ఉపేంద్ర సుబ్బా
ఉపేంద్ర సుబ్బా | |
|---|---|
| జననం | ఉపేంద్ర బహదూర్ ఆంగ్డెంబే లింబు 1971 సెప్టెంబరు 26 |
| వృత్తి | కవి, గీత రచయిత, రచయిత, చిత్ర దర్శకుడు |
| పేరుపడ్డది | కబడ్డీ 4: ది ఫైనల్ మ్యాచ్, జారీ, మన్సర్రా |
| Notable work |
|
| ఉద్యమం | సృజన్‌షిల్ అరాజక్త |
| భాగస్వామి | కల్పనా లావతి (లింబు) |
| పిల్లలు | 3 గురు కుమార్తెలు |
| పురస్కారాలు | పద్మశ్రీ సాహిత్య పురస్కార్ |
ఉపేంద్ర ఆంగ్డెంబే లింబు, ఆయనను ఉపేంద్ర సుబ్బా (Nepali: उपेन्द्र सुब्बा) గా గుర్తిస్తారు. ఆయన ఒక నేపాలీ కవి, గీత రచయిత, రచయిత, చిత్ర దర్శకుడు. రాజన్ ముకారుంగ్, హంగ్యుగ్ అగ్యాత్ లతో కలిసి ప్రారంభించిన సృజన్‌షిల్ అరాజక్త (సృజనాత్మక అరాజకత్వం) అనే ఉద్యమ నిర్వాహకులలో ఈయన ఒకరు.[1]
ప్రారంభ జీవితం
[మార్చు]సుబ్బా తూర్పు కొండ ప్రాంత జిల్లా అయిన పాంచ్‌థర్ లోని ఆంగ్సారంగ్-8 లో జన్మించారు. ఆయన అసలు పేరు ఉపేంద్ర బహదూర్ ఆంగ్డెంబే.
1997 లో, ఆయన గీత రచయిత కావాలనే లక్ష్యంతో దమక్ నుండి ఖాట్మండు నగరానికి వలస వచ్చారు. శాంతిరామ్ రాయ్ సమకూర్చిన సంగీతంతో ఆయన పాటల రచన విజయవంతం కావడం ప్రారంభమైంది. ఆయన రాసిన పాటలను దీప్ శ్రేష్ఠ, రాబిన్ శర్మ, ఆనంద్ కార్కీ, యమ బరాల్ ఆలపించడమే కాకుండా కొన్ని పోటీలలో అవార్డులను గెలుచుకున్నాయి. ఆ సమయంలో పాటల రికార్డింగ్ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారడం, సంగీత పరిశ్రమ తన అభిరుచికి భిన్నమైన దిశలో సాగుతుండటంతో ఆయనకు ఆ రంగంపై నమ్మకం తగ్గింది.[2]
సాహిత్య జీవితం
[మార్చు]ఈ సమయంలో, ఆయనకు రాజన్ ముకారుంగ్, హంగ్యుగ్ అగ్యాత్ లతో పరిచయం ఏర్పడింది. వీరంతా కలిసి సంయుక్తంగా సృజన్‌షిల్ అరాజక్త (సృజనాత్మక అరాజకత్వం) అనే సాహిత్య ఉద్యమాన్ని ప్రారంభించారు. [3]
తన రచనల విజయానికి ఈ సంయుక్త ఉద్యమమే కారణమని ఆయన పేర్కొంటారు. తన 'లాటో పహాడ్' విజయవంతం కావడానికి రాజన్ ముకారుంగ్ రాసిన 'హెచ్చకుప్పా' నవలలు, 'దమిని భీర్' తో మదన్ పురస్కారం గెలుచుకోవడం తనకు మార్గం సుగమం చేశాయని ఆయన చెప్పారు.
ఆయన 2016 లో క్రిటిక్స్ సొసైటీ నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరవడానికి హాంగ్ కాంగ్ సందర్శించారు.[4] సాహిత్య కార్యక్రమాలలో భాగంగా మలేషియా, సింగపూర్ దేశాలలో కూడా పర్యటించారు.
ప్రచురించిన రచనలు
[మార్చు]కవితా సంకలనాలు
[మార్చు]- దాదా మథి కో ఘామ్ జున్ రా గడ్తీర్కా రాకే భూత్ హరు (2002)
- హోంగ్రాయో భోగ్ రా పాంగ్రా (2004)
- ఖోలాకో గీతా రా పురానా కవితాహరు (2013)[5]
- దేశ్ ఖోజ్దై జాదా (2017)
కథల సంకలనాలు
[మార్చు]- లాటో పహాడ్ (2014) (కథల సంకలనం) ఇది 'కేబా కోక్మా' సినిమాగా రూపాంతరం చెందింది[6]
సంగీత ఆల్బమ్
[మార్చు]- జీవన్ ఆఖిర్ కే నై హో రా (2006) (సంగీత ఆల్బమ్)
చలనచిత్ర జీవితం
[మార్చు]తన సినిమా రచనకు గాను దర్శకుడు రామ్ బాబు గురుంగ్ కు ఆయన క్రెడిట్ ఇస్తారు. వీరిద్దరి కలయికలో కబడ్డీ, కబడ్డీ కబడ్డీ వంటి అనేక విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. రవి సెర్మా దర్శకత్వంలో లింబు భాష లో వచ్చిన కేబా కోక్మా (లాటో పహాడ్) ఆయన రాసిన మొదటి కథ.
లాటో పహాడ్ ఒక నాటకంగా కూడా ప్రదర్శించబడింది.[7]
ఆయన కబడ్డీ, కబడ్డీ కబడ్డీ చిత్రాలలో చిన్న పాత్రలలో కనిపించారు. అయితే ఆ పాత్రలు స్నేహితుల బలవంతం వల్లే చేశానని ఆయన భావిస్తారు.
ఆయన రాసి, దర్శకత్వం వహించిన 2023 నాటి జారీ చిత్రం ద్వారా దర్శకుడిగా అరంగేట్రం చేశారు.[8]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]| † | ఇంకా విడుదల కాని చిత్రాలను సూచిస్తుంది |
| సంవత్సరం | శీర్షిక | పాత్ర | క్రెడిట్ | గమనికలు | Ref(s) | ||
|---|---|---|---|---|---|---|---|
| నటుడు | రచయిత | దర్శకుడు | |||||
| 2014 | కబడ్డీ | ఝక్రి | Yes | No | No | తొలి చిత్రం | |
| 2015 | కబడ్డీ కబడ్డీ | ఝక్రి | No | Yes | No | ||
| 2016 | తాండ్రో | N/a | No | Yes | No | ||
| 2016 | పురానో దుంగా | N/a | No | స్క్రీన్ ప్లే | No | ||
| 2019 | కబడ్డీ కబడ్డీ కబడ్డీ | N/a | No | Yes | No | [9] | |
| 2022 | కబడ్డీ 4: ది ఫైనల్ Match | ఝక్రి | Yes | Yes | No | [10] | |
| 2023 | జారీ | N/a | No | Yes | Yes | దర్శకుడిగా తొలి చిత్రం, ప్రత్యేక పాత్ర |
[11] |
| 2024 | మన్సర్రా | N/a | No | Yes | Yes | ప్రత్యేక అతిథి పాత్ర | [12] |
| 2025 | జారీ 2 | N/a | No | Yes | Yes | [13] | |
అవార్డులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "१५ वर्षअघि काठमाडौं छिरेका तीन 'चितుवा'".
- ↑ "अब यस्तो प्रेमिकाको सपना छ, जसको प्रेममा बर्बाद होइजाऊँः उपेन्द्र सुब्बा".
- ↑ "हरिप उपेन्द्र, सरिफ उपेन्द्र - www.nayapage.com". www.nayapage.com. the original నుండి 2015-06-20 న ఆర్కైవు చెయ్యబడింది.
- ↑ "3分28-平台官网". www.hatteri.com. the original నుండి 2023-05-17 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-07-04.
- ↑ "Ratna Pustak Bhandar - The Oldest Book Store - Kathmandu, Nepal".
- ↑ "My Republica". the original నుండి 2016-02-02 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-07-06.
- ↑ "Lato Pahad - The Himalayan Times". 19 July 2015.
- ↑ Timsina, Bibek (2023-04-29). "'Jaari' movie review: A promising debut for Subba". The Annapurna Express (in ఇంగ్లీష్). ఒరిజినల్ నుండి 2023-04-30 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-04-29.
- ↑ Pyakurel, Diwakar (2019-09-22). "Kabaddi Kabaddi Kabaddi movie review: With a clichéd story, can this well-acted comedy sustain the brand ?". Online Khabar. ఒరిజినల్ నుండి 2020-05-21 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-05-21.
- ↑ नेपाल, सुकृत (2022-05-30). "कमेडी शैलीको चलचित्र 'कबड्डी ४'". Gorkhapatra (in నేపాలీ). ఒరిజినల్ నుండి 2022-05-30 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-07-30.
- ↑ Timsina, Bibek (2023-04-29). "'Jaari' movie review: A promising debut for Subba". The Annapurna Express (in ఇంగ్లీష్). ఒరిజినల్ నుండి 2023-04-30 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-04-29.
- ↑ Yami, Hisila (2024-05-22). "Mansarra: The story of vulnerability". The Kathmandu Post (in English). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-10-10.
{{cite web}}: CS1 maint: unrecognized language (link) - ↑ "The Sequel to Superhit Film 'Jari' Announced – 'Jari 2' Set to Release This Dashain". Nepal News (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-10-07.
- ↑ http://nepalipratibhapratishthanuk.org/2015/11/20/%E0%A4%89%E0%A4%AA%E0%A5%87%E0%A4%A8%E0%A5% [dead link]
- ↑ "Bijay Kumar bags Madan Puraskar".
- ↑ "'Kabbadi' bags National Awards".
వెలుపలి లింకులు
[మార్చు]- క్లుప్త వివరణ ఉన్న వ్యాసాలు
- Articles containing Nepali (macrolanguage)-language text
- Articles containing Limbu-language text
- Articles with dead external links from March 2022
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with NLA identifiers