ఉప్పలపాటి వేంకటనరసయ్య
| ఉప్పలపాటి వేంకటనరసయ్య | |
|---|---|
| జననం | ఉప్పలపాటి వేంకటనరసయ్య 1891 కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా |
| మరణం | 1973, ఫిబ్రవరి 25 |
| వృత్తి | ఉపాధ్యాయుడు |
| ప్రసిద్ధి | కవి, రచయిత |
| మతం | హిందూ |
| తండ్రి | గంగయ్య |
| తల్లి | రంగమ్మ |
ఉప్పలపాటి వేంకటనరసయ్య (1891 - 1973, ఫిబ్రవరి 25)[1] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కవి, రచయిత.[2]
జననం, విద్యాభ్యాసం
[మార్చు]వేంకటనరసయ్య 1891లో శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి జన్మించాడు. తల్లి రంగమ్మ, తండ్రి గంగయ్య. ఇతడు హిందూ రజక కులానికి చెందినవాడు. వేంకటనరసయ్య ఏడవ ఏట పల్లెటూరి బడిలో అమరం, ఆంధ్ర పద్య నిఘంటువులను శ్రద్ధగా నేర్చుకున్నాడురు. చిట్వేలి జోర్టు పాఠశాలలో ప్రాథమిక విద్య వరకు చదివాడురు. జీవనోపాధి కోసం 1911లో కొమ్మనవారి పల్లెలో ఒక గ్రాంటు బడిని పెట్టి పిల్లలకు చదువు చెప్పడం ప్రారంభించాడు.[2]
సాహిత్య ప్రస్థానం
[మార్చు]పల్లె వాతావరణంలోని రాత్రి భజన సంకీర్తనలు, నాటకాలు వీరి రచనా వ్యాసంగానికి దోహదపడ్డాయి. 'గుండాల రెడ్డి నాటక సమాజము' వారి చిత్ర నశీయము, పాదుకా పట్టాభిషేకము మొదలగు నాటకాలను చూడటం ద్వారా సంగీతాసక్తి కలిగి, పాటలు, పద్యాలు రాయాలనే కుతూహలం పెరిగింది. వైద్య విద్వాన్ పండిత నారు నాగనార్య సహచర్యంతో సాహిత్యాభిరుచి మరింత పెరిగింది. అప్పటిలో నారు నాగనార్య సత్యాగ్రహ ప్రచారకులుగా ఉండేవాడురు. ఇద్దరు కలిసి దేశ సేవ, సాహిత్య సేవ సమానంగా నిర్వహించారు. అనేక శిలాశాసనముల ప్రతులు వ్రాసి ఉంచారు.
1917-19 సంవత్సరాలలో రాచవీటిలో టీచర్ ట్రైనింగ్ పొందుతున్నప్పుడు రూపనగుడి నారాయణరావు దగ్గర తెలుగు వ్యాకరణం, ఛందో లక్షణం నేర్పుకున్నాడు. వెల్లాల వేంకటాద్రి శర్మ వద్ద మూడు సర్గల వరకు రఘువంశం నేర్చుకున్నాడు. 1950 వరకు వారు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించాడు.[3]
మరణం
[మార్చు]వేంకటనరసయ్య 1973, ఫిబ్రవరి 25న మరణించాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ రాయలసీమ రచయితల చరిత్ర రెండవసంపుటి - కల్లూరు అహోబలరావు, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం
- ↑ 2.0 2.1 2.2 కల్లూరు అహోబలరావు (1977). రాయలసీమ రచయితల చరిత్ర (రెండు సంపుటం).
- ↑ కల్లూరు అహోబలరావు (1977). రాయలసీమ రచయితల చరిత్ర (రెండు సంపుటం).