ఉప్పలపాడు (అలంపూర్ మండలం)

వికీపీడియా నుండి
(ఉప్పలపాడు(అలంపూర్ మండలం) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఉప్పలపాడు, జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ మండలానికి చెందిన నిర్జన గ్రామం.[1] పూర్తిగా అంతర్ధానమైపోయింది. ఒకప్పుడు కృష్ణ, తుంగభద్రల సంగమ ప్రాంత సమీపాన ఈ గ్రామం ఉండేది. ఈ గ్రామానికి ఇరువైపుల గొందిమళ్ళ, కూడవెల్లి గ్రామాలు ఉండేవి.శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వలన ఈ గ్రామం, దాని శివారు భూములు పూర్తిగా ప్రాజెక్టు జలాల్లో మునిగిపోవడం వలన గ్రామం పునర్నిర్మాణానికి నోచుకోలేదు. ఈ గ్రామానికి చెందిన ప్రజలు సమీప ప్రాంతాలైన అలంపూర్, గొందిమళ్ళ, బుక్కాపూర్ మొదలగు ప్రాంతాలలో స్థిరపడ్డారు. అలంపూర్ మండలంలో ఇదే పరిస్థితిని ఎదుర్కొన్న మరో గ్రామం కూడవెల్లి

మూలాలు[మార్చు]

  1. "గ్రామాలు | జిల్లా జోగులంబా గద్వాల్, తెలంగాణ ప్రభుత్వం | భారతదేశం". Retrieved 2022-01-08.

వెలుపలి లంకెలు[మార్చు]