ఉప్పొడ్డివారు

వికీపీడియా నుండి
(ఉప్పొడ్డి వారు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఉప్పొడ్డి వారు ..... ఉప్పొడ్డివాళ్ళు. ఇది ఒక జాతి. మరెక్కడా కనబడని ఈ జాతి ఇక్కడే ఎలా ఉన్నారు., వీరెక్కడినుండి వచ్చారు మొదలగు విషయాలు ఎవ్వరికి తెలియవు. నాగరికత విలసిల్లిన ఈ పల్లెల నడుమ వీరు చాల అనాగరికంగా ఉన్నారు. ఐనా వీరు అంట రాని వారు కాదు, కానీ మిగతా దళిత కులాల వారు వారి కులాలు వేరైనా వారి కట్టు, భాష, అన్ని విషయాలు అందరి లాగానే ఉంటాయి. వడ్డి వాళ్ళు కూడా అందరి వాళ్ళ లాగే ఉంటారు. కాని ఈ ఉప్పొడ్డు వాళ్ళు మాత్రం ప్రత్యేకంగా జీవిస్తున్నారు. వీరు గిరిజనుల లాగ మొగ వాళ్ళు మొలకు గోచి మాత్రమే కట్టు కుంటారు. ఆడవారు పాత చీర మొలకు చుట్టు కొని కొంత భాగాన్ని భుజంపై నుండి వేసు కుంటారు. పిల్లలు కూడా గోచీ గాళ్లే. వారి భాష కూడా ప్రత్యేకంగా ఉంటుంది. అది తెలుగే ........ కాని చాల ప్రత్యేకంగా ఉంటుంది. తరతరాల నుండి వారు ఇక్కడి సామాజిక ప్రపంచంలో జీవిస్తున్నా.... వారు ఎందుకు మార కుండా ప్రత్యేకంగా ఉన్నారో అర్థం కాని విషయం. ప్రభుత్వం కూడా వీరిని పూర్తిగా గుర్తించి నట్లు లేదు. వీరు పూర్తిగా నిరక్ష్య రాస్యులు. ఏ కులం తోను కలవరు. వారి నివాసం గుడిసెలు. వారు మామూలు వడ్డి వాళ్ళ లాగ ఊర పందులను పెంచు తారు. అదొక ఆదాయ వనరు వారికి. మొదట్లో వీరు ఉప్పు బస్తాలను నెత్తిన పెట్టుకొని పల్లెల్లో తిరుగుతూ ఉప్పు అమ్మేవారు. అందుకే వారికి ఉప్పొడ్డి వారు అని పేరు వచ్చిందనిపిస్తుంది. అయినా వడ్డి వారికి, వీరికి పోలికే లేదు. వడ్డి వాళ్ళు సామాన్య జీవన స్రవంతిలో కలిసి పోయి కాలాను గుణంగా మార్పును సంతరించు కుంటున్నారు. మొదట ఈ ఉప్పొడ్డివారు అడవికి వెళ్లి కరివేపాకును బస్తాల కొద్దీ కోసుకొచ్చి ఎండ బెట్టి పల్లెల్లో అమ్మేవారు. దాన్ని డబ్బులకు కాదు.... కాసిన్ని సద్ది నీళ్లకు, లేదా కాసింత సంగటి కొరకు కరివేపాకును ఇచ్చేవారు. పొలాల వెంబడి, చేలల్లో గుంపులుగా తిరుగుతూ ఎండి పోయిన కలబంద పట్టలను సేకరించి వాటిని నీళ్లలో నాన బెట్టి వాటిని బాగా చితగ్గొట్టి దాని నుండి నార తీసి దాంతో చేంతాడు పలుపులు ఉట్టి కుదురులు వంటి వాటిని పేని రైతులకు వడ్ల గింజలకు ఇచ్చే వారు. అప్పట్లో చేద బావులు ఎక్కువ ఉండేవి కనుక చేంతాడు లకు బాగా గిరాకి వుండేది. వీరు నివసించే పల్లె పేరు ఉప్పొడ్డి పల్లె. వీరేదో నాగరిక సమాజానికి దూరంగా అడవుల్లో లేరు. నాగరీకుల పల్లెకు అతి సమీపంలో ఉన్నారు. వీరికి వ్యవసాయపు పనులు గాని. ఇంటి పనులు గాని పూర్తిగా తెలియవు. అందుచేత వీరిని ఎవ్వరు వ్యవసాయపు పనులకు గాని, ఇంటి పనులకు గాని పిలవరు. వారుకూడ ఆ పని తమకు తెలియదని రారు. పోనీ, ఇంటి పనులు అనగా ఇంటి ముందు చెత్త ఊడ్చడం, పాత్రలను తోమడం ఇలాంటి సామాన్యమైన పనులు కూడా వీరికి చేత కాదు.