ఉమేష్. జి. జాదవ్
ఉమేష్ జాదవ్ | |||
![]() 2021లో ఉమేష్ జాదవ్ | |||
పదవీ కాలం 2019 మే 23 – 2024 జూన్ 4 | |||
ముందు | మల్లికార్జున్ ఖర్గే | ||
---|---|---|---|
తరువాత | రాధాకృష్ణ దొడ్డమని | ||
నియోజకవర్గం | గుల్బర్గా | ||
పదవీ కాలం 2013 – 2019 | |||
ముందు | సునీల్ వల్ల్యపురే | ||
తరువాత | అవినాష్ ఉమేష్ జాదవ్ | ||
నియోజకవర్గం | చించోలి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | భేద్సూర్ | 1959 మార్చి 24||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2019-ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ (2013-6 మార్చి 2019) | ||
సంతానం | అవినాష్ జాదవ్ | ||
నివాసం | కలబురగి న్యూఢిల్లీ | ||
పూర్వ విద్యార్థి | బెంగళూరు మెడికల్ కాలేజ్ | ||
వృత్తి | డాక్టర్ | ||
వెబ్‌సైటు | [1] |
ఉమేష్ గోపాల్‌దేవ్ జాదవ్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు చించోలి శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గుల్బర్గా లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]ఉమేష్ జాదవ్ కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గాలో 1959 మార్చి 24న జన్మించాడు. ఆయన 1991లో బెంగళూరు మెడికల్ కాలేజీ నుండి జనరల్ సర్జరీలో మాస్టర్ ఆఫ్ సర్జరీ పూర్తి చేశాడు. అతను వృత్తిరీత్యా వైద్యుడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]ఉమేష్. జి. జాదవ్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సునీల్ వల్ల్యాపూర్‌పై 26060 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పార్లమెంటరీ కార్యదర్శిగా పని చేశాడు.[2] ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సునీల్ వల్ల్యాపూర్‌పై 19212 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
ఉమేష్. జి. జాదవ్ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరి,[3] గుల్బర్గా లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి మల్లికార్జున్ ఖర్గేపై 95,457 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4] ఆయన 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి రాధాకృష్ణ దొడ్డమని చేతిలో ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Umesh Jadhav seizes the day, gets down to business" (in ఇంగ్లీష్). The New Indian Express. 13 June 2019. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.
- ↑ "CM appoints 10 parliamentary secretaries" (in Indian English). The Hindu. 5 November 2015. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.
- ↑ "Umesh Jadhav joins BJP" (in Indian English). The Hindu. 6 March 2019. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "2024 Loksabha Elections Results - Gulbarga" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.
- ↑ "Gulbarga Constituency Lok Sabha Election Result 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.