ఉమ్మడి పౌరస్మృతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పౌరస్మృతి అనునది ఆస్తులకు సంబంధించి పూర్తి ప్రభుత్వ పరిపాలనా విభాగపు హక్కుల పరిధి మరియు వ్యక్తిగతానికి సంబంధించి పెళ్ళి, విడాకులు, నిర్వహణ, దత్తత మరియు వారసత్వం మొదలగు విషయాల చట్ట పరిధి లేదా చట్టం. విడాకులు, వారసత్వాలకు సంబంధించి ఇప్పటి వరకు వివిధ వర్గాలకు వివిధ చట్టాలు వున్నాయి, విడాకులు లేదా వారసత్వ చట్టం హిందువులకు ఒకరకంగా ముస్లిములకు ఇంకొక రకంగా, అలాగే క్రైస్తవులకు మరో రకంగా ఉన్నాయి. ఉమ్మడి పౌరస్మృతి (Uniform civil code) ప్రధాన ఉద్దేశం వీటన్నిటిని ఏకీకృతం చేసి జాతి, మత, వర్గ, లింగ భేదం లేకుండా పౌరులందరినీ నిస్పక్షపాతంగా ఒకే చట్ట పరిధిలోకి తేవటం .