ఉల్లిపాలెం (నగరం)
(ఉల్లిపాలెం(నగరం) నుండి దారిమార్పు చెందింది)
ఉల్లిపాలెం బాపట్ల జిల్లా నగరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
ఉల్లిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°01′19″N 81°03′37″E / 16.021875°N 81.060336°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | నగరం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522 265 |
ఎస్.టి.డి కోడ్ | 08648 |
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
[మార్చు]- ఈ పాఠశాల విద్యార్థులు, విద్యార్థినులు, క్రీడలలో తమ సత్తా చాటుచున్నారు. వీరు పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని, పతకాలు సాధించుచున్నారు.
- ప్రభుత్వం కొన్ని గ్రామీణ పాఠశాలలను ఎంపికచేసి, దశలవారీగా కార్పొరేటు స్థాయికి అభివృద్ధిచేయాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన "సక్సెస్" పాఠశాలలకు రూపకల్పన చేసింది. ఈ పథకం క్రింద ఈ పాఠశాలను ఎంపిక చేసింది. ఈ పాఠశాలలో గత సంవత్సరం, రు. 33 లక్షలతో అదనపు తరగతి గదులు నిర్మించారు. గ్రామస్థులు, రు. 10 లక్షలతో అదనపు వసతులు సమకూర్చారు. ఈ విద్యాసంవత్సరంలో రు. ఐదున్నర లక్షల రూపాయలతో బల్లలు, కుర్చీలు తదితర సామాగ్రి పంపిణీ చేసారు.
- ఈ పాఠశాలలో చదువుచున్న పి.సమతా బ్లెస్సీ అను విద్యార్థిని, ఇటీవల తెనాలిలో నిర్వహించిన జిల్లాస్థాయి "ఇన్స్ పైర్" పోటీలలో తన ప్రతిభ ప్రదర్శించి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనది. ఈమె అను "Earth with garbage Enzime" ప్రాజెక్టును ప్రదర్శించి ఈ అర్హత సాధించింది.
- ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీమతి జి.రమాదేవి గురుబ్రహ్మ పురస్కారానికి ఎంపికైనారు. ఈ పురస్కారాన్ని ఈమె, విశాఖపట్నంలో 2015,సెప్టెంబరు-20వ తేదీనాడు అందుకుంటారు. ఉపాధ్యాయురాలిగా ఈమె చేసిన సేవలకు గుర్తింపుగా ఈమె ఈ పురస్కారానికి ఎంపికైనారు.
- ఈ పాఠశాలలో చదువుచున్న ఫర్మానా అను విద్యార్థిని, ఇటీవల కడప జిల్లాలోని రైల్వేకోడూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడాపోటీలలో తన ప్రతిభప్రదర్శించి, జాతీయస్థాయిపోటీలకు ఎంపికైనది. ఈమె 2016,జనవరి-22 నుండి గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ లో నిర్వహించు జాతీయస్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొంటుంది.
- ఈ పాఠశాలలో ఒక గ్రంథాలయం గూడా ఉంది. ఈ పాఠశాల విద్యార్థులు ఇంతవరకు రెండుసార్లు జాతీయస్థాయి క్రీడా పోటీలలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 400 మంది విద్యార్థులు విద్యనభ్యసించుచున్నారు. గత సంవత్సరం ఈ పాఠశాల విద్యార్థులు పదవ తరగతిలో 1005 ఉత్తీర్ణత సాధించారు.
- ఇటీవల కర్నూలు జిల్లాలోని నందికొట్కూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి బాలికల అండర్-14 కబడ్డీ జట్టుకు కెప్టెనుగా ఈ పాఠశాలకు చెందిన కైతేపల్లి వెంకటేశ్వరమ్మ పాల్గొని తన ప్రతిభతో జట్టు విజయానికి తోడ్పడి, జాతీయస్థాయి పోటీలలో పాల్గొనడానికి అర్హత సంపాదించింది. ఈమె 2016,నవంబరు-17 నుండి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో ఆంధ్రప్రదేశ్ జట్టులో పాల్గొంటుంది.
గ్రామములోని మౌలిక సదుపాయాలు
[మార్చు]రక్షిత మంచినీటి పథకం:- గ్రామ శివారు లోని గౌడపాలెంలో, ఈ పథకం నిర్మాణానికి, 2016,డిసెంబరు-3న శంకుస్థాపన నిర్వహించారు.
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి పసుపులేటి అన్నపూర్ణ, సర్పంచిగా ఎన్నికైనారు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]- శ్రీ భ్రమరాంబ సమేత చెన్నమల్లేశ్వర స్వామివారి దేవాలయం.
- శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం.
గ్రామములోని ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కూరగాయలు