ఉషా థోరట్
ఉషా థోరట్ | |
|---|---|
| భారతీయ రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ | |
| In office 2005 నవంబరు 10 – 2010 నవంబరు 8 | |
| గవర్నర్ | యాగా వేణుగోపాలరెడ్డి దువ్వూరి సుబ్బారావు |
| అంతకు ముందు వారు | కె. జె. ఉదేశి |
| తరువాత వారు | ఆనంద్ సిన్హా |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | ఉషా అయ్యర్ 1950 ఫిబ్రవరి 20 చెన్నై, భారతదేశం |
| జీవిత భాగస్వామి | వైఎస్పీ థోరట్ |
| కళాశాల | లేడీ శ్రీరామ్ కాలేజ్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఢిల్లీ విశ్వవిద్యాలయం |
ఉషా థోరట్ (జననం 1950 ఫిబ్రవరి 20), ఒక భారతీయ ఆర్థికవేత్త, ఆమె రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) డిప్యూటీ గవర్నర్ గా 2005 నవంబరు 10 నుండి 2010 నవంబరు 8 వరకు పనిచేసింది.[1] దీనికి ముందు ఆమె ఆర్బిఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నది. [2][3]
ప్రారంభ జీవితం
[మార్చు]1950 ఫిబ్రవరి 20న చెన్నైలో జన్మించిన ఉషా థోరట్ న్యూఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ల పూర్వ విద్యార్ధి.[4]
కెరీర్
[మార్చు]ఉషా థోరట్ బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెక్యూరిటీస్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బోర్డులలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నామినీగా ఉన్నది.
ఆమె ఏప్రిల్ 2004 నుండి ఆర్బిఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నది. డిప్యూటీ గవర్నర్ గా ఆమె కరెన్సీ మేనేజ్మెంట్, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్, ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్, ప్రాంగణ విభాగం, గ్రామీణ ప్రణాళిక, క్రెడిట్ విభాగం, పట్టణ బ్యాంకుల విభాగానికి బాధ్యత వహించింది.[5]
ఆర్థిక చేరిక (Financial inclusion) ప్రోత్సహించడానికి ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ చేస్తున్న ప్రయత్నాలలో ఆమె కీలక పాత్ర పోషించింది.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ Roy, Anup (2019-08-09). "RBI's Usha Thorat panel for easier foreign play in currency market". Business Standard India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-05-16.
- ↑ "RBI to maintain ample liquidity: Thorat". The Hindu. Chennai, India. 26 June 2009.
- ↑ Saha, Anup Roy & Manojit (2021-04-20). "'Father of banking reforms': Ex-RBI governor M Narasimham passes away at 94". Business Standard India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-05-16.
- ↑ "The Indian Express, 2 May 1998". Thehindubusinessline.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 December 2017.
- ↑ Roy, Anup (2019-08-09). "RBI's Usha Thorat panel for easier foreign play in currency market". Business Standard India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-05-16.
- ↑ Roy, Anup (2019-08-09). "RBI's Usha Thorat panel for easier foreign play in currency market". Business Standard India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-05-16.
- ↑ "RBI to maintain ample liquidity: Thorat". The Hindu. Chennai, India. 26 June 2009.