ఉష్ణమండల వర్షారణ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్రెజిల్‌లో అమెజాన్ వర్షారణ్య ప్రాంతం.దక్షిణ అమెరికాలోని ఉష్ణమండల వర్షారణ్యాలు భూమిపై అత్యధిక జీవజాతుల వైవిధ్యం కలిగి ఉంటాయి.[1][2]

ఉష్ణమండల వర్షారణ్యం అనేది భూమధ్యరేఖకు ఉత్తరం లేదా దక్షిణంగా సుమారు 28 డిగ్రీల లోపు ఉండే ప్రాంతం. ఇవి ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, మెక్సికో మరియు ఎన్నో పసిఫిక్ ద్వీపాలలో కనిపిస్తాయి. వరల్డ్ వన్యప్రాణి ఫండ్ యొక్క జీవపరిణామ వర్గీకరణలో, ఉష్ణమండల వర్షారణ్యాలను ఒక రకమైన ఉష్ణమండల తడి అటవీప్రాంతం (లేదా ఉష్ణమండల తేమ విశాలపత్ర అటవీప్రాంతం) అని భావిస్తారు మరియు లోతట్టు భూమధ్యరేఖాప్రాంత సతతహరిత వర్షారణ్యంగా కూడా చెప్పవచ్చు. ఈ వాతావరణ ప్రాంతంలో కనీస సాధారణ వార్షిక వర్షపాతం 175 cm (69 in) మరియు 200 cm (79 in) మధ్య ఉంటుంది. సంవత్సరం పొడవునా అన్ని నెలలలోనూ సగటు మాస ఉష్ణోగ్రతలు 18 °C (64 °F) పైబడి ఉంటాయి.[3] వర్షారణ్యాలు ఈ భూమిపై సగం సజీవ జంతు మరియు వృక్ష జాతులకు నివాసస్థానాలుగా ఉంటాయి.[4]

నేల మట్టం స్థాయిలో సూర్యకాంతి లేకపోవడం వలన ఎన్నో ప్రాంతాలలో కలుపుమొక్కల పెరుగుదలకు వర్షారణ్యం ప్రతికూలంగా ఉంటుంది.[5] ఇందువలన మనుషులు మరియు ఇతర జంతువులు ఈ అటవీప్రాంతంలో నడవడానికి అనువుగా ఉంటుంది. ఏదైనా కారణం చేత ఆకులతో కూడిన పైకప్పు వంటి కవచం పాడయినా లేదా పలుచబడినా, అక్కడి నేలలో వెనువెంటనే దట్టమైన తీగలు, పొదలు మరియు చిన్న చెట్లతో కూడిన కీకారణ్యం పెరుగుతుంది.[6]

ప్రస్తుతం ఉష్ణమండల వర్షారణ్యాలు మానవ కార్యకలాపాల వలన విభజనకు గురవుతున్నాయి. గతంలో జ్వాలాముఖి మరియు వాతావరణ మార్పు వంటి ప్రక్రియల వలన నివాసపరమైన ఖండీకరణ జరిగినట్టూ, జీవపరిణామానికి ఇవి దోహదపడినట్టూ గుర్తించడం జరిగింది[7]. కానీ, జాతుల వినాశనానికి మానవులు చేసే త్వరితమైన నివాసస్థావర ధ్వంసం ప్రధాన కారణంగా భావించవచ్చు.

లక్షణాలు[మార్చు]

పెరూలో అమెజాన్ నది వర్షపు అటవీప్రాంతం

అన్ని ఇతర జీవపరిణామ ప్రాంతాలలోకన్నా ఈ వర్షారణ్యాలు మరిన్ని ప్రపంచవ్యాప్త జాతులు లేదా జనాభాకు ఆవాసాలుగా ఉంటాయి. ప్రపంచం యొక్క 80% జీవవైవిధ్యం ఈ ఉష్ణమండల వర్షారణ్యాలలో కనిపిస్తుంది.[8] అటవీప్రాంతం యొక్క నేలమట్టం పైకి 50 నుండి 85 మీటర్ల వరకూ విస్తరించే పొడవైన వృక్షాల ఆకులతో కూడిన పైభాగాలు - ఒక దట్టమైన పొరగా ఏర్పడతాయి. అటవీప్రాంతం యొక్క నేలపై పడిన సేంద్రియ పదార్థం వెనువెంటనే విఘటన చెంది, పోషకాలుగా మారుతుంది.

వర్షారణ్యాలలో అత్యధిక వర్షపాతం ఉంటుంది. దీని ఫలితంగా తరచూ ద్రావణీయ పోషకాలు కొట్టుకుపోయి, నేల నిస్సారమవుతుంది. ఎన్నో కాలానుసారంగా వరదలకు గురయ్యే అటవీప్రాంతాల మృత్తిక వలె, ఆక్సిసాల్స్, సారవంతమైన మట్టితో వార్షికంగా భర్తీ చేయబడతాయి.

ఉష్ణమండల వర్షారణ్యాలలో 20వ శతాబ్దం పొడవునా, చెట్లు కొట్టడం మరియు వ్యవసాయానికై తొలగింపు జరిగింది మరియు ప్రపంచవ్యాప్తంగా వర్షారణ్యాల వైశాల్యం త్వరితంగా కుదించుకు పోతోంది.[9][10]

వర్షారణ్యాలను తరచూ "భూమి యొక్క ఊపిరితిత్తులు"గా పిలుస్తారు; కానీ, ఇందుకు వైజ్ఞానిక ఆధారం లేదు, ఎందుకంటే ఉష్ణమండల వర్షారణ్యాలు ప్రధానంగా ప్రాణవాయువుకు అతీతంగా, అత్యల్ప లేదా శూన్యమైన నికర ప్రాణవాయువు ఉత్పత్తితో ఉంటాయని తెలిసిందే.[11][12]

వర్షారణ్యం గాలిలో తేమ కలిగి ఉంటుంది. పొడవైన, విశాలపత్ర సతతహరిత వృక్షాలు ఎక్కువగా ఉండి, అటవీప్రాంతం యొక్క నేలమట్టం నుండి పొడవుగా ఎదిగి ఆకులతో కూడిన పైకప్పు ఏర్పరుస్తాయి. ఎమర్జంట్లుగా పిలువబడే మరింత పొడవైన చెట్లు, ఈ పైకప్పును దాటి పెరగవచ్చు. ఈ పైకప్పు యొక్క పైభాగం చెట్ల కొమ్మలపై నివసించే ఆర్కిడ్లు, బ్రోమెలియాడ్లు, మోసెస్, మరియు లిచెన్స్ వంటి ఎన్నో రకాల వృక్ష జాతులైన ఎపిఫైట్లకు ఆసరాగా ఉంటుంది. వర్షారణ్యం యొక్క అంతర్భాగంలో పెరుగుదల లేదా వృక్షసంపద తరచూ సూర్యకాంతి నేలపై పడకపోవడం వలన తక్కువగా ఉంటుంది, మరియు సాధారణంగా నీడను-తట్టుకునే పొదలు, మూలికలు, ఫెర్న్‌లు, చిన్న చెట్లు మరియు సూర్యకాంతి కోసం చెట్లపైకి పాకే పెద్ద చెట్ల తీగలతో కూడి ఉంటుంది. సాపేక్షంగా తక్కువగా ఉండే నేలపై చెట్ల పెరుగుదల వలన ప్రజలు మరియు ఇతర జంతువులూ ఈ అటవీప్రాంతంలో నడవడానికి వీలవుతుంది. ఆకులు-రాలే మరియు పాక్షికంగా-ఆకులు-రాలే అటవీప్రాంతాలలో, లేదా ఏదైనా కారణం చేత పైకప్పు పాడయిన అటవీప్రాంతాలలో, క్రిందివైపు నేలలో త్వరితంగా దట్టంగా అల్లుకున్న తీగలు, పొదలు మరియు చిన్న చెట్లతో కూడిన కీకారణ్యంగా పిలువబడే ప్రాంతం ఏర్పడుతుంది.

ఇక్కడి ఉష్ణోగ్రత 21 °C నుండి 45 °C వరకూ ఉంటుంది మరియు వార్షిక వర్షపాతం 125 నుండి 660 సెం మీ ఉంటుంది. Mas que raio! Isto é pior que chinês!

పొరలు[మార్చు]

దస్త్రం:TropischeRegenwaelder.png
ఉష్ణమండల వర్షారణ్యాల వ్యాప్తి
కాకుం జాతీయోద్యానవనం, ఘనాలో నేలమట్టం నుండి 40 మీటర్ల ఎత్తున పైకప్పు మార్గం

ఈ వర్షారణ్యం ఐదు వివిధ పొరలుగా విభజించబడి ఉంటుంది, ఇందులో ప్రతిదానికీ నిర్దిష్ట ప్రాంతానికి అనువైన వృక్షాలు మరియు జంతువుల జీవితానికి సరిపడేలా ఉంటుంది. ఇవి: నేల పొర, పొదల పొర, క్రింది చెట్ల పొర, పైకప్పు పొర మరియు ఎమర్జంట్ పొర. కేవలం ఎమర్జంట్ పొర అనేది ఉష్ణమండల వర్షారణ్యాలకే పరిమితమైంది, కాగా ఇతర పొరలు సమశీతోష్ణ వర్షారణ్యాలలోనూ కనిపిస్తాయి.

ఎమర్జంట్ పొర అనేది తక్కువ సంఖ్యలో పైకప్పు పొరను దాటి పెరిగే ఎంతో పెద్ద చెట్లను కలిగి ఉంటుంది, ఇవి 45-55 m ఎత్తు వరకూ పెరుగుతాయి, కొన్ని జాతులు కొన్ని సందర్భాలలో చివరికి 70 m లేదా 80 m ఎత్తువరకూ పెరుగుతాయి. ఇవి వేడి ఉష్ణోగ్రతలు మరియు బలమైన గాలులను తట్టుకోగలిగి ఉండాలి. గ్రద్దలు, సీతాకోకచిలుకలు, గబ్బిలాలు మరియు కొన్ని రకాల కోతులు ఈ పొరలో నివసిస్తుంటాయి.

పైకప్పు అనేది అటవీప్రాంతం యొక్క ప్రాథమిక పొర మరియు మిగిలిన రెండు పొరలకూ పైకప్పుగా వ్యవహరిస్తుంది. చాలావరకూ పైకప్పు చెట్లు మృదువైన, ఒక స్థానానికి వచ్చే అండాకార పత్రాలను కలిగి ఉంటాయి. ఇది ఆకులు మరియు కొమ్మల అల్లిక. ఆహారం విస్తృతంగా లభించడంతో ఈ ప్రాంతంలో ఎన్నో జంతువులు నివసిస్తుంటాయి. ఈ జంతువులలో పాములు, టౌకాన్ లు (రంగురంగుల పక్షి) మరియు చెట్ల కప్పలు ఉంటాయి.

ఇక్కడి క్రింది చెట్ల పొర వరకూ అతితక్కువ సూర్యకాంతి చేరుతుంది, కాబట్టి మొక్కలు తగినంత సూర్యకాంతిని పొందడానికి అనువుగా పెద్ద ఆకులను తయారు చేసుకుంటాయి. ఇక్కడి మొక్కలు అరుదుగా 3 m (10 అడుగులు) వరకూ పెరుగుతాయి. జాగ్వార్లు, ఎర్ర-కళ్ళు కలిగిన చెట్ల కప్పలు మరియు చిరుతల వంటి ఎన్నో జంతువులు ఇక్కడ నివసిస్తుంటాయి. ఇక్కడ ఎన్నో రకాల కీటకాలు ఉంటాయి.

ఇక్కడి పొదల పొర మరియు అటవీప్రాంతం యొక్క నేల ఎంతో చీకటిగా ఉంటాయి. ఫలితంగా, ఈ ప్రాంతంలో అతి తక్కువగా మొక్కలు పెరుగుతాయి. ఈ అటవీప్రాంతం యొక్క నేలమట్టంలో సూర్యరశ్మి పడకపోవడం మూలంగా, ప్రతిదీ త్వరితంగా క్రుళ్ళిపోవడం మొదలవుతుంది. సాధారణ వాతావరణంలో విఘటన చెందడానికి ఒక ఆకుకి ఒక సంవత్సరం పడితే, అదే ఆకు ఇక్కడ 6 వారాల్లో అదృశ్యమవుతుంది. పెద్ద ఆంట్-ఈటర్లు ఈ పొరలో నివసిస్తుంటాయి.

సహజ చరిత్ర[మార్చు]

వందల మిలియన్ల సంవత్సరాలుగా ఉష్ణమండల వర్షారణ్యాలు ఈ భూమిపై ఉన్నాయి. సుమారు 300 మిలియన్ సంవత్సరాల క్రితం యూరమెరికా ఖండంలో కర్బన వాతావరణంలో, ఈ ఉష్ణమండల వర్షారణ్యం జీవావరణ శాస్త్రం నేలకూలింది. వాతావరణంలో మార్పు వలన ఈ వర్షారణ్యం విభజనకు గురైంది. ఉభయచర వైవిధ్యానికి గొప్ప నష్టం కలిగింది మరియు అదే సమయంలో పొడి వాతావరణం సరీసృపాల బహుముఖత్వానికి ప్రారంభమైంది.[7]

మానవ ఉపయోగాలు[మార్చు]

ప్రతికూల మానవ ప్రభావాలు[మార్చు]

వ్యవసాయం, గృహ నిర్మాణం, మరియు ఆహార సేకరణ కొరకు మానవులు అమెజాన్ వర్షారణ్యం ప్రాంతాన్ని సుమారుగా ప్రతి సెకండుకు 1.5 ఎకరాలు లేదా నిమిషానికి 50 ఫుట్‍బాల్ క్షేత్రాల వేగంతో నిర్మూలిస్తున్నారు, దీంతో వర్షారణ్యం క్షీణిస్తోంది.(నిమిషానికి 75 ఎకరాలు)[ఉల్లేఖన అవసరం]

నివాసం[మార్చు]

ఉష్ణమండల వర్షారణ్యాలు మానవ నివాసానికి అనుకూలంగా ఉండవు.[13] ఈ అటవీప్రాంతంలోని ఆహార వనరులు ఇక్కడి అధిక జీవశాస్త్ర వైవిధ్యం కారణంగా తీవ్రంగా చెల్లాచెదురై ఉంటాయి మరియు ఎలాంటి ఆహారం ఉంటుందనేది పైకప్పుపై ఆధారపడుతుంది మరియు సేకరణకు గణనీయమైన శ్రమ అవసరమవుతుంది. కొన్ని వేటగాళ్ళ-సేకరణ బృందాలు ఈ వర్షారణ్యం ప్రాంతాల్లో కాలానుసారంగా అన్వేషించినా, ఆహారం అధికంగా ఉన్న ప్రక్కనే ఉన్న సవన్నా మరియు బహిరంగ అటవీప్రాంతం వాతావరణాలలో స్థిరపడ్డారు. వర్షారణ్యంలో నివసించేవారుగా చెప్పబడే ఇతర ప్రజలు నిజానికి అధిక విలువ కలిగిన అటవీప్రాంతం ఉత్పత్తులైన చర్మాలు, ఈకలు మరియు తేనె అమ్ముకునే వేటగాళ్ళ సేకరణ బృందాలు, ఇందులో వ్యవసాయం చేసుకునే ప్రజలు ఈ అటవీప్రాంతం వెలుపల నివసిస్తారు.[13]

వ్యవసాయ భూభాగంగా మార్పు[మార్చు]

వ్యవసాయ ఆవిష్కారంతో, మానవులు వర్షారణ్యం యొక్క భాగాలను తొలగించి పంటలను ఉత్పత్తి చేయగలిగారు, తద్వారా దానిని బహిరంగ వ్యవసాయభూభాగంగా మార్చారు. కానీ వారు తమ ఆహారాన్ని ప్రాథమికంగా అటవీప్రాంతం తొలగించిన వ్యవసాయ భూమి నుండి పొందుతారు [13][14] మరియు అదనంగా ఈ అటవీప్రాంతంలో వేట మరియు అన్వేషణ సాగిస్తారు.

మునుపు అటవీప్రాంతంగా ఉండిన భూభాగంలో వ్యవసాయం ఎంతో కష్టతరమైంది. వర్షారణ్యం నేలలు తరచూ పలుచగా మరియు ఎన్నో ఖనిజాల్ని కోల్పోయి ఉంటాయి, అంతేకాక అధిక వర్షపాతం కారణంగా వ్యవసాయం కోసం సిద్ధం చేసిన ప్రాంతం నుండి పోషకాలు వెనువెంటనే కొట్టుకుపోవచ్చు. ఉదాహరణకు అమెజాన్ యొక్క యనోమమో ప్రజలు ఈ పరిమితులను అధిగమించేందుకు స్లాష్-అండ్-బర్న్ వ్యవసాయాన్ని అవలంబిస్తారు మరియు ఒకప్పటి వర్షారణ్యం వాతావరణాలలోనికి లోతుగా చొచ్చుకుపోగలుగుతారు. కానీ, వీరు వర్షారణ్య నివాసులు కారు, వీరు వర్షారణ్యంలోనికి ప్రవేశించే చదునుచేసిన వ్యవసాయభూభాగం నివాసులు[13][14]. సాధారణంగా యనమోమో ఆహారంలో 90% వారు పెంచిన చెట్ల నుండి లభిస్తుంది.[14]

పండించిన ఆహారాలు మరియు మసాలా దినుసులు[మార్చు]

కాఫీ, చాక్లెట్, అరటి, మామిడి, బొప్పాయి, మకాడమియా, అవోకాడో, మరియు చెరకు అన్నీ నిజానికి ఉష్ణమండల వర్షారణ్యం ప్రాంతాల నుండి వచ్చినవే మరియు ఇప్పటికీ చాలావరకూ ఇవి మునుపు ప్రాథమికంగా అటవీప్రాంతం అయిన ప్రాంతాల్లో పండించడం జరుగుతుంది. మధ్య-1980లు మరియు 90లలో, ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 40 మిలియన్ టన్నుల అరటిపండ్లు మరియు 13 మిలియన్ టన్నుల మామిడిపండ్లు వినియోగించబడ్డాయి. మధ్య అమెరికన్ కాఫీ ఎగుమతులు 1970లో US$3 బిలియన్ విలువను సాధించాయి. క్రొత్త క్రిముల వినాశనాన్ని తప్పించేందుకు ఉపయోగించే జన్యు మార్పిడి ఇప్పటికీ నిరోధక జంతువుల నుండి ఉత్పన్నమవుతుంది. సమశీతోష్ణ అటవీప్రాంతాల 20 రకాలతో పోలిస్తే, ఉష్ణమండల అటవీప్రాంతాలు 250 పండించిన పండ్ల రకాలను అందించాయి. కేవలం న్యూ గినియాలోని అటవీప్రాంతాలు తినదగ్గ పండ్ల 251 చెట్ల రకాలను కలిగి ఉన్నాయి, ఇందులో కేవలం 43 మాత్రమే పండించే పంటలుగా 1985 సమయానికి స్థిరపడ్డాయి.[15]

ఔషధ మరియు భూవైవిధ్య వనరు[మార్చు]

ఉష్ణమండల వర్షారణ్యాలను "ప్రపంచంలో అతిపెద్ద ఔషధాలయం"గా అభివర్ణిస్తారు[ఉల్లేఖన అవసరం] ఎందుకంటే వర్షారణ్యాలలో కనిపెట్టే ఎన్నో రకాల సహజ ఔషధాలు వర్షారణ్యపు మొక్కల నుండి తయారవుతాయి. ఉదాహరణకు, వర్షారణ్యాలు "హార్మోనల్ కుటుంబనియంత్రణ పద్ధతులు, కొకైన్, ఉత్తేజితాలు, మరియు ప్రశాంతికారి ఔషధాల మౌలిక అంశాలను" కలిగి ఉంటాయి (బ్యాంక్స్ 36)[ఉల్లేఖన అవసరం]. క్యురేర్ (నిశ్చలత్వం కలిగించే మందు) మరియు క్వినైన్ (మలేరియా చికిత్స) సైతం ఇక్కడ లభిస్తాయి.

సత్ప్రభావాలు[మార్చు]

నైరుతి వేసవి ఋతుపవనాల ప్రారంభ తేదీలు మరియు ప్రస్తుతపు వాయు ప్రవాహాలు.

ఉష్ణమండల వర్షారణ్యాలలో పర్యాటక రంగం యొక్క దుష్ప్రభావాలు ఉన్నప్పటికీ, ఇంకా ఎన్నో ముఖ్యమైన సత్ఫలితాలు కూడా ఉన్నాయి.

 • పర్యాటక రంగం పెరుగుదల ఆర్థిక సహకారంలో పెరుగుదల కలిగిస్తుంది, తద్వారా ఆ స్థావరాల రక్షణకు మరింత ఆదాయం లభిస్తుంది. పర్యాటకరంగం ప్రత్యక్షంగా సున్నిత ప్రాంతాలు మరియు స్థావరాల పరిరక్షణకు ఉపయోగపడవచ్చు. ఉద్యానవనాల ప్రవేశ రుసుము మరియు తత్సమాన వనరుల నుండి లభించే ఆదాయాన్ని ప్రత్యేకంగా వాతావరణ సున్నిత ప్రాంతాల భద్రత మరియు నిర్వహణకై ఉపయోగించవచ్చు. పన్నులు మరియు పర్యాటకరంగం ఆదాయం ప్రభుత్వాలకు అటవీప్రాంతం యొక్క భద్రత నిధికై అదనపు ఆదాయవనరు అందిస్తుంది.
 • పర్యాటకరంగం ఇంకా ప్రజలు పర్యావరణం గొప్పతనాన్ని గుర్తించేలా చేస్తుంది మరియు వాతావరణంతో మరింత దగ్గరై ప్రజలు అందులోని పర్యావరణ సమస్యల గురించి తెలుసుకునేలా చేస్తుంది. అలా పెరిగిన జ్ఞానం వలన మరింత మెరుగైన పర్యావరణ భద్రతా ప్రవర్తనను అలవరచుకునే వీలుంది. ముఖ్యంగా ఆఫ్రికాలో అంతేకాక దక్షిణ అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియా, మరియు దక్షిణ పసిఫిక్ ప్రాంతాలలో వన్యప్రాణ పరిరక్షణ మరియు సంరక్షణ ప్రయత్నాలపై పర్యాటకరంగం సత్ప్రభావం చూపింది.[16]

===జీవావరణ సేవలుÃÃ ఎన్నో మానవ ఉపయోగాలకు అదనంగా వర్షపు అటవీప్రాంతాలు జీవావరణ సేవలుగా పిలిచే ఎన్నో ఇతర ఉపయోగాలను కలిగి ఉన్నాయి. వర్షపు అటవీప్రాంతాలు జీవశాస్త్ర వైవిధ్య నిర్వహణ, అవక్షేపన అనుకూలత, చొరబాటు మరియు వరద మరియు శాస్త్రీయ విజ్ఞానం పెరుగుదలలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.

విధ్వంసం[మార్చు]

జ్వాలాముఖి, అగ్ని, మరియు వాతావరణం మార్పు వంటి సహజ ప్రక్రియల ద్వారా ఉష్ణమండల వర్షారణ్యాల విధ్వంసం అనేది శిలాజాల ద్వారా స్పష్టంగా నిర్ధారించబడింది.[7] ఈ భూగర్భ ప్రక్రియలు నెమ్మదిగా భౌతిక వాతావరణ స్వరూపాన్ని మార్చి, జీవపరిణామం మరియు సహజత్వాన్ని పెంచడం జరుగుతుంది.[7] దీనికి విరుద్ధంగా, మానవ కార్యకలాపాలతో ఉష్ణమండల వర్షారణ్యాల విధ్వంసం ద్వారా భూభాగం మార్పు వలన పర్యావరణానికి త్వరిత గతిన మార్పు సంభవిస్తుంది మరియు వినాశనానికి ఇది ప్రధాన కారణాలలో ఒకటిగా భావింపబడుతోంది.

విద్యా వనరులు[మార్చు]

 • వ్యవసాయ మరియు అటవీప్రాంతం వాతావరణ శాస్త్రం [17]
 • వృక్షశాస్త్ర వార్షిక ఘటనలు [18]
 • ఆస్ట్రల్ జీవావరణ శాస్త్రం
 • భూవైవిధ్యం మరియు పరిరక్షణ, ISSN: 0960-3115 eISSN: 1572-9710 [19]
 • జీవశాస్త్ర పరిరక్షణ [20]
 • వైవిధ్యం మరియు పంపిణీలు [21]
 • జీవావరణ సూచికలు [22]
 • జీవావరణ నిర్వహణ & పునరుద్ధరణ [23]
 • జీవావరణశాస్త్రం [24]
 • ఉష్ణమండల జీవావరణ శాస్త్రం పత్రిక [25]
 • పురాతనభౌగోళికశాస్త్రం, పురాతనవాతావరణశాస్త్రం, పురాతనజీవావరణశాస్త్రం [26]
 • నవ్యఉష్ణమండల జంతుసంపద మరియు పర్యావరణంపై పరిశోధనలు [27]
 • ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల తేమకలిగిన విశాలపత్ర అటవీప్రాంతాల జీవావరణ ప్రాంతాల జాబితా
 • పురాతనభౌగోళికశాస్త్రం
 • సతత హరితారణ్యం
 • సమశీతోష్ణ వర్షపు అటవీప్రాంతం
 • అయన మరియు ఉప-అయన రేఖ ప్రాంతాల తడి విశాల పత్ర అరణ్యాలు
 • ఉష్ణమండల వర్షారణ్యం వాతావరణం

సూచనలు[మార్చు]

 1. NASA.gov
 2. ScienceDaily.com
 3. సుసాన్ ఉడ్వార్డ్. ట్రోపికల్ బ్రాడ్ లీఫ్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్: ది రైన్ ఫారెస్ట్. Archived 2008-02-25 at the Wayback Machine. 2008-03-14న తిరిగి పొందబడినది.
 4. ది రేగెంత్స్ అఫ్ ది యునివర్సిటీ అఫ్ మిచిగాన్. ది ట్రాపికల్ రైన్ ఫారెస్ట్. 2008-03-14న తిరిగి పొందబడినది.
 5. మైఖేల్ రిట్టర్. ది ఫారెస్ట్ బయోమి. Archived 2008-01-06 at the Wayback Machine. 2008-03-14న తిరిగి పొందబడినది.
 6. "Tropical Rain Forest". Glossary of Meteorology. American Meteorological Society. మూలం నుండి 2012-01-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-05-14.
 7. 7.0 7.1 7.2 7.3 Sahney, S., Benton, M.J. & Falcon-Lang, H.J. (2010). "Rainforest collapse triggered Pennsylvanian tetrapod diversification in Euramerica" (PDF). Geology. 38: 1079–1082.CS1 maint: multiple names: authors list (link)
 8. [80] ^ U.N. కాల్స్ ఆన్ ఆసియన్ నేషన్స్ టు ఎండ్ డీఫారెస్టేషన్, ర్యూటర్స్
 9. బ్రెజిల్: కర్షకులను అమెజాన్ లోకి పంపటం వలన డీఫారెస్టేషన్ గణనీయంగా పెరిగిపోయింది, ది గార్డియన్, సెప్టెంబర్ 1, 2008
 10. చైనా ఈస్ బ్లాక్ హొల్ అఫ్ ఆసియాస్ డీఫారెస్టేషన్, ఆసియా న్యూస్, 24 మార్చ్ 2008
 11. బ్రొకర్, W.S., 2006 "బ్రీతింగ్ ఈజీ, Et tu, O2" కలమ్బియా యునివర్సిటీ Columbia.edu
 12. [56] ^ మోరన్, E.F., "డీఫారెస్టేషన్ అండ్ ల్యాండ్ యూజ్ ఇన్ ది బ్రెజిలియన్ అమెజాన్", హ్యూమన్ ఎకాలజీ, వాల్యూమ్ 21, నెం. 1, 1993" “"లన్గ్స్ అఫ్ ది వరల్డ్ " నమ్మకాన్ని సరిచేయడానికి 15 సంవత్సరాలు సమయం పట్టినది. వర్షారణ్యలు క్రనజన్యసంయోగక్రియ అనే ప్రక్రియ వలన కొంచెం ప్రాణవాయువును వాతావరణానికి అందిస్తుంది”
 13. 13.0 13.1 13.2 13.3 బైలీ, R.C., హెడ్, G., జేనికే, M., ఓవెన్,B., రేచ్త్మన్, R., జేచెంటర్, E., 1989 "హన్టింగ్ అండ్ గేదరింగ్ ఇన్ ట్రోపికల్ రైన్ఫారెస్ట్: ఈస్ ఇట్ పోస్సిబుల్." అమెరికన్ మనవశాస్త్రవేత్త, 91:1 59-82
 14. 14.0 14.1 14.2 ఫిలిప్ L. వాకర్, లారి సుగియామా, రిచార్డ్ చాకన్. (1998) మానవ దంత అభివృద్ధి, జీవాక్రుతిశాస్త్రం, మరియు వ్యాధిసంబంధశాస్త్రం లో "ఆహారం, దంత ఆరోగ్యం, మరియు సౌత్ అమెరికన్ ఇండియన్ హంటర్-హార్టికల్చరిస్ట్స్ మధ్య సాంస్కృతిక మార్పు" . యునివర్సిటీ అఫ్ ఒరిగాన్ ఆంత్రోపోలాజికల్ పేపర్స్, No . 54
 15. మయర్స్, N. 1985. ది ప్రైమరీ సోర్స్ W. W. నార్టన్ అండ్ కో., న్యూ యార్క్, పేజీలు. 189-193.
 16. ఫోటియు, S. (2001, అక్టోబర్). పర్యాటకం యొక్క పర్యావరణ ప్రభావం. నవంబర్ 30, 2007న తిరిగి పొందబడినది నుండి Uneptie.org
 17. Elsevier. "Agricultural and Forest Meteorology". Retrieved 20 January 2009. Cite web requires |website= (help)
 18. Oxford University Press. "Annals of botany". Retrieved 20 January 2009. Cite web requires |website= (help)
 19. Springer. "Biodiversity and Conservation". Retrieved 20 January 2009. Cite web requires |website= (help)[permanent dead link]
 20. Elsevier. "Biological Conservation". Retrieved 20 January 2009. Cite web requires |website= (help)
 21. "Diversity and Distributions". Retrieved 20 January 2009. Cite web requires |website= (help)[permanent dead link]
 22. Elsevier. "Ecological Indicators". Retrieved 20 January 2009. Cite web requires |website= (help)
 23. John Wiley & Sons. "Ecological Management & Restoration". Retrieved 20 January 2009. Cite web requires |website= (help)
 24. BioOne. "Ecoscience". Retrieved 20 January 2009. Cite web requires |website= (help)
 25. Cambridge University Press. "Journal of Tropical Ecology". Retrieved 20 January 2009. Cite web requires |website= (help)
 26. Elsevier. "Palaeogeography, Palaeoclimatology, Palaeoecology". Retrieved 20 January 2009. Cite web requires |website= (help)
 27. Taylor & Francis. "Studies on Neotropical Fauna and Environment". Retrieved 20 January 2009. Cite web requires |website= (help)

బాహ్య లింకులు[మార్చు]

మూస:Biomes