ఉసిరి సాంబార్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఉసిరి సాంబార్ ఒక శాకాహార వంటకము. ఉసిరి కాయలు ఎక్కువగా దొరికే సీజన్ లో దీనిని తయారుచేస్తుంటారు.

కావలసిన పదార్థాలు[మార్చు]

  • ఉసిరికాయలు - వందగ్రాములు,
  • కందిపప్పు (ఉడికించి) - ఒక కప్పు,
  • సాంబార్‌పొడి - రెండు టీస్పూన్లు,
  • పసుపు - చిటికెడు,
  • పచ్చిమిర్చి - రెండు,
  • కరివేపాకులు - కొన్ని,
  • ఆవాలు - ఒక టీస్పూన్,
  • ఇంగువ - చిటికెడు,
  • ఉప్పు, నూనె - సరిపడా.

తయారీ[మార్చు]

  1. ఉసిరికాయల్ని కడిగి గింజలు తీసి ముక్కలు కోయాలి.
  2. పచ్చిమిర్చిని నిలువుగా చీల్చాలి.
  3. గిన్నెలో ఒక కప్పు నీళ్లు పోసి ఉసిరి ముక్కల్ని ఉడికించాలి. తరువాత సాంబార్ పొడి, పసుపు, పచ్చిమిర్చి, ఇంగువ, ఉప్పు వేసి ఉడికించాలి.
  4. ఉసిరి ముక్కలు ఉడకగానే వాటిని మెత్తగా మెదపాలి. తరువాత ఉడికించిన కందిపప్పు వేసి మళ్లీ ఉడికించాలి.
  5. అన్ని పదార్ధాలు బాగా కలిసిపోయిన తరువాత గిన్నెను స్టవ్ మీద నుంచి కిందకు దింపాలి.
  6. తాలింపుకు నూనె వేడిచేసి ఆవాలు, కరివేపాకు వేయాలి.
  7. ఆవాలు చిటపటమంటున్నప్పుడు సాంబార్‌లో ఆ తాలింపు వేస్తే ఉసిరి సాంబారు తయారు.