ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ

వికీపీడియా నుండి
(ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ
జననం (1917-12-25)డిసెంబరు 25, 1917
ఏలూరు
మరణం 1996
మతం హిందూ
జీవిత భాగస్వామి హయగ్రీవగుప్త
పిల్లలు సుహాసిని, ప్రతాపచంద్ర్రుడు, రాజరాజనరేంద్రుడు, విజ్ఞానేశ్వర కూమారుడు
తల్లిదండ్రులు

ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ (1917 - 1996) కవయిత్రీ, పరిశోధకురాలు.[1] ఈమె తనపేరు లక్ష్మీకాన్తమ్మ అని రాసుకున్నారు.

జీవిత విశేషాలు[మార్చు]

ఈమె తండ్రి ప్రముఖ పాత్రికేయులు నాళము కృష్ణారావు. తల్లి ప్రముఖ సంఘసేవకురాలు, ఆంధ్రమహిళాగానసభ స్థాపకురాలు నాళము సుశీలమ్మ. ఈమె పింగళ నామ సంవత్సరం డిసెంబరు 25, 1917ఏలూరులో జన్మించింది. ఈమె విద్యాభ్యాసము రాజమండ్రిలోని వీధిబడిలో ప్రారంభమైంది. తరువాత వైశ్య సేవాసదనము యువతీ సంస్కృత కళాశాలలో చదివి ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి ఉభయభాషాప్రవీణ 1935లో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణురాలయింది. యల్లాప్రగడ జగన్నాథము పంతులు ఈమెకు ఆధ్యాత్మక గురువు. ఈమెకు తన పదమూడవ యేట మార్చి 24, 1930లో హయగ్రీవ గుప్తతో వివాహం జరిగింది. ఈమె తన ఎనిమిద యేటనుండి 18 సంవత్సరాలు వీణావాదన నేర్చుకుంది. త్యాగరాయ కృతులు నేర్చుకుంది. మొదట ఈమె విష్వక్సేన గోత్రురాలు. వివాహమైన పిమ్మట ఈమె గోత్రము సుకాంచన అయ్యింది. దేవీ ఉపాసకురాలు.

ఈమె రచనలు గృహలక్ష్మి, భారతి, ప్రబుద్ధాంధ్ర, ఆంధ్రమహిళ, కృష్ణాపత్రిక, నవోదయ మొదలైన పత్రికలో ప్రచురింపబడ్డాయి. విజయవాడ, మద్రాసు రేడియోలలో ఈమె రచనలు, ప్రసంగాలు ప్రసారమయ్యాయి.

రచనలు[మార్చు]

 1. దేవీస్తవతారావళి
 2. మనసాహితి - మధుభారతి (గేయములు)
 3. కన్యకమ్మనివాళి (కన్యకాపరమేశ్వరి స్తోత్రము, 1978),
 4. మహిళావిక్రమసూక్తము,
 5. ఆంధ్రుల కీర్తనవాజ్మయసేవ
 6. పరిశోధనా రచనలు - ఆంధ్రుల సంగీతవాజ్మయంపై ఒక పరిశోధన, ఆంధ్ర కవయిత్రులు, అఖిల భారత కవయిత్రులు
 7. ఆంధ్ర కవయిత్రులు, 2వ కూర్పు. 1980
 8. హంస విజయము
 9. అభిజ్ఞాన శాకుంతలము
 10. జాతి పిత
 11. ఒక్క చిన్న దివ్వె (చిన్న కవితలు) (1980)
 12. నాతెలుగు మాంచాల (1981)
 13. లజ్జ కిరీటధారిణి
 14. నావిదేశపర్యటనానుభవాలు (యాత్రాచరిత్రలు)
 15. సరస్వతీ సామ్రాజ్య వైభవము (ఏకాంకిక) (1988)
 16. సాహితీరుద్రమ (ఆత్మచరిత్ర) (1993)
 17. కాంతి శిఖరాలు (భక్తి గీతాలు)
 18. భారతదేశ చరిత్ర కొన్ని గుణపాఠములు (చరిత్ర)
 19. సదుక్తిమంజరి (హిందీకవులయిన కబీర్, తులసీదాస్, విందా రహీమ్ సుభాషితాలు తెలుగులో)
 20. అమృతవల్లి (నవల)
 21. కోరలమధ్యన కోటి స్వర్గాలు (నవల)
 22. చీకటి రాజ్యము (నవల)
 23. శ్రీ కన్యకా సుప్రభాతమ్

అముద్రిత రచనలు[మార్చు]

 1. చంద్రమతి కథ (బాలసాహిత్యము)
 2. సాహిత్య వ్యాసమంజరి
 3. ఋతంబరి (గద్యగీతము)
 4. యుగళ సిరి

బిరుదులు[మార్చు]

 1. డాక్టరేట్
 2. విద్వత్కవయిత్రి
 3. ఆంధ్ర విదుషీకుమారి
 4. తెలుగు మొలక
 5. ఆంధ్ర సరస్వతి
 6. కవయిత్రీ తిలక
 7. కళాప్రపూర్ణ మొదలైనవి.

సత్కారాలు[మార్చు]

 • అనంతపురం పౌరులచే కనకాభిషేకము మరియు పౌరసన్మానము
 • 1953లో గృహలక్ష్మి స్వర్ణకంకణము

మూలాలు[మార్చు]

 1. తెలుగు సాహిత్య చరిత్ర - ద్వా.నా. శాస్త్రి
 2. సాహితీ రుద్రమ - ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ. బాపట్ల, 1993.

ఇతర లింకులు[మార్చు]

 1. గృహలక్ష్మి మార్చి 1953 సంచిక