ఊపాలి ఒపెరాజితా
ఊపలీ ఒపెరాజితా | |
---|---|
జననం | |
విద్య | కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ, డల్హౌసీ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, రిషి వ్యాలీ పాఠశాల |
వృత్తి | క్లాసికల్ ఒడిస్సీ, భరతనాట్యం నర్తకి కొరియోగ్రాఫర్ |
తల్లిదండ్రులు | బిధు భూషణ్ దాస్ ప్రభాత్ నళినీ దాస్ |
బంధువులు | సరళా దేవి (మేనత్త) నిత్యానంద్ కనుంగో (మామ) |
వెబ్‌సైటు | http://www.oopalioperajita.com/ |
ఊపాలి ఒపెరాజితా (ఆంగ్లం:Oopali Operajita) భారతీయ క్లాసికల్ ఒడిస్సీ, భరతనాట్యం నర్తకి. కొరియోగ్రాఫర్ కూడా. అలాగే ఆమె అల్ గోర్ సస్టైనబుల్ టెక్నాలజీ వెంచర్ కాంపిటీషన్ స్థాపకురాలు, చైర్ పర్సన్.[1] ఈ పోటీ అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ అల్ గోర్ (Al Gore) పేరు పెట్టబడినా అతని ప్రమేయం లేకుండా నిర్వహించబడుతుంది.[2]
కెరీర్
[మార్చు]ఊపాలి ఒపెరాజితా ఆరేళ్ల వయసు నుంచి రిషి వ్యాలీ స్కూల్ లో తొమ్మిదేళ్ల పాటు చదివి, GCE 'O' లెవెల్స్ (ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్) గ్రాడ్యుయేట్ చేసింది. ఆమె పండనల్లూరు శైలిలో భరతనాట్యం నర్తకిగా ఆమె ప్రసిద్ధురాలు.[3]
ఆమె 2007లో అల్ గోర్ సస్టైనబుల్ టెక్నాలజీ వెంచర్ కాంపిటీషన్ (AGSTVC) స్థాపించింది. యు.ఎస్ మాజీ వైస్ ప్రెసిడెంట్ అల్ గోర్ గౌరవార్థం ఆమె ఆ పేరు పెట్టింది.[4] 2009-2011 నుండి ప్రతి సంవత్సరం ఎం.బి.ఎ., సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్‌లకు ఇది నిర్వహించబడుతోంది. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM)తో సహా భారతదేశం, బంగ్లాదేశ్, అమెరికా అంతటా ఉన్న సంస్థల నుండి ఎంట్రీలను ఆకర్షించింది. 2009లో అధికారిక భాగస్వామి ఐఐటి ఖరగ్‌పూర్ కాగా 2010, 2011లలో ఐఐటి చెన్నై. ఇది ఐఐఎం కలకత్తా భాగస్వాములలో ఒకటి.[5][6] బంగ్లాదేశ్‌కు చెందిన ఒక బృందం, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) నుండి మరొక బృందం 2011లో ప్రథమ, ద్వితీయ బహుమతులు గెలుచుకున్నాయి.[7]
తన తల్లిదండ్రులతో కలిసి ఆమె గోపీనాథ్ మొహంతి అమృతరా సంతాన (Amrutara Santāna) పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించింది. 2015లో ప్రచురించబడిన అనువాదం, అమృతరా సంతాన: ది డైనాస్టీ ఆఫ్ ది ఇమ్మోర్టల్స్ (Amrutara Santāna: The Dynasty of The Immortals).[8]
మరిన్ని విశేషాలు
[మార్చు]కేలుచరణ్ మోహపాత్ర, దేబా ప్రసాద్ దాస్ వద్ద శిక్షణ పొందిన ఊపాలి ఒపెరాజితా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చింది.[9][10] న్యూయార్క్ టైమ్స్ ఆమెను మోహపాత్ర "స్టార్ విద్యార్థులలో" ఒకరిగా పేర్కొంది.[11]
పిట్స్‌బర్గ్‌లోని కార్నెగీ మ్యూజిక్ హాల్‌లో ప్రదర్శన ఇచ్చిన మొదటి భారతీయ శాస్త్రీయ నృత్యకళాకారిణి ఆమె.[12]
2010లో అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కోసం భారతదేశ అధ్యక్షుడు నిర్వహించిన సంగీత కచేరీకి ఆమె ఆర్టిస్టిక్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్‌గా పనిచేసింది.[13]
ఆమె కేలుచరణ్ మోహపాత్రతో చేసిన నృత్య ప్రదర్శన 1996లో పిట్స్‌బర్గ్ పోస్ట్ గెజెట్ ద్వారా 10 పిట్స్‌బర్గ్ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలలో ఒకటిగా నిలిచింది.[14]
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Oopalee Operajita". economictimes.com.
- ↑ "The Al Gore Sustainable Technology Venture Competition India". cicerotransnational.com.
Prof. Oopali Operajita ... Former Distinguished Faculty Fellow
- ↑ Balasundaram, S. (2012). Non-guru Guru: My Years with J. Krishnamurti (in ఇంగ్లీష్). Edwin House Publishing Company. p. 77. ISBN 978-0-9760006-3-1.
- ↑ "Gear up for Shaastra'10". thehindu.com. 6 September 2010. Archived from the original on 11 September 2010.
- ↑ "IIM Bangalore-IIT Bombay team win first prize at Al Gore Sustainable Technology Venture Competition 2009". www.iimb.ac.in. Retrieved 2 Aug 2021.
...a former Distinguished Faculty Fellow at Carnegie Mellon University
- ↑ "Centre for Entrepreneurship and Innovation | IIM Calcutta". iimcal.ac.in. Archived from the original on 2022-03-08. Retrieved 2023-03-09.
- ↑ "Green campus: IIT-Madras students show the way!". news18.com. 26 September 2011. Archived from the original on 25 October 2019. Retrieved 25 October 2019.
- ↑ Mahanty, Gopinath (2017). Dynasty of the Immortals (in ఇంగ్లీష్). Sahitya Akademi. ISBN 978-81-260-4746-8.
- ↑ ALKA PANDE (2003-05-04). "New Delhi". The Hindu. Archived from the original on 2013-01-25. Retrieved 2018-03-22.
- ↑ "Woods talk and rock". The Hindu (in Indian English). 2010-01-18. ISSN 0971-751X. Archived from the original on 27 June 2021. Retrieved 2018-03-22.
- ↑ Dunning, Jennifer (1996-09-30). "Birthday Tribute to a Master Teacher of Indian Dance". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Archived from the original on 29 January 2018. Retrieved 2021-10-11.
- ↑ Gupta, Namita (16 October 2016). "Sari tales from Benaras". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 24 March 2018.
- ↑ "Oopali Operajita (MAPW '95) Plays Key Role in India's Concert for President Obama". Carnegie Mellon University. 9 December 2010. Retrieved 23 March 2018.
- ↑ Vranish, Jane (1996-12-29). "A STEP AHEAD ALVIN AILEY WAS A STEP AHEAD IN DANCE". Pittsburgh Post-Gazette. మూస:ProQuest. Retrieved 2021-10-09.