ఊమెన్ చాందీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఊమెన్‌ చాందీ
ఊమెన్ చాందీ


కేరళ ముఖ్యమంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2011 మే 18 – 2016 మే 20
నియోజకవర్గం పూతుపల్లి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1943 అక్టోబరు 31
కుమారకోమ్ గ్రామం, కొట్టాయం జిల్లా, కేరళ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి మరియమ్మ ఊమెన్‌
సంతానం ముగ్గురు
నివాసం పూతుపల్లి, తిరువనంతపురం
మతం క్రిస్టియన్

ఊమెన్‌ చాందీ కేరళ రాష్ట్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి. కేరళ రాష్ట్రానికి 2004 - 2006 మధ్య,[1] 2011 - 2016 మధ్య రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. 2006 - 2011 వరకు కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు.[2] 1970 నుండి పూతుపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్నాడు.

2018 జూన్ 6 న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష్యుడు రాహుల్ గాంధీ, ఊమెన్‌ చాందీని భారత జాతియ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శిగా నియమించాడు. తరువాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడుగా కూడా పనిచేసాడు. ఊమెన్‌ చాందీ కాంగ్రెసు పార్టీ తరపున 2021 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి పూతుపల్లి నియోజకవర్గం నుండి 12 వ సారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]

జననం[మార్చు]

ఊమెన్‌ చాందీ 1943 అక్టోబరు 31న కేరళ రాష్ట్రం, కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్ గ్రామంలో జన్మించాడు. తండ్రి పేరు కే.ఓ.చాందీ, అమ్మ బేబీ చాంది.

రాజకీయ నేపథ్యం[మార్చు]

ఊమెన్‌ చాందీ తన రాజకీయ జీవితాన్ని కేరళ స్టూడెంట్స్ యూనియన్ ద్వారా ప్రారంభించి, 1967 నుండి 1969 వరకు దాని అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాడు. అనంతరం 1970లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఊమెన్‌ చాందీ 27 ఏళ్ల వయసులో తొలిసారిగా 1970లో పూతుపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అప్పటి నుండి వరుసగా 1977, 1980, 1982, 1987, 1991, 1996, 2001, 2006, 2011, 2016 ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]

1996–98 వరకు అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించాడు. రాష్ట్ర మంత్రిగా నాలుగుసార్లు బాధ్యతలు నిర్వహించాడు. కె. కరుణాకరన్ మంత్రివర్గంలో 11.04.1977 నుండి 25.04.1977 వరకు కార్మికశాఖ మంత్రిగా, ఎకె ఆంటోని మంత్రివర్గంలో 25.04.1977 నుండి 27.10.1978. కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు. కె. కరుణాకరన్ మంత్రివర్గంలో 28.12.1981 నుండి 17.03.1982. వరకు హోం శాఖ మంత్రిగా, నాల్గొవసారి కె. కరుణాకరన్ మంత్రివర్గంలో 02.07.1991 నుండి 22.06.1994 ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగి ముఖ్యమంత్రితో విభేదాల కారణంగా మంత్రిగా రాజీనామా చేశాడు.

ముఖ్యమంత్రిగా[మార్చు]

ఊమెన్‌ చాందీ 2004 ఆగస్టు 31న కేరళ 19వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. 2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ 2006, మే 12న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు.[5] 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కూటమి గెలుపొందడంతో 2011, మే 18 న రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.

ఎమ్మెల్యే గా విజయాలు[మార్చు]

ఎన్నికలు
సంవత్సరం ప్రత్యర్థి - పార్టీ మెజారిటీ (ఓట్ల )
1970 ఈ.ఎం.జార్జ్ (భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్)) 7,288
1977 పీసీ చెరియన్ (బి.ఎల్.డి) 15,910
1980 ఎం.ఆర్.జి పనికెర్ (ఎన్.డి.పి) 13,659
1982 థామస్ రాజన్ (ఐ.సి.ఎస్) 15,983
1987 వి.ఎన్.వాసవన్ (సిపిఐ (ఎం)) 9,164
1991 వి.ఎన్.వాసవన్ (సిపిఐ (ఎం)) 13,811
1996 రేజి జచరియా (సిపిఐ (ఎం)) 10,155
2001 చెరియన్ ఫిలిప్ (సిపిఐ (ఎం))ఇండిపెండెంట్) 12,575
2006 సింధు జాయ్ (సిపిఐ (ఎం)) 19,863
2011 సుజా సుసాన్ జార్జ్ (సిపిఐ (ఎం)) 33,255
2016 జేక్ సి.థామస్ (సిపిఐ (ఎం)) 27,092
2021 జేక్ సి.థామస్ (సిపిఐ (ఎం))

మూలాలు[మార్చు]

  1. "Oommen Chandy's 70th Birthday Special". Archived from the original on 2014-12-16. Retrieved 2021-04-05.
  2. Krishnan, Anantha. "Kerala assembly elections 2011: UDF wins by narrow margin". The Times of India.
  3. "ఓటమి ఎరుగని ఊమెన్‌ చాందీ". www.eenadu.net. Archived from the original on 2021-05-04. Retrieved 2021-05-04.
  4. Eenadu, Eenadu (5 April 2021). "అజేయుడు ఊమెన్‌ చాందీ". www.eenadu.net. Archived from the original on 5 ఏప్రిల్ 2021. Retrieved 5 April 2021.
  5. "Oommen Chandy sworn in as Kerala CM". www.rediff.com. Retrieved 5 April 2021.