ఎంపైర్ స్టేట్ బిల్డింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎంపైర్ స్టేట్ బిల్డింగ్

ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అనేది న్యూయార్క్ నగరంలో 102-అంతస్తు గల భవనం.ఈ భవనాన్ని 1931 మే 1 న నిర్మించారు. ఈ భవనం ఎత్తు1,250 అడుగులు పై ఉండే యాంటెనతో కలుపుకుంటే 1,454 తో ఎత్తుతో కలిగి ఉంటుంది.సుమారుగా పాతికసార్లు ఈ భవనంపై పిడుగులు పడ్డాయి. అయినా కొంచెం కూడా చెక్కుచెదరలేదు. ఏటా 40 లక్షల మంది పర్యాటకులు ఆ భవనం ఎక్కడానికి చాలా ఆసక్తి కనబరుస్తారు. ప్రపంచంలో 102 అంతస్తుల భవనం. ఈ భవనం రాత్రులు విద్యుత్ కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. 410 రోజులపాటు 3400 మంది ఈయనిర్మాణంలో పాల్గొన్నారు. ఈ భవనాన్ని అధికారికంగా 1931 అమెరికా అధ్యక్షుడు హెర్బల్ హువేర్ ప్రారంభించారు.[1][2]

భవన నిర్మాణం[మార్చు]

ఈ భవనం 6514 కిటికీలు ఉన్నాయి.73 లిఫ్ట్ ఉన్నాయిఈ భవనానికి మొత్తం మెట్లు 1872 ఉన్నాయి.ఈ భవనంలో పోటీలు సైతం నిర్వహిస్తారు. 86వ అంతస్తు 1576 మెట్లను ఎవరు వేగంగా ఎక్కితే వారిని విజేతగా ప్రకటిస్తారు. ఆస్ట్రేలియాకు చెందిన పాల్ క్రిక్ పేరిట వరల్డ్ రికార్డ్ నమోదయింది. అతడు 9నిమిషాలు 33 సెకండ్లలో 86 అంతస్తులు ఎక్కి రికార్డు నమోదు చేసాడు. న్యూయార్క్ నగరం అందాలను చూడాలంటే ఈ భవనం 86, 102 అంతస్తులో ప్రత్యేకంగా అబ్సర్వేషన్ డెస్కలు ఉంటాయి. అక్కడ నుంచి వస్తే న్యూయార్క్ అందాలను, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా కనెక్టికట్ రాష్ట్రాలను చూడవచ్చు.ఈ భవనం ఖరీదు $ 40,948,900 (2016 డాలర్లలో $ 534 మిలియన్లు).

చిత్ర మాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Library, C. N. N. "Empire State Building Fast Facts". CNN. Archived from the original on 2019-11-01. Retrieved 2019-12-03.
  2. "FACTBOX-History of New York's Empire State Building". chicagotribune.com (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2019-11-02. Retrieved 2019-12-03.