బ్యాచిలర్ ఆఫ్ మెడిసన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ
This article needs more links to other articles to help integrate it into the encyclopedia. (మే 2017) |
బ్యాచిలర్ ఆఫ్ మెడిసన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ ని సంక్షిప్తంగా ఎంబిబిఎస్ అంటారు. ఎంబిబిఎస్ రెండు మొదటి ప్రొఫెషనల్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు. యునైటెడ్ కింగ్డమ్ సంప్రదాయమును అనుసరించి వివిధ దేశాలలోని యూనివర్సీటీ వైద్య కళాశాలలు ఔషధ, శస్త్రచికిత్సలో ఈ డిగ్రీ పట్టాలను పట్టభద్రులకు ప్రదానం చేస్తాయి. ఈ పేరు వాటి యొక్క రెండు ప్రత్యేక డిగ్రీలను సూచిస్తుంది; అయితే ఆచరణలో ఇది ఒక డిగ్రీగా వ్యవహరించబడుతుంది, కలిపే ప్రదానం చేస్తారు. యునైటెడ్ స్టేట్స్ యొక్క సంప్రదాయమును అనుసరించే దేశాల్లో ఈ డిగ్రీని ఎం.డి లేదా డి.ఓగా ప్రదానం చేస్తారు, ఇది ఒక వృత్తిపరమైన డాక్టరేట్ డిగ్రీ.
భారతదేశం
[మార్చు]భారతదేశంలోని వైద్య కళాశాలలు భారత వైద్య మండలి ద్వారా ధృవీకరణ పొందుతాయి, ఇవన్నీ ఎంబిబియస్ టైటిల్ తో డిగ్రీలను ప్రదానం చేస్తాయి. విద్యార్థులు డిగ్రీ కోసం దరఖాస్తు చేసే ముందు తప్పనిసరిగా రోటాటరీ ఇంటర్న్ షిప్ ఒక సంవత్సరమును అనుసరించి నాలుగున్నర సంవత్సరాల కోర్సును పూర్తిచేయాలి.