ఎం.ఆర్‌.రాధా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మద్రాసు రాజగోపాల రాధాకృష్ణన్ నాయుడు
MRRadha.jpg
జననం(1907-04-14) 1907 ఏప్రిల్ 14
మద్రాసు, మద్రాసు రాష్ట్రం, బ్రిటీషు ఇండియా
మరణం1979 సెప్టెంబరు 17 (1979-09-17)(వయసు 72)
తిరుచిరాపల్లి, తమిళనాడు, భారతదేశం
ఇతర పేర్లునడిగ వేల్
వృత్తినటుడు
మతంనాస్తికుడు

మద్రాసు రాజగోపాల రాధాకృష్ణన్ ప్రముఖ తమిళ సినిమా మరియు రంగస్థల నటుడు. ప్రముఖ దక్షిణ భారతీయ నటి అయిన రాధిక తండ్రి. ఈయన 1967లో తన సహనటుడు, ఆ తరువాత తమిళనాడు ముఖ్యమంత్రి అయిన ఎం.జి.రామచంద్రన్ పై కాల్పులు జరిపి జైలుకెళ్లాడు.

రాధ, 1907, ఫిబ్రవరి 21న తిరుచ్చిలో జన్మించాడు. చిన్నతనంలోనే తినటానికి మరో చేప ముక్క ఇవ్వనందున తల్లితో గొడవపడి రాధా ఇల్లువదిలి పారిపోయాడు. రంగస్థల నటుడై 5000కు పైగా నాటక ప్రదర్శనలిచ్చాడు. 10వ ఏట ప్రారంభమైన చిన్నచితకా వేషాలేసి, చివరికి ఆయన్నే దృష్టిలో పెట్టుకొని నాటకాలు వ్రాసే స్థాయికి ఎదిగాడు.

రాధా రక్త కన్నీరు నాటకం విజయవంతమవడంతో పేరు సంపాదించుకున్నాడు. ఈ నాటకాన్నే సినిమాగా తీసినప్పుడు అందులో కూడా అద్భుతంగా నటించి అగ్రతారగా ఎదిగాడు. ఈ సినిమా ఈయనకు అంతర్జాతీయ గుర్తింపు, పురస్కారాలను సంపాదించి పెట్టింది. ఇటీవలి రక్తకన్నీరు సినిమాను కన్నడలో ఉపేంద్ర పునర్నిర్మించాడు. రక్తకన్నీరులో రాధా నటనను దేవానంద్, అమితాబ్ బచ్చన్ వంటి అనేక మంది నటులు భారతీయ సినీ చరిత్రలోనే అత్యద్భుతమైన నటనగా కొనియాడారు. ఈ నటనను మరే నటుడు అనుకరించలేడని అన్నారు.

నటించిన చిత్రాలు[మార్చు]

 • రక్త కన్నీర్
 • ఆయిరాం రూబాయ్
 • దైకొదూత దైవం
 • పావ మన్నిప్పు
 • ఎన్‌ కడమై
 • చీఠీ
 • పుదియ పరవాయ్
 • బాలే పాండియ
 • పెట్రల్ధన్ పిల్లయ
 • థాయిక్కు పిన్ తారం
 • కవలై ఇల్లద మనితన్
 • కుముదం
 • కర్పగం
 • తాయై కథ తనయన్
 • పాశం
 • పాలుం పళముం
 • పట్టినాథర్
 • పడిత్తాల్ మట్టుం పోదుమా
 • నానం ఓరు పెణ్
 • కోడుథు వైథవల్
 • ఆలయమణి
 • సంతనథేవన్
 • వెలుం మయిలం థునై
 • రత్నపురి ఇళవరసి
 • థాయి సొల్లి థాథాథే
 • పెట్రాల్థన్ పిల్లయ
 • పెరియ ఇదతు పెన్న్‌
 • ఆంధ జోధి
 • ఉలగం సిరిక్కిరథు

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]