ఎం.ఎం.మానసి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మానసి
జన్మ నామంఎం.ఎం మానసి
మూలంచెన్నై, తమిళనాడు, భారతదేశం
సంగీత శైలిప్లేబ్యాక్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్
క్రియాశీల కాలం2001 – ప్రస్తుతం

ఎం.ఎం. మానసి (జననం 1993 జనవరి 8) హిందుస్థానీ సంగీతములో శిక్షణ పొందిన భారతీయ నేపథ్య గాయని. ఆమె తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఆంగ్ల భాషలలో 170కి పైగా పాటలు పాడింది.[1]

తమిళంలో ఆమె పాడిన స్టైలిష్ తమిజాచి (ఆరంభం), కత్తికెడ (కక్కి సత్తై), సెమ్మ మాస్ (మాస్సు), రోబో రోమియో (తమిళుకు ఎన్ ఒండ్రై అజుతావుమ్‌), సొత్తవాలా (పులి), ఆటకారి మామన్ పొన్ను (తరై తప్పట్టై) తదితర పాటలు శ్రోతలను ఉర్రూతలూగించాయి. ఇళయరాజాకి 1000వ చిత్రం తారై తప్పట్టై.

ఆమె 2018 టాలీవుడ్ పీరియాడిక్ డ్రామా చిత్రం రంగస్థలం నుండి రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు.. పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు.. పాటకుగాను ఉత్తమ మహిళా నేపథ్య గాయని - తెలుగు సైమా (SIIMA) అవార్డును గెలుచుకుంది.[2] ఈ పాట యూట్యూబ్‌లో తక్కువ టైమ్‌లో 10 కోట్ల మార్క్‌ను దాటిన తొలి దక్షిణాది పాటగా అప్పట్లో రికార్డు సృష్టించింది.[3]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

చెన్నైలో పుట్టిన ఎం. ఎం మానసి ముంబైలో పెరిగింది. రెండు సంవత్సరాల వయస్సునుంచి ఆమె సంగీతం నేర్చుకోవడం ప్రారంభించింది. అప్పటినుంచే ఆమె నవరాత్రి ఉత్సవాలు, గణపతి పూజల సమయంలో బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టింది. ఆమెకు ఎం. ఎం. మోనిషా అనే సోదరి ఉంది. మానసి డీజి వైష్ణవ్ కళాశాల నుంచి స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ లో తన చదువును పూర్తి చేసింది.

కెరీర్

[మార్చు]

ఆమె కన్నడ సంగీత పరిశ్రమకు ఇళయరాజా ద్వారా దృశ్య (2014) చిత్రంతో, మలయాళ పరిశ్రమకు విద్యాసాగర్ ద్వారా ఒరు ఇండియన్ ప్రణయకథ (2013) చిత్రంతో పరిచయం అయింది. ఇక ఆమె బాలీవుడ్‌లోకి సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ద్వారా భాగ్ జానీ (2015) చిత్రంలోని డాడీ మమ్మీ.. పాటతో ఎంట్రీ ఇచ్చింది. ఈ పాట యూట్యూబ్‌లో 20 మిలియన్ల మంది వీక్షించారు.

మానసి పాటలు పాడటమే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ కథానాయికలకు గాత్రదానం చేసింది. ఆమె ప్రముఖంగా డబ్బింగ్ ఆర్టిస్టుగా తమన్నా భాటియాకు బాహుబలి, తోజా, ధర్మదురై, దేవి, కత్తి సండై చిత్రాలలో చేసింది. అలాగే కాజల్ అగర్వాల్‌కు మారి, సమంతకు అంజాన్, కమలినీ ముఖర్జీకి ఇరైవి, హన్సిక మోత్వానికి మేఘమన్, నిక్కీ గల్రానీకి డార్లింగ్, వెలైను వందూత్త వెల్లైకారన్ చిత్రాలు, బిందు మాధవికి తమిళుకు ఎన్ ఒండ్రై అజ్ఝుతావుమ్, తాప్సీకి వై రాజా వై, తులసి నాయర్కి యాన్, స్వాతికి ఇధర్క్కుతానే ఆసై పట్టై బాలకుమారా, నజ్రియాకు తిరుమణం ఎనుమ్ నిక్కా, రితికా సింగ్‌కి ఓ మై కడవులే.. ఇలా పలు చిత్రాలలో హిరోయిన్స్ కి చేసింది[4]

తెలుగులోనూ పాడిన పాటలు ఆమెకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. వాటిలో ఆగడులోని "భేల్పూరి", పవర్లోని "నోటంకి", సరైనోడులోని "ప్రైవేట్ పార్టీ", శివంలోని "గుండె ఆగి పోతాందే", మసాలాలోని "మీనాక్షి", లెజెండ్‌లోని "ఓం సర్వాణి", తడాఖాలోని "మారా ఓ మారా", బలుపులోని "లక్కీ లక్కీ రాయ్", రంగస్థలంలోని "రంగమ్మా మంగమ్మా" వంటి పాటలు ఆల్ టైమ్ హిట్ గా నిలిచాయి.

ఇక 2023లో వంశీ పైడిపల్లి దర్శకత్వంవహించి రూపొందించిన వారసుడు చిత్రంలోని ‘రంజితమే’ పాట యూట్యూబ్‌ ట్రెండింగ్ లో నిలిచింది. దీనికి తమన్ సంగీతం అందింగా రామజోగయ్య శాస్త్రి రాసాడు. కాగా ఈ పాటను అనురాగ్‌ కులకర్ణి, ఎం.ఎం.మానసి ఆలపించారు.

మూలాలు

[మార్చు]
  1. Manasi, M. M. (3 January 2018). "A voice to reckon with". The Hindu. Retrieved 3 January 2018.
  2. "సైమా అవార్డ్స్‌లో రంగస్థలం ప్రభంజనం". ETV Bharat News. Retrieved 2023-03-06.
  3. "Rangamma Mangamma Song Creates Record With 100 Million Views - Sakshi". web.archive.org. 2023-03-06. Archived from the original on 2023-03-06. Retrieved 2023-03-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "MM Manasi Inspirations: From K-Pop To Ilaiyaraaja". silverscreen.in. 23 September 2015.