మాడభూషి సంతానం రఘునాథన్

వికీపీడియా నుండి
(ఎం.ఎస్.రఘునాథన్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మాడభూషి సంతానం రఘునాథన్
మాడభూషి సంతానం రఘునాథన్
జననం (1941-08-11) 1941 ఆగస్టు 11 (వయసు 82)
అనంతపురం, బ్రిటిష్ ఇండియా, (ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్)
నివాసంముంబై
జాతీయతభారతీయుడు
రంగములుగణితశాస్త్రము
వృత్తిసంస్థలుTIFR
చదువుకున్న సంస్థలుTIFR
ఇనిస్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీ,ప్రిన్సెటన్
పరిశోధనా సలహాదారుడు(లు)ఎం.ఎస్.నరసింహన్
డాక్టొరల్ విద్యార్థులువినయ్ వి.డియొధర్
గోపాల్ ప్రసాద్
ముఖ్యమైన పురస్కారాలు
  • శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు(1977)
  • థర్డ్ వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రైజ్ (1991)
  • శ్రీనివాస రామానుజన్ మెడల్ (1991)
  • ఎస్.ఎన్.బోస్ ప్రొఫెసర్ షిప్ (1993–1996)
  • పద్మశ్రీ (2001)
  • పద్మభూషణ, (2012)

మాడభూషి సంతానం రఘునాథన్ భారతీయ గణిత శాస్త్రవేత్తత. ఆయన ప్రస్తుతం నేషనల్ సెంటర్ ఫర్ మేథమటిక్స్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ముంబై) లకు అధిపతి. ఆయన హోమీభాభా పచినేసిన స్థానంలో ఆయన టి.ఐ.ఎఫ్.ఆర్ సంస్థలో ప్రొఫెసర్ గా పనిచేసారు.[1] రఘునాథన్ టి.ఐ.ఎఫ్.ఆర్ లో గణితశాస్త్రంలో ఫెలోషిప్ పొందారు. ఆయన యొక్క డాక్టరల్ అడ్వైజర్ ఎం.ఎస్.నరసింహన్. రఘునాథన్ రాయల్ సొసైటీ, థర్డ్ వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, అమెరికన్ మాథమెటికల్ సొసైటీ ల ఫెలోషిప్ పొందారు.[2]

ప్రారంభ జీవితం, విద్య[మార్చు]

మాడబూషి సంతానం రఘునాథన్ ఆగస్టు 11, 1941లో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో తాతగారింట జన్మించారు. ఆయన తండ్రిపేరు ఎం.ఎస్.సంతానం. ఆయన కుటుంబం చెన్నైలో నివసించేది. చెన్నై, మైలాపూర్ లోని పీ ఎస్ ఉన్నత పాఠశాల, మద్రాసు క్రిస్టియన్ కాలేజి ఉన్నత పాఠశాలలో చదివి 1955 లో ఎస్ ఎస్ ఎల్ సీ ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్మీడియట్ సెయింట్ జోసెఫ్ కాలేజీ నుంచి పూర్తి చేసి, చెన్నై వివేకానంద కాలేజీ నుండి గణితంలో బీ ఏ (హానర్స్) చేసారు. అనతి కాలంలోనే గొప్ప గణిత పండితుడిగా పేరొందారు.[3][3] బి.ఎ.ఆనర్స్ పూర్తిచేసిన వెంటనే ఆయన ప్రఖ్యాత వైజ్ఞానిక పరిశోధనా సంస్థ "టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్"లో రీసెర్చ్ అసిస్టెంటుగా చేరారు. ఈ పదవి కోసం 250 సభ్యులను టీ ఐ ఎఫ్ ఆర్ ఇంటర్వ్యూ చేసి ఇద్దరిని ఎంపిక చేసినప్పుడుఆ ఇరువురిలో ఆయన కూడా ఉన్నారు. 1960 లో "టీ ఐ ఎఫ్ ఆర్"లో చేరిన ఆయన అక్కడ నుండి వెనుదిరిగి చూడలేదు. 1960-62 కాలంలో, శిక్షణ పొంది, గణిత కోవిదుడు అచార్య నరసింహన్ ఇచ్చిన పరిశోధనాంశం " డిఫర్మేషన్స్ ఆఫ్ లినియర్ కన్నెక్షన్స్ అండ్ రీమానియన్ మెట్రిక్స్ "ను 1963 లో పరిష్కరించారు.

మద్రాసు విశ్వవిద్యాలయంలోని వివేకానంద కాలేజీ నుండి బి.ఎ. ఆనర్స్ పట్టాపొందారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి 1961 లో ఎం.ఎ డిగ్రీని పొందారు. 1966 లో ఎం.ఎస్. నరసింహన్ పర్యవేక్షణలో, బొంబాయి విశ్వవిద్యాలయం లోని "టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్" సంస్థ నుండి పీ హెచ్ డీ (డాక్టరేట్) పట్టా అందుకున్నారు. కే గౌరీశంకరన్, ఆయన టీ ఐ ఎఫ్ ఆర్ వాతావరణంలో ఇమడడానికి సహాయం చేసారు. డాక్టరేట్ పట్టా సాధించాక ఓ ఏడాది "ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్", ప్రిన్స్‌టన్, న్యూ జెర్సీ, అమెరికాలో పరిశోధనలు చేస్తూ గడిపేరు. ఆయన "టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్"లో స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్ విభాగపు ప్రొఫెసర్కు రీసెర్చ్ అసిస్టెంతుగా (1966-87), 1987 లో ప్రొఫెసర్ ఆఫ్ ఎమినెన్సె (ఘనమైన గౌరవ హోదా) అందుకున్నారు.

సామాన్య ప్రజల ఊహకి వాస్తవంగా వృత్తినిపుణుడు చేసే పనికి వ్యత్యాసం ఉంటోంది. అందుకని అందరికీ అర్ధమైయ్యేటట్టు చెప్పే ఆవశ్యకత ఉందంటూ గణిత శాస్త్ర అంశాల మీద అందరికీ అవగాహన అయ్యేటట్లు వివరణలు ఇచ్చారు.

పరిశోధనలు[మార్చు]

1960-62 లో శిక్షణ పొందిన తరువాత ఆయన ఎం.ఎస్.నరసింహన్ గారి పర్యవేక్షణలో ఆయన సూచించిన పరిశోధనాంశం "డి ఫార్మేషన్స్ ఆఫ్ లీనియన్ కనెక్షన్స్ అండ్ రైమన్ మెట్రిక్స్" పై పరిశోధన చేసి 1962 లో సాధించారు.

ఆయన నరసింహన్ అధ్వర్యంలో 1966 లో బొంబాయి విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి అందుకున్నారు. తరువాత ఆయన "ఇనిస్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీ,ప్రిన్స్‌టన్" యు.ఎస్.లో ఒక సంవత్సరం పాటు గడిపి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ పోస్టు డాక్టరల్ రీసెర్చ్ చేసారు. ఈ కాలంలో ఆయన అమెరికా, యూరోప్, జపాన్, లలోని ముఖ్యమైన ప్రదేశాలకు ఆహ్వానింపబడ్డారు. ఆ తరువాత అనేక అంతర్జాతీయ సదస్సులలో ఆయన పాల్గొన్నారు.

జాతీయ, అంతర్జాతీయ సంస్థలు అనేకం ఈయనకు తమ 29వ యేట ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ మెథమెటిక్స్ సభలో ఉపన్యసించారు. ఈ గౌరవం దక్కిన అతి కొద్ది మంది భారతీయులలో ఒకరుగా కీర్తి గడించారు. "నేషనల్ బోర్డ్ ఫర్ హయ్యర్ మేథమెటిక్స్" స్థాపక సభ్యులు, కొంతకాలం అధ్యక్షులుగా ఉన్నారు. ధర్డ్ వరల్డ్ అకాదమీ ప్రైజ్, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాదమీ వారి ప్రతిష్ఠాత్మక శ్రీనివాస రామానుజన్ మెడల్, శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ మొదలగు అవార్డులు, రివార్దులు అనేకం అందుకున్నారు. ఇంటర్నేషనల్ మేథమెటికల్ యూనియన్ పాలకమండలి సభ్యులుగా ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన్ రాయల్ సొసైటీ సభ్యత్వం అందుకున్నాఉర్. తెలుగు గడ్డ మీద నుంచి చెన్న పట్టణానికి వలస వెళ్ళిన కుటుంబ సభ్యులు కావడంతో ఈయన తమిళుడుగా ముద్ర పడ్డారు. మాడభూషి అనంత శయనం గారి వంశంలో జన్మించిన ఈయనను నోబుల్ బహుమతి గ్రహీత ఫొఫెసర్ ఎస్.చంద్రశేఖర్ ఒక ప్రసంగం సందర్భమ్లో "ఉత్తమ భారతీయ గణితశాస్త్రవేత్తలలో రఘునాథన్ ఒకరు" అని కీర్తించారు.

అవార్డులు,గౌరవాలు[మార్చు]

పద్మశ్రీపురస్కారం
  • 2001 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది
  • జూలై 2000 లో రాయల్ సొసైటి ఫెల్లోగా ఎంపికైయ్యారు
  • తార్డ్ వాల్డ్ అకాడమి (ఇటలీ), ఫెల్లో
  • ఐ ఎన్ ఎస్ ఏ నుండి శ్రినివాస రామానుజన్ పతకం
  • శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు
  • ఇంటర్నేషన్ మాథమెటిక్స్ యూనియన్, కార్యనిర్వాహక సభ్యుడు
  • మెహతా పరిశోధనా సంస్థ, పాలక మండలి, అధ్యక్షుడు
  • నేషనల్ బోర్డ్ ఆఫ్ హైయ్యర్ మాతమాటిక్స్, అధ్యక్షుడిగా 1987 నుండి కొనసాగుతున్నారు. (ఈ సంస్థ ఆద్వర్యంలో 1996 లో అంతర్జాతీయ మాథమేటికల్ ఒలంపియాడ్ విజయవంతంగా నిర్వహించారు)
  • నేషనల్ బోర్డ్ ఆఫ్ హైయెర్ మేథమేటిక్స్ కి ఛైర్మన్ గా వ్యవహరించారు.
  • ఎం ఎస్ ఆర్ టి ఐ ఎఫ్ ఆర్ లో "అంతర్జతీయ స్కూల్ ఇన్ ఆల్జెబ్రైక్ గ్రూప్స్ ఎండ్ డిస్క్రీట్ సబ్ గ్రూప్స్" నెలకొల్పారు.
  • అంతర్జాతీయ గణిత సంస్థ కార్యనిర్వాహక సభ్యుడిగా వ్యవహరించారు

ప్రచురణలు[మార్చు]

Raghunathan's book Discrete Subgroups of Lie Groups, published by Springer Verlag, Germany, in 1972 is now a classic in the area. It is unique in its coverage of various results which in recent decades have been put to considerable use, and as such it is much appreciated and widely referred to.The book has been translated into the Russian and published with a foreword by G.A. Margulis. [4]

కొన్ని విశేషాంశాలు[మార్చు]

  • జూలై 14, 2000 సంవత్సరంలో ఎం ఎస్ రఘునాథన్ (టీ ఐ ఎఫ్ ఆర్), రాయల్ సొసైటీ, లండన్, ఫెల్లోగా గుర్తింపు పొందడమ్ ద్వారా యం యస్ గణిత శాస్త్ర దిగ్గజాలైన శ్రీనివాస రామానుజన్, హరీష్ చంద్ర, సి ఎస్ శేషాద్రి, ఎం ఎస్ నరసింహన్, ఎస్ ఆర్ ఎస్ వరధన్ ల సరసన చేరారు.
  • ఐ సీ ఎం సదస్సు నాలుగేళ్ళకొకసారి జరుగుతుంది. గణిత క్షేత్రంలో ఇది అత్యంత ప్రతిష్ఠాత్మక మైన, విశిష్ట మైన, దిశామార్గం చూపే సభగా పరిఇగణిస్తారు. 1970 లో నైస్ లో జరిగిన ఐ సీ ఎం సభను ఉద్దేశించి మాట్లాడిన భారతీయుడు డాక్టర్ ఎం ఎస్. అప్పటికి ఆయన వయస్సు 29 సంవత్సరాలే!.
  • ఫ్రాన్స్ గణితకారుడు - జీన్ ద్యుడోన్ని, 1977 లో ప్రచురించిన " ఏ పనోరమా ఆఫ్ ప్యూర్ మేథమేటిక్స్ " పుస్తకంలో యం యస్ గారి పరిశోధనలని ప్రస్తావించారు.అప్పటికి ఎం ఎస్ వయస్సు 37 సంవత్సరాలు మాత్రమే.[5]

మూలాలు[మార్చు]

  1. Homi Bhabha Chair at TIFR
  2. List of Fellows of the American Mathematical Society, retrieved 9 June 2013.
  3. 3.0 3.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-06-10. Retrieved 2015-06-27.
  4. "Books Publications".
  5. గణిత మేధావి - విశిస్టాచార్య పద్మశ్రీ మాడభూషి సంతానం (ఎం ఎస్) రఘునాథన్

ఇతర లింకులు[మార్చు]