ఎం.ఏ. బేబీ
ఎం. ఏ. బేబీ | |||
![]() 2010లో ఎం. ఏ. బేబీ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2025 ఏప్రిల్ 6 | |||
ముందు | సీతారాం ఏచూరి | ||
---|---|---|---|
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2012 ఏప్రిల్ | |||
కేరళ శాసనసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2006 – 2016 | |||
ముందు | కడవూరు శివదాసన్ | ||
తరువాత | జె. మెర్సీకుట్టి అమ్మ | ||
నియోజకవర్గం | కుందర | ||
విద్యా శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2006 – 2011 | |||
ముందు | ఈటీ మహమ్మద్ బషీర్ | ||
తరువాత | పి.కె. అబ్దు రబ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | సిపిఐ(ఎం) | ||
జీవిత భాగస్వామి | బెట్టీ లూయిస్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మరియం అలెగ్జాండర్ బేబీ (జననం 5 ఏప్రిల్ 1954) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 1986లో కేవలం 32 ఏళ్ల వయసులోనే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై,1999లో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆ తరువాత 2006, 2011లో కుందర ఎమ్మెల్యేగా ఎన్నికై 2025 ఏప్రిల్ 6న సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]ఎంఏ బేబీ కొల్లం జిల్లాలోని ప్రాక్కుళంలోని ఎన్ఎస్ఎస్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు కేరళ స్టూడెంట్స్ ఫెడరేషన్‌లో చేరి ఆ తరువాత స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా , కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)లలో వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన 1986లో కేవలం 32 ఏళ్ల వయసులోనే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై 1998 వరకు పని చేశాడు.
ఎంఏ బేబీ 2006, 2011 కేరళ శాసనసభకు కుందర నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికై 2006 నుండి 2011 వరకు విద్యా, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన 2014 లోక్‌సభ ఎన్నికలలో కొల్లం లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి ఎన్.కె. ప్రేమచంద్రన్ చేతిలో 37,649 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
ఎంఏ బేబీ 2012లో కేరళలోని కోజికోడ్‌లో జరిగిన సభలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2025 ఏప్రిల్ 6న మధురైలో జరిగిన సభలో సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.[3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ "M. A. Baby | Congenial comrade" (in Indian English). The Hindu. 12 April 2025. Archived from the original on 13 April 2025. Retrieved 13 April 2025.
- ↑ "సీపీఎం కొత్త సారథి ఎంఏ బేబీ". Andhrajyothy. 7 April 2025. Archived from the original on 11 April 2025. Retrieved 11 April 2025.
- ↑ "సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ". Eenadu. 7 April 2025. Archived from the original on 7 April 2025. Retrieved 7 April 2025.
- ↑ "M.A. Baby elected general secretary of CPI(M)" (in Indian English). The Hindu. 6 April 2025. Archived from the original on 11 April 2025. Retrieved 11 April 2025.
- ↑ "సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ.. కేరళ మాజీ మంత్రికి సారథ్య బాధ్యతలు". NT News. 7 April 2025. Archived from the original on 11 April 2025. Retrieved 11 April 2025.