Jump to content

ఎం.కె. సోమశేఖర్

వికీపీడియా నుండి
ఎం.కె. సోమశేఖర్

పదవీ కాలం
2013 – 2018
ముందు ఎస్.ఎ. రామదాస్
తరువాత ఎస్.ఎ. రామదాస్
నియోజకవర్గం కృష్ణరాజ

పదవీ కాలం
2004 – 2008
ముందు ఎస్.ఎ. రామదాస్
తరువాత ఎస్.ఎ. రామదాస్
నియోజకవర్గం కృష్ణరాజ

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు జనతాదళ్ (సెక్యులర్)
జీవిత భాగస్వామి కుసుమ[1]
నివాసం No. 318, డి. సుబ్బయ్య రోడ్, చామరాజ మొహలా, మైసూరు
వృత్తి రాజకీయ నాయకుడు

ఎం.కె. సోమశేఖర్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు కృష్ణరాజ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

ఎం.కె. సోమశేఖర్ జనతాదళ్ (సెక్యులర్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1999 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఎస్.ఎ. రామదాస్ చేతిలో 9,752 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2004 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కృష్ణరాజ శాసనసభ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఎస్.ఎ. రామదాస్ పై 3,394 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

ఎం.కె. సోమశేఖర్ ఆ తరువాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి 2008 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఎస్.ఎ. రామదాస్ చేతిలో 19,422 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కృష్ణరాజ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఎస్.ఎ. రామదాస్ పై 6,065 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2016లో కర్ణాటక సిల్క్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులయ్యాడు.[3]

ఎం.కె. సోమశేఖర్ 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఎస్.ఎ. రామదాస్ చేతిలో 26,347 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కృష్ణరాజ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి టీ.ఎస్. శ్రీవత్స చేతిలో 7,213 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "FIR against former MLA Somashekar, his wife, and others for allegedly fabricating records" (in Indian English). The Hindu. 14 February 2024. Archived from the original on 13 May 2025. Retrieved 13 May 2025.
  2. "Triangular contest in Krishnaraja constituency with candidates banking on party popularity" (in Indian English). The Hindu. 27 April 2023. Archived from the original on 13 May 2025. Retrieved 13 May 2025.
  3. "21 MLAs to head boards, corporations" (in Indian English). The Hindu. 2 November 2016. Archived from the original on 23 April 2025. Retrieved 23 April 2025.
  4. "Karnataka Assembly Elections 2023: Krishnaraja". Election Commission of India. 13 May 2023. Archived from the original on 13 May 2025. Retrieved 13 May 2025.