Jump to content

ఎం.జి. రాధాకృష్ణన్

వికీపీడియా నుండి

మలబార్ గోపాలన్ నాయర్ రాధాకృష్ణన్ (1940, జూలై 29 - 2010, జూలై 2) కేరళకు చెందిన ఒక భారతీయ సంగీత దర్శకుడు, కర్ణాటక గాయకుడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఎం.జి. రాధాకృష్ణన్ 1940, జూలై 29న కేరళలోని అలప్పుజ జిల్లాలోని హరిపాడులో సంగీత స్వరకర్త, హార్మోనిస్ట్ మలబార్ గోపాలన్ - హరికథ విద్వాంసురాలు కమలాక్షి మరస్యార్ దంపతుల ముగ్గురు పిల్లలలో పెద్దవాడిగా జన్మించారు.[1] అతను అలప్పుజాలోని SD కళాశాలలో చదువుకున్నాడు. స్వాతి తిరునాల్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ నుండి గానభూషణం తీసుకున్నాడు. అక్కడ కె.జె. యేసుదాస్ అతని క్లాస్‌మేట్స్‌లో ఒకరు. అతని తమ్ముడు ఎం.జి. శ్రీకుమార్ మలయాళం, తమిళ సినిమాల్లో నేపథ్య గాయకుడు,[2] అతని చెల్లెలు కె. ఓమనకుట్టి కర్ణాటక సంగీత గాయని, విద్యావేత్త.

రాధాకృష్ణన్ పద్మజను వివాహం చేసుకున్నాడు. ఆమె స్వయంగా కవయిత్రి, గేయ రచయిత, శాస్త్రీయ నృత్యకారిణిగా ప్రసిద్ధి చెందింది. వారికి ఇద్దరు పిల్లలు - ఎం.ఆర్. రాజకృష్ణన్, కార్తీక. వారి కుమారుడు రాజాకృష్ణన్ ఒక ప్రసిద్ధ సౌండ్ రికార్డిస్ట్, అతను అనేక చిత్రాలలో పనిచేశాడు. ఆయన 70వ పుట్టినరోజుకు నెల కంటే తక్కువ సమయంలో, కాలేయ వ్యాధి కారణంగా తిరువనంతపురంలోని కిమ్స్ ఆసుపత్రిలో 2010, జూలై 2న మరణించాడు.


అవార్డులు

[మార్చు]

కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు

[మార్చు]
  • 2005 – ఉత్తమ సంగీత దర్శకుడు – అనంతభద్రం 
  • 2001 – ఉత్తమ సంగీత దర్శకుడు – అచనేయనేనికిష్టం 

ఆసియానెట్ ఫిల్మ్ అవార్డులు

[మార్చు]
  • 2005 – ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు – ఆనందభద్రం 
  • 2001 – ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు – కాటే వన్ను విలిచాప్పోల్ 

ఇతర అవార్డులు

[మార్చు]

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Harippad honed his talents". The New Indian Express. 16 May 2012. Retrieved 2020-05-09.
  2. Singing from the soul[usurped]; Saraswathy Nagarajan, The Hindu, 2005-06-24; Retrieved: 2007-09-03
  3. "Classical Music". Department of Cultural Affairs, Government of Kerala. Retrieved 24 February 2023.
  4. "Kerala Sangeetha Nataka Akademi Award: Light Music". Department of Cultural Affairs, Government of Kerala. Retrieved 26 February 2023.

బాహ్య లింకులు

[మార్చు]