Jump to content

ఎం.జె .అక్బర్

వికీపీడియా నుండి
ఎం.జె .అక్బర్
ఎం.జె .అక్బర్

2014లో హాలిఫాక్స్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఫోరంలో అక్బర్


విదేశాంగ శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
2016 జూలై 5 – 2018 అక్టోబర్ 17
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

పదవీ కాలం
జూన్ 2016 – 2022 జూన్ 29
నియోజకవర్గం మధ్యప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జననం (1951-01-11) 1951 జనవరి 11 (వయసు: 75)
టెలినిపారా, పశ్చిమ బెంగాల్ , భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ (1989–2014)
భారతీయ జనతా పార్టీ (2014 నుండి)
వృత్తి జర్నలిస్ట్, రాజకీయ నాయకుడు, రచయిత

మోబాషర్ జావేద్ అక్బర్ (జననం 11 జనవరి 1951) భారతదేశానికి చెందిన జర్నలిస్ట్, రచయిత & రాజకీయ నాయకుడు. ఆయన 2016 జూలై 5 నుండి 2018 అక్టోబర్ 17 వరకు విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[1] జావేద్ అక్బర్ 1989 నుండి 1991 వరకు కిషన్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా, జూలై 2015లో జార్ఖండ్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యాడు.[2]

ఎం.జె .అక్బర్ జర్నలిజంలో తన సుదీర్ఘ కెరీర్‌లో ఇండియా టుడే , హెడ్‌లైన్స్ టుడే, ది టెలిగ్రాఫ్, ది ఏషియన్ ఏజ్ & డెక్కన్ క్రానికల్ వంటి వార్తా పత్రికలను సంపాదకుడిగా పని చేశాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అక్బర్ ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో తన సమకాలీనురాలైన మల్లికా జోసెఫ్‌ను వివాహం చేసుకున్నాడు . వారికి ఇద్దరు పిల్లలు, డార్ట్‌మౌత్ కళాశాల పూర్వ విద్యార్థి ప్రయాగ్[3] & కేంబ్రిడ్జ్‌లోని జీసస్ కళాశాల నుండి న్యాయ పట్టా పొందిన ముకులికా.[4][5]

పుస్తకాలు

[మార్చు]
  • నెహ్రూ: ది మేకింగ్ ఆఫ్ ఇండియా (1990)[6]
  • అల్లర్ల తర్వాత అల్లర్లు (1991)
  • కాశ్మీర్: బిహైండ్ ది వేల్ (1991)
  • ఇండియా: ది సీజ్ వితిన్ - ఛాలెంజెస్ టు ఎ నేషన్స్ యూనిటీ (1996)
  • ది షేడ్ ఆఫ్ స్వోర్డ్స్: జిహాద్ అండ్ ది కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ (2003)
  • బైలైన్ (2004)
  • బ్లడ్ బ్రదర్స్ - ఎ ఫ్యామిలీ సాగా (2006)
  • హావ్ పెన్, విల్ ట్రావెల్ (2010)
  • టిండర్‌బాక్స్: ది పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ పాకిస్తాన్ (2012)
  • ఎ మిర్రర్ టు పవర్: ది పాలిటిక్స్ ఆఫ్ ఎ ఫ్రాక్చర్డ్ డికేడ్ , హార్పర్‌కాలిన్స్ ఇండియా, 2015.

మూలాలు

[మార్చు]
  1. "MJ Akbar - From Congress MP To PM Modi's Minister" (in ఇంగ్లీష్). NDTV. 5 July 2016. Archived from the original on 20 August 2025. Retrieved 20 August 2025.
  2. "MJ Akbar Wins Rajya Sabha By-Poll from Jharkhand" (in ఇంగ్లీష్). NDTV. 2 July 2015. Archived from the original on 20 August 2025. Retrieved 20 August 2025.
  3. "Alumni 2000". Archived from the original on 2019-09-27. Retrieved 2025-08-28.
  4. Sen, Rehana. "Green is the valley". The Hindu.[dead link]
  5. "BIOGRAPHY:M J Akbar Bylines, Books, War, RSS Syndication, Book Reviews, Letters, Lots More!". www.mjakbar.org. Archived from the original on 6 December 2013.
  6. "Portfolio of Modi government ministers: MJ Akbar appointed MoS External Affairs", The Financial Express, 5 July 2016