Jump to content

ఎం.వి. వీరభద్రయ్య

వికీపీడియా నుండి
ఎం.వి. వీరభద్రయ్య

పదవీ కాలం
2018 – 2023 మే 13
ముందు కే. ఎన్. రాజన్న
తరువాత కే. ఎన్. రాజన్న
నియోజకవర్గం మధుగిరి

వ్యక్తిగత వివరాలు

జననం 1955 మార్చి 8
కర్ణాటక, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ జనతాదళ్ (సెక్యులర్)
వృత్తి రాజకీయ నాయకుడు

ఎం.వి. వీరభద్రయ్య (జననం 8 మార్చి 1955) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో మధుగిరి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

ఎం.వి. వీరభద్రయ్య రాజకీయాల్లోకి రాకముందు ఐఎఎస్ అధికారిగా పని చేశాడు.[2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

ఎం.వి. వీరభద్రయ్య జనతాదళ్ (సెక్యులర్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి కే. ఎన్. రాజన్న చేతిలో 14,427 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో మధుగిరి శాసనసభ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి కే. ఎన్. రాజన్నపై 18,574 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5]

ఎం.వి. వీరభద్రయ్య 2023 శాసనసభ ఎన్నికలలో జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి కే. ఎన్. రాజన్న చేతిలో 35,523 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. "Assembly Election Results in 2018, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-17.
  2. "Former policemen, bureaucrats bite the dust" (in ఇంగ్లీష్). Deccan Herald. 8 May 2013. Archived from the original on 5 May 2025. Retrieved 5 May 2025.
  3. "Retired bureaucrats and police officers fail to make a mark" (in Indian English). The Hindu. 13 May 2023. Archived from the original on 5 May 2025. Retrieved 5 May 2025.
  4. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  5. "Karnataka assembly results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). India Today. 15 May 2018. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.
  6. "Karnataka Assembly Elections 2023: Madhugiri". Election Commission of India. 13 May 2023. Archived from the original on 5 May 2025. Retrieved 5 May 2025.