Jump to content

ఎం.సి. మనగులి

వికీపీడియా నుండి
మల్లప్ప చన్నవీరప్ప మనగూలి

పదవీ కాలం
2018 జూన్ 6 – 2019 జూలై 8

పదవీ కాలం
2018 మే 14 – 2021 జనవరి 28
ముందు రమేష్ బాలప్ప భూసనూర్
తరువాత రమేష్ బాలప్ప భూసనూర్
నియోజకవర్గం సిందగి
పదవీ కాలం
1994 – 1999
ముందు రాయగొండప్ప భీమన్న చౌదరి
తరువాత శరణప్ప తిప్పన్న సునగర్
నియోజకవర్గం సిందగి

వ్యక్తిగత వివరాలు

మరణం 2021 జనవరి 28
రాజకీయ పార్టీ జనతాదళ్ (సెక్యులర్)
సంతానం అశోక్ ఎం. మనగూలి, డా. శాంత్వీర్, ఎం. మనగూలి

మల్లప్ప చన్నవీరప్ప మనగూలి (మరణం 28 జనవరి 2021) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు సిందగి శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఉద్యానవన శాఖ మంత్రిగా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ఎం.సి. మనగులి జనతా పార్టీ (జెపి) ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1989 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో సిందగి శాసనసభ నియోజకవర్గం నుండి జెఎన్‌పి (జెపి) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి చౌదరి రాయగొండప్ప భీమన్న చేతిలో 8,629 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత జనతాదళ్ పార్టీలో చేరి 1994 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో జేడీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి చౌదరి రాయగొండప్ప భీమన్నపై 28,219 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

ఎం.సి. మనగులి 1999 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో సిందగి శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సునగర్ శరణప్ప తిప్పన్న చేతిలో 10,757 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత జనతాదళ్ (సెక్యులర్) పార్టీలో చేరి 2004 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి చౌదరి అశోక్ గురప్ప షాబాది చేతిలో 9,050 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

ఎం.సి. మనగులి 2008 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో సిందగి శాసనసభ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రమేష్ బాలప్ప భూసనూర్ చేతిలో 14,761 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రమేష్ బాలప్ప భూసనూర్ చేతిలో 752 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు.

ఎం.సి. మనగులి 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో సిందగి శాసనసభ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రమేష్ బాలప్ప భూసనూర్ పై 9,305 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికై 2018 జూన్ 6 నుండి 2019 జూలై 8 వరకు ఉద్యానవన శాఖ మంత్రిగా పని చేశాడు.[1]

మరణం

[మార్చు]

ఎం.సి. మనగులి 2021లో 85 సంవత్సరాల వయసులో కోవిడ్-19 నుండి శ్వాసకోశ సమస్యలతో జనవరి 28న మరణించాడు.[2][3][4][5]

మూలాలు

[మార్చు]
  1. "Karnataka: Kumaraswamy allocates portfolios, retains finance" (in ఇంగ్లీష్). The Week. 9 June 2018. Archived from the original on 23 April 2025. Retrieved 23 April 2025.
  2. "Senior JDS leader M C Managuli passes away at 85 in Bengaluru" (in ఇంగ్లీష్). The New Indian Express. 28 January 2021. Retrieved 23 April 2025.
  3. "JD(S) MLA M.C. Managuli passes away" (in Indian English). The Hindu. 28 January 2021. Archived from the original on 23 April 2025. Retrieved 23 April 2025.
  4. "Senior JD(S) legislator MC Managuli passes away". The Times of India. 29 January 2021. Archived from the original on 23 April 2025. Retrieved 23 April 2025.
  5. "Oldest MLA in Karnataka MC Managuli dies, leaders across party lines offer condolences" (in ఇంగ్లీష్). The New Indian Express. 28 January 2021. Retrieved 23 April 2025.