ఎం.సుగుణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం.సుగుణ

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2015 - 2019
నియోజకవర్గం తిరుపతి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1952 ఫిబ్రవరి 10న
తిరుపతి, చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు కె. సుబ్బరామయ్య, వెంకటమ్మ
జీవిత భాగస్వామి ఎం.వెంకటరమణ

మన్నూరు సుగుణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె తిరుపతి నియోజకవర్గం నుండి 2015లో ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

ఎం. సుగుణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, తిరుపతిలో 1952 ఫిబ్రవరి 10న కె. సుబ్బరామయ్య, వెంకటమ్మ దంపతులకు జన్మించింది. ఆమె 1వ నుండి 7వ తరగతి వరకు తిరుపతిలోని ఎస్.పి. జైన్ మున్సిపల్ పాఠశాలలో, సెంట్రల్ స్కూల్లో పదవ తరగతి పూర్తి చేసి, ఎస్.పి.డబ్ల్యూ కాలేజీలో బీఎస్సీ , బి.ఈ.డి, ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేసింది.

వివాహం

[మార్చు]

ఎం.సుగుణ వివాహం ఎం.వెంకటరమణ తో 1972 నవంబర్ 22న జరిగింది. వెంకటరమణ, సుగుణ దంపతులకు ఇద్దరు కూతుర్లు సుమ, హరిత ఉన్నారు.

రాజకీయ జీవితం

[మార్చు]

ఎం.సుగుణమ్మ తన భర్త తిరుపతి శాసనసభ్యుడు (ఎమ్మెల్యే) ఎం.వెంకటరమణ మరణాంతరం 2014లో రాజకీయాల్లోకి వచ్చింది. ఆయన మరణంతో తిరుపతి అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ఎం.సుగుణమ్మను తిరుపతి శాసనసభ స్థానం టీడీపీ అభ్యర్థిగా 2015 జనవరి 15న పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించాడు.[2] ఎం.సుగుణమ్మ 2015లో జరిగిన ఎన్నికల్లో తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీదేవి పై 1,16,524 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యింది.[3][4] ఆమె తరువాత శాసనసభలో సాంఘిక, సంక్షేమ కమిటీ సభ్యురాలిగా,  టీటీడీ బోర్డు సభ్యురాలిగా పని చేసింది. ఎం.సుగుణమ్మ 2019లో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది.

మూలాలు

[మార్చు]
  1. The Hindu (17 February 2015). "TDP registers emphatic win in Tirupati bypoll" (in Indian English). Archived from the original on 1 March 2022. Retrieved 1 March 2022.
  2. Sakshi (15 January 2015). "తిరుపతి టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ". Archived from the original on 1 March 2022. Retrieved 1 March 2022.
  3. Sakshi (16 February 2015). "లక్షకు పైగా మెజార్టీతో సుగుణమ్మ విజయం". Archived from the original on 1 March 2022. Retrieved 1 March 2022.
  4. The Economic Times (17 February 2015). "TDP wins Tirupati bypoll with margin of 1.16 lakh votes". Archived from the original on 1 March 2022. Retrieved 1 March 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=ఎం.సుగుణ&oldid=3475973" నుండి వెలికితీశారు