ఎం. జి. కె. మేనన్
ఎం. జి. కె. మేనన్ | |
|---|---|
| 2వ ఛైర్మన్ భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ | |
| In office 1972 జనవరి – 1972 సెప్టెంబరు | |
| అంతకు ముందు వారు | విక్రం సారాభాయ్ |
| తరువాత వారు | సతీష్ ధావన్ |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | మాంబిల్లికాళతిల్ గోవింద్ కుమార్ మేనన్ 1928 ఆగస్టు 28 మంగళూరు, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం మంగళూరు, కర్ణాటక, భారతదేశం) |
| మరణం | 2016 నవంబరు 22 (వయసు: 88) |
| సంతానం | 2 |
| కళాశాల |
|
| పురస్కారాలు |
|
ఎం. జి. కె. మేనన్ | |
|---|---|
| 4th Director General of Defence Research and Development Organisation | |
| In office 1974 – 1978 | |
| అంతకు ముందు వారు | Basanti Dulal Nagchaudhuri |
| తరువాత వారు | Raja Ramanna |
ఎం. జి. కె. మేనన్ | |
|---|---|
| విద్యా నేపథ్యం | |
| పరిశోధనలో మార్గదర్శి | Cecil F. Powell |
| పరిశోధక కృషి | |
| వ్యాసంగం | Physics |
| పనిచేసిన సంస్థలు | |
ఎం. జి. కె. మేనన్ (మాంబిల్లికాళతిల్ గోవింద్ కుమార్ మేనన్) (28 ఆగస్టు 1928-22 నవంబర్ 2016) 1972 లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మెన్‌గా పనిచేసిన భారతీయ భౌతిక శాస్త్రవేత్త, విధాన రూపకర్త. ఇతడు 1974 నుండి 1978 వరకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్‌లో డైరెక్టర్ జనరల్‌గా కూడా పనిచేశాడు.[1][2][3][4] అంతే కాకుండా భారత ప్రభుత్వ భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రిగా కూడా పనిచేశాడు.
మంగళూరు జన్మించిన మేనన్ నోబెల్ గ్రహీత సెసిల్ ఎఫ్. పావెల్ మార్గదర్శకత్వంలో ప్రాథమిక కణ భౌతిక శాస్త్రంలో పీహెచ్డీ కోసం బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి హాజరయ్యాడు. ఇతడు1955లో టి. ఐ. ఎఫ్. ఆర్. లో చేరాడు. ప్రాథమిక కణాల లక్షణాలను అన్వేషించడానికి ఇతడు కాస్మిక్ కిరణాలతో ప్రయోగాలు చేపట్టాడు. ఇతడు బెలూన్ విమాన ప్రయోగాలను ఏర్పాటు చేయడంలో చురుకుగా పాల్గొన్నాడు. అలాగే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ వద్ద గనులలో కాస్మిక్ రే న్యూట్రినోలతో లోతైన భూగర్భ ప్రయోగాలు చేశాడు.
ఇతడు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ముంబై డైరెక్టర్‌గా, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడిగా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌లో విక్రమ్ సారాభాయ్ ఫెలోగా, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియాకు అధ్యక్షుడిగా,ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బొంబాయికి ఛైర్మన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌గా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలహాబాద్‌కు ఛైర్మన్ బోర్డ్ అఫ్ గవర్నర్స్‌గా పనిచేశాడు.[5]
ప్రారంభ జీవితం, విద్య
[మార్చు]ఎం.జి.కె.మేనన్ ఒక మలయాళీ నాయర్ కుటుంబంలో కిళక్కపట్‌కు చెందిన జస్టిస్ శంకర మేనన్, మాంబిల్లికాళతిల్‌కు చెందిన నారాయణికుట్టి అమ్మ దంపతులకు జన్మించాడు.[6] 1953లో నోబెల్ గ్రహీత సెసిల్ ఎఫ్. పావెల్ మార్గదర్శకత్వంలో కణ భౌతిక శాస్త్రంలో పీహెచ్డీ కోసం బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి వెళ్లడానికి ముందు ఇతడు జోధ్‌పూర్ జస్వంత్ కళాశాల, బొంబాయిలోని రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఇప్పుడు ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అని పిలుస్తారు)లో చదువుకున్నాడు.[7]
వృత్తి
[మార్చు]మేనన్ 1955లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థలో చేరాడు. అక్కడ భాభా తోపాటు కలిసి పనిచేశాడు. భాభా అకాల మరణం తరువాత, 1966లో, 38 సంవత్సరాల వయస్సులో ఇతడు ఆ సంస్థకు డైరెక్టర్ అయ్యాడు.[7]మీనన్ 1972లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఛైర్మన్‌గా, 1974 నుండి 1978 వరకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అధిపతిగా చేశాడు.[8][2] ఇతడు ప్లానింగ్ కమిషన్ సభ్యుడు (1982-1989), ప్రధానమంత్రికి శాస్త్రీయ సలహాదారు (1986-1989), కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR)కు ఉపాధ్యక్షుడు (1989-1990). 1990-96 సమయంలో మేనన్ రాజ్యసభ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 1989లో అప్పటి భారత ప్రధాని విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ ఆయనను సైన్స్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్ శాఖ సహాయ మంత్రిగా నియమించాడు.[9]
అవార్డులు, గుర్తింపులు
[మార్చు]- 1996లో ఇతడు అబ్దుస్ సలాం పతకాన్ని గెలుచుకున్నాడు.
- ప్రత్యేక పురస్కారాలు: 1961లో పద్మశ్రీ, 1968లో పద్మభూషణ్, 1985లో పద్మవిభూషణ్ అవార్డులను గెలుచుకున్నాడు.[10][11]
- 2008 చివరిలో ఇతని గౌరవార్థం ఒక గ్రహశకలానికి 7564 గోకుమేనన్ అని ఇతని పేరు పెట్టారు.[12]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ప్రొఫెసర్ సెసిల్ ఎఫ్. పావెల్ ఆధ్వర్యంలో బ్రిస్టల్ విశ్వవిద్యాలయం పార్టికల్ ఫిజిక్స్ లో పిహెచ్డి డిగ్రీ కోసం పనిచేస్తున్నప్పుడు, మీనన్ తత్వశాస్త్రంలో డిగ్రీ కోసం పనిచేస్తున్న ఇందుమతి పటేల్‌ను కలుసుకుని వివాహం చేసుకున్నాడు. న్యూయార్క్ నగరం వెయిల్ కార్నెల్ మెడిసిన్ బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ అనంత్ కె. మీనన్, న్యూఢిల్లీలో ప్రాక్టీస్ చేస్తున్న రేడియాలజిస్ట్ ప్రీతి వైద్‌లు వీరి సంతానం.[13] మీనన్ మనుమడు, కార్తికేయ ఎమ్. మీనన్, న్యూయార్క్ నగరంలోని మౌంట్ సినాయ్ వద్ద ఉన్న ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో వైద్య విద్యార్థిగా ఉన్నాడు.
సూచనలు
[మార్చు]- ↑ (2021). "Mambillikalathil Govind Kumar Menon. 28 August 1928—22 November 2016".
- ↑ 2.0 2.1 "Acclaimed physicist and ex-ISRO chief Prof MGK Menon dies at 88". Hindustan Times (in ఇంగ్లీష్). 2016-11-22. Retrieved 2020-02-15.
- ↑ "MGK Menon Chairman Page". ISRO.
- ↑ "MGK Menon page". DRDO.
- ↑ "Council of the Indian Statistical Institute". Archived from the original on 7 December 2011. Retrieved 14 December 2011.
- ↑ "Former minister, physicist M G K Menon passes away". 23 November 2016.
- ↑ 7.0 7.1 "The master conductor". frontline.in. Retrieved 22 November 2016.
- ↑ "DRDO". DRDO.
- ↑ "Former ISRO chief MGK Menon passes away". The Times of India. 2016-11-22. Retrieved 2020-02-15.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 3 January 2016.
- ↑ "Padma Awards | Interactive Dashboard". www.dashboard-padmaawards.gov.in (in ఇంగ్లీష్). Retrieved 2020-09-04.[permanent dead link]
- ↑ . "M G K Menon: A rare Statesman of Science".
- ↑ "Tri-Institutional PhD Program in Chemical Biology". chembio.triiprograms.org/. Retrieved 24 January 2023.
- All articles with dead external links
- Pages using Template:Post-nominals with missing parameters
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- రాజస్థాన్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యులు
- 2016 మరణాలు
- 1928 జననాలు