ఎం. మణిగాంధీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం. మణిగాంధీ

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 - 2019
ముందు పరిగెల మురళి కృష్ణ
తరువాత జరదొడ్డి సుధాకర్
నియోజకవర్గం కోడుమూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1965
మునగపాడు, కోడుమూరు మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ Indian Election Symbol Ceiling Fan.svg వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు Indian Election Symbol Cycle.pngతెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి సుశీల
సంతానం భార్గవ్, దిలీప్ గాంధీ
వృత్తి రాజకీయ నాయకుడు

ఎం. మణిగాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో కోడుమూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

ఎం. మణిగాంధీ 1970లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, కర్నూలు పట్టణంలో జన్మించాడు. ఆయన తండ్రి ఎం. శిఖామణి కోడుమూరు నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేశాడు. ఎం. మణిగాంధీ కర్నూలులోని ఎస్.టి.బి.సి. కాలేజీ లో బిఎ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

ఎం. మణిగాంధీ తన తండ్రి కోడుమూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎం. శిఖామణి మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోడుమూరు నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పరిగెల మురళి కృష్ణ చేతిలో ఓడిపోయాడు. మణిగాంధీ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీజేపీ అభ్యర్థి మాదారపు రేణుకమ్మా పై 52384 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

ఎం. మణిగాంధీ 2016 మార్చి 2న వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరాడు.[1]ఆయనకు 2019లో టీడీపీ నుండి టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీని వీడి మార్చి 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరాడు.

మూలాలు[మార్చు]

  1. "YSR Congress rebel MLA joins TDP". The Business Line (in ఇంగ్లీష్). 2 March 2016. Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.