ఎం. మహేందర్ రెడ్డి
ఎం. మహేందర్ రెడ్డి | |||
| |||
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ (డీజీపీ)
| |||
పదవీ కాలం 10 ఏప్రిల్ 2018 – 31 డిసెంబర్ 2022 | |||
ముందు | అనురాగ్ శర్మ | ||
---|---|---|---|
తరువాత | అంజనీ కుమార్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కిష్టాపురం, మధిర మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | 1962 డిసెంబరు 3||
జాతీయత | భారతదేశం | ||
తల్లిదండ్రులు | నారాయణ రెడ్డి, అచ్చమ్మ | ||
సంతానం | నితీష్ |
ముదిరెడ్డి మహేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్. ఆయన 2017 నవంబరు 17 నుండి 2022 డిసెంబరు 31 వరకు తెలంగాణ రాష్ట్ర డీజీపీగా పనిచేశాడు.[1][2]
జననం, విద్యాభాస్యం
[మార్చు]ఎం. మహేందర్ రెడ్డి 3 డిసెంబరు 1962లో తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా,కూసుమంచి మండలం, కిష్టాపురం గ్రామంలో నారాయణ రెడ్డి, అచ్చమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన నల్గొండ జిల్లా సర్వేల్ గురుకుల పాఠశాలలో ప్రాధమిక విద్యను పూర్తి చేసి,[3] వరంగల్ ఎన్.ఐ.టి నుండి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎన్‌ఐటీ దిల్లీలో ఎంటెక్ చదువుతుండగా ఐపీఎస్‌కు ఎంపికయ్యాడు.[4][5] ఆయన 2020లో జేఎన్టీయూహెచ్ నుంచి ‘‘ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆన్ పోలీసింగ్’పై పీహెచ్‌డీ పూర్తి చేశాడు.[6][7][8] ఆయనకు భార్య అనిత, కుమారుడు నితేష్ ఉన్నాడు.[9]
వృత్తి జీవితం
[మార్చు]ఎం. మహేందర్ రెడ్డి 1986 బ్యాచ్‌కు చెందిన ఐ.పి.ఎస్ అధికారి. ఆయన తొలి పోస్టింగ్ కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్. తరువాత గుంటూరులో, బెల్లంపల్లి లో పని చేసి నిజామాబాదు, కర్నూల్ జిల్లా ఎస్పీగా పని చేశాడు. 1995లో హైదరాబాద్ తూర్పు జోన్ డీసీపీగా పని చేసి, సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఫ్యాకల్టీగా, ఇంటెలీజెన్స్ చీఫ్, గ్రేహౌండ్స్ ఐజీగా పలు జిల్లాల్లో వివిధ హోదాల్లో పని చేశాడు. 2 జూన్ 2014న హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా నియమితుడయ్యాడు. డీజీపీ అనురాగ్ శర్మ పదవీవిరమణ చేయడంతో ఆయన 12 నవంబర్ 2017న ఇన్‌చార్జి డీజీపీగా నియమితుడై,[10][11][12] 10 ఏప్రిల్ 2018న పూర్తి స్థాయి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా నియమితుడయ్యాడు.[13] ఆయన 8 ఏప్రిల్ 2020లో దేశంలోని టాప్ 25 ఐపిఎస్ అధికారుల జాబితాలో 8వ స్థానం దక్కించుకున్నాడు.[14][15]
మహేందర్ రెడ్డి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా 2024 జనవరి 25న నియమితులయ్యాడు.[16][17]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (31 December 2022). "మహేందర్ రెడ్డి పదవీ విరమణ.. నూతన డీజీపీగా అంజనీకుమార్". Retrieved 1 January 2023.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Andhra Jyothy (31 December 2022). "తెలంగాణ డీజీపీగా మహేందర్రెడ్డి పదవీ విరమణ". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
- ↑ Sakshi (12 November 2017). "నా పునాది సర్వేల్". Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.
- ↑ The Hans India (11 November 2017). "Top cop is Khammam's son of soil" (in ఇంగ్లీష్). Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.
- ↑ The News Minute (11 November 2017). "It's official: Hyderabad Commissioner Mahender Reddy is new Telangana DGP" (in ఇంగ్లీష్). Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.
- ↑ ETV Bharat News (30 May 2020). "డాక్టర్ కాబోతున్న డీజీపీ మహేందర్ రెడ్డి!". Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.
- ↑ TV9 Telugu (18 October 2020). "పీహెచ్‌డీ పూర్తి చేసుకున్న తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి". Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (18 October 2020). "పీహెచ్‌డీ పూర్తి చేసిన డీజీపీ మహేందర్ రెడ్డి". Sakshi. Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.
- ↑ Andhrajyothy (30 July 2020). "డీజీపీ మహేందర్ రెడ్డి కుమారుడి వివాహం". Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.
- ↑ Sakshi (10 November 2017). "నూతన డీజీపీగా మహేందర్‌రెడ్డి". Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.
- ↑ The Indian Express (12 November 2017). "Mahendar Reddy takes over as in-charge Telangana DGP" (in ఇంగ్లీష్). Archived from the original on 6 January 2021. Retrieved 5 January 2022.
- ↑ The Hindu (10 November 2017). "Mahender Reddy is new DGP" (in Indian English). Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.
- ↑ Sakshi (10 April 2018). "పూర్తి స్థాయి డీజీపీగా మహేందర్‌రెడ్డి". Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.
- ↑ Sakshi (8 April 2020). "డీజీపీ మహేందర్‌రెడ్డికి అరుదైన గౌరవం". Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.
- ↑ HMTV (8 April 2020). "డీజీపీ మహేందర్‌రెడ్డికి అరుదైన గౌరవం". Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.
- ↑ Andhrajyothy (25 January 2024). "టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ.. గవర్నర్ ఆమోదం". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.
- ↑ Eenadu (26 January 2024). "టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మహేందర్‌రెడ్డి". Archived from the original on 26 January 2024. Retrieved 26 January 2024.