ఎం. సతీష్ రెడ్డి
| ఎం. సతీష్ రెడ్డి | |||
కర్ణాటక శాసనసభ ప్రభుత్వ చీఫ్ విప్
| |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2021 సెప్టెంబర్ 13 | |||
| ముందు | వి. సునీల్ కుమార్ | ||
|---|---|---|---|
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2008 | |||
| ముందు | నియోజకవర్గం సృష్టించబడింది | ||
| నియోజకవర్గం | బొమ్మనహళ్లి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1972 డిసెంబరు 12 హొంగసంద్ర, బెంగళూరు | ||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| జీవిత భాగస్వామి | ఆశా | ||
| సంతానం | 1 కొడుకు, 1 కూతురు | ||
ఎం. సతీష్ రెడ్డి కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు బొమ్మనహళ్లి శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]ఎం. సతీష్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2008 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బొమ్మనహళ్లి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి కుపేంద్ర రెడ్డిపై 13,640 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2013 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సి. నాగభూషణపై 25,852 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
ఎం. సతీష్ రెడ్డి 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బొమ్మనహళ్లి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సుష్మా రాజగోపాల రెడ్డిపై 47162 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికై,[2] 2021 సెప్టెంబర్ 13న కర్ణాటక శాసనసభ ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమితుడయ్యాడు.[3] ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఉమాపతి శ్రీనివాస గౌడపై 24,215 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ "Satish Reddy is new Chief Whip" (in Indian English). The Hindu. 13 September 2021. Archived from the original on 24 April 2025. Retrieved 24 April 2025.
- ↑ "Karnataka Assembly Elections 2023: Bommanahalli". Election Commission of India. 13 May 2023. Archived from the original on 24 April 2025. Retrieved 24 April 2025.
- ↑ Hindustan Times (13 May 2023). "Bangalore South election 2023 results LIVE: Govindraj Nagar, Vijay Nagar, Basavanagudi, Padmanabhanagar, BTM Layout" (in ఇంగ్లీష్). Archived from the original on 15 May 2023. Retrieved 15 May 2023.