ఎం. సత్యనారాయణ
ఎం. సత్యనారాయణ | |||
పదవీ కాలం 2008 – 2013 | |||
ముందు | సిద్దరామయ్య | ||
---|---|---|---|
తరువాత | సిద్దరామయ్య | ||
నియోజకవర్గం | చాముండేశ్వరి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1944 కర్ణాటక భారతదేశం | ||
మరణం | 2019 జూన్ 6 | ||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
నివాసం | కర్ణాటక భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ఎం. సత్యనారాయణ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2008 శాసనసభ ఎన్నికలలో చాముండేశ్వరి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]ఎం. సత్యనారాయణ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో చేరి వివిధ హోదాల్లో పని చేసి 2008 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో చాముండేశ్వరి శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సి.ఎన్. మంజెగౌడపై 14,299 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2013 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి జి.టి. దేవెగౌడ చేతిలో 7103 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2]
మరణం
[మార్చు]ఎం. సత్యనారాయణ వయసు సంబంధిత వ్యాధులతో బాధపడుతూ 2019 జూన్ 6న గుంగ్రాల్ చత్రలోని తన నివాసంలో మరణించాడు. ఆయనకు భార్య లక్ష్మి, కుమారులు అరుణ్‌కుమార్, జగదీష్, కుమార్తె ఎస్ సునీత ఉన్నారు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-19.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-19.
- ↑ "Former M L A Sathyanarayana passes away" (in ఇంగ్లీష్). Deccan Herald. 7 June 2019. Archived from the original on 14 May 2025. Retrieved 14 May 2025.
- ↑ "Former MLA Sathyanarayana passes away" (in Indian English). The Hindu. 7 June 2019. Archived from the original on 14 May 2025. Retrieved 14 May 2025.