ఎక్కిళ్ళు
వెక్కుళ్ళు(Hiccough) అప్పుడప్పుడు అందరికీ అనుభవమైనవి. ఇవి ఉదరవితానం హఠాత్తుగా సంకోచించడం వల్ల ఏర్పడతాయి. ఇలాంటి సంకోచం వలన గాలి ఉఛ్వాసం ద్వారా ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తూ స్వరతంత్రులను దగ్గరచేస్తుంది. దీని మూలంగా 'హిక్' అనే ధ్వని పుడుతుంది. ఈ శబ్దాన్ని ఆధారం చేసుకొనే ఆయుర్వేదంలో వెక్కిళ్ళను 'హిక్క' అని, ఆంగ్లంలో 'హిక్కప్' అని అంటారు
వెక్కుళ్ళు వస్తున్నప్పుడు రకరకాల చిట్కాలను ఉపయోగిస్తాము. ఊపిరిని బిగబట్టి ఉంచడం, చల్లని నీరు తాగడం, హఠాత్తుగా భయపడేట్టు చేయడం మొదలైనవి. వెక్కిళ్ళు చాలవరకు కొద్ది నిమిషాలలో సర్దుకుంటాయి. అలా తగ్గకుండా ఎక్కువకాలం రావడం ఒక వ్యాధి లక్షణంగా భావించాలి.
కారణాలు
[మార్చు]- ఉదరవితానం చుట్టుపక్కల వాపు : న్యూమోనియా, ప్లూరసీ వంటివి, పచ్చకామెర్లు, పేగులలో అల్సర్ లు మూలంగా ఎక్కువగా వెక్కిళ్ళు వస్తాయి.
- మూత్రపిండాల వ్యాధులు : యురీమియా అనే వ్యాధిలో మూత్రం తక్కువగా పోవడం వల్ల శరీరమంతా ఉబ్బినట్లు కనిపించదం, వాంతులు, తలనొప్పి, కళ్ళు తిరగడం మొదలైన చిహ్నాలు కనిపిస్తాయి. శ్వాస ఒక ప్రత్యేకమైన వాసన కలిగివుంటుంది.
- మెదడుకు సంబంధించిన వ్యాధులు : పక్షవాతం, మెదడులో కంతుల పెరుగుదల వల్ల కూడా వెక్కిళ్ళు వస్తాయి.
- మానసిన రుగ్మతలు : న్యూరోసిస్ లోను, హిస్టీరియా వంటి మానసిక ఉద్రిక్తలలో ఇవి కనిపిస్తాయి.
చిట్కాలు
[మార్చు]ఎక్కిళ్లు పోవాలంటే సడన్‌గా భయాందోళనలు కల్గించే మాటలు గానీ, షాకింగ్ న్యూస్ గానీ చెప్పటం వలన కూడా ఎక్కిళ్లు వెంటనే తగ్గుతాయి. ఎందుకంటే మన మెదడు ఆ న్యూస్‌కి రియాక్ట్ అయి వెంటనే స్పందిస్తుంది.
శొంఠి, ఎక్కిళ్లకు మంచి పని చేస్తుంది. శొంఠిని పొడిచేసి బెల్లంతో కలిపి పీలిస్తే ఎక్కిళ్లు తగ్గుముఖం పడతాయి. శొంఠి ఒక్కదాన్ని తేనేతో కలిపి తీసుకోవటం వలన కూడా ఎక్కిళ్ళు తగ్గుతాయి. శొంఠి, పిప్పళ్ళు ఉసిరిని పొడిచేసి తేనే, పటికబెల్లం చూర్ణంతో కలిపి సేవిస్తే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
సాధారణంగా చిన్నపిల్లలకు ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తుంటాయి. ఇంట్లో అమ్మ, అమ్మమ్మ, నాన్నమ్మ వుంటే ఏవరో ఎక్కువగా తలుచుకోవటం వల్ల ఎక్కిళ్లు ఎక్కువగా వస్తున్నాయి అంటారు. నిజానికి చిన్న పిల్లలకు ఎక్కిళ్లు బాగా వస్తుంటే వాళ్ళనీ బోర్లాపడుకోబెట్టి వెన్ను తట్టాలి. ఇలా చేయటం వల్ల ఎక్కిళ్లు తగ్గుతాయి.
కొద్దిగా పంచదార నోట్లో వేయటం లేదా నీళ్ళలో పంచదార కలుపుకొని తాగడం వల్ల కూడా ఎక్కిళ్లు తగ్గుతాయి. ఊపిరిని గట్టిగా పీల్చి కొంతసేపు బిగబట్టి తరువాత వదలాలి. అలా చేయటం వలన కూడా ఎక్కిళ్లు పోతాయి. నీరుల్లి రసాన్ని పీలిస్తే కూడా ఎక్కిళ్లు తగ్గుతాయి
ఒక స్పూన్ నిమ్మరసం తాగడం గానీ, ఒక స్పూన్ వేరుశెనగ వెన్న తినడం వలన కూడా ఎక్కిళ్లు తగ్గుతాయి.