Jump to content

ఎక్టోపిక్ గర్భం

వికీపీడియా నుండి
ఎక్టోపిక్ గర్భం
ఇతర పేర్లుఎక్సీసిస్, ఎక్స్‌ట్రాట్యురైన్ ప్రెగ్నెన్సీ, EUP, ట్యూబల్ ప్రెగ్నెన్సీ (ఫెలోపియన్ ట్యూబ్‌లో ఉన్నప్పుడు)
లాపరోస్కోపిక్ వీక్షణ, నీలం బాణాలు గర్భాశయం సూచిస్తోంది ఎడమ ఫెలోపియన్ ట్యూబ్‌ ఎక్టోపిక్ గర్భం. రక్తస్రావం ఎరుపు బాణాలుతో గుర్తించవచ్చు. కుడి ట్యూబ్ సాధారణమైనది..
ప్రత్యేకతప్రసూతి శాస్త్రం, గైనకాలజీ
లక్షణాలుకడుపు నొప్పి, యోని రక్తస్రావం
ప్రమాద కారకములుక్లామిడియా సంక్రమణం, పొగాకు ధూమపానం, గొట్టం (ట్యూబ్) శస్త్రచికిత్స, వంధ్యత్వ చరిత్ర, సహాయక పునరుత్పత్తి సాంకేతిక విధానాలు అనుసరించడం
రోగనిర్ధారణ పద్ధతిఅల్ట్రాసౌండ్, రక్త పరీక్షలు, మానవ కోరియానిక్ గోనాడోట్రోపిన్ పరీక్ష
భేదాత్మక రోగనిర్థారణ పద్ధతిగర్భస్రావం, అండాశయపు టోర్షన్, తీవ్రమైన అపెండిసైటిస్
చికిత్సశస్త్రచికిత్సతో పాటు మెథోట్రెక్సేట్ మందుల వాడకం
రోగ నిరూపణఅభివృద్ధి చెందిన దేశాలలో సుమారు 1% నుండి 2%. సహాయక పునరుత్పత్తి సాంకేతిక విధానాలు ఉపయోగించేవారిలో 4% వరకు
మరణాలుఅభివృద్ధి చెందిన దేశాల్లో మరణించే ప్రమాదం 0.1% నుంచి 0.3% మధ్య ఉండగా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది 1% నుంచి 3% మధ్య ఉంది. మొత్తం మహిళల్లో మొదటి త్రైమాసికంలో సుమారు 10% మరణానికి సాధారణ కారణం

ఎక్టోపిక్ గర్భం అనేది గర్భం ఏర్పడడములో సమస్య, దీనిలో పిండం గర్భాశయం వెలుపల అతుకుకొని ఉంటుంది.[1] దీనిలో సాధారణంగా కడుపు నొప్పి, యోని రక్తస్రావం ఉంటాయి, కానీ కొంతమంది ఎక్టోపిక్ గర్భం ఉన్న మహిళల్లో 50 శాతం లోపు మందికి ఈ రెండు లక్షణాలు ఉంటాయి. ఈ నొప్పి చాలా తీవ్రంగా (sharp) ఉండవచ్చు, లేదా నిస్తేజంగా, తిమ్మిరిగా ఉండవచ్చు. పొత్తికడుపులోకి రక్తస్రావం జరిగినట్లయితే నొప్పి భుజానికి కూడా వ్యాపించవచ్చు .[2] తీవ్రమైన రక్తస్రావం వల్ల గుండె వేగం, తెలివి తప్పి పడిపోవడం లేదా షాక్ ఏర్పడవచ్చు .[1][2] చాలా అరుదుగా మినహాయించి, పిండం మనుగడ సాగించలేకపోతుంది .[3]

కారణాలు

[మార్చు]

ఎక్టోపిక్ గర్భం ప్రమాద కారకాలలో కటి శోథ వ్యాధి, తరచుగా క్లామిడియా సంక్రమణం (క్లామిడియా ట్రాకోమాటిస్ అనే బాక్టీరియం వలన లైంగికంగా సంక్రమించే సంక్రమణం), పొగాకు ధూమపానం, ఇంతకు ముందే గొట్టం (ట్యూబ్) శస్త్రచికిత్స, వంధ్యత్వ చరిత్ర, సహాయక పునరుత్పత్తి సాంకేతిక విధానాలు (వంధ్యత్వాన్ని పరిష్కరించడానికి ఉపయోగించే వైద్య విధానాలు అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) వంటివి) అనుసరించడం ఉంటాయి. ఇంతకుముందు ఎక్టోపిక్ గర్భం వచ్చిన వారికి ఇంకొకసారి ఇదే రకమైన గర్భం వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ.[4]

గుర్తింపు పరీక్షలు

[మార్చు]

చాలా ఎక్టోపిక్ గర్భాలు (90%) ఫాలోపియన్ ట్యూబ్ లో సంభవిస్తాయి, అందువలన వీటిని గొట్టాల గర్భాలు అని పిలుస్తారు, కానీ గర్భాశయం మీద, అండాశయాల మీద లేదా ఉదరం లోపల కూడా ఈ ఎక్టోపిక్ గర్భాలు ఏర్పడవచ్చు. సాధారణంగా ఎక్టోపిక్ గర్భం గుర్తింపు అల్ట్రాసౌండ్, రక్త పరీక్షలు, మానవ కోరియానిక్ గోనాడోట్రోపిన్ (HCG - అంటే గర్భం గుర్తింపు కోసం ఉపయోగించే హార్మోన్) ద్వారా జరుగుతుంది. దీనికి ఒకటి కంటే ఎక్కువ సార్లు పరీక్షలు అవసరం కావచ్చు. ఇలాంటి లక్షణాలకు ఇతర కారణాలు ఏమంటే - గర్భస్రావం, అండాశయపు టోర్షన్ (అండాశయం ఇతర నిర్మాణాలకు అతుక్కునే అసాధారణ పరిస్థితి), తీవ్రమైన అపెండిసైటిస్[2] లు కావచ్చు.

నివారణ, చికిత్స

[మార్చు]

స్క్రీనింగ్, చికిత్స ద్వారా క్లామిడియా సంక్రమణం వంటి ప్రమాద కారకాలను తగ్గించడం ద్వారా నివారణ జరుగుతుంది.[5] కొన్ని ఎక్టోపిక్ గర్భాలు చికిత్స లేకుండా పరిష్కరించబడతాయి. అయితే ఈ విధానం 2014 నాటికి బాగా అధ్యయనం చేయలేదు. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్సతో పాటు మెథోట్రెక్సేట్ మందుల వాడకం పనిచేస్తుంది. ముఖ్యంగా బీటా-HCG తక్కువగా ఉన్నప్పుడు, ఎక్టోపిక్ పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. గొట్టం పగిలిపోయినా, పిండం హృదయ స్పందన ఉంటే లేదా వ్యక్తి కి మిగిలిన ముఖ్యమైన (vitals) స్పందనలు అస్థిరంగా ఉన్నప్పుడు శస్త్రచికిత్స సాధారణంగా సిఫార్సు చేస్తారు.[4] అయితే ఈ శస్త్రచికిత్స లాపరోస్కోపిక్ లేదా లాపరోటమీ అని పిలువబడే పెద్ద కోత ద్వారా కావచ్చు.[1] చికిత్స తీసుకున్న మహిళలు సాధారణంగా మంచి ఫలితాలు పొందుతారు.[4]

ప్రాబల్యం

[మార్చు]

అభివృద్ధి చెందిన దేశాలలో ఈ ఎక్టోపిక్ గర్భం శాతం సుమారు 1% నుండి 2% అయినప్పటికీ సహాయక పునరుత్పత్తి సాంకేతిక విధానాలు ఉపయోగించేవారిలో ఇది 4% వరకు ఉండవచ్చు. ఇది మొత్తం మహిళల్లో మొదటి త్రైమాసికంలో సుమారు 10% మరణానికి అత్యంత సాధారణ కారణం.[4] అభివృద్ధి చెందిన దేశాలలో ఫలితాలు మెరుగుపడ్డాయి అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలలో అవి ఇంకా పరిస్థితి మెరుగు పడవలసి ఉంది.[5] అభివృద్ధి చెందిన దేశాల్లో మరణించే ప్రమాదం 0.1% నుంచి 0.3% మధ్య ఉండగా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది 1% నుంచి 3% మధ్య ఉంది.[6] ఎక్టోపిక్ గర్భం గురించి మొట్టమొదటగా 11వ శతాబ్దంలో అల్-జహ్రావి ద్వారా తెలియపరచాడు.[5] "ఎక్టోపిక్" అనే పదానికి "స్థలం నుండి బయటపడటం" అని అర్థం.[7]

సూచనలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 . "Diagnosing ectopic pregnancy and current concepts in the management of pregnancy of unknown location".
  2. 2.0 2.1 2.2 . "Does this woman have an ectopic pregnancy?: the rational clinical examination systematic review".
  3. (2008). "Full-term abdominal pregnancy: a case report and review of the literature".
  4. 4.0 4.1 4.2 4.3 Cecchino GN, Araujo Júnior E, Elito Júnior J (September 2014). "Methotrexate for ectopic pregnancy: when and how". Archives of Gynecology and Obstetrics. 290 (3): 417–23. doi:10.1007/s00404-014-3266-9. PMID 24791968.
  5. 5.0 5.1 5.2 (April 2009). "Tubal ectopic pregnancy: diagnosis and management".
  6. Mignini L (26 September 2007). "Interventions for tubal ectopic pregnancy". who.int. The WHO Reproductive Health Library. Archived from the original on 2 April 2015. Retrieved 12 March 2015.
  7. Cornog, Mary Wood (1998). Merriam-Webster's vocabulary uilder. Springfield, Mass.: Merriam-Webster. p. 313. ISBN 9780877799108. Archived from the original on 2017-09-10.