ఎఖోకార్డియోగ్రఫీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అసామాన్యమైన ఎఖోకార్డియోగ్రామ్.మధ్య-కండ్రాల వాయుకోష భాగాలలో లోపం చూపిస్తున్న బింబం.ఎడమ ప్రక్కన క్రింది భాగంలో లేశం హృదయ ఆవృత్తిని చూపిస్తోంది. ఎర్రని భాగం ఆ ఆవృత్తి చిత్రం తీసిన సమయాన్ని సూచిస్తోంది.రక్త ప్రవాహం మరియు వేగంని సూచించడానికి రంగుల ప్రయోగం.
సోనోగ్రఫర్ పిల్లల ఎఖోకార్డియోగ్రామ్ చేస్తున్నాడు
గుండె ఎడమ కుహరాన్ని చూపిస్తున్న ఎఖోకార్డియోగ్రామ్
వాయుకోష భాగాలలో లోపం

వైద్య వర్గంచే సామాన్యంగా కార్డియాక్ ఎఖో లేదా ఎఖో గా పిలవబడే ఎఖోకార్డియోగ్రాం (Echocardiography) శబ్ద ప్రతిధ్వనికి చిత్ర రూపంలో గుండెను చూపించే చిత్ర పటం. ఆంగ్లంలో దీనిని ఎఖో కార్డియో గ్రామ్ గా వ్యవహరించినప్పటికీ, ఇసిజిగా దీనిని క్లుప్తీకరణం చేయరు - అందుకు కారణం ఇసిజిని ఎలక్ట్రోకార్డియోగ్రాంకు సంక్షేపంగా వాడటమే. అతిధ్వనితో గుండెను చూడడం గా కూడా అభివర్ణించే ఈ ప్రక్రియ అతిధ్వనిని ప్రయోగించి గుండె భాగాలను ద్వి-పరిణామం గల (2D) (అంటే పొడుగు మరియు వెడల్పు మాత్రమే చూపి, లోతు లేదా మందం చూపనట్టి) చిత్రాలుగా చూపించే సాధారణ పద్ధతిని అవలంబిస్తుంది. కొత్తగా వచ్చే అతిధ్వని వ్యవస్థలు అప్పటికప్పుడే 3D చిత్రాలు చూపించే ప్రక్రియను అవలంబిస్తాయి.

గుండె భాగాలను ద్వి-పరిణామం గల చిత్రాలుగా చూపటమే కాక, ఎఖోకార్డియోగ్రామ్ రక్త ప్రసరణ వేగాన్ని మరియు గుండె కణజాల నిర్మాణాన్ని దోప్ప్లర్ అతిధ్వని ప్రక్రియను ఉపయోగించి తెలపగలుగుతుంది. వాల్వే గుండె కవాటం కణజాలాలను మరియు పని తీరును, కుడి ఎడమ హృదయ కుహరాల మధ్య అస్వభావికమైన సూచనలను, కవాటాల గుండా వెనుకకు వెళ్ళే రక్తాన్ని, గుండె ఉత్పాదకత మరియు బహిష్కరణ భిన్నం అంచనా వేయటానికి ఇది పనికి వస్తుంది. ఇతర పరిమాణాలలో గుండె కొలమానాలు (గొట్టంలాగ ఉన్న అంగ వ్యాసం మరియు కోశల దృఢత్వము) మరియు E/A అనుపాతం.

ఎఖోకార్డియోగ్రామ్ కి అతిధ్వని పాత వైద్య అనువర్తనం. ఎఖోకార్డియోగ్రామ్ సిరల లోనికి పంపే భేద వృద్ధి అతిధ్వని మొదటి ఆచరణాత్మక ప్రయోగం. ఈ ప్రక్రియలో కణజాలం మరియు రక్తం యొక్క తేడాను పటాలలో స్పష్టంగా చూపడానికి వాయువు నింపబడిన సూక్ష్మ బుడగలను సిరలలోనికి పంపిస్తారు. ఇలా తేడాను చూపే ప్రక్రియ మైయోకర్దియాల్ చిలకరింపులను అంచనా వేయటంలో ఉపయోగ కరంగా ఉంటుందో లేదో అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. డొప్లర్ అతిధ్వనితో కూడా ఈ ప్రక్రియను వినియోగించి ప్రవాహ సంబంధ కొలమానాలను బాగుగా తెలుసుకోవచ్చు. (డొప్లర్ ఎఖోకార్డియోగ్రామ్ ను చూడండి.)

ఎఖోకార్డియోగ్రామ్ హృదయ సోనోగ్రఫర్, హృదయ నిర్మాణ శాస్త్ర నిపుణుడు (యు.కే.లో), లేదా హృదయ వ్యాధి నిపుణుడు ప్రయోగిస్తారు.

ప్రయోజనం[మార్చు]

ఎఖోకార్డియోగ్రఫీని గుండె మరియు నాళికా వ్యవస్థలో రోగాలను కనుగొనడానికి ఉపయోగిస్తారు. దీనిని గుండె జబ్బులు నిర్ధారించే పరీక్షలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. గుండె ఆకార పరిమాణాలు, రక్త పంపిణి సామర్థ్యం, మరియు దాని కణజాలం ఎక్కడ ఎంత పాడైపోయాయి లాంటి గుండెకు సంబంధించిన చాలా సమాచారం ఈ పరికరం వల్ల తెలుస్తుంది. గుండె కవాటాల వ్యాధులను అంచనా వేయటానికి ఈ పరికరం బాగా ఉపయోగపడుతుంది. మూసి ఉన్న కవాటాల గుండా వెనకకు రావటం (దీనినే రిగర్జిటేషన్ గా కూడా వ్యవహరిస్తారు) వంటి అస్వాభావికమైన రక్త ప్రసరణను కనుగొనటానికి ఈ పరికరం ఉపయోగపడుతుంది. గుండె ఆవరణ కణజాలం యొక్క కదలికల్ని అంచనా వేయటం ద్వారా, ఈ పరికరం హృద్ధమని సంబంధిత వ్యాధుల ఉనికిని తీవ్రతని అంచనా వేసేందుకు ఉపయోగపడుతుంది. గుండె దగ్గర నొప్పి వ్యాధి సంబంధితమైనదా లేదా అన్న విషయం కూడా అంచనా వేయవచ్చు. హైపెర్త్రోఫిక్ కార్దియోమైయోపతిని కనుగొనటానికి కూడా ఈ పరికరం ఉపయోగపడుతుంది. శస్త్ర చికిత్స లేకుండా (శరీరంలోకి ఏ విధమైన పరికరాలు చొప్పించకుండా) పరీక్ష చేయగలగటం మరియు తెలిసిన హాని కాని, అనుషంగా ప్రభావాలు లేకపోవటం ఈ పరికరం వలన లాభాలు.

వక్ష స్థలం గుండా తీసే ఎఖోకార్డియోగ్రామ్[మార్చు]

వక్షస్థలం గుండా తీసే ఎఖోకార్డియోగ్రామ్ (Transthoracic echocardiogram) ను కార్డియాక్ అల్ట్రాసౌండ్ గా కూడా వ్యవహరిస్తారు. సాధారణ ఎఖోకార్డియోగ్రామ్ వక్ష స్థలము పై స్పర్శ శృంగాలను ఉంచటం ద్వారా గుండెను వక్షం గుండా చిత్రిస్తారు. ఇది శస్త్రచికిత్స కానటువంటిది, చాలా కచ్చితమైన కొలమానాలు ఇచ్చేది మరియు గుండె ఆరోగ్యాన్ని తొందరగా అంచనా వేయటానికి సహకారం అందించే పరికరం.

ఆహార నాళం గుండా తీసే ఎఖోకార్డియోగ్రామ్[మార్చు]

ఆహారనాళం గుండా తీసే ఎఖోకార్డియోగ్రామ (Transesophageal echocardiogram) ఇంకో పద్ధతి. ఈ పద్ధతిలో అతిధ్వనిని ఉత్పన్నం చేసి తిరిగి వినే ఓ స్పర్శ శృంగాన్ని మనిషి ఆహార నాళంలోకి పంపిస్తారు. తద్వారా వచ్చిన చిత్రాన్ని ముద్రించి పరిస్థితిని అంచనా వేయవచ్చు. ఈ పద్ధతిని ట్రాన్స్ ఎసోఫెగల్ ఎఖో కర్దియోగ్రం లేదా TOE గా వ్యవహరిస్తారు. అమెరికాలో దీనిని TEEగా వ్యవహరిస్తారు.

త్రి-పరిమాణాల (3-D) ఎఖోకార్డియోగ్రామ్[మార్చు]

శిఖరం నుండి చూస్తున్న హృదయ 3D ఎఖోకార్డియోగ్రామ్

కొన్ని స్పర్శ శృంగాలని క్రమ పద్ధతిలో అమర్చి, ప్రతిధ్వని నుండి ఉత్పన్నమయ్యే విద్యుత్ తరంగాలను విశ్లేషించే తగు వ్యవస్థను ఉపయోగించటం ద్వారా 3-D ఎఖోకార్డియోగ్రామ్ ఇప్పుడు సాధ్యమే. గుండె నిర్మాణం యొక్క సవివరణాత్మక నిర్ధారణకు ఇది తోడ్పడి, రోగ లక్షణాలను - ప్రత్యేకించి కవాటలలోని లోపాలను[1] మరియు కార్డియో మైయోపతిలను గుర్తించటానికి ఉపయోగపడుతుంది.[2] ఇలా ఉత్పన్నమైన గుండె యొక్క చిత్రాన్ని వివిధ కోణాలలో వివిధ లోతులలో చీల్చి పరీక్షించగలగటం ఈ పద్ధతి ప్రత్యేకత. దీనితో పుట్టుకలోనే వచ్చిన గుండె వైకల్యం తెలుసుకొనవచ్చు.[3] కుడి హృదయ కుహరంలో జీవాణు పరీక్షలు చేసే నిమిత్తం గుండె కణజాలాలను తీసేటప్పుడు అప్పటి కప్పుడు 3-D చిత్రాలు చూపించే ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది.[4]

గుర్తింపు[మార్చు]

  • యు.ఎస్.: "ఇంటర్ సొసైటల్ కమిషన్ ఫర్ ద అక్రేదిటేషణ్ ఆఫ్ ఎఖోకార్డియోగ్రఫి లాబొరేటరీస్" (ICAEL) ఎఖో ప్రయోగశాలకు, హృదయ వ్యాధి నిపుణులకు మరియు సాంకేతిక సిబ్బందికి ప్రమాణాలు నిర్దేశిస్తుంది. అన్ని నిబంధనలు పాటిస్తే, ఆ ప్రయోగశాలకు ICEAL ధ్రువ పత్రం లభిస్తుంది. ఈ ధ్రువ పత్రం లభించిన ప్రయోగ శాలకు బీమా కంపనీల నుండి ఎక్కువ మొత్తం లభిస్తుంది. http://www.icael.org/icael/index.htm
  • యుకే: యు.కే.లో ఇటువంటి గుర్తింపుని బ్రిటిష్ సొసైటి ఆఫ్ ఎఖోకర్దియోగ్రఫి ఇస్తుంది. ఇందు యోగ్యతా పత్రం సంపాదించటానికి సాంకేతిక సిబ్బంది మరియు ఇతర వృత్తి నిపుణులు కొంత పనిచేసి, దానిని దిన చర్య పుస్తకంలో రాసి, ఓ పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి.
  • ఐరోపా: యురోపియన్ అసోసిఎషన్ ఆఫ్ ఎఖో కార్డియోగ్రఫి (EAE), వ్యక్తిగత మరియు ప్రయోగశాల గుర్తింపు ప్రసాదిస్తుంది. వ్యక్తిగత గుర్తింపులో మూడు ప్రత్యేకీకరణలు: వయోజన వక్ష స్థలం గుండా తీసే ఎఖోకార్డియోగ్రామ్ (TTE), వయోజన ట్రాన్స్ ఎసోఫెగల్ ఎఖో కార్డియోగ్రఫి (TEE) మరియు పుట్టుకతో వచ్చే హృద్రోగ ఎఖోకార్డియోగ్రఫి (CHD).

వీటిని కూడా చూడండి[మార్చు]

  • ఏంజియోగ్రామ్
  • ఎలక్ట్రోకార్డియోగ్రామ్
  • పిండ ఎఖోకార్డియోగ్రామ్

సూచనలు[మార్చు]

  1. Poh KK, Levine RA, Solis J, Shen L, Flaherty M, Kang YJ, Guerrero JL, Hung J. (2008). "Assessing aortic valve area in aortic stenosis by continuity equation: a novel approach using real-time three-dimensional echocardiography". Eur Heart J. 29 (20): 2526. doi:10.1093/eurheartj/ehn022. PMC 2721715. PMID 18263866.CS1 maint: multiple names: authors list (link)
  2. Goland S, Czer LS, Luthringer D, Siegel RJ. (2008). "A case of arrhythmogenic right ventricular cardiomyopathy". Can J Cardiol. 24 (1): 61–2. PMC 2631252. PMID 18209772.CS1 maint: multiple names: authors list (link)
  3. పుట్టుకతో వచ్చే హృద్రోగ నిర్వహణలో త్రి-మితీయ ఎఖోకార్డియోగ్రామ్ దత్తాంశ విశ్లేషణ యొక్క ప్రభావం అన్న. తోరాక్. సరజ్., సెప్టంబరు 2008; 86: 875 - 881)
  4. గుండె జీవాను కణజాలాల పరీక్ష లో ఫ్లోరోస్కోపిక్ మరియు అప్పటి కప్పుడు కనపడే త్రి-మితీయ విధానాలలో వక్ష స్థలం గుండా తీసే ఎఖోకార్డియోగ్రామ్ చేసే సహాయం ను పోల్చటం డి ప్లట్ట్స్, ఎమ్ బ్రౌన్, జి జవోర్స్కి, సి వెస్ట్, ఎన్ కెల్లి, డి బర్స్తోవ్. యురోపియన్ ఎకోకర్దియోగ్రఫి పత్రిక (2010) డిఓఐ: 10.1093/ఎజేఖోకర్డ్/jeq036

బాహ్య లింకులు[మార్చు]

మూస:Medical imaging మూస:Cardiac procedures