ఎగువ సుబన్‌సిరి జిల్లా
అప్పర్ సుబన్‌సిరి జిల్లా | |
|---|---|
అరుణాచల్ ప్రదేశ్ పటంలో అప్పర్ సుబన్‌సిరి జిల్లా స్థానం | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | అరుణాచల్ ప్రదేశ్ |
| ముఖ్య పట్టణం | దపోరిజో |
| Area | |
• మొత్తం | 7,032 కి.మీ2 (2,715 చ. మై) |
| Population (2011) | |
• మొత్తం | 83,205[1] |
| జనాభా వివరాలు | |
| • అక్షరాస్యత | 64.0%[1] |
| • లింగ నిష్పత్తి | 982[1] |
| Website | అధికారిక జాలస్థలి |
అప్పర్ సుబన్‌సిరి జిల్లా, భారతదేశం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా. జిల్లా ముఖ్యపట్టణం దపోరిజో
చరిత్ర
[మార్చు]1987 సుబన్‌సిరి జిల్లాను, ఎగువ సుబన్‌సిరి, దిగువ సుబన్‌సిరి జిల్లాలుగా విభజించిన తరువాత ఈ జిల్లా ఏర్పడింది.[2]
భౌగోళికం
[మార్చు]ఎగువ సుబన్‌సిరి జిల్లా కేంద్రం దపొరిజోలో ఉంది. ఈ జిల్లా వైశాల్యం 7032 చ.కి.మీ.[3] ఈ జిల్లా వైశాల్యం అమెరికాలోని ఈస్ట్ ఫాల్క్‌లాండ్ నగరానికి సమానం.[4] ముఖ్యమైన పట్టణాలు చేతమ్, గిబా, టేక్సింగ్, లైమ్కింగ్, నాచో, సియుమ్, పయెంగ్, తలిహా, గితే రిపా, గుస్సార్, డంపోరిజో, డపోరిజో, మారో, బారిరిజో, పుచిగెకు, వీటిలో ప్రతి ఒక్కటి సర్కిల్‌కు ప్రధాన కార్యాలయాలుగా ఉన్నాయి.
ఆర్ధికం
[మార్చు]2011 గణాంకాలను అనుసరించి పంచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ఎగువ సుబన్‌సిరి జిల్లా ఒకటి అని గుర్తించింది.[5] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండునుండి నిధులను అందుకుంటున్న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[5]
శాసన వ్యవస్థ
[మార్చు]ఎగువ సుబన్‌సిరి జిల్లాలో నాలుగు అరుణాచల ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి: నాచో, తలిహా, డాపొరిజో, డంపొరిజో. ఇవన్నీ అరుణాచల్ పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గంలో భాగమై ఉన్నాయి.[6]
జనాభా గణాకాలు (2011)
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సుబన్‌సిరి జిల్లాలో మొత్తం జనాభా 83,448. వీరిలో 41,758 మంది పురుషులు ఉండగా. 41,690 మంది స్త్రీలు ఉన్నారు.[7] జిల్లాలో మొత్తం 15,869 కుటుంబాలు ఉన్నాయి. జిల్లా సగటు లింగ నిష్పత్తి 998.
జిల్లా మొత్తం జనాభాలో 16.1% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 83.9% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 79.5% కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 60.7% ఉంది. జిల్లాలోని పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి 938 కాగా, గ్రామీణ ప్రాంతాల వారిది 1,010 ఉంది.
జిల్లాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 12475, ఇది మొత్తం జనాభాలో 15%.ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 6332 మంది మగ పిల్లలు ఉండగా, 6143 మంది ఆడ పిల్లలు ఉన్నారు. పిల్లల లింగ నిష్పత్తి 970, ఇది ఎగువ సుబంసిరి జిల్లా సగటు లింగ నిష్పత్తి (998) కంటే తక్కువ.
జిల్లా మొత్తం అక్షరాస్యత రేటు 63.8%.జిల్లాలో పురుషుల అక్షరాస్యత రేటు 59.41% ఉండగా, స్త్రీల అక్షరాస్యత రేటు 49.1%.ఉంది
ఎగువ సుబన్‌సిరి జిల్లాలో తగిన్, హిల్, మిరి, గాలో ప్రజలు నివసిస్తున్నారు.
భాషలు
[మార్చు]ఎగువ సుబన్‌సిరి జిల్లాలో తగిన్ ప్రధాన భాషగా ఉంది. సినో -టిబెట్ కుటుంబానికి చెందిన హిల్స్ మిరి (న్యిషి), గాలో జిల్లా పశ్చిమ భూభాగంలో వాడుకలో ఉంది.[8]
మూలాలు
[మార్చు]- 1 2 3 "District Census 2011". Census2011.co.in.
- ↑ Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-10-11.
- ↑ Srivastava, Dayawanti (2010). "States and Union Territories: Arunachal Pradesh: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. p. 1113. ISBN 978-81-230-1617-7.
- ↑ "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 18 February 1998. the original నుండి 2018-02-20 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-10-11.
East Falkland 7,040km2
- 1 2 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. the original (PDF) నుండి 5 ఏప్రిల్ 2012 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 September 2011.
- ↑ "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. the original నుండి 13 ఆగస్టు 2011 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 March 2011.
- ↑ "Upper Subansiri District Population Religion - Arunachal Pradesh, Upper Subansiri Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). the original నుండి 2023-11-28 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-09-21.
- ↑ M. Paul Lewis, ed. (2009). "Galo: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-09-28.