ఎడాల్ఫ్ హిట్లర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఎడాల్ఫ్ హిట్లర్ లేదా అడాల్ఫ్ హిట్లర్ (Adolf Hitler) (జననం: 20 ఏప్రిల్ 1889 - మరణం: 30 ఏప్రిల్ 1945) 1933 నుండి జర్మనీ ఛాన్స్ లర్ గాను 1934 నుండి మరణించే వరకు జర్మనీ నేత(ఫ్యూరర్ fuhrer) గాను వ్యవహరించిన వ్యక్తి. ఇతడు నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ (దీనే నాజీ పార్టీ అంటారు) వ్యవస్థాపకుడు.

అడాల్ఫ్ హిట్లర్

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీ ఆర్థికముగా, సైనికముగా భారీగా నష్టపోయింది. హిట్లర్ మొదటి ప్రపంచ యుద్ధంలో గాయపడిన సైనికుడు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీపై మిత్ర రాజ్యాలు విధించిన ఆంక్షలు హిట్లర్ లోని అతివాదిని మేలు కొలిపాయి. ఈ విపత్కర పరిస్థితులను హిట్లర్ తనకు అనుకూలంగా మలచుకొన్నాడు. అణగారిన మధ్య తరగతి ప్రజలను హిట్లర్ తన వాక్పటిమతో ఉత్తేజితులను చేసాడు. జర్మనీ పతనానికి యూదులే ముఖ్య కారణమని హిట్లర్ బోధించాడు అతని ఉపన్యాసాలలో ఎప్పుడూ అతివాద జాతీయత, యూదు వ్యతిరేకత, సోషలిస్ట్ వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపించేవి. అధికారం లోకి వచ్చిన తరువాత పతనమైన ఆర్థిక వ్యవస్థను నిస్తేజంగా ఉన్న సైనిక వ్యవస్థను గాడి లోనికి తెచ్చాడు. ఇతని విదేశాంగ విధానం నియంతృత్వము, ఫాసిస్ట్ ధోరణి తోనూ నిండి ఉండేది. ఇతని విదేశాంగ విధాన లక్ష్యం జర్మనీ దేశ సరిహద్దులను పెంచడమే. ఇదే ధోరణి తో ఇతడు ఆస్ట్రియా, పోలండ్, చెక్ రిపబ్లిక్ లపై దండెత్తాడు. ఇదే రెండవ ప్రపంచ యుద్ధానికి దారి తీసింది.

హిట్లర్ మరియు ముస్సొలినీ

రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభం లో అక్ష రాజ్యాలు(Axis powers) దాదాపు యూరప్ ను జయించాయి. కానీ క్రమంగా మిత్ర రాజ్యాల చేతిలో ఓడిపోయాయి. హిట్లర్ జాతి వ్యతిరేక విధానాల వలన యుద్ధం పూర్తి అయ్యేసరికి సుమారుగా 1.1 కోట్ల ప్రజలు మరణించారు. వీరిలో 60 లక్షల మంది యూదులు. దీనిని చరిత్రలో మానవ హననం (హోలోకాస్ట్)గా పేర్కొంటారు. యుద్ధపు చివరి రోజులలో సోవియట్ రష్యా కు చెందిన రెడ్ ఆర్మీ బెర్లిన్ నగరం లోనికి ప్రవేశించగానే హిట్లర్ ఆ ముందురోజే వివాహం చేసుకున్న తన భార్య ఇవా బ్రౌన్ తో కలిసి ఒక నేలమాళిగలో ఏప్రిల్ 30, 1945 మధ్యాహ్నం 3.30 కి ఆత్మ హత్య చేసుకొన్నాడు.

ముస్సోలినీ తో హిట్లర్
పత్రికలలో హిట్లర్ మరణ వార్త