Jump to content

కూర్పు

వికీపీడియా నుండి
(ఎడిటింగ్ నుండి దారిమార్పు చెందింది)

కూర్పు లేదా సవరణ (Editing) అనేది ఒక వ్యక్తి లేదా సంస్థ, లిఖిత, శ్రవణ, దృశ్య మాధ్యమాలను ప్రచురించడానికి విషయాన్ని ఎంపిక, సిద్ధం చేసే ప్రక్రియ. ఈ ప్రక్రియలో దిద్దుబాట్లు, సంక్షిప్తీకరణ ముఖ్యమైనవి. ఇంకా సరైన, స్థిరమైన, ఖచ్చితమైన సమాచారాన్ని అందించడానికి అనేక మార్పుచేర్పులు చేస్తారు.[1]

కూర్పు అనేది మొదటగా రచయిత ఆలోచనతోనే ప్రారంభమౌతుంది. తర్వాత సంపాదకులు, రచయిత సహకారంతో ముందుకు సాగుతుంది. సవరణలు చేయడంలో సృజనాత్మక నైపుణ్యాలు, మానవ సంబంధాలు, ఖచ్చితమైన పద్ధతులు కలబోసి ఉంటాయి.[2][3] సవరణ అభ్యాసం చేయడం భవిష్యత్తు సాహిత్య రచనలలో భాషా లోపాన్ని తగ్గించడానికి ఒక మార్గం.[4]

ప్రచురణరంగంలో ఈ పనిచేసే వారిని సంపాదకులు అంటారు. సంపాదకుల్లో వివిధ స్థాయిల వారు ఉంటారు. సాధారణంగా, సీనియర్-స్థాయి సంపాదకీయ సిబ్బందికి రిపోర్ట్ చేసే సహాయక సంపాదకులు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌లకు రిపోర్ట్ చేసే డైరెక్టర్లు ఉంటారు. అనేక ప్రచురణలలో ఉన్నత స్థాయిలో వారిని చీఫ్ ఎడిటర్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ లేదా కేవలం ఎడిటర్ అని పిలుస్తారు. ఒక పత్రికకు ఎక్కువగా పనిచేస్తూ, గౌరవనీయమైన పదవిలో ఉన్నవారు ఎడిటర్-ఎట్-లార్జ్ లేదా కంట్రిబ్యూటింగ్ ఎడిటర్ అనే బిరుదును పొందవచ్చు. మధ్య-స్థాయి వార్తాపత్రిక సంపాదకులు వ్యాపారం, క్రీడలు, ఫీచర్‌లు వంటి విభాగాలను తరచుగా నిర్వహిస్తారు లేదా నిర్వహించడంలో సహాయపడతారు. అమెరికన్ వార్తాపత్రికలలో, టాప్ ఎడిటర్ క్రింద ఉన్న స్థాయి సాధారణంగా మేనేజింగ్ ఎడిటర్ అవుతుంది.

విజువల్ ఎడిటింగ్

[మార్చు]

విజువల్ ఎడిటింగ్ లో ప్రధానమైనవి ఫోటో ఎడిటింగ్, సినిమాటిక్ ఎడిటింగ్. ఫోటో ఎడిటింగ్ 20వ శతాబ్దపు తొలినాళ్ళలో ప్రాథమిక స్థాయి నుండి అనేక మార్పులు చెందుతూ వచ్చింది. 1980వ దశకంలో కంప్యూటర్ల రాకతో ఫోటో ఎడిటింగ్‌లో సమూలమైన మార్పులు వచ్చాయి. ఫోటోషాప్, లైట్‌రూం లాంటి అప్లికేషన్లు ఫోటో ఎడిటింగ్ లో విప్లవాన్ని తీసుకువచ్చాయి.

మూలాలు

[మార్చు]
  1. Mamishev, Alexander, Williams, Sean, Technical Writing for Teams: The STREAM Tools Handbook, Institute of Electrical and Electronics Engineers, John Wiley & Sons. Inc., Hoboken, 2009, p. 128.
  2. "Encarta Dictionary definition of "editing"". Archived from the original on 22 October 2009.
  3. "Encarta Dictionary definition of 'editor'". Archived from the original on 6 February 2009.
  4. Diab, N. M. (2010). Effects of peer-versus self-editing on students' revision of language errors in revised drafts. System, 38(1), 85–95.
"https://te.wikipedia.org/w/index.php?title=కూర్పు&oldid=4607872" నుండి వెలికితీశారు