ఎడ్గర్ మిచెల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎడ్గర్ మిచెల్
జననం
ఎడ్గర్ డీన్ మిచెల్

(1930-09-17)1930 సెప్టెంబరు 17
హెరెఫోర్డ్, టెక్సాస్, యు.ఎస్.
స్థితిDeceased
మరణం2016 ఫిబ్రవరి 4(2016-02-04) (వయసు 85)
లాక్ వర్త్, ప్లోరిదా, యు.ఎస్.
జాతీయతఅమెరికన్
విద్యాసంస్థకార్నెగీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, B.S. 1952
నావల్ పోస్టు గ్రాడ్యుయేట్ స్కూలు, B.S. 1961
మసాచసెట్ట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , Sc.D. 1964
వృత్తినేవల్ ఏవియేటర్, టెస్ట్ పైలట్
అంతరిక్ష జీవితం
నాసా ఆస్ట్రనాట్
ర్యాంకుకెప్టెన్, యునైటెడ్ స్టేట్స్ నావీ
అంతరిక్షంలో గడిపిన కాలం
9d 00h 01m
ఎంపిక1966 NASA Group 5
మొత్తం ఇ.వి.ఎ.లు
2
మొత్తం ఇ.వి.ఎ సమయం
9 గంటల 23 నిమిషాలు
అంతరిక్ష నౌకలుఅపోలో 14
అంతరిక్ష నౌకల చిత్రాలు
పదవీవిరమణఅక్టోబరు 1, 1972

ఎడ్గర్ "ఎడ్" మిచెల్ ( 1930 సెప్టెంబరు 17 – 2016 ఫిబ్రవరి 4), (కెప్టెన్, యునైటెడ్ స్టేట్ నేవీ) అమెరికన్ నావీ అధికారి, ఏవియేటర్, టెస్ట్ పైలట్, అంతరిక్ష సాంకేతిక నిపుణులు, నాసా అంతరిక్ష శాస్త్రవేత్త. చంద్ర గ్రహంపై అడుగుపెట్టిన ఆరో వ్యక్తిగా ఎడ్గర్ మిచెల్ రికార్డు క్రియేట్ చేశారు. 1971 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు అపోలో 14 మిషన్ జరిగింది. ఆ సమయంలో 12 మంది వ్యోమగాములు చంద్రమండలంలో అడుగుపెట్టారు. వారిలో ఆరో వ్యక్తి ఎడ్గర్.

జీవిత విశేషాలు

[మార్చు]

బాల్య జీవితం , విద్య

[మార్చు]
Mitchell's doctoral thesis on space vehicle guidance on display at the U.S. Astronaut Hall of Fame

మిచెల్ సెప్టెంబరు 17 1930 న హెరెఫోర్డ్ (టెక్సాస్) లో జన్మించారు.[1] ఆయన తన స్వంత పట్టణంగా ఆర్టెసియా (న్యూ మెక్సికో) ను భావిస్తారు.[2] ఆయన అమెరికా యొక్క బోయ్ స్కౌట్స్ లో క్రియాశీలకంగా ఉండేవారు. అచట లైఫ్ స్కౌట్ లో రెండవ ర్యాంకు సాధించారు.[3] ఆయన డెమొలాయ్ ఇంటర్నేషనల్ లో కూడా సభ్యులు. ఆయన న్యూ మెక్సికోలోని ఆర్టెసియా లాడ్జ్#29 లో సభ్యులుగా కూడా ఉన్నారు.[4] ఆయన హ్యాండ్‌బాల్, టెన్నిస్,, స్విమ్మింగ్ వంటి అంశాలలో పాల్గొని ఆనందించేవారు. ఆయనకు స్కుబా డైవింగ్, గ్లైడింగ్ వంటి అంశాలు పట్ల యిష్టం ఉండేది.

ఆయన 1948లో న్యూమెక్సికోలోలోని అర్తెసియా హైస్కూలులో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసారు. 1952లో కార్నెగీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఇండస్ట్రియల్ మేనేజిమెంటులో బ్యాచులర్స్ డిగ్రీ పొందారు.[1] ఆ తరువాత సంవత్సరం ఆయన యు.ఎస్. నావీలో చేరారు. ఆయన ప్రాథమిక శిక్షణను సాన్ డియాగో రిక్రూట్ డిపోలో పూర్తిచేసారు. నేవీలో క్రియాశీలక ఉద్యోగం చేస్తున్నప్పుడే ఆయన యు.ఎస్. నుండి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్స్ డిగ్రీని 1961లో పొందారు. 1964లో మసాచుసెట్ట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఏరోనాటిక్స్, ఆస్ట్రోనాటికల్ డిగ్రీలను పొందారు.[1]

ఆయన రెండు సార్లు విడాకులు తీసుకొన్నారు. ఆయనకు ముగ్గురు పిల్లలు, ముగ్గురు పెంపుడు పిల్లలు, తొమ్మిది మంది మనుమలు ఉన్నారు.

రోదసిలో ఆయనకు జ్జ్ఞానోదయం అయిందని, అప్పటి నుంచి ఏకాగ్రత, ఫిజిక్స్, ఇతర అదృశ్య శక్తులపై ఆయన స్టడీ చేయడం ప్రారంభించారని చెప్తూ ఉంటారు. 1996లో ఆయన రాసిన జీవిత చరిత్రలో ఆ మూడు రోజుల్లో తనకు ఈ విశ్వమంతా అనుసంధానమై ఉందన్న అద్భుతమైన భావన కలిగిందని రాశారు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Mitchell".
  2. Dr.Edgar Mitchell interview (Day before Disclosure). January 7, 2011 – via YouTube.
  3. "Scouting and Space Exploration". Archived from the original on 2016-03-03. Retrieved 2016-02-06.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2016-02-06.

ఇతర లింకులు

[మార్చు]