ఎనుమాముల వ్యవసాయ మార్కెట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా, ఎనుమాముల గ్రామంలో ఉంది.[1] దాదాపు 117 ఎకరాల్లో విస్తరించివున్న ఈ మార్కెట్ ఆసియాలోనే రెండవ అతిపెద్ద మార్కెట్.[2][3][4]

చరిత్ర[మార్చు]

తెలంగాణ ప్రభుత్వ మార్కెటింగ్ విభాగం కమిటీ ఈ వ్యవసాయ మార్కెట్‌ను నిర్వహిస్తుంది. 2017నాటికి మొత్తం ఆదాయం సుమారు 20 కోట్లు.

మార్కెట్ వివరాలు[మార్చు]

వాణిజ్యపరంగా ఇది ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన మార్కెట్. సుమారు 450మంది కమీషన్ ఏజెంట్స్, 300 మంది కొనుగోలుదారులు, 800 మంది అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది, వేలమంది కూలీలతో నిత్యం ఈ మార్కెట్ రద్దీగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే పంటను బట్టి ఈ మార్కెట్ వేరువేరు భాగాలుగా (మిరప యార్డు, పత్తి యార్డు) విభజించబడింది. వరంగల్ జిల్లా, నల్లగొండ జిల్లా, ఖమ్మం జిల్లా, ఆదిలాబాద్ జిల్లాల ప్రాంతాలనుండి వచ్చే మిర్చి అమ్మకానికి ఈ మార్కెట్ అనువుగా ఉంటుంది. గుంటూరు, మహారాష్ట్ర నుండి కొనుగొలుదారులు ఇక్కడికి వచ్చి మిర్చి కొనుగోలుచేస్తారు.

ఈ-నామ్ మార్కెట్[మార్చు]

ఇక్కడ ఎలక్ట్రానిక్ బరువు ప్రమాణాలను ఉపయోగించి ధాన్యపు బరువును నిర్ధారించడానికి జరుగుతుంది. అందుకే 2016, ఏప్రిల్ 14న భారత ప్రభుత్వం జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ ప్రాజెక్ట్ (నామ్ ప్రాజెక్ట్) కోసం తెలంగాణలోని 40 మార్కెట్లలో ఒకటిగా మార్కెట్‌ను ఎంపిక చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కొత్త ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పద్ధతిని ఈ-నామ్ అని పిలుస్తారు. ఏ ప్రాంతానికి చెందిన వ్యాపారి అయినా మధ్యవర్తులు లేకుండా ఈ మార్కెట్లోని ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.

మూలాలు[మార్చు]

  1. TRS indifferent to farmers’ distress: Cong. - The Hindu
  2. Telangana government's Rs 30 lakh deposit norm stuns agricultural traders- The New Indian Express
  3. "Farmer run over by truck in Warangal". Archived from the original on 2019-07-27. Retrieved 2019-07-27.
  4. Trouble likely at Enumamula market yard - The Hindu