ఎన్య
This article ఈ పేజీకి ఏ పేజీ నుండీ లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీ. (ఏప్రిల్ 2017)
|
![]() |
ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి వ్యాసాన్ని వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన వర్గంలో చేర్చండి.
|
Enya | |
---|---|
![]() Enya in 2001 at the premiere of Sweet November.
|
|
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | Eithne Ní Bhraonáin |
ఇతర పేర్లు | Enya Brennan |
రంగం | New Age, Celtic, World |
వృత్తి | vocalist, instrumentalist, composer, producer |
క్రియాశీల కాలం | 1982 - present |
Labels | WEA, Warner Music UK, Warner Bros. Records UK, Reprise, Geffen |
Associated acts | Clannad, Moya Brennan, Brídín Brennan |
వెబ్సైటు | www.enya.com |
Notable instruments | |
Piano |
ఈథ్నేని భ్రానైన్ [1] (జననం 1961 మే 17) ఎన్య గా బాగా పేరున్న ఈమె, ఒక ఐరిష్ గాయని, సంగీత వాద్యురాలు మరియు స్వరకర్త. పత్రికా యంత్రాంగం కొన్నిసార్లు ఆమెను ఆంగ్ల పేరు ఎన్య బ్రెన్నన్ పేరుతో సూచిస్తుంది; ఆమె మాతృభాష ఐరిష్ భాషలో ఈథ్న్ ను ఎలా ఉచ్చరిస్తారో సరిగ్గా అలానే ఎన్యగా ప్రతిలేఖనం చేయబడింది.
ఆమె తరువాత క్లుప్తంగా ఫ్యామిలీ బ్యాండ్ క్లన్నాడ్లో చేరినప్పుడు, మరియు ఆమె ఒంటరి వృత్తికై వదిలేముందు ఆమె సంగీత వృత్తి 1980లో ఆరంభమయ్యింది. 1986 BBC ధారావాహిక ది సెల్ట్స్లో ఆమె ప్రదర్శన ఆమెకు విస్తారమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. దీని తరువాత కొద్దికాలానికి, ఆమె 1988 సంకలనం వాటర్‌మార్క్ ఆమెకు అంతర్జాతీయ ఖ్యాతిని పెంపొందించింది మరియు ఆమె అసాధారణ సంగీతానికి, గొంతు-పొరల ద్వారా గుర్తించే గుణం, జానపద మాధుర్యాలు, ఎలెక్ట్రానిక్ నేపథ్య సంగీతం మరియు తేలికపాటి జలతరంగాల సంగీతంతో పేరుగాంచింది.[2]
1990లలో మరియు 2000లలో ఆమె నిలకడైన విజయాన్ని కొనసాగించారు; ఆమె 2000 సంకలనం అ డే విత్అవుట్ రైన్ 15 మిల్లియన్ల కాపీలు అమ్ముడైనది[3] మరియు 2001 యొక్క ప్రపంచంలో ఉత్తమ అమ్మకాలు జరిపే మహిళా కళాకారిణిగా ఆమెను నమోదు చేశారు.[4] ఆమె ఐర్లాండ్ యొక్క ఉత్తమ అమ్మకాలు జరుపుతున్న ఏకైక కళాకారిణి[5] మరియు U2 బ్యాండ్ తరువాత అధికారికంగా సంగీతాన్ని ఎగుమతి చేస్తున్న దేశంలోని అతిపెద్ద రెండవ కళాకారిణి.[6] ఆమె సంకలనం అమ్మకాలు 2009 నాటికి 70 మిల్లియన్లు అయ్యాయి,[7] ఇందులో 26 మిల్లియన్లకు పైగా ఆల్బం అమ్మకాలు USలో జరిగాయి.[8] ఆమె పని ఆమెకు ఇతరవాటితో పాటు నాలుగు గ్రామీ పురస్కారాలను మరియు ఒక అకాడెమి పురస్కారం ప్రతిపాదనను సంపాదించి పెట్టింది. ఇప్పటివరకూ ఆమె వృత్తిలో ఆమె 10 వేర్వేరు భాషలలో ప్రదర్శించింది.[9]
విషయ సూచిక
- 1 సంగీతంలో పెరగడం మరియు క్లనాడ్
- 2 ఒంటరి వృత్తి ప్రారంభం: ది ఫ్రాగ్ ప్రిన్స్ మరియు ది సెల్ట్స్
- 3 అంతర్జాతీయ పురోగమనం: వాటర్‌మార్క్, షెపార్డ్ మూన్స్ మరియు ది మెమరీ ఆఫ్ ట్రీస్
- 4 అ డే విత్అవుట్ రైన్ మరియు ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్
- 5 అమరన్‌టైన్ , అండ్ వింటర్ కేం మరియు ది వెరీ బెస్ట్ ఆఫ్ ఎన్య
- 6 సంగీత శైలి మరియు ఇతర ప్రణాలికలు
- 7 ఎంపిక కాబడ్డ డిస్కోగ్రఫీ
- 8 వ్యక్తిగత జీవితం
- 9 జనరంజక సంస్కృతి
- 10 గుర్తింపుపొందిన పురస్కారాలు
- 11 ఇవి కూడా చూడండి
- 12 సూచనలు
- 13 బాహ్య లింకులు
సంగీతంలో పెరగడం మరియు క్లనాడ్[మార్చు]
ఎన్య గ్వీడోర్ (ఐరిష్ లో దీనిని గోత్ దొభైర్ అని పిలుస్తారు) లోని కౌంటీ దొనెగల్‌లో పూర్తిగా ఐరిష్-మాట్లాడే సంగీత కుటుంబంలో తొమ్మిది మంది పిల్లలలో ఆరవ వారుగా జన్మించారు.[10] ఆమె తాతాబామ్మలు ఐర్లాండ్ అంతటా ప్రదర్శించబడిన బ్యాండ్‌లో ప్రదర్శించారు, ఆమె తండ్రి లియో'స్ తవేర్న్ ఆరంభించక ముందు ఆమె తండ్రి స్లీవ్ ఫోయ్ యొక్క నాయకుడిగా ఉండేవారు, మరియు ఆమె తల్లి ఒక డాన్సు బ్యాండ్ లో ప్రదర్శించారు మరియు తరువాత సంగీతాన్ని పోబల్‌స్కోయిల్ ఘోత్ దొభైర్‌లో నేర్పించారు. చిన్న వయసులోనే, ఎన్య అనేక అభినయాలతో గ్వీడోర్ యొక్క స్థానిక రంగస్థల వేదికల వద్ద ప్రదర్శించారు మరియు ఆమె తల్లి యొక్క గాయక బృందంలో St. మేరీ'స్ చర్చి, డెర్రిబెగ్ వద్ద తోబుట్టువులతో పాడింది. ఆమె మిల్ఫోర్డ్, కౌంటీ దొనెగల్ లోని లోరేటో కమ్యూనిటీ స్కూల్ కు హాజరైనారు మరియు ఆ పిమ్మట శాస్త్రీయ పియానో వాయిద్యకారిణి అవ్వాలని కళాశాలకు వెళ్ళారు, అక్కడ ఆమె సంగీతం మరియు నీటి రంగుల చిత్రలేఖనంలో అభ్యాసాన్ని కొనసాగించారు. ఎన్యకు నలుగురు అన్నదమ్ములు మరియు నలుగురు అక్కచెల్లెళ్ళు ఉన్నారు, వీరిలో చాలా మంది 1968లో ఆన్ క్లాన్ ఆస్ దోభార్ ఏర్పాటు చేశారు. 1970లలో వీరు ఆ బ్యాండ్‌కు తిరిగి క్లనాడ్ అని పేరు పెట్టారు.
1980లో, ఎన్య క్లనాడ్ టో కలసి పనిచేసింది, ఈ బ్యాండ్‌లో ఆమె తోబుట్టువులు మైర్ (మోయా), పోల్, మరియు సియరన్ మరియు కవల అంకుల్స్ నోయెల్ మరియు పడ్రైగ్ దుగ్గన్ లతో ఏర్పడింది. ఎన్య కీబోర్డు వాయించింది మరియు నేపథ్య గాత్రాన్ని వారి యొక్క ఆల్బం క్రాన్ ఉల్ (1980)కు అందించింది, అయిననూ ఆమె అధికారికంగా 1981లో ఫుఐమ్ విడుదల వరకు బృందం యొక్క సభ్యురాలు కాలేదు, ఆమె కవరుపేజీ మీద కనిపించింది. అదే సంవత్సరంలో, ఎన్య రాగైరన్ యొక్క సభ్యురాలిగా ఉంది, ఇది అల్టన్ ఫ్రంట్ -వుమన్ మై రీడ్ ని మ్హొనైగ్ యొక్క బ్యాండ్.[11]
1982లో, "థీం ఫ్రమ్ హరీ'స్ గేమ్" కొరకు క్లనాడ్ ప్రసిద్ధి చెందే కొంతకాలం ముందు నిర్మాత మరియు మేనేజర్ నిక్కీ రయాన్ ఈ బృందాన్ని వీడి వెళ్ళారు మరియు ఎన్య ఆమె సోలో వృత్తిని ఆరంభించటానికి అతనితో కలిసింది. ఎన్య తరువాత ఆమె యొక్క సొంత రికార్డింగ్ స్టూడియోను యేర్పరుచుకుంది, దాని పేరు "ఐగిల్", "ఈగల్"ను ఫ్రెంచిలో అలా అంటారు.
ఒంటరి వృత్తి ప్రారంభం: ది ఫ్రాగ్ ప్రిన్స్ మరియు ది సెల్ట్స్[మార్చు]
"ఆన్ ఘోత్ ఆన్ ఘ్రియన్" ("ది సోలార్ విండ్" ఐరిష్ లో) మరియు "మిస్ క్లార్ రిమెమ్బర్స్" అనే రెండు సంగీత సాధనాల పాటలను ఎన్య 1984 సంకలనం టచ్ ట్రావెల్ [12]లో విడుదల చేసింది. ఆమె మొదటిసారి ఎన్యగా (ఈత్నేగా కాకుండా) 1984 చిత్రం ది ఫ్రాగ్ ప్రిన్స్‌కు సంగీతాన్ని కొంతవరకు అందివ్వడంతో పేరుపొందారు, అదే పేరుతో సౌండ్ట్రాక్ ఆల్బం మీద కూడా విడుదలయ్యింది. ఇంకొక ప్రదర్శన 1987లో రికార్డు అవుతూ కనిపించింది, ఇందులో సినీడ్ ఓ'కన్నోర్ యొక్క తోలి సంకలనం ది లయన్ అండ్ ది కోబ్రాలో ఎన్య మాట్లాడిన మాటలు (పాడలేదు) ఉన్నాయి. సంకలనం యొక్క పేరు ఎన్య యొక్క ఐరిష్ రీడింగ్ ఆఫ్ పామ్స్ 91:13 (KJVను కొంతవరకూ ఆంగ్లంలో అనువాదం చేయబడింది: "దౌ షల్ట్ ట్రెడ్ ఆన్ ది లయన్ అండ్ ది యాడర్...") "నెవర్ గెట్ ఓల్డ్" పాటలో ఉంది.
ఎన్య 1986 BBC టెలివిజన్ డాక్యుమెంటరీ ది సెల్ట్స్ యొక్క సౌండ్ ట్రాక్ కొరకు సంగీతం అందివ్వడానికి ఒప్పందం చేసుకుంది. ఆమె అందించిన సంగీతాన్ని ఆమె యొక్క మొదటి సోలో సంకలనం ఎన్య (1987)లో పొందుపరచింది, కానీ ఆ సమయంలో ఇది చాలా మంది దృష్టిని ఆకర్షించింది.[13] B-సైడ్ సింగిల్ "ఎక్లిప్స్" నిజానికి ఇది 1987 ఆల్బం ఎన్య నుండి ఎన్య పాట "డీరీడ్ ఆన్ తుఆత్"ను ముందుది వెనక్కు చేసి మార్చబడినది.[14] "బోడిసియ" అనే పాట కూడా ఈ సంకలనం లోనిదే, తరువాత దీనిని మచ్చుగా ది ఫుజీస్ వారి యొక్క సింగిల్ "రెడీ ఆర్ నాట్" (1996)లో తీసుకున్నారు, ఇది ఒక చిన్నపాటి విభేదాన్ని తీసుకువచ్చింది ఎందుకంటే ఈ బృందం ఎన్య నుండి అనుమతి తీసుకోలేదు లేదా ఆమెకు ఆ ఖ్యాతిని ఇవ్వలేదు, మారియో వినాన్స్ ఆమెను ప్రశంసించారు (వినాన్స్ పాట, "ఐ డోన్'ట్ వాన్నా నో"లో ఉన్న ఒక రాప్‌ను P. దిడ్డి చేశారు మరియు దీనికి అధికారికంగా ముగ్గురు కళాకారుల పేర్లను తెలుపుతారు, ఇది 2004లో హాట్ 100లో #2 స్థానానికి చేరినప్పుడు ఎన్య యొక్క అత్యధికంగా నమోదైన సింగిల్‌గా అయ్యింది).[10]
అంతర్జాతీయ పురోగమనం: వాటర్‌మార్క్, షెపార్డ్ మూన్స్ మరియు ది మెమరీ ఆఫ్ ట్రీస్[మార్చు]
![]() |
|
ఈ శ్రావ్యకాన్ని వినే ప్రయత్నంలో మీకు ఇబ్బంది ఎదురైందా? మీడియా సహాయాన్ని చూడండి. |
ఎన్య 1988లో ఆమె వృత్తి జీవితంలో వాటర్‌మార్క్ సంకలనం ద్వారా పురోగమనాన్ని సాధించారు, ఇందులో జనాదరణ పొందిన పాట "ఒరినోకో ఫ్లో"ఉంది (కొన్నిసార్లు తప్పుగా దీనిని "సెయిల్ అవే" అని అనుకుంటారు). జే త్యరీ ఉన్న "ఒరినోకో ఫ్లో", దీనికి ఒరినోకో స్టూడియోస్ పేరుమీదగా ఈ పేరు పెట్టినట్లు నివేదించారు (ఇప్పుడు మిలోకో స్టూడియోస్), ఇది ఇక్కడ ఆరంభించబడి, యునైటెడ్ కింగ్డంలో పట్టికలో మొదటి స్థానంను, జర్మనీలో 2వ స్థానాన్ని పొందింది మరియు వాటర్‌మార్క్ ఆల్బం యొక్క పదకొండు మిల్లియన్ల ప్రచురణలు అమ్ముడైనాయి.[10]
మూడు సంవత్సరాల తరువాత, ఆమె ఇంకొక విజయవంతమైన సంకలనంతో ముందుకు వచ్చారు, అది షెపార్డ్ మూన్స్, దాని యొక్క పన్నెండు మిల్లియన్ల కాపీలు అమ్ముడైనాయి మరియు ఎన్యకు మొదటి గ్రామీ పురస్కారంను సంపాదించిపెట్టింది. పాటలు "ఆన్ యువర్ షోర్" మరియు "ఎక్సైల్" (వాటర్‌మార్క్ నుండి) మరియు "ఎపోన" (ఎన్య నుండి) 1991 చిత్రం L.A. స్టొరీలో పొందుపరచారు. "ఎబుడే" కూడా సౌండ్‌ట్రాక్ మీద రాబిన్ విల్లియమ్స్ చిత్రం టాయ్స్ లో ప్రదర్శించారు, అయితే 1990 చిత్రం గ్రీన్ కార్డ్‌లో "రివర్", "వాటర్ మార్క్", మరియు "స్టాంస్ ఇన్ ఆఫ్రికా" ఉన్నాయి.[15] "బుక్ ఆఫ్ డేస్"ను ప్రధానంగా ఫార్ అండ్ అవే చిత్రంలో, ఈ చిత్రం కొరకు పురాతన సెల్టిక్ భాష స్థానంలో ఆంగ్ల-పాట శైలిని షెపార్డ్ మూన్స్ సంకలనంలో అన్ని చోట్ల 1993 తరువాత ఉంచారు. 1993లో, షెపార్డ్ మూన్స్ నుండి "మార్బెల్ హాల్స్" యొక్క ఆమె రికార్డింగ్ మార్టిన్ స్కోర్‌సేసే చిత్రం ది ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్ లో చిత్రాకరించబడింది.
1992లో, ఎన్య సంకలనం యొక్క మెరుగైన సంకలనాన్ని ది సెల్ట్స్ గా విడుదల చేశారు, ఇందులో దీర్ఘ సమయం ఉన్న, మరియు మార్చబడిన "పోర్త్రైట్" శైలి కూడా ఉంది, దీనిని పేరు మార్చి "పోర్త్రైట్ (అవుట్ ఆఫ్ ది బ్లూ)" అని పెట్టారు. షెపార్డ్ మూన్స్ వచ్చిన నాలుగు సంవత్సరాల తరువాత, ఆమె ది మెమరీ ఆఫ్ ట్రీస్ (1995) విడుదల చేశారు, UK మరియు జర్మనీ రెంటిలో విజయవంతమైన మొదటి ఐదింటిలో ఉంది అలానే ఈ సంకలనం నుండి విడుదలైన "ఎనీవేర్ ఈజ్" మరియు "ఆన్ మై వే హోమ్" వల్ల ఉత్తమ 10 ఆల్బంగా U.S. సింగిల్స్ లో ఉంది.
![]() |
|
ఈ శ్రావ్యకాన్ని వినే ప్రయత్నంలో మీకు ఇబ్బంది ఎదురైందా? మీడియా సహాయాన్ని చూడండి. |
1997లో, ఎన్య ఆమె యొక్క అతిగోప్పగా విజయవంతమైన సేకరణను విడుదల చేసింది, పైంట్ ది స్కై విత్ స్టార్స్: ది బెస్ట్ ఆఫ్ ఎన్య, తిరిగి ఇది UK ఇంకా జర్మనీలో మొదటి ఐదింటిలోకి దూసుకు వచ్చింది, ఇందులో రెండు కొత్త పాటలు కూడా ఉన్నాయి: అవి "పైంట్ ది స్కై విత్ స్టార్స్" మరియు "ఓన్లీ ఇఫ్..."; "ఓన్లీ ఇఫ్..." తరువాత ఒక సింగిల్‌గా అయింది. ("ఓన్లీ ఇఫ్ యు వాంట్ టు", అనేది "ఓన్లీ ఇఫ్..."యొక్క ముందుగా వచ్చిన తర్జుమా. ఇది ది బెస్ట్ ఆఫ్ ఎన్య అనే జపనీస్ ప్రోత్సాహక CDలో ఉంది, మరియు ఇందులో ఫ్రెంచ్ పాటలు లేవు.[16]) ఆమెకు జేమ్స్ కామెరాన్ యొక్క 1997 చిత్రం టైటానిక్ కొరకు సంగీతం స్వరకల్పన చేయడానికి అవకాశం అందించారు, కానీ తిరస్కరించింది. ఫలితంగా తీసుకోబడ్డ నార్వేగన్ గాయని సిస్సెల్ కిర్క్‌జెబో శైలి కూడా ఎన్యలాగా ఉంది ఆమె చేసిన పనిలో కనిపించటం వలన కొంతమంది ఆ ప్రశాసను ఎన్యకు ఆపాదించారు,[ఆధారం కోరబడింది] ముఖాముఖీలలో అధికారికంగా ఈ పాటల సంగీతం క్లనాడ్ దేనని తెలిపాయి. ఎన్య యొక్క "సైలెంట్ నైట్" 1989 ఐరిష్ భాష తర్జుమా రికార్డింగ్ ("ఒఇచే చియుయిన్")అనేక సంవత్సరాలలో అనేకసార్లు విడుదలచేశారు, ఇందులో ది క్రిస్టమస్ EP ( లేకపోతే ఇందులో నాన్-హాలిడే సంబంధిత ముందుగా జారీచేసిన ఎన్య రికార్డింగ్లు ఉన్నాయి) మరియు అ వెరీ స్పెషల్ క్రిస్టమస్ దాతృత్వ సంకలనం యొక్క 1997 ప్రచురణ ఉన్నాయి.
అన్సెట్ ఆస్ట్రేలియా, ఆ ఎయిర్‌లైన్ 1990లలో దానిపేరును మార్చుకునేటప్పుడు ప్రోత్సాక అవసరం కొరకు విస్తృతంగా "స్టాంస్ ఇన్ ఆఫ్రికా"ను వాడుకుంది. యుట్యూబ్ లో ఈ పాట యొక్క భాగాలను చూపించే ప్రకటనలను చూడవచ్చు. 1992 చిత్రం స్లీప్‌వాకర్స్ చిత్రం యొక్క సిగ్నేచర్ ట్యూన్ గా "బోడిసియ"ను చూపించింది.
అ డే విత్అవుట్ రైన్ మరియు ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్[మార్చు]
ఐదు సంవత్సరాల విరామం తరువాత, ఎన్య అ డే విత్అవుట్ రైన్ సంకలనంను 2000లో విడుదల చేసింది, ఇందులో 37 నిమిషాలు నూతన అంశాన్ని ఉంచారు (U.S. తర్జుమాలో 34 నిమిషాలు ఉంది). ఈనాటి వరకూ ఇది ఎన్య యొక్క అత్యంత విజయవంతమైన సంకలనం, U.S. బిల్‌బోర్డు 200 పట్టిక మీద రెండవ స్థానంకు చేరింది. మొదటి సింగిల్, "ఓన్లీ టైం" ను స్వీట్ నవంబర్ చిత్రంలో ఉపయోగించారు మరియు U.S.రేడియో ప్రసారంను 2000 చివరలో పొందింది. మే 2001లో, NBC దాని యొక్క టెలివిజన్ ధారావాహిక ఫ్రెండ్స్ కొరకు ప్రకటనలతో పాటు "ఓన్లీ టైం"ను వాడటం ఆరంభించింది, దీనితో రేడియోలో ప్రసారం అయ్యే ప్రధమ స్థానంలోని-40 లో చేరటానికి ఈ పాటకు అవకాశం చిక్కింది.
సెప్టెంబర్ 11, 2001 దాడులు తరువాత, "ఓన్లీ టైం"ను దాడుల గురించి తెలిపే అనేక రేడియో మరియు టెలివిజన్ నివేదికల సౌండ్‌ట్రాక్‌గా ఉపయోగించారు.[17] ఎన్య ఈ పాట యొక్క ప్రత్యేక ప్రచురణను విడుదల చేసింది మరియు ఒక మాక్సి సింగిల్ ను 20 నవంబర్ 2001న పాప్ సంగీతంను కలిగి ఉంది, మరియు దీని నుండి వచ్చే ధనాన్ని బాధితుల కుటుంబాలకు దానం చేసారు. "ఓన్లీ టైం" U.S. హాట్ 100లో 10వ స్థానంలోకి, పాప్ పట్టికలో 12వ స్థానంలోకి మరియు అడల్ట్ కంటెంపొరరీ అండ్ హాట్ అడల్ట్ కంటెంపొరరీ పట్టికలలో మొదటి స్థానంలోకి ఎగబ్రాకింది. జర్మనీలో, "ఓన్లీ టైం" జర్మన్ సింగిల్ పట్టికలో నెంబర్ 1 స్థానానికి తిరిగి ప్రవేశించింది[18] మరియు అ డే విత్అవుట్ రైన్ సంకలనం కొన్ని వారాల తరువాత మొదటి స్థానంలోకి చేరింది.
ఎన్య ఎకో పురస్కారంను జర్మనీలో 2001 యొక్క ఉత్తమ అమ్మకాల అంతర్జాతీయ సింగిల్‌గా గెలుచుకుంది, మరియు ఉత్తమ అమ్మకాల సంకలనం కొరకు ప్రతిపాదనను పొందింది.
2001లో, ఎన్య "మే ఇట్ బి" రికార్డు చేశారు, ఇందులో ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ చిత్ర మూడింటి సమాహారం తొలి విడుత, ఫెలోషిప్ ఆఫ్ ది రింగ్‌లో చూపించారు, మరియు ఇది జర్మన్ పట్టికలో మొదటి స్థానంలో ప్రవేశించిన ఆమె వరుస రెండవ సింగిల్. ఈ వీడియో పీటర్ జాక్సన్ చిత్రం నుండి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించింది.[19]
ఎన్య, స్వీయ-ఆమోదం పొందే సంగీతాన్ని నిదానంగా స్వరపరుస్తుంది.[20] నూతన పాట "సుమీరేగుసా" ("వైల్డ్ వయొలెట్") రోమ రయాన్ వ్రాసిన జపనీస్ పద్యం మీద ఆధారపడి ఉంది. సెప్టెంబర్ 2004లో, ఈ పాటను జపాన్ పానసోనిక్ యొక్క ప్రకటనల ప్రచారం భాగంగా వాడుకుంది. వార్నర్ మ్యూజిక్ జపాన్ పేర్కొంటూ ఎన్య యొక్క తరువాతి సంకలనం నవంబర్ మధ్యలో జపాన్‌లో విడుదలకు సిద్దంగా ఉందని తెలిపింది. ఎన్య ఆమె యొక్క అధికారిక వెబ్‌లో పత్రికా సమావేశాన్ని 19 సెప్టెంబర్ లో జారేచేసింది, అందులో ఆమె అది పొరపాటున తెలపబడినదని ఇంకనూ నూతన సంకలనం అంత తొందరగా రావట్లేదని తెలిపింది.[21]
అమరన్‌టైన్ , అండ్ వింటర్ కేం మరియు ది వెరీ బెస్ట్ ఆఫ్ ఎన్య[మార్చు]
నవంబర్ 2005లో, ఒక నూతన సంకలనం అమరన్‌టైన్ అనే పేరుతొ విడుదలైంది. UK మరియు U.S.రెండు చోట్ల ఇది మొదటి 10 లోకి చేరింది, మరియు జర్మనీలో 3వ స్థానానికి చేరింది. ఈ సంకలనం 2007 కొరకు ఉత్తమ నూతన యుగం సంకలనంగా గ్రామీ పురస్కారంను గెలుచుకుంది, ఇది ఎన్య యొక్క నాల్గవ పురస్కారం.
2006లో, ఎన్య అనేక క్రిస్టమస్-అంశం CDలను నూతనంగా రికార్డు చేసినవాటితో విడుదల చేసింది. 2006 అక్టోబరు 10న, Sounds of the Season: The Enya Holiday Collection ఆరుపాటలతో విడుదలైనది: ఇంతక్రితం విడుదలైన "ఒఇచే చియుయిన్" (a.k.a. "సైలెంట్ నైట్") మరియు "అమిడ్ ది ఫాలింగ్ స్నో" ఉన్నాయి, ఆ ప్రమాణాలలో ఉన్న నూతన రికార్డింగ్లలో "అడెస్టె ఫిడెలెస్" (a.k.a. "ఓహ్ కమ్ అల్ యే ఫైత్‌ఫుల్ ") మరియు "వుయ్ విష్ యు అ మెర్రీ క్రిస్టమస్" అలానే రెండు దానిలోనే ఉన్న పాటలు, "క్రిస్టమస్ సీక్రెట్స్" మరియు "ది మేజిక్ అఫ్ ది నైట్" ఉన్నాయి. ఈ CD NBC టెలివిజన్ నెట్వర్క్ మరియు టార్గెట్ డిపార్టుమెంటు స్టోర్ చైన్ తో మాత్రమే ఉన్న భాగస్వామ్యంతో కేవలం సంయుక్త రాష్ట్రాలులోనే విడుదలైనది. ఎన్యకు వరల్డ్'స్ బెస్ట్-సెల్లింగ్ ఐరిష్ ఆక్ట్ పురస్కారాన్ని 2006 నవంబర్ 19న లండన్‌లో వరల్డ్ మ్యూజిక్ అవార్డ్స్ వద్ద బహుకరించారు.
నవంబర్ చివరలో, అమరన్‌టైన్ యొక్క రెండు నూతన ప్రచురణలు విడుదలైనాయి. సౌండ్స్ ఆఫ్ ది సీజన్ లో ముందుగానే ఉన్న నాలుగుపాటల డిస్క్ తో విడుదల అయిన దానిని UKలో తిరిగి క్రిస్టమస్ ఎడిట్: అమరన్‌టైన్ గా విడుదల చేశారు (ముందుగా వచ్చిన ఆల్బం అప్పటికే "అమిడ్ ది ఫాలింగ్ స్నో" కలిగి ఉంది అయితే "ఓఇచే చియుయిన్" మాత్రం 1988లో రికార్డు అయినది, ఇది చాలా సార్లు అనేక సేకరణలలో కనిపించింది). U.S. ఈ విడుదల యొక్క ప్రత్యేక తర్జుమాను పొందింది (అమరన్‌టైన్ - డీలక్స్ కలెక్టర్'స్ ఎడిషన్ ), ఇందులో మూడు పోస్ట్ కార్డులు మరియు రోమ రయాన్ యొక్క పుస్తకం వాటర్ షోస్ ది హిడెన్ హార్ట్ కాపీని కలిగి ఉంది, దీని గురించి ముందుగా వచ్చిన ఆల్బంలో సూచించారు. కెనడా అభిమానులు అమరన్‌టైన్ నుండి స్పెషల్ క్రిస్టమస్ ఎడిషన్ లేదా EP పేరున్న క్రిస్టమస్ సీక్రెట్స్ నుండి ఎంపిక చేసుకోవచ్చు, ఇందులో కేవలం నాలుగు కొత్త పాటలు ఉన్నాయి.
ఈ విడుదల సమయంలోనే ఎన్య యొక్క అధికారిక వెబ్సైట్ యొక్క పునఃప్రారంభం 2006 నవంబర్ 2న జరిగింది. 2006 నవంబర్ 16న, ఎన్య ITV1'స్ మీద తెలుపుతూ ఆమె తన రాబోయే సంకలనం మీద పనిచేస్తున్నట్టు అన్నారు. ఒక నెల తరువాత, జపనీస్ ముఖాముఖిలో ఎన్య తెలుపుతూ ఆ సంకలనం పూర్తి క్రిస్టమస్ సంకలనంగా ఉంటుందని మరియు అది 2007లో విడుదలవుతుందని చెప్పారు[ఆధారం కోరబడింది] ఇది విపరీతమైన అభిమానుల ఊహలకు దారితీసింది, ఇందులో ఒకటి అధికారిక enya.com ఫోరం; చివరికి ఆ సమయంలో ఏవిధమైన విడుదల జరగలేదు.
2007 మధ్యకి, ఎన్య 80 మిల్లియన్ల ఆల్బంలను అమ్మిందని బలంగా తెలిపారు. ఒక అమెరికా వ్యాపారవేత్త "ఎన్యనోమిక్స్" అనే పదబంధాన్ని కనుగొన్నారు, అది ఏవిధమైన ప్రత్యక్ష ప్రదర్శనలు ఇవ్వకుండా మిల్లియన్ల కొద్దీ రికార్డులను అమ్మే ఎన్య సామర్థ్యాన్ని వివరిస్తుంది.[22]
2007 జూన్ 29న, ఎన్య ఒక గౌరవప్రథమైన డాక్టరేట్‌ను నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఐర్లాండ్, గాల్వే నుండి పొందింది.[23] ఇది జరిగిన కొద్దికాలానికి, 2007 జూలై 10 (తేదీని కూడా ఎన్య యొక్క వార్తల అధికారిక వెబ్సైటులో ఉంది), ఎన్య రెండవ గౌరవ డాక్టరేట్ ను యూనివర్సిటి ఆఫ్ ఉల్స్టర్ నుండి పొందింది.[24][25]
2008 సెప్టెంబర్ 1న, ఎన్య యొక్క వెబ్సైట్ "ది లోక్సియన్ గేమ్స్" ఆరంభించింది. ఈ పోటీలో ఎన్య అభిమానులు నాలుగు అతిపెద్ద బహుమతులను గెలుచుకోవచ్చు, అవి ఏమిటనేది ఇంకా చెప్పలేదు. రెండవ స్థానంలో నిలిచినవారికి ముప్పై బహుమతులు ప్రదానం చేస్తారు. గతంలో Enya.com ఆన్లైన్ పోటీలో, విజేతలకు ఎన్య సంతకం చేసిన ఆల్బంలను అందించారు. "ది లోక్సియన్ గేమ్స్" ఆరంభం మరియు సరికొత్త వెబ్సైట్ ఈ మధ్యనే విడుదలయ్యాయి. 2008 నవంబర్ 7లో, అండ్ వింటర్ కేం... విడుదలయ్యింది. ఈ సంకలనంలో క్రిస్టమస్ మరియు చలికాలం అంశాలు ఉన్నాయి. ఇది కూడా ఒక అంతర్జాతీయ హిట్, అనేక దేశాలలో మొదటి 10లో చేరింది, సీజనల్ ఆల్బంకు ఇది ఒక అసాధారణ విజయం.[ఆధారం కోరబడింది]
మార్చి 2009లో, వార్నర్ మ్యూజిక్ జపాన్ ఎన్య యొక్క మొదటి 4 ఆల్బంలను నూతన ఆకృతిలో విడుదల చేసింది, దానిని SHM-CD అని పిలిచారు. ఈ ఆకృతి మంచి శబ్ద నాణ్యతను మరియు ప్లేయర్ లో పెట్టినప్పుడు చదవడానికి మంచి డేటాను అందచేయటానికి అనుమతిస్తుంది. "ది సెల్ట్స్", "వాటర్‌మార్క్", "షెపార్డ్ మూన్స్" మరియు "ది మెమరీ ఆఫ్ ట్రీస్" నూతనంగా మెరుగుపరచబడినాయి మరియు మెరుగైన బోనస్ ట్రాక్లను కూడా పొందుపరచబడ్డాయి.ఈ డిస్క్లు నూతన సంకలన కళను తీసుకువచ్చాయి. "ది సెల్ట్స్" యొక్క మెరుగైన తర్జుమా కూడా అది ఎన్య పేరుతొ మొదట 1987లో విడుదలైనది మరియు "ఎన్య"కొరకు ఆరంభ సంకలనం కళను క్లిన్ డి'ఒయిల్ గా ఆమె మొదటి ఆల్బంలో ఎప్పటికీ పుస్తకంలో చేర్చబడింది.
23 నవంబర్ 2009న, ఎన్య ఒక నూతన సంకలనం ది వెరీ బెస్ట్ ఆఫ్ ఎన్య ను విడుదలచేసింది. 1988 నుండి 2008 వరకు ఉన్న విజయవంతమైన పాటలను పొందుపరచింది. దీనిలో నూతన పాటలు ఏమీ లేవు కేవలం ఇంతక్రితం విడుదల కాని "అనిరోన్" యొక్క ప్రత్యామ్నాయం ఉంది, దీని మూలాన్ని The Lord of the Rings: The Fellowship of the Ring యొక్క సౌండ్‌ట్రాక్ కొరకు పొందుపరచారు. ఒక డీలక్స్ ఎడిషన్ రకాన్ని DVDతో పాటు ఆమె వృత్తి జీవితంలోని అనేక విడియోలను మరియు బోనస్ చిత్ర స్థాయిని కలిగి ఉంది.
సంగీత శైలి మరియు ఇతర ప్రణాలికలు[మార్చు]
ఆమె సంగీతంలో చాలా వరకు సంప్రదాయ ఐరిష్, సెల్టిక్, మరియు శాస్త్రీయ సంగీతం యొక్క ప్రభావం కనిపిస్తుంది.[ఆధారం కోరబడింది] ఒక వాద్య బృందంగా ఎన్య ముగ్గురి మధ్య ఉన్న భాగస్వామ్యాన్ని తెలుపుతుంది: ఎన్య, ఈమె సంగీతం స్వరకల్పన చేసి ప్రదర్శిస్తుంది; నిక్కీ రయాన్, సంకలనాలను నిర్మిస్తారు; మరియు రోమ రయాన్, పాటలను గేలిక్‌లో కాకుండా మిగిలిన అనేక భాషలలో వ్రాస్తారు.[10] ఎన్య కచ్చితంగా తెలియచేయకపోతే తప్ప మిగిలిన సమయాలలో అన్ని పెర్కుషన్, సంగీత సాధనాలు, మరియు గాత్రాలను ఆమె పాటలలో ప్రదర్శిస్తుంది.[10] అయినప్పటికీ కొన్నింటిలో శబ్దమునకు సంబంధించిన సాధనాలను ప్రదర్శించారు, దాదాపు అన్ని శబ్దాలు సింతసైజర్ ద్వారా చేయబడతాయి. ఆమెకే సొంతమైన శబ్దాన్ని ఆమె గొంతు శబ్దాన్ని 80 సార్లు పెంచడం ద్వారా పొందవచ్చు.[26]
ఆమె సిగ్నేచర్ సౌండ్ విస్తారమైన అనేక-ట్రాకింగ్ గాత్రాల సులభమైన అమరిక ద్వారా పేరుగాంచింది. ఆమె ఒక ముఖాముఖిలో తెలుపుతూ ఆమె గొంతును 500 సార్లు డబ్బింగ్ చేసినట్టు తెలిపింది. ఈ గాత్రాల మీద ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా పనిచేస్తారు, మరియు వాటినన్నిటినీ ఒక వాస్తవ బృంద గీతంగా చేస్తారు, అయిననూ ఆ గొంతులన్నీ ఎన్యవే అవుతాయి. వాటర్‌మార్క్ సంకలనం యొక్క "కుర్సుం పెర్ఫిసియో"లో, ఎన్య ఇది ఒక మధ్య C దిగువున ఉన్న ఎనిమిదవ స్వరం Cని చేరింది. తరువాత ఆ పాటలో, ఆమె ఒక ఉచ్చ A-ఫ్లాట్ ను పద్యాన్ని మూడింతలు చేసే దాని పైన పాడింది.[27][28]
అమరన్‌టైన్ సంకలనంలో, ఎన్య జపనీస్ మరియు లోక్సియన్ భాషలలో పాడింది, ఈ భాషను రోమ రయాన్ కనుగొన్నారు.[10] అయితే ఆమె పాటలు చాలా వరకు ఆంగ్లంలోనే పాడబడినాయి, ఎన్య యొక్క కొన్ని పాటలు పూర్తిగా ఐరిష్ లేదా లాటిన్‌లో పాడబడినాయి. పూర్తిగా లేదా కొంతవరకు వెల్ష్, స్పానిష్, ఫ్రెంచ్, మరియు J. R. R. టోల్కీన్ సృష్టించిన భాషలలో వ్రాయబడిన పాటలను కూడా ఎన్య పాడారు. J. R. R. టోల్కీన్ యొక్క ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ కు సంబంధిత పాటలను ఎన్య పాడారు, ఇందులో 1991 యొక్క "లోత్లోరీన్" (వాద్య సంగీతం), 2001 యొక్క "మే ఇట్ బి" (దీనిని ఆంగ్లంలో మరియు క్వీన్యలో పాడారు), మరియు "అనిరోన్" (సిన్దరిన్ లో ఉంది)—చివరి రెంటినీ ఆమె స్వరపరచినప్పుడు, పీటర్ జాక్సన్ యొక్క చిత్రం ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది ఫెలోషిప్ ఆఫ్ ది రింగ్ లో కనిపించింది.
ఎన్య అనేక టెలివిజన్ కార్యక్రమాలలో, సమావేశాలలో మరియు వేడుకలలో అనేకమైన ప్రత్యక్ష ప్రదర్శనలను ఇచ్చారు, (ఆమె ఇటీవల కనిపించినది 2005 వేసవిలో గొత్ దొభైర్‌లో, ఇది లెటర్‌కెన్నిలో జరిగిన బ్రెన్నాన్ కుటుంబం అభినందన సభ ఒకే సమయంలో జరిగాయి), కానీ ఆమె ఇంకనూ సంగీత కచేరీ చేయవలసి ఉంది. ఆమె మాట్లాడుతూ, ఏదో ఒకనాడు కచేరీ చేయడం ఆమెకు ఇష్టమని మరియు అది గొప్ప సవాలని భావిస్తున్నట్టు తెలిపింది.
ఆమె గ్రామీలు "ఉత్తమ నవీన యుగం ఆల్బం"కు అయినప్పటికీ, ఎన్య మాత్రం ఆమె సంగీతం నవీన యుగం యొక్క కాలానికి చెందినదని వ్యక్తిగతంగా వర్గీకరణ చేయదు. ఏ కాలానికి ఆమె సంగీతం వర్తిస్తుందని అడిగినప్పుడు ఆమె సమాధానంగా "ఎన్య"అని తెలిపింది.[10]
ఎంపిక కాబడ్డ డిస్కోగ్రఫీ[మార్చు]
- సంకలనాలు, సింగిల్స్ మరియు పట్టికలో స్థానాల పూర్తి జాబితా కొరకు ఎన్య డిస్కోగ్రఫీ చూడండి.
DVD విడుదలలు[మార్చు]2000లో, వార్నర్ మ్యూజిక్ ఎన్య: ది వీడియో కలెక్షన్ ను DVDలో యూరోప్, దక్షిణ ఆఫ్రికా మరియు ఆసియాలో విడుదల చేసింది, ఇందులో "ఒరినోకో ఫ్లో" నుండి ఆనాటి దాకా అన్ని విడియోలను మరియు "వైల్డ్ చైల్డ్" కూడా పొందుపరచబడింది, కేవలం "బుక్ ఆఫ్ డేస్" నుండి తీసుకొనబడలేదు, ఫార్ అండ్ అవే చిత్రం నుండి వీడియో కొరకు యెంత ఉపయోగించాలి అనేదాని యొక్క అనుమతి ఇబ్బందుల కారణంగా దీనికి బదులుగా ప్రత్యక్ష TV ప్రదర్శనను ఉంచారు. మూన్‌షాడోస్ పేరుతో ముందుగా సేకరించిన విడియోల తరువాత ఇది విడుదల అయ్యింది, ఇది 1992లో VHS మరియు లేజర్‌డిస్క్ మీద విడుదలైనది. ఈ DVD విడుదలలో ముఖాముఖిలు మరియు రెండు విడియోలు తయారు చేయటంలో జరిగిన పనులు చేర్చబడినాయి. 2000-2001 సమయంలో అనేక సందర్భాలలో వీడియో కలెక్షన్ DVD యొక్క ఉత్తర అమెరికా (రీజన్ 1) విడుదలను ప్రకటించారు, కానీ అది జరగలేదు; దానికి కారణం ఎప్పుడూ అధికారికంగా తెలపలేదు. ఒక దశలో దేని విడుదల ఆలస్యం కావడానికి కారణం "మే ఇట్ బి" వీడియో చేరికను అనుమతించడానికేనని ప్రకటించారు, అయితే (ఇప్పుడు పనిచేయని) అభిమానుల సైట్లు ప్రకారం శబ్ద నాణ్యత సరిగా లేనందునే దాని విడుదలను వెనక్కు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపాయి. ఆసియా నుండి చట్టవిరుద్దమైన కాపీలు 2000 నాటి నుండి రీజన్ 1 యొక్క కొన్ని భాగాలలో రిటైల్ స్థాయిలో పంపిణీ కాబడ్డాయి. 2005 చివరి నాటికి కూడా ఆన్లైన్ పరిశోధకులు Amazon.com వంటివారు ఈ DVDని "త్వరలో రాబోతోంది" జాబితాలోనే చూపించటం కొనసాగించారు. నవంబర్ 2009లో, ది వెరీ బెస్ట్ ఆఫ్ ఎన్య సేకరణ విడుదల యొక్క డీలక్స్ తర్జుమాలో ఒక DVD బోనస్ డిస్క్ ఉంది, ఇందులో 2001 విడుదల నుండి చాలా వరకు (మొత్తం కాదు)సంగీత వీడియోలు ఉన్నాయి, ఆ విడుదల నుండి డాక్యుమెంటరీలతో పాటు మరియు 2001 తరువాత వచ్చిన ఎన్య సంకలనాలు ఉన్నాయి. ఈసారి DVD విడుదల (రీజన్ 0గా ఆకృతి చేసారు) ఉత్తర అమెరికాలో కూడా జరిగింది. వ్యక్తిగత జీవితం[మార్చు]కుటుంబ బ్యాండ్ క్లనాడ్ యొక్క సభ్యురాలిగా, ఎన్య నిర్మాత/మేనేజర్ నిక్కీ రయాన్‌తో స్నేహాన్ని యేర్పరుచుకుంది. ఏడు సంవత్సరాలు రయాన్‌తో పనిచేసిన తరువాత, క్లనాడ్ వేరొక నిర్మాత కొరకు చూడటం ఆరంభించింది. బ్యాండ్ యొక్క భవిష్య మార్కెటింగ్ గురించి విభేదాలు బృందంలో ఒక చెడిన చీలికకు దారితీసింది, దీనితో రయాన్ మరియు ఎన్య వారి సోలో వృత్తి జీవితం కొరకు బ్యాండ్ నుండి విడిపోయారు. చీలిక తరువాత, నిక్కి మరియు రోమ రయాన్‌తో ఎన్య కలిసి ఉంది మరియు ఒక చిన్న స్టూడియోను ఒక షెడ్డులో నిర్మించుకుంది. ఎన్య పియానో శిక్షణను ధనార్జన కొరకు ఇచ్చేది, అయితే రయాన్లు మాత్రం అవకాశం కొరకు వేచి ఉన్నారు. తరువాత BBC నుండి వచ్చిన పిలుపు ది సెల్ట్స్ టెలివిజన్ డాక్యుమెంటరీ ధారావాహికకు సంగీతం అందించటానికి దారితీసింది, మరియు అతిపెద్ద విజయం నిదానంగా అనుసరించింది. వాటర్‌మార్క్ తో ఆరంభమయ్యి, ఎన్య అనేక దొంగల దృష్టిని ఆకర్షించింది, అనేక మంది ఆమె కోటలోకి ప్రవేశించి ఆమె సిబ్బంది కొంత మంది మీద దాడి చేశారు.[29] ఫలితంగా, ఎన్య అంచనాల ప్రకారం €250,000లను కిల్లినీ, కౌంటీ డబ్లిన్ లోని ఆమె ఇల్లు మాన్డెర్లీ కాసిల్‌లో భద్రతా అవసరాలకు వెచ్చించింది, (ఈ పేరును ఆమె అభిమాన పుస్తకం మాక్సిం డె వింటర్'స్ హౌస్ మరియు బ్లాక్ అండ్ వైట్ చిత్రం రెబెక్కాతో కలిపి పెట్టబడింది).[10] 1996లో, డబ్లిన్‌లో ఆమె ఫోటోను మెడ చుట్టూ వేసుకున్న ఒక వ్యక్తిని గోత్ దొభైర్, కౌంటీ దొనెగల్ లోని ఆమె తల్లితండ్రుల పబ్ నుండి బయటకు త్రోసినపుడు అతనిని అతనే చంపుకున్నాడు.[10][22] 2006లో, వినోదాన్ని అందించే ధనిక ఐరిష్ వారిలో ఎన్య అంచనా ప్రకారం €109 మిల్లియన్ల ఆర్జనతో మూడవ స్థానంలో నిలిచారు (అనగా., £75 మిల్లియన్లు లేదా US$165 మిల్లియన్లు). ఇది ఆమెను 2006 యొక్క 250 ధనిక ఐరిష్ ప్రజల యొక్క సండే టైమ్స్ రిచ్ లిస్టులో ఆమెను 95వ స్థానానికి తీసుకువెళ్ళటానికి సరిపోతుంది.[30] ఎన్య పిల్లులను ప్రేమిస్తుంది. 1988లో ప్రచురితమైన ఒక ముఖాముఖిలో, పెంపుడు జంతువుల గురించి అడిగినప్పుడు, ఆమె సమాధానం ఇస్తూ: "నా దగ్గర ఒక పిల్లి ఉంది. నాకు పిల్లులంటే ప్రేమ; ఒక సందర్భంలో నా దగ్గర 12 పిల్లులు ఉన్నాయి. అది ఒక ఆనందాన్ని ఇస్తుంది. సూర్య కాంతిలో అవి పడుకొని ఉంటాయి మరియు పైకి వచ్చి నా మెడ చుట్టూ ఎక్కి ఉంటాయి."[31] ఎన్య యొక్క అభిమాన శాస్త్రీయ స్వరకర్త సెర్గీ రాచ్మన్ఇనోఫ్. ఆమె అలవాట్లలో శృంగార భరితమైన బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు చూడటం, కళా ఖండాలను సేకరించడం, చదవటం, మరియు వాటర్‌కలర్ చిత్రలేఖనం చేయడం ఉన్నాయి.[16] జనరంజక సంస్కృతి[మార్చు]సౌత్‌పార్క్ అనుకరణ[మార్చు]ఎన్య యొక్క సంగీత శైలి సౌత్ పార్క్ సీజన్ 1 భాగం డెత్‌లో అనుకరణ చేశారు. గ్రాండ్‌పా మార్ష్ భాగంలో అతను చనిపోవటానికి అతని మనవడి సహాయంకై ఒప్పించటానికి ప్రయత్నిస్తాడు. అతని వయసులో జీవించటం ఎలానో అతనికి చూపించటానికి అతని మనమడు స్టాన్‌ను ఒక గదిలో బంధిస్తాడు మరియు బలవంతంగా ఎన్య యొక్క ఒరినోకో ఫ్లో వంటిది వినేటట్లు చేస్తాడు. స్టాన్ వివరిస్తూ అది "చాలా భయంకరమైన, కృత్రిమమైన మరియు చవకరకంగా ఉంది...కానీ అదేసమయంలో అసాధారణమైన సొంపుగా ఉంది" మరియు దీని తరువాత అతని తాతను చంపటంలో సహాయం చేస్తానని ఒప్పుకుంటాడు. గుర్తింపుపొందిన పురస్కారాలు[మార్చు]నాలుగు నూతన యుగం సంకలనం కొరకు గ్రామీ పురస్కారాలను ఎన్య ఈనాటికి గెలుచుకుంది:
ఇంకనూ, "మే ఇట్ బి" ఉత్తమ పాటగా అకాడెమి పురస్కారం కొరకు 2002 ఉత్సవాల్లో ప్రతిపాదించబడింది, కానీ ఇది మోన్స్టర్స్, ఇంక్. రండీ న్యూమాన్ యొక్క పాట "ఇఫ్ ఐ డిడ్న్'ట్ హావ్ యు"తో ఓడిపోయింది. ఇవి కూడా చూడండి[మార్చు]సూచనలు[మార్చు]
బాహ్య లింకులు[మార్చు]వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
|
- All articles with dead external links
- Articles with dead external links from August 2009
- అనాథ పేజీలు from ఏప్రిల్ 2017
- Articles with invalid date parameter in template
- అన్ని అనాథ పేజీలు
- గూగుల్ అనువాద వ్యాసాలు
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- All articles with unsourced statements
- Articles with unsourced statements from December 2009
- Articles with unsourced statements from November 2007
- Articles with Open Directory Project links
- 1961 జననాలు
- 1980ల గాయకులు
- 1990 సంవత్సరపు గాయకులు
- 2000 సంవత్సరపు గాయకులు
- 2010 సంవత్సరపు గాయకులు
- సెల్టిక్ ఫ్యూజన్ సంగీతకారులు
- క్లాన్నాడ్
- ఎన్య
- గ్రామీ అవార్డు విజేతలు
- గ్వీడోర్
- ఐరిష్ మహిళా గాయనీమణులు
- ఐరిష్ జానపద గాయకులు
- ఐరిష్ పాప్ గాయకులు
- ఐరిష్ రోమన్ కాథలిక్స్
- ఐరిష్ గాయకుడు-పాట రచయితలు
- ఐరిష్-భాషా గాయకులు
- లాటిన్-భాషా గాయకులు
- జీవిస్తున్న ప్రజలు
- నూతన యుగం వాద్యకారులు
- డాల్కీతో సంబంధం ఉన్న ప్రజలు
- కౌంటీ దొనెగల్ నుండి ప్రజలు
- వార్నర్ సంగీత బృందం కళాకారులు
- మహిళలలో ప్రముఖులు
- వరల్డ్ మ్యూజిక్ పురస్కారాల విజేతలు