ఎన్.హెచ్. శివశంకర రెడ్డి
| ఎన్.హెచ్. శివశంకర రెడ్డి | |||
| పదవీ కాలం 2018 జూన్ 6 – 2019 జూలై 25 | |||
| ముందు | కృష్ణ బైరె గౌడ | ||
|---|---|---|---|
| తరువాత | లక్ష్మణ్ సవాడి | ||
| నియోజకవర్గం | గౌరీబిదనూరు | ||
| పదవీ కాలం 2013 మే 31 – 2018 మే 18 | |||
| ముందు | జి.హెచ్. తిప్పారెడ్డి | ||
| తరువాత | ఎం. కృష్ణ రెడ్డి | ||
| నియోజకవర్గం | గౌరీబిదనూరు | ||
| పదవీ కాలం 1999 – 2023 | |||
| ముందు | ఎన్. జ్యోతి రెడ్డి | ||
| తరువాత | కె.హెచ్. పుట్టస్వామి గౌడ | ||
| నియోజకవర్గం | గౌరీబిదనూరు | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1954 సెప్టెంబరు 24 హెచ్. నాగసాంద్ర, గౌరిబిదనూర్ | ||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ (2004 నుండి) | ||
| ఇతర రాజకీయ పార్టీలు | స్వతంత్ర (2004 వరకు) | ||
| జీవిత భాగస్వామి | సుజాతమ్మ | ||
| సంతానం | 2 | ||
నాగసంద్ర హనుమంత శివశంకర రెడ్డి కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు గౌరీబిదనూరు శాసనసభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]ఎన్.హెచ్. శివశంకర రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చి 1999 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో గౌరీబిదనూరు శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి 2004, 2008, 2013, 2018 శాసనసభ ఎన్నికలలో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభ డిప్యూటీ స్పీకర్గా, హెచ్.డి. కుమారస్వామి రెండవ మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పని చేశాడు.
ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అభ్యర్థి కె.హెచ్. పుట్టస్వామి గౌడ చేతిలో 37,286 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Farm loans from coop. societies to be waived in first phase: Reddy" (in Indian English). The Hindu. 20 August 2018. Archived from the original on 3 May 2025. Retrieved 3 May 2025.
- ↑ "Shivashankara Reddy elected Deputy Speaker" (in Indian English). The Hindu. 19 July 2013. Archived from the original on 3 May 2025. Retrieved 3 May 2025.
- ↑ "Karnataka Assembly Elections 2023: Gauribidanur". Election Commission of India. 13 May 2023. Archived from the original on 3 May 2025. Retrieved 3 May 2025.