ఎన్. ఎ. హారిస్
ఎన్. ఎ. హారిస్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2008 | |||
ముందు | ఎస్. రఘు | ||
---|---|---|---|
నియోజకవర్గం | శాంతి నగర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] భద్రావతి, కర్ణాటక, భారతదేశం | 1967 జనవరి 11 .||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | ![]() | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
నలపాడ్ అహ్మద్ హారిస్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు శాంతి నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]ఎన్. ఎ. హారిస్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2008 శాసనసభ ఎన్నికలలో శాంతి నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి డి.యూ. మల్లికార్జునపై 13,797 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2013 ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి కె. వాసుదేవ మూర్తిపై 20187 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
ఎన్. ఎ. హారిస్ 2018 శాసనసభ ఎన్నికలలో శాంతి నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కె. వాసుదేవమూర్తిపై 18,205 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై[2] బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పని చేశాడు.[3] ఆయన 2023 ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కె. శివకుమార్ పై 7,125 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[4][5] 2024 జనవరి 26న బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ "N.A.Haris,52nd birthday celebration with school students". YouTube.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ "BMTC chairman says there will be no hike in bus fares". The New Indian Express. Archived from the original on 19 January 2019. Retrieved 2020-02-12.
- ↑ "Election Commission of India". Archived from the original on 2023-06-02. Retrieved 2025-01-02.
- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
- ↑ "Karnataka: 34 MLAs made chiefs of boards, Shanti Nagar MLA gets BDA" (in ఇంగ్లీష్). The New Indian Express. 27 January 2024. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.