Jump to content

ఎన్. రామచందర్ రావు

వికీపీడియా నుండి
నారపరాజు రామచందర్ రావు
ఎన్. రామచందర్ రావు


సభ్యుడు ,బార్ కౌన్సిల్ అఫ్ ఇండియా
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014

మాజీ శాసనమండలి సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2015 - 2021
నియోజకవర్గం మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గం

హైదరాబాద్ జిల్లా బిజెపి అధ్యక్ష్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2017 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం (1959-04-27) 1959 ఏప్రిల్ 27 (వయసు 65)
హైదరాబాద్
జాతీయత  India
ఇతర రాజకీయ పార్టీలు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ఏబీవీపీ, భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి ఎన్. సావిత్రి
సంతానం అముక్త , అవనీష్
పూర్వ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్
వృత్తి న్యాయవాది & రాజకీయ నాయకుడు

నారపరాజు రామచందర్ రావు తెలంగాణ రాష్ట్ర చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ.

రాజకీయ జీవితం

[మార్చు]

ఎన్. రామచందర్ రావు భారతీయ జనతా పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ - రంగారెడ్డి - హైదరాబాద్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక 2014లో జరిగిన సెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టిఆర్ఎస్ అభ్యర్థి చింతల కనకారెడ్డి చేతిలో 2768 ఓట్ల తేడాతో ఓటమి చెందాడు.

ఎన్. రామచందర్ రావు 2015లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ - రంగారెడ్డి - హైదరాబాద్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టిఆర్ఎస్ అభ్యర్థి జి. దేవీప్రసాద్ రావు పై గెలిచి తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆయన 2018లో జరిగిన సెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టిఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు చేతిలో 73698 ఓట్ల తేడాతో ఓటమి చెందాడు.

ఎన్. రామచందర్ రావు 2021లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ - రంగారెడ్డి - హైదరాబాద్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టిఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణి దేవి చేతిలో ఓటమిపాలయ్యాడు.[1]

ఎన్. రాంచందర్ రావును 2024 జనవరి 08న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి బీజేపీ పార్టీ నియమించింది.[2]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 1977-80 ;అధ్యక్ష్యుడు స్టూడెంట్స్ యూనియన్, రైల్వే డిగ్రీ కాలేజీ
  • 1982-85 ; స్టూడెంట్స్ యూనియన్ కార్యదర్శి, ఉస్మానియా యూనివర్సిటీ
  • తొలి రాష్ట్ర కార్యదర్శి భారతీయ జనతా యువ మోర్చా
  • లీగల్ సెల్ కన్వీనర్ - భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ
  • లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ - భారతీయ జనతా పార్టీ జాతీయ శాఖ
  • 2008- — ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి
  • 2011-2013—ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
  • 2014 - సభ్యుడు, బార్ కౌన్సిల్ అఫ్ ఇండియా
  • 2015 - 2021 మాజీ ఎమ్మెల్సీ - మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గం [3]
  • 2017- అధ్యక్షుడు, హైదరాబాద్ జిల్లా బిజెపి [4]

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (23 March 2021). "Telangana Graduates' MLC polls: Defeated BJP MLC N Ramchander Rao demands CBI probe". Archived from the original on 2 August 2021. Retrieved 2 August 2021.
  2. Andhrajyothy (9 January 2024). "17 లోక్‌సభ స్థానాలకు బీజేపీ ఇన్‌చార్జిలు". Archived from the original on 9 January 2024. Retrieved 9 January 2024.
  3. Sakshi (26 March 2015). "టీఆర్‌ఎస్‌కు ఝలక్!". Archived from the original on 14 December 2021. Retrieved 14 December 2021.
  4. Sakshi (16 January 2017). "బీజేపీ నగర అధ్యక్షుడిగా రామచంద్రరావు". Sakshi. Archived from the original on 2 August 2021. Retrieved 2 August 2021.