ఎఫావిరెంజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
450px-Efavirenz skeletal.svg.png

Efavirenz, ఎఫావిరెంజ్ ( 4- (2-cyclopropylethynyl) -4- (trifluoromethyl) -2,4-dihydro-1H-3,1-benzoxazin-2-one, EFV, brand name Sustiva®) అనేది HIV-1 చికిత్సలో ఉపయోగించె non-nucleoside reverse transcriptase inhibitor (NNRTI) అనె తరగతికి చెందిన ఒకానొక ఔషదము.దీనికు EFV పొడిపేరు. ఇది FDA (Food and Drug Administration of USA ) వారిచే HIV మరియు 17-Sep-98 [1] రోజున అమోదించబడింది.

మోతాదు ( Dosage )[మార్చు]

ఎయిడ్స్
Red ribbon.png
ఉపశమన మందులు
స్టావుడిన్
లామివుడిన్
జిడోవుడిన్
డిడనొసిన్
అబాకవిర్
టెనొఫవిర్
ఎంట్రిసిటబిన్
నెవిరపిన్
ఎఫావిరెంజ్
ఇండినవిర్
అటాజనవిర్
రిటనోవిర్
లొపినవిర్
డారునవిర్
నెల్పినవిర్
సాక్వినవిర్

Efavirenz టాబ్లెట్లను తినకముందు రాత్రి సమయంలో వేసుకొవాలి ఈ మందును పిల్లలు కూడా వారి బరువును బట్టి తీసుకొనవచ్చును. ఈమందును ఒక్కదానినే వెసుకొకూడదు దీనితో NRTI కి చెందిన కనీసం రెండు మందులతొ కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు.ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపొతె గుర్తుకు వచ్చిన వెంబడె వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది. ప్రతి రోజు డొస్ 600mg రోజుకు ఒక సారి వేసుకోవాలి.

దుష్ప్రబావాలు (Side Effects )[మార్చు]

ఈ దుష్ప్రబావాలు [2] (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.

  1. మానసిక సమస్యలు: పని మీద ఎకాగ్రత పెట్టకపోవటం, నిద్ర రాక పోవటం, అత్మహత్య చేసుకొవాలి అన్న అలోచన రావటం, చిత్ర విచిత్ర మైనటువంటి కలలు, మగత, ఈ మందును పడుకునేముందు వేసుకొంటె కొన్ని దుష్ప్రభావాలను నివారించవచ్చు. మీకు నిరాశవాహ స్థితి, విపరీత అలోచనలు, కోపం లాంటివి వస్తె మీ డాక్టరుకు చెప్పండి. ఈ మందు మొదలుపెట్టిన కొన్ని వారాల్లో ఇవన్ని రావచ్చును ఆ తర్వాత క్రమంగా మాయమవుతాయి
  2. కాలేయ సమస్యలు: ఈ మందు వెసుకొనె వారిలో ప్రాణాంతకమైన కాలెయ సమస్యలు మొదటి ఆరు వారల్లో రావచ్చు. మహిళల్లో ముఖ్యంగా ఇది ఎక్కువ. మీ డాక్టరు ఎప్పటికప్పుడు మీ లివర్ ఎంజైములను (LFT's) టెస్ట్ చెస్తు మీ లివరు యొక్క పనితనాన్ని పరీక్షించవచ్చు. అలసట అకలి లేకపొవటం. కళ్ళు మరియు చర్మం పసుపు రంగులోనికి మారటం, తెల్లటి విరేచనాలు అయితే వెంబడె డాక్టరును సంప్రందించండి.
  3. ' చర్మం పైన దుద్దుర్లు సాధారణంగా ఈ మందు వాడె వారిలో కనిపిస్తుంది. కొన్ని సార్లు ఇది ప్రమాదకరంగా మారుతుంది, మరణం కూడా సంబవిచ్చవచ్చు. ఈ దుద్దుర్లు జ్యరం, నోతిపూత, కండరాలనొప్పితొ పాటు రావచ్చును. మొహం పైన వాపు కూడా రావచ్చును.

ఈ మందును ఎవరు వేసుకోకుడదంటె?[మార్చు]

ఈ మందును వెసుకునేముందు మీడాక్టరుకు చెప్పాల్సిన విషయాలు. మీకు ఎదైన లివర్ సమస్యలు ఇంతకు ముందు వచ్చివుంటె, ఈ మందును తీసుకొకపొవచ్చు లేదా ప్రత్యేక పర్యవేక్షణలో తీసుకొనవలసి ఉంటుంది. ఈ మందును దుష్ప్రబావాల వల్ల ఒకసారి అపివేసి వుంటె తిరిగి వెసుకోకూడదు.

గర్భవతి మహిళలు వేసుకొవచ్చా?[మార్చు]

ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి D గా వర్గీకరించబడ్డది. ముందు దీనికి ప్రెగ్నెన్సి తరగతి C గా ఉండేది. ప్రయోగ పరీక్షలలో తెలినది ఏమిటంటె గర్బం లోని పిండానికి తీవ్రమైన హాని చేకురుస్తుంది.గర్భవతి మహిళ ఈ మందును తీసుకొక పొవటం ఉత్తమం కనీసం గర్బం దాల్చిన మొదటి మూడు నెలలు దీనిని వెసుకోకుడదు. అలాగే బాలింత మహిళ పాలలో ఈ మందు ప్రాబవం పిల్లలపై వుంటుంది. అయితే HIV Positive గర్భవతి మహిళ తమ పిల్లలకు పాలు ఇవ్వకపొవడం మంచిది.

మూలాలు[మార్చు]