Jump to content

ఎమ్మా గోల్డ్ మేన్

వికీపీడియా నుండి
ఎమ్మా గోల్డ్ మేన్
ఎమ్మా గోల్డ్ మేన్, సుమారు 1911
జననం(1869-06-27)1869 జూన్ 27
కోవ్నో, రష్యా
మరణం1940 మే 14(1940-05-14) (వయసు 70)
టొరంటో, ఒంటరియో, కెనడా
తత్వ శాస్త్ర పాఠశాలలుఅరాజకవాదం
స్త్రీవాదం
ప్రభావితులు
ప్రభావితమైనవారు

ఎమ్మా గోల్డ్ మేన్ ( 1869 జూన్ 27 – 1940 మే 14) ప్రముఖ ఆరాకజవాద రాజకీయ కార్యకర్త, స్త్రీవాది, రచయిత్రి. 20వ శతబ్దం మొదటి భాగంలో ఉత్తర అమెరికాలోనూ, ఐరోపా లోనూ అరాజకవాదం అభివృద్ధి చెందడానికి ఈమె ఎంతో కృషి చేసింది.

అప్పటి రష్యన్ రాజ్యంలోని కోవ్నో (ప్రస్తుతం లిథూనియా లోని కౌనస్) లో 1869లో యూదుల కుటుంబంలో జన్మించింది ఎమ్మా. 1885లో వారి కుటుంబం అమెరికాకు వలస వెళ్ళిపోయారు.[2] అమెరికాలో 1886లో జరిగిన హేయ్ మార్కెట్ బాంబు దాడి జరిగిన తరువాత, ఎమ్మా అరాజకవాదానికి ఆకర్షితురాలైంది. ఆ తరువాత అరాజకవాద సిద్ధాంత రచయిత్రిగా, లెక్చరర్ గా మారిన ఆమె, కొద్ది రోజులకే ప్రముఖ రచయిత్రిగా ప్రసిద్ధి చెందింది. కేవలం అరాజకవాదంపైనే కాక, స్త్రీ హక్కుల గురించి, సామాజిక అంశాల గురించీ ఆమె చేసే ప్రసంగాలకు వేలాది మంది శ్రోతలు హాజరయేవారు.[2] ప్రముఖ అరాజకవాద రచయిత అలెగ్జాండర్ బెర్క్మెన్ ఆమె ప్రాణ స్నేహితుడు, ప్రేమికుడు. వారిద్దరూ కలసి హెంరీ క్లే ఫ్రిక్ అనే పారిశ్రామికవేత్త, ఫైనానిషియర్ ను చంపడానికి ప్రయత్నించారు. ఈ హత్య ద్వారా తమ సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలని వారి ఉద్దేశం. అయితే ఫ్రిక్ ఈ హత్యా ప్రయత్నం నుంచీ తప్పించుకోగలిగాడు. ఈ కేసులో కోర్టు బెర్క్మన్ కు 22ఏళ్ళ కారాగార శిక్ష విధించింది. ఆ తరువాత సంవత్సరాలలో అల్లర్లకు ప్రేరేపించడం, చట్టానికి విరుద్ధంగా కుటుంబ నియంత్రణ గురించి సమాచారం పంచడం వల్ల ఎమ్మా ఎన్నోసార్లు జైలు జీవితం అనుభవించింది. 1906లో, ఆమె మదర్ ఎర్త్ అనే అరాకజవాద సిద్ధాంత పత్రికను ప్రారంభించింది.

1917లో, కొత్తగా అమలులోకి వచ్చిన డ్రాఫ్ట్ అనే పథకానికి ఎవరూ నమోదు చేసుకోకుండా కుట్ర చేసినందుకుగానూ ఎమ్మా, బెర్క్మెన్ రెండేళ్ళ పాటు జైలు జీవితం అనుభవించారు. వారు జైలు నుండి విడుదలైన వెంటనే కొన్ని వందలమందితో కలిపి, తిరిగి అరెస్టు చేసి, రష్యాకు పంపేశారు. మొదట్లో అక్టోబర్ విప్లవానికి మద్దతు పలికింది ఎమ్మా. ఈ పరిణామాల కారణంగా విప్లవ నాయకుడు బోల్షెవిక్ పదవిలోకి వచ్చాడు. కానీ ఆ తరువాత బోల్షెవిక్ కు వ్యతిరేకంగా జరిగిన క్రోంస్టడ్ రెబెలియన్ అనే విప్లవాన్ని హింసాత్మక పద్ధతిలో అణిచివేయడానికి ప్రయత్నించడంతో ఎమ్మా కూడా తన మద్దతును వెనక్కి తీసుకుని, సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా విప్లవం ప్రారంభించింది. 1923లో, మై డిసిల్లజన్మెంట్ ఇన్ రష్యా అన్న పేరుతో రష్యాలోని తన అనుభవాల గురించి పుస్తకం రాసింది ఆమె. ఇంగ్లాండ్, కెనెడా, ఫ్రాన్స్ లలో నివసించే సమయంలో లివింగ్ మై లైఫ్ అనే ఆత్మకథ కూడా రాసింది ఎమ్మా. స్పెయిన్ లో అంతర్యుద్ధం మొదలైనప్పుడు స్పానిష్ విప్లవంలో పాల్గొని, సహాయం చేసేందుకు స్పెయిన్ కు వెళ్ళింది ఆమె. తన 70వ ఏట 1940, మే 14న కెనడాలోని టొరొంటోలో మరణించింది ఎమ్మా గోల్డ్ మేన్.

జీవిత చిత్రణ

[మార్చు]

కుటుంబం

[మార్చు]

ఎమ్మా రష్యా సామ్రాజ్యంలోని, కొవ్నోలో (ప్రస్తుతం లిథూనియా పట్టణంలో కౌనస్) ఒక సంప్రదాయ యూదు కుటుంబంలో జన్మించింది. [3] ఎమ్మా తల్లి టౌబే బైనొవిచ్ కు తన మొదటి భర్త ద్వారా 1860లో హెలీనా, 1862లో లీనా అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. టౌబే భర్త టి.బితో చనిపోవడంతో ఆమె పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎమ్మా ఒకచోట తన తల్లి గురించి రాస్తూ "తన 15వ ఏట పెళ్ళి చేసుకున్న ఆ యువకుని మరణంతోనే ఆమె లోని ప్రేమంతా చనిపోయింది. ఆమెకు తిరిగి ప్రేమ లభించనేలేదు." అని పేర్కొంది."[4]

ఎమ్మా తల్లి టౌబేకి ఆమె కుటుంబం మరో పెళ్ళి చేసింది. అది పెద్దలు కుదిర్చిన పెళ్ళి. ఎమ్మా ప్రకారం తన తల్లి రెండవ పెళ్ళికీ, మొదటి పెళ్ళికీ ఏ మాత్రం సంబంధం లేదు.[4] టౌబే రెండవ భర్త అబ్రహం గోల్డ్ మేన్, ఆమె ఆస్తినంతా వ్యాపారంలో పెట్టి, నష్టపోయాడు. ఈ పరిణామం ఆ భార్యా, భర్తల మధ్య దూరాన్ని పెంచడమే కాక, ఇంట్లో పిల్లల పరిస్థితి మరింత దారుణంగా మార్చేసింది. టౌబే గర్భం దాల్చినప్పుడు ఆమె భర్త, తమకు మగపిల్లవాడే పుట్టాలనీ, ఆడపిల్ల పుట్టడం అంటే మరో నష్టమేననీ భావించాడు. కానీ ఈసారి వారికి ఎమ్మా గోల్డ్ మేన్ జన్మించింది. అయితే ఆమె తరువాత వారికి ముగ్గురు మగపిల్లలు జన్మించారు.[5]

మూలాలు

[మార్చు]
  1. Diggs, Nancy Brown (1998). Steel Butterflies: Japanese Women and the American Experience. Albany: State Univ. of New York Press. p. 99. ISBN 0791436233. Like other radicals of the time, Noe Itō was most influenced by none other than Emma Goldman.
  2. 2.0 2.1 University of Illinois at Chicago Biography of Emma Goldman Archived సెప్టెంబరు 11, 2013 at the Wayback Machine. UIC Library Emma Goldman Collection. Retrieved on December 13, 2008.
  3. Goldman, Living, p. 24.
  4. 4.0 4.1 Goldman, Living, p. 447.
  5. The order of birth is unclear; Wexler (in Intimate, p. 13) notes that although Goldman writes of herself as her mother's fourth child, her brother Louis (who died at the age of six) was probably born after her.