ఎమ్మా (నవల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Emma
EmmaTitlePage.jpg
Title page from the first edition
రచయితJane Austen
దేశంUnited Kingdom
భాషEnglish
శైలిNovel
ప్రచురణ కర్తJohn Murray
ప్రచురణ తేదిDecember 1815;
title page says 1816
Media typePrint
ISBNN/A

ఎమ్మా అనే నవల జెన్ ఆస్టేన్‌చే రాయబడింది. అపార్థం చేసుకోబడిన ప్రణయం యొక్క ప్రమాదాల గురించి ఈ నవల వివరిస్తుంది. ఈ నవల మొదటిసారిగా 1815 డిసెంబరులో ప్రచురితమైంది. తన ఇతర నవలల్లో మాదిరిగానే,జార్జియన్‌-రీజెన్సీ ఇంగ్లాండ్‌‌లో నివసించే ఒక ఆడంబరవంతురాలైన మహిళ యొక్క సమస్యలు, ఇబ్బందులు గురించి ఆస్టేన్ ఈ నవలలో ప్రస్తావించింది; దీంతోపాటు తాను ఎంచుకున్న పాత్రల మధ్య ఒక ఉల్లాసభరితమైన సభ్యతతో కూడిన హాస్యాన్ని కూడా ఆమె సృష్టించింది.

నవల ప్రారంభానికి ముందు, "ఎవరూ ఎరగని ఒక కథానాయకను ఎంచుకునేందుకు నేను వెళ్తున్నాను. అయితే, నాకు మాత్రం ఆమెంటే చాలా ఇష్టం" అని ఆస్టేన్ ముందుమాటగా రాసింది.[1] ఈ నవల ప్రారంభ వాక్యంలో "ఎమ్మా ఉడ్‌హౌస్, అందమైనది, తెలివైనది, మరియు ధనవంతురాలు" అంటూ ప్రధాన పాత్ర గురించి ఆస్టేన్ పరిచయం చేసింది. అయినప్పటికీ,ఎమ్మా కూడా కొంతవరకు నాశనం అయ్యింది; పెళ్ళి సంబంధాలు కుదిర్చే విషయంలో తన సొంత సామర్థ్యాల గురించి ఆమె మహా అతిగా అంచనా వేసుకుంటుంది; ఇతరుల జీవితాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవడం వల్ల కలిగే ప్రమాదాలను గుర్తించడంలో ఆమె గుడ్డిగా ఉండిపోతుంది. అలాగే తరచూ ఆమె ఇతరుల చర్యల యొక్క అర్థాల గురించి పొరబాటు పడుతుంటుంది.

కథా సారాంశం[మార్చు]

హైబరీ గ్రామంలో నివసించే పరిపక్వ వయసులో ఉండే ఇరవై ఏళ్ల ఎమ్మా వుడ్‌హౌస్, జీవితంలో పెళ్ళి చేసుకోరాదని తనకు తాను నచ్చజెప్పుకున్నప్పటికీ, ప్రేమ సంబంధాల విషయంలో గారడీ చేయగలగడం తనకు స్వాభావికంగా లభించిన బహుమతి అని ఆమె తన గురించి తాను గొప్పగా ఊహించుకుంటుంది. తనకు పాఠాలు చెప్పే పంతులమ్మకు, గ్రామీణ ప్రాంతానికి చెందిన భార్యా వియోగుడైన మిస్టర్ వెస్టన్‌కు మధ్య పెళ్ళి సంబంధం కుదరడం తన ఘనతేనని స్వీయ-నిర్ణయానికి వచ్చిన ఎమ్మా, తన కొత్త స్నేహితురాలు హ్యారియెట్ స్మిత్‌ కోసం అర్హతకలిగిన సంబంధం వెతికేందుకు సిద్ధపడుతుంది. హ్యారియెట్ తల్లితండ్రుల గురించి తెలియనప్పటికీ, గౌరవవంతుడైన వ్యక్తికి భార్య కాగల అర్హత నీకు ఉందంటూ హ్యారియెట్‌ను ఒప్పించడంతో పాటు, తన స్నేహితురాలి చూపులను గ్రామ పురోహితుడైన మిస్టర్ ఎల్టన్‌పై పడేలా చేస్తుంది. మరోవైపు, హ్యారియెట్ మనసులో చోటు దక్కించుకున్న ఐశ్వర్యవంతుడైన రైతు రాబర్ట్ మార్టిన్ ప్రతిపాదనను తిరస్కరించమని కూడా ఎమ్మా ఆమెకు నచ్చజెపుతుంది.

ఎమ్మా ప్రోద్భలంతో మిస్టర్ ఎల్టన్‌ను హ్యారియెట్ మోహించడం మొదలుపెడుతుంది. అయితే, తాను ఇష్టపడుతున్నది ఎమ్మానే తప్ప హ్యారియెట్‌ను కాదని ఎల్టన్ స్పష్టం చేయడంతో ఎమ్మా ప్రణాళికలన్నీ తప్పుదోవ పడుతాయి. దీంతో హ్యారియెట్‌కు సంబంధం కల్పించే దిశగా తాను చూపిన ఆత్రుత, నిజమైన పరిస్థితి స్వభావాన్ని అర్థం చేసుకునే విషయంలో తనని గుడ్డిదాన్ని చేసిందనే విషయాన్ని ఎమ్మా గ్రహిస్తుంది. ఎమ్మాకు బావ, ఐశ్వర్యవంతుడైన స్నేహితుడు అయిన మిస్టర్ నైట్లే, సంబంధాలను కలిపేందుకు ఎమ్మా చేస్తున్న ప్రయత్నాలను విమర్మనాత్మక దృష్టితో చూస్తుంటాడు. మరోవైపు మిస్టర్ మార్టిన్ అన్ని అర్హతలు కలిగిన యువకుడని, అతన్ని పెళ్ళి చెసుకోవడం హ్యారియెట్‌ భాగ్యమని అతను విశ్వసిస్తుంటాడు. అందుకే ఎమ్మా తొందరపాటు విషయమై అతను, ఎమ్మాతో గొడవపడుతుంటాడు. అదేసమయంలో హ్యారియెట్, మిస్టర్ మార్టిన్‌ల జంట అన్ని విధాల సరిజోడనే విషయాన్ని మిస్టర్ నైట్లే రుజువుచేస్తాడు. ఇదిలా ఉంటే, ఎమ్మాచే నిరాకరించబడడంతో పాటు హ్యారియెట్ మాత్రమే అతని సరిజోడని ఎమ్మా చేసిన వ్యాఖ్యలతో ఎల్టన్‌ తీవ్రమైన కోపానికి గురవుతాడు. దీంతో వీలైనంత తొందరగా ఒక యువతిని పెళ్ళి చేసుకుతీరాలని నిర్ణయించుకున్న అతను బాత్ నగరానికి బయలుదేరుతాడు.

దీంతో హ్యారియెట్‌కు సౌకర్యంగా ఉండేలా మరో సంబంధం వెతికేందుకు సిద్ధమైన ఎమ్మాకు హైబరీలో కొత్త సందర్శకుడు, మిస్టర్ వెస్టన్ కుమారుడు అయిన ఫ్రాంక్ చర్చిల్‌ తారసపడుతాడు. ఇక ఫ్రాంక్ విషయానికి వస్తే తండ్రిని కలుసుకోవడం కోసం అతను హైబరీ చేరుకుంటాడు. చిన్నప్పుడే ఫ్రాంక్‌ను అతని అత్త, మామలు దత్తత చేసుకోవడం వల్ల అతను లండన్‌లో పెరిగి పెద్దవుతాడు. దీనివల్ల ఫ్రాంక్ గురించి ఎమ్మాకు ఎలాంటి విషయాలు తెలియవు. మరోవైపు ఫ్రాంక్ సైతం తన అత్త అనారోగ్యం, ఆమె చేసే ఫిర్యాదుల కారణంగా చాలాకాలం పాటు తన తండ్రిని కలుసుకునేందుకు భయపడుతాడు. అదేసమయంలో ఫ్రాంక్‌ను తొలిచూపులోనే నైట్లే అనుమానిస్తాడు, ప్రత్యేకించి అతను కేవలం జుట్టు కత్తరించుకోవడానికి తిరిగి లండన్ వెళ్లడం నైట్లే అనుమానానికి మరింత ఊతమిస్తుంది. అయినప్పటికీ, ఎమ్మా మాత్రం ఫ్రాంక్‌లోని సంతోషాన్ని గుర్తించడంతో పాటు, అతని మోహపు చూపులన్ని నేరుగా తన వైపే ఉండడాన్ని కూడా గ్రహిస్తుంది. అయినప్పటికీ, ఎమ్మా మాత్రం ఫ్రాంక్ వ్యామోహాన్ని నిరుత్సాహపరిచేందుకు ప్రయత్నిస్తుంది. మరోవైపు ఆ యువకునితో సరసాలడడం, ముఖస్తుతి చేయడం లాంటి విషయాల వైపు తాను ఆకర్షితమవుతుండడాన్ని ఆమె గుర్తిస్తుంది. అందుకే, తక్కువ ఉత్సుకతతో హైబరీకి మరొకరిని జతచేసినందుకు జెన్ ఫైర్‌ఫాక్స్ ని ఎమ్మా అభినందిస్తుంది. జెన్ అందమైనది, పరిపక్వత కలిగిన స్త్రీ, అయితే, ఎమ్మా మాత్రం ఆమెను ఇష్టపడదు. జెన్ యొక్క ప్రత్యేకంగా ఉండే తత్వం మరియు, పరోక్షమైన ఆరోపణలు లాంటివి ఇందుకు కారణం. దీంతో పాటు జెన్‌పై ఆమె అసూయతో ఉండడం కూడా ఇందుకు కారణమవుతుంది.

అనుమానం, కుట్ర, అపార్థాలు లాంటివి సంభవిస్తాయి. ఆసమయంలో జెన్‌ను రక్షించిన మిస్టర్ నైట్లే, దయకు ఆమె యోగ్యురాలని చెబుతాడు. ఎందుకంటే, ఎమ్మాలా ఆమెకు స్వతంత్రమైన సంపదలేదు అలాగే పాఠాలు చెప్పే ఉద్యోగం కోసం త్వరలోనే ఆమె తప్పకుండా ఇల్లు విడిచి వెళ్లాల్సి ఉందని అతను చెబుతాడు. జెన్‌ రక్షణ విషయంలో మిస్టర్ నైట్లే చూపే మనోద్రేకం శృంగారపరమైన భావనల వల్లే వచ్చిందని, ఎమ్మా అతన్ని నిరాకరించడం వల్లే అతనిలో ఆరకమైన భావన ఏర్పడిందని మిస్సెస్ వెస్టన్ అనుమానిస్తుంది. మరోవైపు ఫ్రాంక్, ఎమ్మాల మధ్య బంధం ఏర్పడిందని ప్రతి ఒక్కరు భావిస్తారు, అయితే, ప్రభావవంతమైన వ్యక్తిగా ఫ్రాంక్‌ను త్వరలోనే ఎమ్మా తిరస్కరించడంతో పాటు, హ్యారియెట్ కోసం చూస్తున్న సరిజోడు వ్యక్తిగా మాత్రమే అతన్ని ఊహించుకుంటుంది. ఒక కార్యక్రమం సందర్భంగా, హ్యారియెట్‌తో డాన్స్ చేసేందుకు నైట్లే, ఎమ్మా అనుమతి సంపాదిస్తాడు, మరోవైపు మిస్టర్ ఎల్టన్, అతని కొత్త భార్య కారణంగా హ్యారియెట్ అనుమానాలు పొందుతుంది. ఆ మరుసటి రోజు, హ్యారియెట్‌ని జిప్పీ యాచకుల బారినుంచి ఫ్రాంక్ రక్షిస్తాడు. అదేసమయంలో తన సామాజిక హోదా కంటే, ఉన్నత స్థానంలో ఉన్న ఒక వ్యక్తితో తాను ప్రేమలో పడ్డాననే విషయాన్ని హ్యారియెట్, ఎమ్మాకు చెబుతుంది. దీంతో హ్యారియెట్ ప్రేమలో పడింది ఫ్రాంక్‌తోనేనని ఎమ్మా నమ్ముతుంది. మరోవైపు ఫ్రాంక్, జెన్‌లు రహస్య అవగాహనతో ఉన్నారని నైట్లే అనుమానించడం ప్రారంభిస్తాడు, అలాగే ఈ విషయమై ఎమ్మాను హెచ్చరించేందుకు అతను ప్రయత్నిస్తాడు. నైట్లే సలహాలు విని ఎమ్మా నవ్వుతుంది, దీంతోపాటు ఫ్రాంక్‌తో ఆమె సరసమాడడం ప్రారంభించడంతో నైట్లే సలహా వృధా అవుతుంది. అలాగే ఒక పిక్నిక్‌లో భాగంగా దయాహృదయం కలిగిన బ్రహ్మచారిణి, జెన్ యొక్క అత్త అయిన మిస్ బేట్స్ ని ఎమ్మా అవమానిస్తుంది. దీంతో నైట్లే ఎమ్మాను బాగా చీవాట్లు పెట్టడంతో ఆమె ఎడుస్తుంది.

ఇంతలో ఫ్రాంక్ యొక్క అత్త చనిపోయిందనే వార్త వస్తుంది. ఈ సంఘటనతో ఏమాత్రం ఊహించని ఒక విషయం వెలుగులోకి రావడంతో పాటు అది నెమ్మదిగా అన్ని రకాల మిస్టరీలను పరిష్కరిస్తుంది. ఫ్రాంక్ అండ్ జెన్‌లు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుని ఉంటారు; ఫ్రాంక్ ధ్యాస ఎమ్మాపై నిలపడం అనేది అతని నిజమైన ప్రాధాన్యతను మరుగుపర్చేందుకు అతను ఉపయోగించిన ఒక తెరలాంటిది. అతని అత్త మరణంతో, అతని మామ ఆమోదంతో తాను ప్రేమించిన జెన్‌నే పెళ్ళి చేసుకునేందుకు ఫ్రాంక్ సిద్ధమవుతాడు. ఈ నేపథ్యంలో హ్యారియెట్ జీవితం అణిచివేయబడిందని ఎమ్మా దిగులు చెందుతుంది. అయితే, తన మనసులో ఉన్నది ఫ్రాంక్ కాదని, తాను ఇష్టపడుతున్నది నైట్లేని అని హ్యారియెట్ ఆ తర్వాత చెబుతుంది. నైట్లే మాత్రమే తన భావాలను పంచుకోగలడని హ్యారియెట్ విశ్వసించడమే ఇందుకు కారణం. అయితే, నైట్లేను తాను ప్రేమిస్తున్నానని హ్యారియెట్ చెప్పడంతో ఎమ్మా ఒక్కసారిగా తల్లడిల్లి పోతుంది. ఆసమయంలో ఆమె మనసులో ఉప్పొంగిన బాధ ఆమె నైట్లేను ప్రేమిస్తున్న సంగతిని ఆమెకు తెలియజేస్తుంది. అదేసమయంలో నైట్లే సైతం తాను హ్యారియెట్‌ను ప్రేమిస్తున్నానని చెబుతాడని ఎమ్మా భావిస్తుంది. అయితే, తాను ప్రేమిస్తున్నది ఎమ్మాని అని నైట్లే చెప్పడంతో ఆమె సంతోషపడుతుంది. మరోవైపు రాబర్ట్ మార్టిన్ నుంచి హ్యారియెట్‌కు రెండోసారి ప్రేమ ప్రతిపాదన రాగా, ఆమె దానిని ఆమోదిస్తుంది. చివరకు ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారనే ప్రశ్నలకు సమాధానం దొరకడంతో పాటు హ్యారియెట్ మరియు మిస్టర్ మార్టిన్, ఎమ్మా మరియు మిస్టర్ నైట్లేలు వివాహాం చేసుకోవడంతో ఈ నవల సుఖాంతమౌతుంది.

ప్రధాన పాత్రలు[మార్చు]

ఎమ్మా వుడ్‌హౌస్, కథలో ప్రధాన పాత్ర అయిన ఈమె, అందమైనది,అధిక-ఉత్సాహవంతురాలు, తెలివైనది, మరియు 'కొంచెం' నాశనమైన 21 ఏళ్ల యువతి. చిన్నతనంలోనే ఆమె తల్లి మరణిస్తుంది, మరోవైపు ఆమె పెద్ద సోదరి కూడా వివాహం చేసుకుని వెళ్లిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పటినుంచి ఆమె ఇంటి యజమానురాలుగా మారుతుంది. అదేసమయంలో అనేక మార్గాల్లో ఆమె వయసుకు మించిన పక్వతకు చేరుకుంటుంది, అయితే, కొన్ని సమయాల్లో ఆమె తీవ్రమైన పొరబాట్లు చేస్తుంది, ఎప్పుడైనా సరే తన నిర్ణయాలు సరైనవని ఆమె స్థిరంగా నమ్మడం, మరోవైపు నిజమైన ప్రపంచపు అనుభవాలు లేకపోవడం అనే కారణాల వల్లే ఆమె ఆ విధంగా చేస్తుంది. మరోవైపు ఎప్పటికీ పెళ్ళి చేసుకోరాదని ఆమె గట్టిగా నిర్ణయించుకున్నప్పటికీ, ఇతరుకు పెళ్ళి సంబంధాలు కుదిర్చే విషయంలో మాత్రం ఆమె ఆనందం పొందుతుంది. మిస్టర్ నైట్లే తనను ఎల్లవేళలా ప్రేమిస్తున్నాడనే విషయాన్ని గ్రహించే వరకూ ఆమె ప్రేమలో పడే అవకాశమే లేదన్నట్టుగా కనిపిస్తుంది.

జార్జ్ నైట్లే, 37 లేదా 38 ఏళ్ల వ్యక్తి. ఎమ్మాకు దగ్గరి స్నేహితుడైన నైట్లే, ఎమ్మాను విమర్శించే ఒకే ఒక వ్యక్తి అయినప్పటికీ, ఆమె విషయంలో అత్యంత జాగ్రత తీసుకుంటుంటాడు. డాన్‌వెల్ యొక్క ఎస్టేట్‌కు పొరుగున ఉన్న మరో ఎస్టేట్‌కు మిస్టర్ నైట్లే యజమాని, ఈ ఎస్టేట్‌లో పెద్ద సంఖ్యలో భూములతో పాటు ఒక ఫాం కూడా ఉంటుంది. ఎమ్మా సోదరి అయిన ఇసాబెల్లా భర్త మిస్టర్ జాన్ నైట్లేకి ఇతను అన్న. మిస్టర్ మార్టిన్‌ను ద్వేషించమంటూ హ్యారియెట్‌ను సమ్మతింపజేసే విషయంలో ఎమ్మా చూపే చొరవను మిస్టర్ నైట్లే ద్వేషిస్తుంటాడు, ఎమ్మా చర్యలన్నీ హ్యారియెట్‌కు అనుకూలంగా మారగలదని అతను ఆలోచించడమే అందుకు కారణం; హ్యారియెట్‌కు మిస్టర్ ఎల్టన్‌తో సంబంధం కుదిర్చే విషయంలో అతను ఎమ్మాను హెచ్చరిస్తుంటాడు, ఎందుకంటే ఎల్టన్ దృష్టి మొత్తం హ్యారియెట్ కంటే, ఎమ్మా పైనే ఉందనే విషయాన్ని అతను సరిగ్గా అంచనా వేస్తాడు. ఫ్రాంక్ చర్చిల్‌ను, అతని ఉద్దేశ్యాలను నైట్లే అనుమానిస్తాడు; ఆ యువకునిపై ఉన్న ఈర్ష భావమే నైట్లే అనుమానానికి ప్రధానంగా కారమైనప్పటికీ, ఫ్రాంక్ చర్చిల్ పైకి కనబడేంత మంచివాడు కాదనే విషయం తెలియడంతో నైట్లే అనుమానాలు సరైనవేననే విషయం నిర్థారణవుతుంది.

మిస్టర్ ఫ్రాంక్ చర్చిల్, మిస్టర్ వెస్టన్ మొదటి భార్య కుమారుడు, సౌందర్యవంతుడైన చర్చిల్, ఒక్క మిస్టర్ నైట్లేకు తప్ప మిగిలిన వారందరికీ ఇష్టమైన వ్యక్తిగా ఉంటాడు,ఫ్రాంక్ ఒక పక్వత చెందని యువకుడని నైట్లే భావిస్తాడు. ఎమ్మాను ఫ్రాంక్ 'వెంబడిస్తున్నాడు' అని భావించడం కూడా అతని విషయంలో నైట్లే ఈర్షకు లోను కావడానికి పాక్షికంగా కారణమవుతుంది. ఫ్రాంక్‌ చిన్నతనంలోనే తల్లి మరణించడంతో అతను ధనవంతులైన తన అత్త, మామల వద్ద పెరిగి పెద్దవుతాడు, ఈ కారణంగానే అతను తన మామ, అత్తల పేరునే చివరిపేరుగా ఎంచుకుంటాడు. డాన్స్, సంగీతాలను ఇష్టపడే ఫ్రాంక్, జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తుంటాడు. ఫ్రాంక్ పాత్ర నిర్లక్ష్యం కలిగిన వ్యక్తిగా చిత్రించబడినప్పటికీ,ఆస్టేన్ ఇతర నవలలైన ప్రైడ్ అండ్ ప్రెజూడిక్‌ లోని మిస్టర్ మిక్‌హామ్ పాత్ర లేదా సెన్స్ అండ్ సెన్సిబిలిటీ లోని విల్లోబే పాత్రల కంటే తక్కువ దుష్ట లక్షణాలు కలిగినదిగా ఉంటుంది.

జెన్ ఫైర్‌ఫాక్స్, అనాథ అయిన ఈమెకు మిస్ బేట్స్ అనే అత్త, మిస్సెస్ బేట్స్ అనే ఒక బామ్మ మాత్రమే ఉంటారు. చక్కని నడవడికతో పాటు బాగా చదువుకున్న, పాటలు పాడడంలో పియానో వాయించడంలో నైపుణ్యం కలిగిన జెన్ అందమైన, తెలివైన, సొగసైన స్త్రీగా పరిగణించబడుతుంటుంది; నిజానికి ఈ కథలో ఎమ్మా ఈర్షకు గురైన ఎకైక వ్యక్తి జెన్‌ మాత్రమే. జెన్‌ తక్కువ సంపద మాత్రమే కలిగి ఉన్నప్పటికీ, మరియు ఉపాధ్యాయురాలు కావాలని ముందుగానే నిర్ణయింపబడినప్పటికీ, ఆమె మాత్రం దానిపై విముఖత కలిగి ఉంటుంది.

హ్యారియెట్ స్మిత్, చిన్న వయసు అమ్మాయి అయిన ఈమె ఎమ్మా స్నేహితురాలు, అందమైనదే అయినప్పటికీ,నిష్కపటురాలు కావడంతో ఇతరుల మాటలకు ప్రత్యేకించి ఎమ్మా మాటలకు అత్యంత సులభంగా ప్రభావితమౌతుంది; దగ్గర్లోని పాఠశాలలో చదువుకుంటుంటుంది. ప్రాథమికంగా ఎవరని తెలియని తల్లితండ్రులకు పుట్టిన అక్రమ సంతానంగా స్మిత్ గుర్తించబడుతుంటుంది, అయితే, బాగా ధనికుడు, హోదా కలిగిన ఒక వ్యాపారవేత్త అయినప్పటికీ, "సుగుణవంతుడు" కాని ఒక వ్యక్తి కూతురే ఈ స్మిత్ అనే విషయం ఈ నవల చివరి అధ్యాయంలో బహిర్గతమౌతుంది. ఈ నవల ప్రారంభంలోనే హ్యారియెట్‌ను ఎమ్మా తన ప్రభావంలోకి తీసుకుంటుంది. అలాగే, సంబంధాలు కుదిర్చే విషయంలో తప్పుదోవ పట్టిన ఎమ్మా ప్రయత్నాలకు హ్యారియెట్ ఒక పావుగా మారుతుంది. అంతేకాకుండా, ఎమ్మా ప్రోద్భలం కారణంగానే రాబర్ట్ మార్టిన్ అనే రైతు నుంచి వచ్చిన పెళ్ళి ప్రతిపాదనను సైతం హ్యారియెట్ మొదట్లో తిరస్కరిస్తుంది. హ్యారియెట్ కంటే, అతను తక్కువ స్థాయి వ్యక్తి అని ఎమ్మా చెప్పడంతో తన అనుమానాస్పద మూలాలను సైతం మర్చిపోయి హ్యారియెట్ ఈ రకమైన నిర్ణయం తీసుకుంటుంది. దీని తర్వాత ఆమె మిస్టర్ నైట్లే విషయంలో మోజు పెంచుకుంటుంది. ఈ సంఘటనతో ఎమ్మా తన సొంత భావాలను అర్థం చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. చివరకు ఎమ్మా ప్రమేయాన్ని తోసిపుచ్చి మరీ హ్యారియెట్, మిస్టర్ మార్టిన్‌లు వివాహం చేసుకుంటారు.

ఫిలిప్ ఎల్టన్ చూడ చక్కనైన, సత్ప్రవర్తన కలిగిన మరియు ఆశాపూరితుడైన యువ పురోహితుడు. హ్యారియెట్‌ను వివాహం చేసుకోవాల్సిందిగా ఎమ్మా అతనిని కోరుతుంది; అయితే అతను మాత్రం ఎమ్మాను పెళ్ళి చేసుకోవాలని కోరుకుంటాడు. అయితే, ఎమ్మా అతని కోరికను తిరస్కరించడంతో వెంటనే మరో స్త్రీని పెళ్లాడడం ద్వారా మిస్టర్ ఎల్టన్‌కున్న ధన వ్యామోహం బట్టబయలవుతుంది.

అగస్టా ఎల్టన్, అంతకుముందు మిస్ హాకిన్స్ గా పేరున్న ఈమె, మిస్టర్ ఎల్టన్ విషయంలో ధనాగారం లాంటిది. అయితే, చెడ్డ భార్యగా పేరు తెచ్చుకుంటుంది. బడాయి, ఎవరినీ లెక్కచేయనితనం, ఆడంబరపూరిత స్వభావం కలిగిన స్త్రీ అయిన అగస్టా, ప్రతి విషయంలో తానే కేంద్ర బిందువు కావాలని కోరుకుంటుంది. అందుకే ఎమ్మా, ఆమెకు సంబంధించిన వారికి అగస్టా అంటే ఏమాత్రం నచ్చదు. అయితే, జెన్ ద్వారా ఈ పాత్ర చిత్రీకరించబడిన తీరు ఇతరుల యొక్క సానుభూతిని సంపాదించుకునేలా చేస్తుంది.

మిసెస్స్ అన్నే వెస్టన్, పెళ్ళికి ముందు మిస్ టెయిలర్‌గా పేరున్న ఈమె, పదహారేళ్ల పాటు ఎమ్మాకు పాఠాలు చెప్పే పంతులమ్మగా పనిచేస్తుంది. అటుపై ఎమ్మాకు దగ్గరి స్నేహితురాలిగాను,అంతరంగికురాలిగాను మారుతుంది. ఈ నవల మొదటి అధ్యాయంలో ఆమె మిస్టర్ వెస్టన్‌ను వివాహం చేసుకుంటుంది. వివేకవంతురాలైన ఈమె, ఎమ్మాను ఆరాధిస్తుంటుంది. మిస్సెస్ వెస్టన్ తన మాజీ యజమానురాలికి సంరక్షక తల్లిగా నడుచుకుంటుంది. అలాగే, అప్పుడప్పుడు మధ్యేమార్గం, తర్కంతో వాదించే వ్యక్తిగా ప్రవర్తిస్తుంది.

మిస్టర్ వెస్టన్, సమీపకాలంలో ధనికుడైన ఇతను హార్ట్ ఫీల్డ్ యొక్క పరిసర ప్రాతంలో నివసిస్తుంటాడు. ఎమ్మాకు పంతులమ్మగా పనిచేసిన మిస్ టెయిలర్‌ను ఇతను వివాహం చేసుకుంటాడు, అయితే, ఇతనికి జరిగిన మొదటి వివాహం వల్ల ఫ్రాంక్ చర్చిల్ జన్మిస్తాడు, తల్లి చనిపోవడం వల్ల చర్చిల్ తన తల్లి సోదరుడు, వదినల ద్వారా దత్తత తీసుకోబడి వారివద్దే పెరిగి పెద్దవుతాడు. మిస్టర్ వెస్టన్ ఎల్లప్పుడూ విశ్వాసపూర్వక, ఆశాపూర్వక వ్యక్తిగా ఉండడంతో పాటు, ఉమ్మడి ఆస్తులను అనుభవిస్తుంటాడు.

మిస్ బేట్స్, స్నేహపూర్వకమైన, అతివాగుడు స్వభావం కలిగిన ఈ పెళ్ళికాని అమ్మాయి తల్లి అయిన మిస్సెస్ బేట్స్, మిస్టర్ వుడ్‌హౌస్‌కు స్నేహితురాలు. బంధువైన జెన్ ఫైర్‌ఫాక్స్, ఈమె జీవితానికి వెలుగులా ఉంటుంది. మిస్ బేట్స్ రోజంతా గ్రామంలో గడిపిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఎమ్మా ఆమెను కించపరిచిన సమయంలో జెన్ కలగజేసుకుని బేట్స్ గురించి వివరిస్తుంది. దీని తర్వాత, ఎమ్మాను మిస్టర్ నైట్లే కఠినంగా చీవాట్లు పెడుతాడు. దీంతో అవమానం పొందిన ఎమ్మా తన తప్పుకు పరిహారం కోసం ప్రయత్నిస్తుంది.

హెన్రీ వుడ్‌హౌస్, ఎమ్మాకు తండ్రి అయిన ఇతను ఎల్లప్పుడూ తన ఆరోగ్యం, సౌకర్యం గురించే ఆందోళన చెందుతుంటాడు, అదేసమయంలో అతని స్నేహితుల యొక్క ఆరోగ్యం, సౌకర్యం విషయంలో మాత్రం అతను అదే తీరుగా ప్రవర్తించడు. ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం విషయంలో అనేక విషయాలు అపాకరమైనవని అతను భావిస్తుంటాడు, దీంతోపాటు సాధారణంగానే అతను ఒక విభిన్నమైన వ్యక్తి కావడం వల్ల అతనితో వ్యవహరించడం కష్టంగా ఉంటుంది. అతనికి కష్టం కలిగించే అల్పమైన విషయాల గురించి అతను ఎల్లప్పుడు గొడవ చేయడమే ఇందుకు కారణం. తక్కినవారి విషయంలోనూ అదే రకమైన ఇబ్బంది గురించి ఊహించడం వల్ల తనను సందర్శించడానికి వచ్చే వారు తెచ్చే ఆహారాన్ని అతను నిరాకరిస్తుంటాడు. పేద ఐసాబెల్లా మరియు ముఖ్యంగా పేద మిస్ టైలర్ వివాహం చేసుకోవడం, వారిని తనకు దూరంగా తీసుకెళ్లడం పట్ల అతను విచారం వ్యక్తం చేస్తాడు, వారు తన వద్ద నుంచి వెళ్లిపోవడంపై అసంతృప్తితో ఉండటం వలన, వారు అందుకు దయనీయమైన పరిస్థితులు ఎదుర్కొంటారని అతను భావిస్తాడు.

ఇసాబెల్లా వుడ్‌హౌస్, ఎమ్మాకు పెద్ద సోదరి అయిన ఈమె హెన్రీకి కూతురు. జాన్ నైట్లేని వివాహం చేసుకునే ఇషాబెల్లా, తన ఇద్దరు కుమారులు హెన్రీ, లిటిల్ జాన్‌ల పెంపకంలో భాగంగా ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతుంటుంది.

జాన్ నైట్లే, ఇసాబెల్లాకు భర్త అయిన ఇతను జార్జ్ నైట్లేకి తమ్ముడు. జెన్ ఫైర్‌ఫాక్స్ కు ఇతను పాత పరిచయస్థుడు. ప్రత్యేకించి వాతావరణం మామూలు కంటే, బాగోలేనప్పుడు, ఇంటివద్దే ఉండడానికి ప్రాముఖ్యమిచ్చే వ్యక్తి అయినప్పటికీ, సందర్శనలు, సెలవురోజులను బయట గడపడం లాంటి తన కుటుంబం యొక్క కోరికలను అతను తప్పక మన్నిస్తుంటాడు.

విమర్శలు మరియు నేపథ్యాలు[మార్చు]

ఆస్టేన్‌ కథానాయకల్లో ఆర్థికపరమైన ఆందోళనలు లేని మొదటి కథానాయక ఎమ్మా వుడ్‌హౌస్, దీన్ని ఆమె కపటం లేని మిస్ స్మిత్‌కు తెలియజేస్తుంది. ఈ కారణంగానే ఆమె వివాహా విషయంలో ఆసక్తి ప్రదర్శించదు. ఆస్టేన్ యొక్క ఇతర నవలల నుంచి ఇదొక గొప్ప నిష్క్రమణ, ఎందుకంటే, ఆమె రాసిన ఇతర నవలల్లోని కథాంశాల్లో వివాహం, ఆర్థిక భద్రత కోసం అన్వేషించడమనేది తరచూ ముఖ్యమైన నేపథ్యంగా కనిపిస్తుంది. ఈ నవలలో ఎమ్మా యొక్క పుష్కలమైన ఆర్థిక వనరులనేవి ఈ రకమైన కారకాల్లో ఒకటి, ఈ కారణంగానే ఈ నవల ఆస్టేన్ యొక్క గత నవలలైన సెన్స్ అండ్ సెన్సిబిలిటీ, ప్రైడ్ అండ్ ప్రెజూడిక్‌ ల కంటే, మరింత సున్నితమైనదిగా తయారైంది. జెన్ ఫైర్‌ఫాక్స్ యొక్క ఆకాంక్షలు, వ్యత్యాసం లాంటివి నిరాధారమైనవి.

ఆస్టేన్ నవలల్లో చోటు చేసుకున్న ఇతర కథానాయకలతో పోలిస్తే ఎమ్మా శృంగారపరమైన ఆకర్షణకు వ్యతిరేకంగా ఉంటుంది. మంచి వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడానికి ముందు ఒక చెడ్డ వ్యక్తి పట్ల ఆకర్షితమయ్యే మరియన్ డాష్‌వుడ్‌లా కాకుండా, ఎమ్మా తన జీవితంలో ఎదురయ్యే మగవారి పట్ల ఎలాంటి శృంగారపరమైన ఆకర్షణను వ్యక్తం చేయదు. ఆమెపై తనకున్న ప్రేమ గురించి మిస్టర్ ఎల్టన్ వ్యక్తం చేసిన సమయంలో ఎమ్మా నిజాయితీతో కూడిన ఆశ్చర్యాన్ని (కొంతవరకు విసుగును) మాత్రమే వ్యక్తం చేస్తుంది. ఆస్టేన్ మరో నవలలోని కథానాయక ఎలిజబెత్ బెన్నెట్,తనపై ఉన్న ప్రేమ గురించి మిస్టర్ కొలిన్స్ చెప్పిన సమయంలో అతిశయమైన రీతిలో ప్రతిస్పందించినట్లుగా ఈ నవలలో ఎమ్మా స్పందించదు. ఫ్రాంక్ చర్చిల్ పట్ల ఎమ్మాకు ఉండే భావం, శృంగారపరమైన ప్రేమ కోసం కంటే, తన జీవితంలోని చిన్న నాటకం కోసం మాత్రమే ఆమె అతనిపై ఆసక్తి ప్రదర్శిస్తోందనే విషయాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రత్యేకించి, హ్యారియట్ స్మిత్, రాబర్ట్ మార్టిన్‌ల మధ్య చిగురించే ప్రేమను అర్థం చేసుకునే విషయంలో ఎమ్మా ఘోరంగా విఫలమౌతుంది; ఆర్థిక పరిష్కారాలు మరియు సామాజిక లక్ష్యం ప్రాతిపదికగా ఆమె సంభావ్య పోలికను వివరించింది. మిస్టర్ నైట్లే విషయంలో హ్యారియట్ స్మిత్ తన అభిరుచిని బహిరంగపర్చిన తర్వాత మాత్రమే ఎమ్మా తన సొంత భావాల గురించి తెలుసుకుంటుంది.

ఆస్టేన్ ఇతర కథానాయకలతో పోలిస్తే, ఈ రెండు విషయాల్లో ఎమ్మా ప్రధానంగా విభేదిస్తుంది, అయితే, మరో మార్గంలో ఆమె ఆస్టేన్ ఇతర కథానాయకలైన ఎలిజబెత్ బెన్నెట్, అన్నే ఎల్లియట్‌లను పోలి ఉంటుంది: తక్కువ పని మాత్రమే కలిగిన ఒక తెలివైన, వయసులో ఉన్న స్త్రీ అయిన ఎమ్మాకు తన పరిసరాన్ని లేదా రోజువారీ పనిని మార్చుకునే సామర్థ్యం ఉండదు. ఆమె కుటుంబం ప్రేమగలదైనప్పటికీ మరియు ఆమె ఆర్థిక హోదా భద్రతనిచ్చినప్పటికీ, ఎమ్మా రోజువారీ జీవితం వాస్తవంగా నిస్తేజంగా ఉంటుంది; నవల ప్రారంభంలో ఆమె తన సరి వయసు నేస్తాలను కొద్ది సంఖ్యలో మాత్రమే కలిగి ఉంటుంది. అయినప్పటికీ, ఆమె పనికిమాలిన పెళ్ళి సంబంధాలను నిర్ణయించడమనేది ప్రత్యేకించి ఒంటరిగా, పిల్లలు లేకుండా ఉండే ఒక ధనిక మహిళ జీవితం యొక్క సంకుచిత ఉద్దేశ్యానికి వ్యతిరేకంగా మౌనమైన ఆక్షేపణ వ్యక్తం చేయడాన్ని ప్రతిబింబిస్తుంది.

చలనచిత్రం మరియు టెలివిజన్ రూపాంతరాలు[మార్చు]

అనేక రూపాంతరాలకు ఎమ్మా కథాంశంగా మారింది:[2]

 • 1948: ఎమ్మా
 • 1972: ఎమ్మా (BBC 1972 టెలివిజన్‌), డొరన్ గాడ్‌విన్ ఎమ్మాగా నటించారు.
 • 1995: క్లూలెస్‌ (ఒక బలహీనమైన ఆధునిక రూపాంతరం), చెర్ హోరోవిట్జ్ (ఎమ్మా)గా అలిసియా సిల్వర్‌స్టోన్‌ నటించారు.
 • 1996: ఎమ్మా, ఎమ్మాగా జ్వెనెత్‌ పాల్ట్రో ఎమ్మాగా నటించారు.
 • 1996: ఎమ్మా, కేట్ బెకిన్‌సేల్ ఎమ్మాగా నటించారు.
 • 2009: ఎమ్మా, రోమోలా గరాయ్ ఎమ్మాగా నటించారు.
 • 2010: ఆయేషా, సోనమ్ కపూర్ ఐషా (ఎమ్మా - హిందీ భాష వెర్షన్) గా నటించారు, రేహా కపూర్ నిర్మాత[3]
 • 2010: ఎమ్మా, సరాహ్ కాటన్ ఎమ్మాగా నటించారు.

ప్రజాదరణ సంస్కృతిలో ఎమ్మా[మార్చు]

 • మైక్ లెయిగ్ రూపొందించిన నేక్డ్ (1993)చిత్రంలో ఎమ్మా నవల ఇతివృత్తం కనిపిస్తుంది. అందులోని జానీ పాత్ర (డేవిడ్ దెవ్లిస్ ఈ ప్రాత పోషించాడు)శీర్షికను, రచయిత పేరును తికమకకు గురిచేస్తుంది.
 • అమీ హెకెర్‌లింగ్ ద్వారా రూపొందిన క్లూలెస్ (1995)చిత్రంలోని ప్రధాన కథాంశానికి ఎమ్మా ఆధారంగా నిలిచింది. ఎలిసియా సిల్వర్‌స్టోన్ ద్వారా ఈ పాత్ర పోషించబడింది.
 • జోన్ ఎయికెన్, జెన్ ఫైర్‌ఫాక్స్: ది సీక్రెట్ స్టోరీ ఆఫ్ ది సెకండ్ హీరోయిన్ ఇన్ ఆస్టేన్స్ ఎమ్మా పేరుతో తోడుగా ఉండే వ్యక్తిని గురించిన నవల రాశారు.
 • రెజినాల్ట్ హిల్ రాసిన ఒక 1987 సంక్షిప్త కథ "పూర్ ఎమ్మా" (2007 పేపర్‌బ్యాక్‌ దేర్ యార్ నో గోస్ట్ ఇన్ ది సోవియట్ యూనియన్లో ఇది చేర్చబడింది) లో నిధులు, భద్రత లాంటివి కీలక పాత్ర పోషిస్తాయి.
 • ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎమ్మా, అనే నవల జూలియట్ ఆర్చర్‌చే రాయబడింది, ఇది ఎమ్మాకు ఆధునిక వెర్షన్.
 • ఎమ్మా అండ్ ది వేర్‌వాల్వ్స్: జెన్ ఆస్టేన్ అండ్ ఆడమ్ రాన్, అనే మస్‌అప్ నవల ఆడమ్ రాన్‌చే రాయబడింది. మస్‌అప్ నవల అనేది అసలు ఆధారానికి సంబంధించిన కథనాన్ని, రచయిత పేరును కలిగి ఉంటుంది.కాపీరైట్ ద్వారా ఒక కథను ఎక్కువ కాలం రక్షించలేక పోవడం వల్ల ఇలా జరుగుతుంది. అలాగే, కొత్త (మస్‌అప్‌)కథను సృష్టించడం కోసం అసలు కథకు కొనసాగింపుగా మరి కొంత కొత్త కథను జోడించడం జరుగుతుంది. ప్రత్యేకించి, మస్‌అప్ కథ అనేది అసలు కథకు ముగింపుగా ఉంటుంది. దీంతోపాటు, అసలు కథ యొక్క రచయిత పేరును మస్‌అప్ పబ్లిషర్ ముద్రించడం జరుగుతుంది. అప్రమాణికమైన ఈ ప్రక్రియలో భాగంగా మస్‌రూప్ నవలలో అసలు రచయిత పేరు సంయుక్త రచయిత లేదా సహకారుడు రూపంలో చోటు చేసుకుంటుంది.
 • జ్వెనెత్ పాల్ట్రో 1996 సినిమాలో ఎమ్మాగా నటించారు.
 • పుస్తకం ఆధారంగా రూపొందించిన 2009 BBC సిరీస్‌లో రోమోలా గరాయ్ ఎమ్మాగా నటించారు.
 • న్యూయార్ సిటీలోని ఒక పేరు చెప్పని ప్రెప్ పాఠశాల గురించి ఆండ్రివ్ ట్రీస్' రాసిన "అకాడమీ X," నవలలోని ఇతివృత్తం మొత్తం "ఎమ్మా"ను ఉపయోగించుకుంటుంది. ఇందులో ప్రధాన పాత్ర అయిన జాన్, ఇంగ్లీష్ విభాగానికి అధిపతిగా ఉండడంతో పాటు, తన సీనియర్ లిటరేచర్ తరగతిలో "ఎమ్మా"ను బోధిస్తుంటుంది. ఇక క్యాటలిన్ పాత్రకు సంబంధించిన చూపులు, ధనం, పాఠశాలలోని సామాజిక క్రమానుగత శ్రేణిలో ఉన్నత స్థానాన్ని కలిగి ఉండడం ద్వారా తరచూ ఆ పాత్ర కథానాయకతో పోల్చబడుతుంది.
 • బాలీవుడ్ చిత్రం ఆయేషా (2010) సైతం ఎమ్మాకు ఒక అనువర్తనం.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • కాల్పానికంలోని అసంబద్దత

గమనికలు[మార్చు]

 1. ఆస్టేన్-లెయిగ్, జేమ్స్ ఎడ్వర్డ్. ఏ మెమోయిర్ ఆఫ్ జేన్ ఆస్టేన్ . 1926. Ed. R. W. చాప్‌మ్యాన్. ఆక్స్ ఫర్డ్: ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, 1967. పుట. 157
 2. ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Jane Austen పేజీ
 3. "క్యాస్టింగ్ అనౌన్స్ డ్ ఫర్ BBC ఒన్స్ ఎమ్మా దిస్ ఆటం" అట్ BBC ఒన్ (4 ఏప్రిల్ 2009)

బాహ్య లింకులు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

మూస:Jane Austen