Jump to content

ఎం.ఎ.రహ్మాన్

వికీపీడియా నుండి
(ఎమ్.ఎ.రెహమాన్ నుండి దారిమార్పు చెందింది)
ఎం.ఎ.రహ్మాన్
వృత్తిఛాయాగ్రాహకుడు
క్రియాశీల సంవత్సరాలు1941-1987
జీవిత సహచరిబళ్ళారి లలిత
పురస్కారాలురఘుపతి వెంకయ్య అవార్డు (1983)

ఎం.ఎ.రహ్మాన్ భారతదేశం గర్వించదగిన చలనచిత్ర ఛాయాగ్రాహకులలో ఒకడు. ఇతని కృషికి గుర్తింపుగా 1983లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతడిని రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు 1914 మార్చి 14న ఔరంగాబాదులో జన్మించాడు. ఇతడికి మొదటినుండి సినిమాటోగ్రఫీ పట్ల అభిరుచి ఎక్కువగా ఉండేది. ఇతడు తన 19వ యేట చలనచిత్ర ఛాయాగ్రాహకుడు జోషి వద్ద కెమెరా బాయ్‌గా పనిచేశాడు. తరువాత ఇతర కెమెరామెన్‌ల వద్ద మూకీ చిత్రాలకు పనిచేసి అనుభవం గడించాడు. 1934లో బెంగళూరులోని సూర్యా ఫిలిం కంపెనీలో చేరి అనేక చిత్రాలకు పనిచేశాడు. తరువాత ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీలో మూకీ కెమెరా మెన్‌గా చేరాడు. అప్పట్లో అద్భుతమైన ట్రిక్ ఫోటోగ్రఫీతో అనేక స్టంట్ చిత్రాలు విజయవంతం అయ్యేందుకు ఎంతో కృషి చేశాడు. ట్రిక్ ఫోటోగ్రఫీలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు. నలుపు తెలుపు ఛాయాగ్రహణంలో ఇతని పరిజ్ఞానానికి అనేక తెలుగు, తమిళ చిత్రాలే నిదర్శనం. అనేక దశాబ్దాల పాటు సినీ ఛాయాచిత్ర కళలో వివిధ రకాల ప్రయోగాలు చేసి ఎంతోమందికి మార్గదర్శకుడయ్యాడు.[1]

సినిమాలు

[మార్చు]

ఇతడు ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన కొన్ని తెలుగు సినిమాలు:[2]

విడుదలైన సంవత్సరంసినిమా పేరుదర్శకుడుఇతర వివరాలు
1941భక్తిమాలహరిలాల్ దేశాయ్
1943భాగ్యలక్ష్మిపి. పుల్లయ్య
1949మన దేశంఎల్.వి.ప్రసాద్
1950లక్ష్మమ్మత్రిపురనేని గోపీచంద్
1950సంసారంఎల్.వి.ప్రసాద్
1951పేరంటాలుత్రిపురనేని గోపీచంద్
1952దాసిసి.వి.రంగనాథ దాసు
1953నా ఇల్లుచిత్తూరు నాగయ్య
1953పిచ్చి పుల్లయ్యతాతినేని ప్రకాశరావు
1954తోడుదొంగలుడి.యోగానంద్
1955జయసింహడి.యోగానంద్
1955విజయగౌరిడి.యోగానంద్
1955సంతానంసి.వి.రంగనాథ దాసు
1956సాహస వీరుడుడి.యోగానంద్మదురై వీరన్ అనే తమిళ సినిమా డబ్బింగ్
1957పాండురంగ మహత్యంకమలాకర కామేశ్వరరావు
1957సువర్ణసుందరివేదాంతం రాఘవయ్య
1958రాజనందినివేదాంతం రాఘవయ్య
1959కృష్ణలీలలుజంపన చంద్రశేఖరరావు
1959రేచుక్క-పగటిచుక్కకమలాకర కామేశ్వరరావు
1960దేసింగురాజు కథటి.ఆర్.రఘునాథ్రాజా దేసింగు అనే తమిళచిత్రానికి డబ్బింగ్
1962భీష్మబి.ఎ.సుబ్బారావు
1963నర్తనశాలకమలాకర కామేశ్వరరావు
1963మంచి చెడుటి.ఆర్.రామన్న
1963వాల్మీకిసి.యస్.రావు
1965ప్రమీలార్జునీయముఎం.మల్లికార్జునరావురవికాంత్ నగాయిచ్, మాధవ్ బుల్‌బులేలతో కలిసి
1966శకుంతలకమలాకర కామేశ్వరరావు
1967కాలచక్రంటి.ఆర్.రామన్నపణం పడైతవన్ అనే తమిళ సినిమా డబ్బింగ్
1967కొంటెపిల్లటి.ఆర్.రామన్నపారక్కం పావై అనే తమిళ సినిమా డబ్బింగ్
1975బాగ్దాద్ వీరుడుటి.ఆర్.రామన్నబాగ్దాద్ పెరళగి అనే తమిళ సినిమా డబ్బింగ్
1978మేలుకొలుపుబి.వి.ప్రసాద్
1978శ్రీరామ పట్టాభిషేకంఎన్.టి.రామారావు
1979మా వారి మంచితనంబి.ఎ.సుబ్బారావు
1979శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణంఎన్.టి.రామారావు
1979శ్రీమద్విరాట పర్వముఎన్.టి.రామారావు

పురస్కారాలు, సత్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ↑ కమీషనర్. నంది అవార్డు విజేతల పరంపర (1964-2008) (PDF) (1 ed.). హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార పౌరసంబంధాల శాఖ. pp. 71–72. Retrieved 30 September 2022.
  2. ↑ వెబ్ మాస్టర్. "All Movies M.A. Rahman". ఇండియన్ సినిమా. Retrieved 30 September 2022.

బయటిలింకులు

[మార్చు]