ఎయిర్ ఫోర్స్ వన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అమెరికా సంయుక్త రాష్ట్రాలు అధ్యక్షుడు ప్రయాణించే అమెరికా వైమానిక దళానికి చెందిన విమానం యొక్క అధికారిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కాల్ సైన్‌ను (పిలిచే పేరును) ఎయిర్ ఫోర్స్ వన్ అంటారు.[1] 1990 నుంచి, అధ్యక్షుని ప్రయాణాలకు ఉపయోగించే ప్రత్యేక విమాన దళంలో, ప్రత్యేకంగా నిర్మించిన, అత్యాధునిక సౌకర్యాలు ఉన్న రెండు బోయింగ్ 747-200 బి శ్రేణి విమానాలు ఉన్నాయి, ఇవి "విసి-25ఎ" అనే వైమానిదళ హోదాతో, "28000" మరియు "29000" సీరియల్ నెంబర్లు కలిగివున్నాయి. అధ్యక్షుడు ప్రయాణిస్తున్న సమయంలో మాత్రమే ఈ విమానాన్ని "ఎయిర్ ఫోర్స్ వన్" అనే పేరుతో పిలుస్తారు, యునైటెడ్ స్టేట్స్ వైమానిక దళం కేవలం అధ్యక్షుడి ప్రయాణాలకు మాత్రమే ఉపయోగిస్తున్న మరియు నిర్వహిస్తున్న విమానాల్లో దేనినైనా అనధికారికంగా ఈ పేరుతో పిలుస్తారు, అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఇతర అదనపు విమానాన్ని పిలిచేందుకు కూడా ఈ పేరును ఉపయోగిస్తారు.విమానాన్ని కిందకు దింపకుండా ముందు తెచ్చుకున్న ఇంధనాన్ని ఆకాశం మధ్యలో కూడా నింపుకునే సౌకర్యం ఈ విమానంలో ఉంది. దానివల్ల అత్యవసర పరిస్థితుల్లో ఎంతసేపైనా గాల్లోనే ఉండొచ్చు. ఒకసారి ట్యాంకు నిండా ఇంధనాన్ని నింపితే సగం ప్రపంచాన్ని చుట్టే సామర్థ్యం ఈ విమానం సొంతం. దీని పరిధి అపరిమితం. అత్యాధునిక రాడార్లు సైతం దీని ప్రయాణ మార్గాన్ని గుర్తించలేవు. విమానంలో నాలుగు వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఉన్న మూడు అంతస్తులు ఉంటాయి. ఒకేసారి వందమందికి వండిపెట్ట గల కిచెన్, ప్రత్యేక ఆఫీస్‌రూం, డైనింగ్ గది లాంటి సౌకర్యాలూ ఉన్నాయి. ఒక గంట సేపు ఇది గాల్లో ఎగరాలంటే సుమారు కోటి రూపాయలు ఖర్చవుతుంది. ఈ విమానం ఖరీదు సుమారు రూ.1600 కోట్లు[2]

అమెరికన్ అధ్యక్ష పదవి మరియు దాని యొక్క శక్తికి ఎయిర్ ఫోర్స్ వన్‌ను ఒక ముఖ్యమైన చిహ్నంగా చెప్పవచ్చు.[3] ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ మరియు అత్యధికంగా ఛాయచిత్రాలు తీయబడిన వాటిలో ఈ విమానం కూడా ఒకటి.[4]

చరిత్ర[మార్చు]

1910 అక్టోబరు 11న, థెయోడోర్ రూజ్‌వెల్ట్ విమానంలో ప్రయాణించిన మొదటి అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడిగా గుర్తింపు పొందారు, అయితే ఆ సమయంలో అందుబాటులో ఉన్న ప్రారంభ రైట్ ఫ్లైయర్ విమానంలో ఆయన కిన్‌లోచ్ క్షేత్రంలో (మిస్సోరీలోని సెయింట్ లూయిస్ సమీపంలో) ప్రయాణించారు, అయితే ఆయన ఆ సమయంలో అధ్యక్ష పదవిలో లేరు, విలియం హార్వర్డ్ టాఫ్ట్, ఆయన తరువాత అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఏదేమైనప్పటికీ, ఒక దేశీయ ప్రదర్శనలో వీక్షకులు చూస్తుండగా కొద్ది సమయంపాటు గాలిలో ప్రయాణించడం ద్వారా ఆయన రికార్డు సృష్టించారు, ఈ సందర్భం అమెరికా అధ్యక్షుల వాయు ప్రయాణాలకు ఆరంభంగా నిలిచింది.[5]

రెండో ప్రపంచ యుద్ధానికి ముందు, అధ్యక్షుడి విదేశీ మరియు దేశవ్యాప్త పర్యటనలు చాలా అరుదుగా జరిగేవి. వైర్‌లెస్ టెలీకమ్యూనికేషన్ మరియు త్వరిత రవాణా సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో దూర-ప్రయాణాలు అసాధ్యంగా ఉండేవి, ఎందుకంటే ఇటువంటి ప్రయాణాలకు ఎక్కువ సమయం తీసుకోవడంతోపాటు, వాషింగ్టన్, డి.సి.లో అధ్యక్ష కార్యకలాపాలు నిలిచిపోతాయి, అయితే డగ్లస్ డిసి-3 వంటి విమానం అందుబాటులోకి రావడంతో, వాయు ప్రయాణాన్ని ఒక యోగ్యమైన రవాణా మార్గంగా పరిగణిస్తున్న అమెరికా ప్రజల సంఖ్య బాగా పెరిగింది. పూర్తిస్థాయి లోహ విమానం, మరింత ఆధారపడదగిన ఇంజిన్లు మరియు మార్గనిర్దేశానికి కొత్త రేడియో సదుపాయాలు వ్యాపార విమాన ప్రయాణాలను సురక్షితం మరియు బాగా సౌకర్యవంతం చేశాయి. జీవిత భీమా కంపెనీలు కూడా విమాన పైలెట్‌లకు భీమా పాలసీలు అందించడం ప్రారంభించాయి, బాగా ఎక్కువస్థాయిలో ప్రయాణ ఖర్చులు ఉన్నప్పటికీ, అనేక మంది వ్యాపార ప్రయాణికులు మరియు ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా దూర ప్రయాణాలకు రైలు కంటే విమానాలు ఉపయోగించడం ప్రారంభించారు.

అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగుతూ, విమానంలో ప్రయాణించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ గుర్తింపు పొందారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా, మెక్సికోలో జరిగిన 1943నాటి కాసాబ్లాంకా సదస్సుకు హాజరయ్యేందుకు డిక్సీ క్లిప్పర్ అనే పేరు గల పాన్-అమెరికా సిబ్బంది ఉన్న బోయింగ్ 314 ఫ్లైయింగ్ బోట్ (విమానం)లో రూజ్‌వెల్ట్ ప్రయాణించారు, ఈ విమానం ఆ సందర్భంలో 5,500 మైళ్లు (ఇది మూడు "చక్రాలు" కలిగివుంది) ప్రయాణించింది.[6] అట్లాంటిక్ యుద్ధంలో పాలుపుంచుకుంటున్న జర్మనీ జలాంతర్గాముల నుంచి ముప్పు ఉన్న కారణంగా అట్లాంటిక్ మహాసముద్రంపై విమాన ప్రయాణం ఉత్తమైన మార్గంగా పరిగణించబడింది.[7]

అధ్యక్షుడు ఫ్లాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ యొక్క సి-54 స్కైమాస్టర్ విమానం, దీని ముద్దుపేరు "ది సాక్రెడ్ కౌ".

మొదటి అధ్యక్షుడు ప్రయాణ విమానం[మార్చు]

అధ్యక్షుడి ప్రయాణానికి వ్యాపార విమానయాన సంస్థలపై ఆధారపడటంపై ఆందోళన వ్యక్తమవడంతో, కమాండర్ ఇన్ చీఫ్ (అధ్యక్షుడు) అవసరాలకు తగిన విధంగా, ఒక సైనిక విమానాన్ని నవీకరించేందుకు యు.ఎస్.ఎ.ఎ.ఎఫ్. నేతలకు ఆదేశాలు జారీ చేశారు.[8] అధ్యక్షుడి వినియోగానికి ప్రత్యేకించబడిన మొదటి విమానం సి-87ఎ విఐపి ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్. ఈ విమానాన్ని, నెంబరు 41-24159, అధ్యక్ష విఐపి ప్రయాణానికి ఉపయోగించేందుకు 1943 లో తిరిగి నవీకరించారు, దీనికి గెస్ వేర్ II అనే పేరు పెట్టారు, ఇది అధ్యక్షుడు ఫ్లాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ అంతర్జాతీయ ప్రయాణాలకు ఉద్దేశించబడింది.[9] దీనికి ఆమోదం లభించినట్లయితే, అధ్యక్ష సేవల్లో ఉపయోగించిన మొదటి విమానంగా, తొలి ఎయిర్ ఫోర్స్ వన్‌గా గుర్తింపు పొందివుండేది. అయితే, సి-87 వినియోగంపై జరిపిన ఒక సమీక్షలో అత్యంత వివాదాస్పద భద్రతా ముప్పు బయటపడిన తరువాత, సీక్రెట్ సర్వీస్ (రహస్య సేవల విభాగం) అధ్యక్ష ప్రయాణాలకు గెస్ వేర్ IIను ఉపయోగించడాన్ని మరోమాట లేకుండా తిరస్కరించింది.[9] దీంతో ఈ విమానాన్ని రూజ్‌వెల్ట్ పాలనా యంత్రాంగంలోని సీనియర్ అధికారుల ప్రయాణాలకు ఉపయోగించారు. మార్చి 1944లో, గెస్ వేర్ II విమానాన్ని ఒక సౌహార్ద పర్యటన కోసం ఎలీనోర్ రూజ్‌వెల్ట్ లాటిన్ అమెరికా దేశాలకు వెళ్లేందుకు ఉపయోగించారు. సి-87ను 1945లో వినియోగం నుంచి తొలగించారు.[9]

అధ్యక్ష ప్రయాణాల కోసం రహస్య సేవల విభాగం ఆ తరువాత ఒక డగ్లస్ సి-54 స్కైమాస్టర్‌ను సిద్ధం చేసింది. ఈ విసి-54సి విమానానికి సాక్రెడ్ కౌ అనే మారుపేరు ఉండేది, ఇందులో పడుకునే ప్రదేశం, రేడియో టెలిఫోన్ మరియు చక్రాల కుర్చీతోపాటు రూజ్‌వెల్ట్‌ను విమానంలో ఎక్కించేందుకు ఉపయోగించే మడవగల ఎలివేటర్ ఉన్నాయి. మార్పులు చేసిన తరువాత, విసి-54సిని అధ్యక్షుడు రూజ్‌వెల్ట్ ఒక్కసారి మాత్రమే ఉపయోగించారు, ఫిబ్రవరి 1945లో యాల్టా సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లిన సందర్భంగా రూజ్‌వెల్ట్ దీనిలో ప్రయాణించారు.[8]

అధ్యక్షుడు ట్రూమాన్ ప్రధానంగా ఉపయోగించిన ఇండిపెండెన్స్

1945 వసంతకాలంలో రూజ్‌వెల్ట్ మరణించిన తరువాత, ఉపాధ్యక్షుడు హారీ ఎస్. ట్రూమాన్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. యు.ఎస్. వైమానిక దళాన్ని సృష్టించేందుకు ఉద్దేశించిన జాతీయ భద్రతా చట్టం 1947 పై విసి-54సి విమానంలో ప్రయాణిస్తూ, ట్రూమాన్ సంతకం చేశారు.[8] 1947 ఆయన విసి-54సి స్థానంలో, ఆధునిక సి-118 లిఫ్ట్‌మాస్టర్‌ను ప్రవేశపెట్టారు, దీనికి ట్రూమాన్ ఇండిపెండెన్స్ అనే పెట్టారు మిస్సోరిలో ట్రూమాన్ సొంత పట్టణం పేరు కూడా ఇదే కావడం గమనార్హం). ఎయిర్ ఫోర్స్ వన్‌గా పరిగణించబడిన మొదటి విమానం ఇదే, ఇది ప్రత్యేకమైన బాహ్య రూపం కలిగివుంది-ఈ విమానం ముందు భాగంపై ఒక డేగ బొమ్మ చిత్రీకరించారు.

ఎయిర్ ఫోర్స్ వన్[మార్చు]

వైట్ డి. ఐసెన్‌హోవర్ పాలన సందర్భంగా భద్రతాపరమైన ప్రయోజనాల కోసం అధ్యక్ష ప్రయాణాలకు ఉపయోగించే విమానాన్ని పిలిచేందుకు ఒక స్థిరమైన పేరును ఏర్పాటు చేశారు. ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ వ్యాపార విమానం (8610) పై కూడా అధ్యక్షుడి విమానాన్ని (ఎయిర్ ఫోర్స్ 8610) పిలిచే పేరు ఉండటంతో, 1953 నుంచి అధ్యక్ష విమానాన్ని ఈ పేరుతో పిలిచే సంప్రదాయానికి స్వస్తి పలికారు. ఈ వ్యాపార విమానం ప్రమాదవశాత్తూ అధ్యక్ష విమానం ప్రయాణిస్తున్న గగనతలంలోకి ప్రవేశించింది, ఈ సంఘటన తరువాత అధ్యక్ష విమానానికి ప్రత్యేకంగా "ఎయిర్ ఫోర్స్ వన్" అనే పిలిచే పేరును స్థిరీకరించారు.

అధ్యక్షుడు ఈసెన్‌హోవర్ ఉపయోగించిన కొలంబైన్ III

ఐసెన్‌హోవర్ అధ్యక్ష ప్రయాణాల కోసం ఉద్దేశించి నాలుగు ఇతర ప్రొపెలెర్ విమానాలు, లాక్‌హీడ్ సి-121 కాన్‌స్టెలేషన్స్ (విసి-121ఈ) లను కూడా ప్రవేశపెట్టాడు. మామీ ఐసెన్‌హోవర్ ఈ విమానాలకు కొలంబైన్ II మరియు కొలంబైన్ III అనే పేర్లు పెట్టాడు, కొలంబైన్, కొలరెడో అధికారిక రాష్ట్ర పుష్పంగా గుర్తింపు పొందిన తరువాత, ఇదే రాష్ట్రానికి చెందిన ఐసెన్‌హోవర్, పై నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష విమాన దళంలోకి రెండు ఏరో కమాండర్‌ లను కూడా తీసుకున్నారు, ఇప్పటివరకు ఎయిర్ ఫోర్స్ వన్‌గా సేవలు అందించిన విమానాల్లో అతిచిన్న విమానాలుగా ఇవి గుర్తింపు పొందాయి. అధ్యక్షుడు ఐసెన్‌హోవర్, ఎయిర్ ఫోర్స్ వన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఆధునికీకరించారు, ఇందులో భాగంగా ఎయిర్-టు-గ్రౌండ్ టెలిఫోన్ (విమానంలో నుంచి భూమిపైవారితో మాట్లాడే టెలిఫోన్) మరియు ఎయిర్-టు-గ్రౌంట్ టెలీటైప్ యంత్రాన్ని అధ్యక్ష విమానంలో చేర్చారు. 1958లో ఐసెన్‌హోవర్ ప్రభుత్వ హయాం ముగింపు సమయానికి, వైమానిక దళం అధ్యక్ష విమానాల్లోకి మూడు బోయింగ్ 707 జెట్‌ లను (ఈ విసి-137 విమానాలు ఎస్‌ఏఎమ్ 970, 971, మరియు 972 గా గుర్తించబడ్డాయి), చేర్చింది. ఐసెన్‌హోవర్ విసి-137 విమానాన్ని తొలిసారి ఉపయోగించిన అధ్యక్షుడిగా గుర్తింపు పొందారు, డిసెంబరు 3 నుంచి 1959 డిసెంబరు 22 వరకు నిర్వహించిన శాంతి సౌహార్ద పర్యటనలో ఆయన ఈ విమానాన్ని ఉపయోగించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన 11 ఆసియా దేశాల్లో పర్యటించారు, కొలంబైన్‌లో ప్రయాణం కంటే రెండు రెట్లు ఎక్కువ వేగంతో, 19 రోజుల్లో దూరం ప్రయాణించారు.

బోయింగ్ 707 విమానాలు[మార్చు]

అధ్యక్షులు కెన్నెడీ నుంచి క్లింటన్ వరకు ఉపయోగించిన బోయింగ్ 707 (SAM 26000).

అక్టోబరు 1962లో జాన్ ఎఫ్. కెన్నెడీ పాలనా యంత్రాంగం ఒక సి-137 స్ట్రాటోలైనర్ విమానాన్ని కొనుగోలు చేసింది, ఇది ఒక ఆధునిక లాంగ్-రేంజ్ (బాగా ఎక్కువ దూరం ప్రయాణించగలిగిన) 707—స్పెషల్ ఎయిర్ మిషన్ (ఎస్‌ఎఎమ్) 26000, అయితే కెన్నెడీ మాత్రం ఐసెన్‌హోవర్ హయాంనాటి విమానాల్లోనే కెనడా, ఫ్రాన్స్, ఆస్ట్రియా మరియు యునైటెడ్ కింగ్‌డమ్ దేశాల్లో పర్యటించారు.

వైమానిక దళం దాని యొక్క సొంత నమూనాతో ఒక ప్రత్యేక అధ్యక్ష లైవరీని (వాహనాలపై వేసే ప్రత్యేకించిన రంగులు) విమానంపై వేసేందుకు ప్రయత్నించింది: దీనిలో భాగంగా విమానాన్ని ఎరుపు మరియు లోహ బంగారు రంగుతో దేశం పేరును నలుపు అక్షరాల్లో ఉంచాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ఇటువంటి రూపంతో ఉండే విమానంలో మితిమీరిన రాజదర్పం ఉట్టిపడుతుందని కెన్నెడీ భావించారు, అతని భార్య, మొదటి మహిళ జాక్వెలిన్ కెన్నెడీ సలహాపై, ఆయన విసి-137 కోసం కొత్త లైవరీ మరియు అంతర్గత భాగాల రూపకల్పనలో సాయం చేయాలని ఫ్రాన్స్‌లో జన్మించిన అమెరికా ఇండస్ట్రియల్ డిజైనర్ రేమండ్ లోవీని సంప్రదించారు.[3] లోవీ, ఆపై అధ్యక్షుడిని కలిశారు, ఈ ప్రాజెక్టుపై ప్రాథమిక పరిశీలనలో భాగంగా ఆయన జాతీయ ప్రాచీన పత్ర భాండాగారానికి వెళ్లారు, అక్కడ ఆయనకు అమెరికా సంయుక్త రాష్ట్రాల స్వాతంత్ర్య ప్రకటనకు సంబంధించిన తొలి ముద్రిత పత్రాన్ని చూశారు, దీనిలో దేశం యొక్క పేరులోని అక్షరాలు బాగా దూరంగా మరియు కాస్లోన్ అని పిలిచే ఒక టైప్‌ఫేస్‌లో పేజి ఎగువ భాగంలో రాయబడ్డాయి. మెరుగుపెట్టిన అల్యూమినియంతో ఫ్యూసిలేజ్ (విమానంలో మధ్యభాగం) కింది భాగాన్ని ప్రస్పుటం చేయాలని మరియు రెండు నీలి రంగులను ఉపయోగించాలని అతను నిర్ణయించాడు; ఒక నీలిరంగు పలకకు ప్రారంభ గణతంత్ర రాజ్యం మరియు అధ్యక్ష పదవితో అనుబంధం ఉంది మరియు మరింత సమకాలీన ముదురు నీలం వర్తమానం మరియు భవిష్యత్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. ముక్కు భాగానికి సమీపంలో విమాన మధ్యభాగానికి రెండువైపులా అధ్యక్ష ముద్రను జోడించారు, తోకపై పెద్ద అమెరికా జెండాను చిత్రీకరించారు, విమానానికి రెండు వైపులా పెద్ద అక్షరాలలో "యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా" అని రాయబడి ఉంటుంది. లోవీ యొక్క కృషికి అధ్యక్షుడు మరియు ప్రసార మాధ్యమాల నుంచి తక్షణ ప్రశంసలు లభించాయి. విసి-137 చిహ్నాలు భారీస్థాయి విసి-25 విమానానికి కూడా స్వీకరించారు, ఈ విమానం 1990 నుంచి అధ్యక్ష ప్రయాణాలకు అందుబాటులోకి వచ్చింది.[10]

స్పెషల్ ఎయిర్ మిషన్ 26000[మార్చు]

1962 నుంచి 1998 వరకు ఎస్‌ఎఎమ్ 26000 అమెరికా అధ్యక్షులకు సేవలు అందించింది, కెన్నెడీ నుంచి క్లింటన్ వరకు అమెరికా అధ్యక్షులుగా పనిచేసినవారు దీని సేవలను ఉపయోగించుకున్నారు. 1963 నవంబరు 22న, అధ్యక్షుడు కెన్నెడీ ఎస్‌ఎఎమ్ 26000 విమానంలో టెక్సాస్‌లోని డల్లాస్ నగరానికి వెళ్లాడు, ఇక్కడ ఈ విమానం అధ్యక్షుడిగా నేపథ్యంగా పనిచేసింది మరియు కెన్నెడీ భార్య డల్లాస్ లవ్ ఫీల్డ్‌లో శ్రేయోభిలాషులకు వందనం చేశారు. ఆ రోజు మధ్యాహ్నం తరువాత, కెన్నెడీ హత్యకు గురైయ్యారు, అనంతరం ఉపాధ్యక్షుడు లిండన్ జాన్సన్ అధ్యక్షుడిగా ఎస్‌ఎఎమ్ 26000 విమానంలోనే పదవీ బాధ్యతలు స్వీకరించారు. జాన్సన్ యొక్క విజ్ఞప్తిపై, ఈ విమానంలో కెన్నెడీ భౌతికకాయాన్ని వాషింగ్టన్‌కు తీసుకొచ్చారు. అంతేకాకుండా కెన్నెడీ అంత్యక్రియలు జరిగిన ఆర్లింగ్టన్ జాతీయ శ్మశానవాటిక గగనతలంపై ఆ సమయంలో 50 యుద్ధ విమానాలతోపాటు, ఈ విమానం కూడా గౌరవ వందనం సమర్పించింది. ఒక దశాబ్దం తరువాత, ఇదే విమానం జాన్సన్ భౌతికకాయాన్ని ప్రభుత్వ అంత్యక్రియలు కోసం వాషింగ్టన్‌కు తీసుకొచ్చింది, తరువాత తిరిగి ఆయన భౌతికకాయాన్ని సొంత రాష్ట్రమైన టెక్సాస్‌కు తీసుకెళ్లింది. వ్యక్తిగత రాంచ్‌లో (పశువులు పెంపకం కోసం ఉద్దేశించిన సొంత భూభాగం) ఆయన అంత్యక్రియలు జరుగుతున్న సందర్భంలో, ఎస్‌ఎఎమ్ 26000 విమానం యొక్క ఒక మాజీ పైలెట్ జాతీయ పతకాన్ని లేడీ బర్డ్ జాన్సన్‌కు అందజేశాడు.

స్పెషల్ ఎయిర్ మిషన్ 27000[మార్చు]

బోయింగ్ 707 ఎస్‌ఎఎమ్ 27000 ఎయిర్ ఫోర్స్ వన్ ఎస్‌ఎఎమ్ 27000గా అధ్యక్షులు నిక్సాన్ నుంచి జార్జి డబ్ల్యు. బుష్ వరకు సేవలు అందించింది, నిక్సాన్ నుంచి రీగన్ వరకు ఇది ప్రధాన విమానంగా ఉంది.

1972 లో ఎస్‌ఎఎమ్ 26000 స్థానంలో మరో విసి-137 విమానం, స్పెషల్ ఎయిర్ మిషన్ 27000, విధులు నిర్వహణలోకి వచ్చింది, అయితే ఎస్‌ఎఎమ్ 26000 విమానాన్ని మాత్రం 1998లో పూర్తిగా తొలగించే వరకు సహాయక విమానంగా ఉపయోగించారు. ఎస్‌ఎఎమ్ 26000 ఇప్పుడు నేషనల్ మ్యూజియం ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్‌లో ప్రదర్శించబడుతుంది. ఎస్‌ఎఎమ్ 27000ను ఉపయోగించిన మొదటి అధ్యక్షుడిగా రిచర్డ్ నిక్సన్ గుర్తింపు పొందారు, ఈ కొత్త విమానం 1990లో రెండు విసి-25 విమానాలు (ఎస్‌ఎఎమ్ 28000 మరియు 29000) ప్రవేశపెట్టే వరకు అధ్యక్షులుగా పనిచేసిన అందరికీ ప్రయాణ అవసరాలు తీర్చింది. రాజీనామా చేయాలనే తన ఉద్దేశాన్ని ప్రకటించిన తరువాత, నిక్సాన్ ఎస్‌ఎఎమ్ 27000 విమానంలో కాలిఫోర్నియా వెళ్లారు. గెరాల్డ్ ఫోర్డ్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత విమానాన్ని పిలిచే పేరును ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి ఎస్‌ఎఎమ్ 27000కి మార్చారు.

అధ్యక్షుడు జార్జి డబ్ల్యు.. బుష్ 2001 లో ఎస్‌ఎఎమ్ 27000 విమానాన్ని అధ్యక్ష సేవల నుంచి తొలగించారు, దీనిని తరువాత కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినో అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకెళ్లారు, ఆపై దీని భాగాలను వేరుచేసి సిమీ వ్యాలీలోని రొనాల్డ్ రీగన్ అధ్యక్ష గ్రంథాలయానికి పంపారు, ఇక్కడ మళ్లీ దీని భాగాలను కూర్చి, శాశ్వత ప్రదర్శన కోసం ఉంచారు.

బోయింగ్ 747 విమానాలు[మార్చు]

రొనాల్డ్ రీగన్ రెండుసార్లు అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఎయిర్ ఫోర్స్ వన్‌లో పెద్దగా ప్రధానమైన మార్పులేమీ చోటుచేసుకోలేదు, ప్రస్తుతం ఉపయోగిస్తున్న 747 విమానాల తయారీ మాత్రం ఆయన అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే ప్రారంభమైంది. కనీసం మూడు ఇంజిన్లు మరియు 6000 మైళ్ల వరకు తిరిగి ఇంధన నింపుకోవాల్సిన అవసరంలేని రెండు భారీ విమానాలకు తయారు చేసేందుకు సంబంధించిన ప్రతిపాదనకు 1985లో యుఎస్‌ఎఎఫ్ ఒక విజ్ఞప్తి జారీ చేసింది. బోయింగ్ కంపెనీ 747 విమానంతో మరియు మెక్‌డొనెల్ డగ్లస్ కంపెనీ డిసి-10 విమానంతో ప్రతిపాదనలు సమర్పించాయి, అయితే ఈ పోటీలో బోయింగ్ విజయం సాధించింది. రీగన్ తన హయాంలో ఉపయోగించిన పాత 707 విమానాల స్థానంలో రెండు బోయింగ్ 747 విమానాలు చేర్చేందుకు రీగన్ పాలనా యంత్రాంగం ఆర్డర్ ఇచ్చింది.[11] ఈ విమానం యొక్క అంతర్గత అలంకరణ (ఏర్పాట్లు) ప్రథమ మహిళ నాన్సీ రీగన్ రూపొందించారు, అమెరికా సంయుక్త రాష్ట్రాల నైరుతీ భూభాగాన్ని జ్ఞాపకం తెచ్చే నమూనాలను ఆమె ఇందులో ఉపయోగించారు.[11] బోయింగ్ నుంచి మొదటి విమానం 1990లో సరఫరా చేయబడింది, ఆ సమయంలో [[జార్జి హెచ్. డబ్ల్యు. బుష్ అమెరికా అధ్యక్షుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. విద్యుదయస్కాంత ప్రేరణ (ఈఎమ్‌పి) ప్రభావాలు నుంచి విమానాన్ని భద్రపరిచేందుకు అవసరమైన అదనపు పని పూర్తి చేసేందుకు అనుమతించడంలో జాప్యాలు జరిగాయి. విసి-25 విమానంలో రక్షిత మరియు అరక్షిత ఫోన్ మరియు కంప్యూటర్ కమ్యూనికేషన్ వ్యవస్థలు రెండింటినీ అమర్చారు, అమెరికా సంయుక్త రాష్ట్రాలపై దాడి జరిగిన పక్షంలో, ఆకాశంలోన ప్రయాణిస్తూనే విధులు నిర్వహించేందుకు అధ్యక్షుడిగా దీని ద్వారా అవకాశం ఏర్పడుతుంది.

2006 మార్చి 1న ఆఫ్ఘనిస్తాన్‌లోని బాగ్రామ్ వైమానిక స్థానరంలో దిగిన ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి నడచి వెళుతున్న అధ్యక్షుడు జార్జి డబ్ల్యు. బుష్ మరియు ప్రథమ మహిళ లారా బుష్.

అధ్యక్షుడు వాయు ప్రయాణాలకు సంబంధించిన విమానాల నిర్వహణ బాధ్యతలను మేరీల్యాండ్‌లో ఉన్న ఆండ్ర్యూస్ వైమానిక దళ స్థావరం లోని 89వ ఎయిర్‌క్రాఫ్ట్ వింగ్ చూస్తుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలపై ప్రయాణిస్తున్నప్పుడు సాధారణంగా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్‌కు యుద్ధ విమానాల రక్షణ ఉండదు, అయితే ఇది ఒకసారి జరిగింది. జూన్ 1974 లో, అధ్యక్షుడు నిక్సాన్ విదేశీ పర్యటనలో భాగంగా సిరియాలో ఆగాల్సివుంది, సిరియాకు చెందిన యుద్ధ విమానాలు ఎయిర్ ఫోర్స్ వన్‌కు రక్షణ కల్పించేందుకు దానిని అనుసరించాయి. అయితే, ఎయిర్ ఫోర్స్ వన్ సిబ్బందికి ముందుగా ఈ విషయాన్ని తెలియజేయలేదు, ఫలితంగా గందరగోళం ఏర్పడటంతో, విమానం నుంచి దూకడంతోపాటు, రక్షణాత్మక చర్యలు చేపట్టాల్సి వచ్చింది.[12]

వరల్డ్ ట్రేడ్ సెంటర్ సౌత్ టవర్‌ దాడి[మార్చు]

ఎయిర్ ఫోర్స్ వన్‌తో ముడిపడిన అత్యంత నాటకీయ సంఘటనల్లో మరొకటి సెప్టెంబరు 11 దాడుల సందర్భంగా చోటుచేసుకుంది. న్యూయార్క్ నగరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ సౌత్ టవర్‌పై దాడి జరిగిన తరువాత ఫ్లోరిడాలోని సారాసోటాలో ఉన్న ఎమ్మా ఈ. బూకర్ ఎలిమెంటరీ పాఠశాల వద్ద అధ్యక్షుడు జార్జి డబ్ల్యు.. బుష్ అడ్డగించబడ్డారు. విసి-25 విమానంలో ఆయన సారాసోటా-బ్రాడెన్‌టన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లూసియానాలోని బార్క్స్‌డాల్ వైమానిక దళ స్థావరానికి మరియు అక్కడి నుంచి నెబ్రాస్కాలోని ఆఫుట్ వైమానిక దళ స్థావరానికి చేరుకొని చివరకు వాషింగ్టన్‌కు వెళ్లారు. తరువాతి రోజు, "వైట్ హౌస్ మరియు ఎయిర్ ఫోర్స్ వన్‌లు కూడా తీవ్రవాదుల ఉద్దేశిత లక్ష్యాలుగా ఉన్నాయని నిర్దిష్ట మరియు విశ్వసనీయ సమాచారం అందడంతో అధ్యక్షుడు బుష్ ఈ నిర్ణయం తీసుకున్నారని" వైట్ హౌస్ మరియు న్యాయ శాఖ అధికారులు వివరణ ఇచ్చారు.[13] తరువాత వైట్ హౌస్ ఎయిర్ ఫోర్స్ వన్‌కు వచ్చిన ముప్పుకు సంబంధించిన ఆధారాన్ని బయటపెట్టలేకపోయింది, తరువాత జరిపిన విచారణలో తప్పుడు సమాచారం అందడం వలన ఈ సంఘటన జరిగిందని తేలింది.[14]

స్పెషల్ ఎయిర్ మిషన్ 28000[మార్చు]

2009 ఏప్రిల్ 3న సమావేశ గదిలో సిబ్బందిని కలిసిన అధ్యక్షుడు బరాక్ ఒబామా.

రెండోసారి అధ్యక్షుడిగా అధ్యక్షుడు బుష్ పదవీ కాలం 2009 లో ముగిసిన తరువాత ఆయనను టెక్సాస్‌కు తీసుకెళ్లేందుకు ఈ విసి-25 విమానాన్ని ఉపయోగించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడిని తీసుకొని వెళడం లేదు కాబట్టి, బుష్‌ను సొంత నగరంలో విడిచిపెట్టేందుకు ఉద్దేశించిన ఈ విమాన ప్రయాణాన్ని స్పెషల్ ఎయిర్ మిషన్ 28000 అని పిలిచారు. 2009 ఏప్రిల్ 27 న, ఫొటోలు తీసుకునేందుకు మరియు శిక్షణ కార్యక్రమంలో భాగంగా విసి-25 విమానం చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించింది, అయితే దీని వలన అనేక మంది న్యూయార్క్ పౌరులు భయాందోళనలకు గురైయ్యారు.[15] ఫొటోలు తీసుకునేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమం సందర్భంగా జరిగిన ప్రమాదం వలన వైట్ హౌస్ సైనిక కార్యాలయ డైరెక్టర్ రాజీనామా చేయాల్సి వచ్చింది.

విసి-25ఎ విమానాలు త్వరలో అధ్యక్ష విమానాల స్థానంలో వచ్చి చేరే అవకాశం ఉంది, ఎందుకంటే వీటి నిర్వహణ అతితక్కువ వ్యయంతో సాధ్యపడుతుంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న విమానాల స్థానంలో కొత్తవాటిని తీసుకొచ్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి యుఎస్‌ఎఎఫ్ ఎయిర్ మొబిలిటీ కమాండ్ ఏర్పాటు చేయబడింది, కొత్త బోయింగ్ 747-8 మరియు ఈఎడిఎస్ ఎయిర్‌బస్ ఎ-380 విమానాలను ఇది పరిశీలిస్తోంది.[16] 2009 జనవరి 7న, యుఎస్‌ఎఎఫ్ ఎయిర్ మెటీరియల్ కమాండ్ 2017 సంవత్సరం ప్రారంభానికి అధ్యక్ష ప్రయాణాలను చేపట్టే విధంగా, విమానాలను సరఫరా చేసేందుకు ఆర్డర్ జారీ చేసింది.[17] 2009 జనవరి 28న, ఈఎడిఎస్ఈ విమాన నిర్మాణ కార్యక్రమం నుంచి తాము వైదొలుగుతున్నామని ప్రకటించింది, దీంతో బోయింగ్ ఒక్కటే ఈ పోటీలో మిగిలింది, బోయింగ్ 747-8 లేదా బోయింగ్ 787 విమానాలను దీని కోసం ప్రతిపాదించింది.[18]

ఇతర అధ్యక్ష విమానాలు[మార్చు]

ఎయిర్ ఫోర్స్ వన్, అధ్యక్షుడి కారు మరియు రహస్య సేవల విభాగ సిబ్బంది[19]

అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే పౌర విమానాన్ని ఎగ్జిక్యూటివ్ వన్ అనే హోదా ఇచ్చారు, ఈ హోదా పొందిన ఒకే ఒక్క వ్యాపార విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్‌లైన్స్. 1973 డిసెంబరు 26న, తరువాత-అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రిచర్డ్ నిక్సాన్ ఒక ప్రయాణికుడిగా వాషింగ్టన్ డల్లాస్ నుంచి లాస్ ఏంజెలెస్‌కు వెళ్లే అంతర్జాతీయ విమానంలో ప్రయాణించారు. ఇంధనాన్ని ఆదా చేసేందుకు వైమానిక దళానికి చెందిన బోయింగ్ 707 విమానంలో ప్రయాణం వద్దని ఆయన తన సిబ్బందికి చెప్పారు.[20]

2000 మార్చి 8న, అధ్యక్షుడు బిల్ క్లింటన్ పాకిస్థాన్‌కు పేరుపెట్టని గల్ఫ్‌స్ట్రీమ్ III విమానంలో ప్రయాణించారు, ఇదిలా ఉంటే "ఎయిర్ ఫోర్స్ వన్" పేరుతో మరో విమానం కొన్ని నిమిషాల తర్వాత ఇదే మార్గంలో ప్రయాణించింది.[21][22][23] ఈ దారిమల్లింపును అనేక యు.ఎస్. ప్రసార మాధ్యమాలు బయటపెట్టాయి. ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులకు ప్రత్యేక విమానాలు కేటాయించబడివుంటాయి. మరిన్ని వివరాల కోసం ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్స్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ది స్టేట్ అండ్ గవర్నమెంట్‌ను చూడండి.

ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ప్రదర్శన[మార్చు]

2005లో, ఎస్‌ఎఎమ్-27000 విమానాన్ని సందర్శించిన అధ్యక్షుడు జార్జి డబ్ల్యు.. బుష్, ప్రథమ మహిళ లారా బుష్, మరియు మాజీ ప్రథమ మహిళ లేడీ నాన్సీ రీగన్, ఈ విమానం 1972–2001 మధ్యకాలంలో అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారికి సేవలు అందించింది; దీనిని ప్రస్తుతం రొనాల్డ్ రీగన్ అధ్యక్ష గ్రంథాలయంలో ప్రదర్శనార్థం ఉంచారు.

ఎయిర్ ఫోర్స్ వన్‌గా గతంలో సేవలు అందించిన పలు అధ్యక్ష విమానాలు (సాక్రెడ్ కౌ, ఇండిపెండెన్స్, కొలంబైన్ III, ఎస్‌ఎఎమ్-26000, మరియు ఇతర చిన్న అధ్యక్ష విమానాలు) నేషనల్ మ్యూజియం ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ యొక్క అధ్యక్ష విమానశాలలో (ఇది ఒహియోలోని డేటన్ సమీపంలో రైట్-పాటర్సన్ ఎఎఫ్‌బి వద్ద ఉంది) మరియు వాషింగ్టన్‌ లోని సీటెల్‌లో ఉన్న మ్యూజియం ఆఫ్ ఫ్లైట్‌లో ఉన్నాయి. నిక్సాన్ పాలనా కాలం నుంచి జార్జి హెచ్. డబ్ల్యు. బుష్ పాలన వరకు ఎయిర్ ఫోర్స్ వన్‌గా సేవలు అందించిన బోయింగ్ 707 (ఎస్‌ఎఎమ్-27000) కాలిఫోర్నియాలోని సిమీ వ్యాలీలోని రొనాల్డ్ రీగన్ అధ్యక్ష గ్రంథాలయంలో ప్రదర్శించబడుతోంది. ఈ గ్రంథాలయంలోని ఎయిర్ ఫోర్స్ వన్ పెవీలియన్ ప్రజల సందర్శనకు 2005 అక్టోబరు 24న ప్రారంభించబడింది. జాన్ ఎఫ్. కెన్నెడీ ఉపయోగించిన ఒక విసి-118ఎ లిఫ్ట్‌మాస్టర్ అరిజోనాలోని టుక్సన్‌లో ఉన్న పీమా ఎయిర్ & స్పేస్ మ్యూజియంలో ప్రదర్శించబడుతుంది.

ప్రాథమిక అధ్యక్ష విమాన పైలెట్‌ల జాబితా[మార్చు]

లెప్టినెంట్ కల్నల్ హెన్రీ టి. మేయర్స్:[24]

 • అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్: జూన్ 1944-ఏప్రిల్ 1945
 • అధ్యక్షుడు హారీ ట్రూమాన్: ఏప్రిల్ 1945-జనవరి 1948

కల్నల్ ఫ్రాన్సిస్ డబ్ల్యు. విలియమ్స్:[24]

 • అధ్యక్షుడు హారీ ట్రూమాన్: జనవరి 1948-జనవరి 1953

కల్నల్ విలియం జి. డ్రాపెర్:[24]

 • అధ్యక్షుడు వైట్ ఈసెన్‌హోవర్: జనవరి 1953-జనవరి 1961

కల్నల్ జేమ్స్ స్విండల్:[24]

 • అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ: జనవరి 1961-నవంబరు 1963
 • అధ్యక్షుడు లిండన్ జాన్సన్: నవంబరు 1963-జులై 1965

కల్నల్ జేమ్స్ వి. క్రాస్:[24]

 • అధ్యక్షుడు లిండన్ జాన్సన్: జూలై 1965-మే 1968

లెఫ్టినెంట్ కల్నల్ పాల్ త్రోన్‌హిల్:[24]

 • అధ్యక్షుడు లిండన్ జాన్సన్: మే 1968-జనవరి 1969

కల్నల్ రాల్ఫ్ డి. అల్బర్టాజ్జీ:[24]

 • అధ్యక్షుడు రిచర్డ్ నిక్సాన్: జనవరి 1969-ఆగస్టు 1974

కల్నల్ లెస్టెర్ సి. మెక్‌క్లెలాండ్:[24]

 • అధ్యక్షుడు గెరాల్డ్ ఫోర్డ్: ఆగస్టు 1974-జనవరి 1977
 • అధ్యక్షుడు జిమ్మీ కార్టర్: జనవరి 1977-ఏప్రిల్ 1980

కల్నల్ రాబర్ట్ ఈ. రుడిక్:[24]

 • అధ్యక్షుడు జిమ్మీ కార్టర్: ఏప్రిల్ 1980-జనవరి 1981
 • అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్: జనవరి 1981-జనవరి 1989

కల్నల్ రాబర్ట్ డి. “డానీ” బార్:[24]

 • అధ్యక్షుడు జార్జి హెచ్. డబ్ల్యు. బుష్: జనవరి 1989-జనవరి 1993
 • అధ్యక్షుడు బిల్ క్లింటన్: జనవరి 1993-జనవరి 1997

కల్నల్ మార్క్ ఎస్. డొనెలీ:[25]

 • అధ్యక్షుడు బిల్ క్లింటన్: జనవరి 1997-జనవరి 2001
 • అధ్యక్షుడు జార్జి డబ్ల్యు. బుష్: జనవరి 2001-జూన్ 2001

కల్నల్ మార్క్ డబ్ల్యు. టిల్‌మాన్:[25]

 • అధ్యక్షుడు జార్జి డబ్ల్యు. బుష్: జూన్ 2001-జనవరి 2009

కల్నల్ స్కాట్ టర్నెర్:[26]

 • అధ్యక్షుడు బరాక్ ఒబామా: జనవరి 2009–ప్రస్తుతం

ఇవి కూడా చూడండి[మార్చు]

గమనికలు[మార్చు]

 1. ఆర్డర్ 7110.65R (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) ఫెడరల్ ఏవియేషన్ ఆడ్మినిస్ట్రేషన్ మార్చి 14, 2007. సేకరణ తేదీ: ఆగస్టు 27, 2007.
 2. బోస్మాన్, జూలీ. "పాలిటిక్స్ కెన్ వెయిట్: ది ప్రెసిడెంట్ హాజ్ ఎ డేట్." ది న్యూయార్క్ టైమ్స్ , మే 30, 2009. సేకరణ తేదీ: జూన్ 17, 2009.
 3. 3.0 3.1 వాల్ష్ 2003.
 4. వాలెస్, క్రిస్ (అతిథేయి). "ఎబోర్డ్ ఎయిర్ ఫోర్స్ వన్." ఫాక్స్ న్యూస్ , నవంబరు 24, 2008. సేకరణ తేదీ: నవంబరు 28, 2008.
 5. హార్డెస్టీ 2003, పేజీలు 31–32.
 6. హార్డెస్టీ 2003, పేజి 38.
 7. హార్డెస్టీ 2003, పేజి 39.
 8. 8.0 8.1 8.2 "ఫ్యాక్ట్‌షీట్: డగ్లస్ విసి-54సి సాక్రెడ్ కౌ" Archived 2007-09-02 at the Wayback Machine.. అమెరికా సంయుక్త రాష్ట్రాల వైమానిక దళ జాతీయ సంగ్రహాలయం. సేకరణ తేదీ: అక్టోబరు 19, 2009.
 9. 9.0 9.1 9.2 డోర్ 2002, పేజి l34.
 10. హార్డెస్టీ 2003, పేజి 70.
 11. 11.0 11.1 విలియమ్స్, రూడీ. "రీగన్ మేక్స్ ఫస్ట్, లాస్ట్ ఫ్లైట్ ఇన్ జెట్ హి ఆర్డర్డ్." Archived 2008-04-13 at the Wayback Machine. అమెరికా సంయుక్త రాష్ట్రాల రక్షణ విభాగం జూన్ 10, 2004. సేకరణ తేదీ: జూన్ 23, 2009.
 12. "వాషింగ్టన్ పోస్ట్ ఆన్‌లైన్ కాన్వెర్జేషన్ విత్ కెన్నెత్ వాల్ష్ ఆన్ హిజ్ ఎయిర్ ఫోర్స్ వన్: ఎ హిస్టరీ ఆఫ్ ది ప్రెసిడెంట్స్ అండ్ దెయిర్ ప్లేన్స్ ". washingtonpost.com , మే 22, 2002. సేకరణ తేదీ: అక్టోబరు 18, 2009.
 13. "ప్రెస్ బ్రీఫింగ్ బై ఆరీ ఫ్లీషెర్." వైట్ హౌస్ న్యూస్ రిలీజెస్ , సెప్టెంబరు 2001. సేకరణ తేదీ: అక్టోబరు 18, 2009.
 14. అలెన్, మైక్. "వైట్ హోస్ డ్రాప్స్ క్లయిమ్ ఆఫ్ థ్రెట్ టు బుష్." ది వాషింగ్టన్ పోస్ట్ , p. A08, సెప్టెంబరు 27, 2001. సేకరణ తేదీ: ఫిబ్రవరి 28, 2007.
 15. రావు, మైథిలీ మరియు ఎడ్ హెన్రీ. " 'ఫ్యూరియస్' ఒబామా ఆర్డర్స్ ఆఫ్ NY ప్లేన్ ఫ్లైఓవర్." cnn.com , ఏప్రిల్ 28, 2009. సేకరణ తేదీ: అక్టోబరు 18, 2009.
 16. ట్రింబుల్, స్టీఫెన్. "US కన్సిడర్స్ ఎయిర్‌బస్ A380 యాజ్ ఎయిర్ ఫోర్స్ వన్ అండ్ పొటెన్షియల్లీ ఎ C-5 రిప్లేస్‌మెంట్." ఫ్లైట్ గ్లోబల్ , అక్టోబరు 17, 2007. సేకరణ తేదీ: జూన్ 23, 2009.
 17. హోరిన్, డేనియల్. "యుఎస్‌ఎఎఫ్ ప్రెసిడెన్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ రీకాపిటలైజేషన్ (పిఎఆర్) ప్రోగ్రామ్." యుఎస్‌ఎఎఫ్ మెటీరియల్ కమాండ్ , జనవరి 7 2007. సేకరణ తేదీ: జనవరి 8, 2009.
 18. బట్లెర్, అమై. "బోయింగ్ ఓన్లీ కంటెండర్ ఫర్ న్యూ ఎయిర్ ఫోర్స్ వన్". Archived 2011-12-19 at the Wayback Machine. AviationWeek.com , జనవరి 28, 2009. సేకరణ తేదీ: జూన్ 23, 2009.
 19. [31]
 20. మడ్, రోజెర్ మరియు రిచర్డ్ వాగ్నెర్. వాడెర్‌బిల్ట్ టెలివిజన్ న్యూస్ ఆర్కైవ్ "ప్రెసిడెంట్ / కమర్షియల్ ఎయిర్‌లైన్ ఫ్లైట్." CBS న్యూస్ , డిసెంబరు 27, 1973. సేకరణ తేదీ: జూన్ 23, 2009.
 21. సామన్, బిల్. "క్లింటన్ యూజెస్ డెకే ఫ్లైట్ ఫర్ సెక్యూరిటీ." వాషింగ్టన్ టైమ్స్ , మార్చి 26, 2000, పేజి C.1.
 22. హనీఫా, అజీజ్. "ప్లేయింగ్ హైడ్-అండ్-సీక్ ఆన్ ట్రిప్ టు ఇస్లామాబాద్." ఇండియా అబ్రాడ్ . న్యూయార్క్: మార్చి 31, 2000, వాల్యుమ్ XXX, ఇష్యూ 27, పేజి 22.
 23. "క్లింటన్స్ ట్రిప్ టు ఏషియా కాస్ట్ ఎట్ లీస్ట్ $50 మిలియన్." మిల్వౌకీ జర్నల్ సెంటినెల్ , ఏప్రిల్ 9, 2000, పేజి 175 A.
 24. 24.0 24.1 24.2 24.3 24.4 24.5 24.6 24.7 24.8 24.9 లాంగ్, మేజర్ తిమోతీ A., USAF. "ది డిప్లమాటిక్ డ్రాయింగ్ ఫవర్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ వన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ది టాక్టికల్ అండ్ స్ట్రాటజిక్ లెవెల్స్ ఆఫ్ డిప్లమసీ. (రీసెర్చ్ రిపోర్ట్)" మాక్స్‌వెల్ AFB, అలేబామా: ఎయిర్ యూనివర్శిటీ , ఏప్రిల్ 2008.
 25. 25.0 25.1 డోర్ 2002
 26. "ఎయిర్ ఫోర్స్ వన్ పైలెట్ సెట్ ఫర్ ఫైనల్ మిషన్." ఎయిర్ ఫోర్స్ టైమ్స్ స్టాఫ్ రిపోర్ట్, జనవరి 19, 2009.

మూలాలు[మార్చు]

 • అబోట్ జేమ్స్ ఎ. మరియు ఎలైన్ ఎమ్. రైస్. డిజైనింగ్ కామ్‌లాంట్: ది కెన్నెడీ వైట్ హోస్ రీస్టోరేషన్ . న్యూయార్క్: వాన్ నోస్ట్‌రాండ్ రీన్‌హోల్డ్, 1998. ISBN 0-442-02532-7.
 • అల్బెర్టాజ్జీ, రాల్ఫ్ మరియు జెరాల్డ్ ఎఎఫ్. టెర్‌హాస్ట్. ఫ్లైయింగ్ వైట్ హౌస్: ది స్టోరీ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ వన్ . న్యూయార్క్: కౌవార్డ్, మెక్‌కాన్ & జియోగెగాన్, 1979. ISBN 0-698-10930-9.
 • బ్రౌన్, డేవిడ్. "Q&A: U.S. ప్రెసిడెన్షియల్ జెట్ ఎయిర్ ఫోర్స్ వన్." నేషనల్ జియోగ్రాఫిక్ న్యూస్, 2003 మే 29.
 • డోర్, రాబర్ట్ ఎఎఫ్. ఎయిర్ ఫోర్స్ వన్ . సెయింట్ పాల్, మిన్నెసోటా: మోటార్‌బుక్స్ ఇంటర్నేషనల్, 2002. ISBN 0-7603-1055-6.
 • హార్డెస్టీ, వాన్. ఎయిర్ ఫోర్స్ వన్: ది ఎయిర్‌క్రాఫ్ట్ దట్ షేప్‌డ్ ది మోడ్రన్ ప్రెసిడెన్సీ . చాన్‌హాసెన్, మిన్నెసోటా: నార్త్‌వర్డ్ ప్రెస్, 2003. ISBN 1-55971-894-3.
 • హారిస్, టామ్. "హౌ ఎయిర్ ఫోర్స్ వన్ వర్క్స్." HowStuffWorks.com . సేకరణ తేదీ: 2006 అక్టోబరు 10.
 • వాల్ష్, కెన్నెత్ టి. ఎయిర్ ఫోర్స్ వన్: ఎ హిస్టరీ ఆఫ్ ది ప్రెసిడెంట్స్ అండ్ దెయిర్ ప్లేన్స్ . న్యూయార్క్: హైపెరియన్, 2003. ISBN 1-4013-0004-9.

బాహ్య లింకులు[మార్చు]