ఎరిక్సన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Telefonaktiebolaget L. M. Ericsson
రకంPublic (మూస:OMX, NASDAQERIC)
స్థాపితంStockholm, Sweden (1876)
వ్యవస్థాపకు(లు)Lars Magnus Ericsson
ప్రధానకార్యాలయంKista, Stockholm, Sweden
సేవా ప్రాంతముWorldwide
కీలక వ్యక్తులుMichael Treschow (Chairman of the board), Hans Vestberg (President and CEO), Marcus Wallenberg (Deputy Chairman)
పరిశ్రమTelecommunications
ఉత్పత్తులుMobile and fixed broadband networks, consultancy and managed services, multimedia technology
ఆదాయంSEK 206.477 billion (2009)[1]
నిర్వహణ రాబడిSEK 5.918 billion (2009)[1]
లాభముSEK 3.672 billion (2009)[1]
ఆస్తులుSEK 269.8 billion (2009)[1]
మొత్తం ఈక్విటీSEK 141.0 billion (2009)[1]
ఉద్యోగులు82,500 (2009)[1]
అనుబంధ సంస్థలుSony Ericsson (50%)
ST Ericsson (50%)
LG-Ericsson (50%)
వెబ్‌సైటుEricsson.com

స్వీడన్ లోని అతిపెద్ద సంస్థలలో ఒకటైన ఎరిక్సన్ (Telefonaktiebolaget L. M. ఎరిక్సన్ ) (మూస:OMX, NASDAQERIC), టెలికమ్యూనికేషన్, సమాచార కమ్యూనికేషన్ వ్యవస్థలు మరియు సంబంధిత సేవలను అందిస్తుంది. పలురకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని, ముఖ్యంగా మొబైల్ నెట్‌వర్క్‌‌లను ఈ సంస్థ అందిస్తుంది. నేరుగానూ, అనుబంధ సంస్థల ద్వారానూ, మొబైల్ పరికరాలు, కేబుల్ టివి మరియు IPTV వ్యవస్థల వంటి రంగాలలో ఈ సంస్థ ముఖ్య పాత్ర వహిస్తుంది. బ్లూటూత్‌ను కనిపెట్టింది కూడా ఎరిక్సన్ సంస్థే.

1876లో ఒక టెలిగ్రాఫ్ పరికరాల మరమ్మతు దుకాణం వలె 1918 ఆగస్టు 18 నాడు లార్స్ మాగ్నస్ ఎరిక్సన్ ఈ సంస్థను స్థాపించారు. 2003 నుంచి స్టాక్‌హొమ్ మునిసిపాలిటిలోని కిస్టాలో ప్రధాన కార్యాలయం కలిగి ఉన్న ఎరిక్సన్ సంస్థ, "వైర్లెస్ వ్యాలీ" అని పిలవబడే ప్రాంతములో భాగం. 1990ల మధ్యలో నుండి, స్టాక్‌హోంలో విస్తృతంగా వ్యాపించి ఉన్న ఈ సంస్థ, ఆ నగరాన్నే ఐరోపా యొక్క సమాచార సాంకేతిక పరిజ్ఞాన (IT) పరిశోధనా కేంద్రాలలో ఒకటిగా మార్చేసింది. ఎరిక్సన్‌కు 150 కంటే ఎక్కువ దేశాలలో కార్యాలయాలు, కార్యకలాపాలు ఉన్నాయి. 20,000 కంటే ఎక్కువ మంది సిబ్బంది స్వీడన్‌లో పనిచేస్తున్నారు. సంస్థలు UK, ఇండియా, ఆయర్లాండ్, USA, ఫిన్లాండ్, చైనా, బ్రజిల్ వంటి ఇతర దేశాలలో కూడా గణనీయమైన కార్యకలాపాలు ఉన్నాయి.

20వ శతాబ్ద ప్రారంభములో, ప్రపంచ మాన్యువల్ టెలిఫోన్ ఎక్స్‌చేంజ్ మార్కెట్ లో ఎరిక్సన్ ప్రధాన పాత్ర వహించింది. కాని ఆటోమేటిక్ పరికరాలను ప్రవేశ పెట్టడంలో ఆలస్యం చేసింది. 1916లో, 60,000 లైన్‌లను కలిగి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద మాన్యువల్ టెలిఫోన్ ఎక్స్‌చేంజ్‌ను మాస్కోలో ఎరిక్సన్ స్థాపించింది. 1990ల సమయములో, సెల్లులర్ టెలిఫోన్ వ్యవస్థలలో ఎరిక్సన్‌కు 35-40% మార్కెట్ వాటా ఉండేది. ఇతర పలు టెలికమ్యూనికేషన్ రంగాల మాదిరిగానే, ఎరిక్సన్ కూడా 2000ల ప్రారంభములో భారీ నష్టానికి గురయింది. ఆర్థికంగా నిలద్రొక్కుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా వేలాది ఉద్యోగులను తొలిగించవలసి వచ్చింది. 2000ల మధ్య భాగములో సంస్థ మరల లాభంలోకి వచ్చింది.

35% మార్కెట్ వాటాతో, ప్రస్తుతం ఎరిక్సన్ ప్రపంచంలోని అతి పెద్ద మొబైల్ టెలికమ్యూనికేషన్ పరికరాల విక్రేత.

విషయ సూచిక

చరిత్ర[మార్చు]

పునాది[మార్చు]

లార్స్ మాగ్నస్ ఎరిక్సన్
An early, wooden, Ericsson telephone, made by the Ericsson Telephone Co. Ltd., of Nottingham, England, it is now in the collection of Thinktank, Birmingham Science Museum.

లార్స్ మాగ్నుస్ ఎరిక్సన్, ఒక పరికరాల తయారీదారుడుగా, టెలిఫోన్‌తో తన అనుబంధాన్ని ప్రారంభించాడు. టెలిగ్రాఫ్ పరికరాలు తయారు చేసే Telegrafverket అనే ఒక స్వీడన్ సంస్థలో అతను పనిచేశాడు. 1876లో, 30 సంవత్సరాలు వయస్సులో, మిత్రుడు కార్ల్ జోహన్ అండెర్సన్ సహాయంతో అతను ఒక టెలిగ్రాఫ్ మరమ్మతు దుకాణం పెట్టాడు. ఆ కొట్టు స్టాక్‌ హొం మధ్య భాగములో (ప్రధాన షాపింగ్ వీధి అయిన Drottninggatan లో నంబరు 15) ఉంది, విదేశీ తయారి టెలిఫోన్ లను రిపేర్ చేసింది. 1878లో, ఎరిక్సన్ స్వంతగా టెలిఫోన్ పరికరాలను తయారీ చేసి అమ్మడం మొదలుపెట్టాడు. అతని ఫోన్లలో సాంకేతికపరంగా నూతనంగా ఏమి లేవు. ఎందుకంటే, అప్పటికే, USలో కొత్త సాంకేతిక పరిజ్ఞానం కనిపెట్టబడింది. 1878లో, Stockholms Allmänna Telefonaktiebolag అనే స్వీడన్ తొలి టెలికాం ఆపరేటింగ్ సంస్థకు టెలిఫోన్లు మరియు స్విచ్‌బోర్డ్ లు సరఫరా చెస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు.

1878 లోనే, స్థానికంగా టెలిఫోన్ దిగుమతి చేసే నుమ పీటర్ సన్ బెల్ టెలిఫోన్ కంపెనీ వారి టెలిఫోన్ లను రిపేర్ చేయడానికి ఎరిక్సన్ ను పనిలో పెట్టాడు. ఈ సంఘటన వలన, అతను పలు సీమెన్స్ టెలిఫోన్ లను కొని వాటిలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశోధించడం మొదలుపెట్టాడు. (కొన్ని సంవత్సరాల క్రితం ఎరిక్సన్ కు సీమెన్స్ లో స్కాలర్‌షిప్ ఉండేది) Telegrafverket మరియు స్వీడిష్ రైల్వేస్ సంస్థలకు రిపేర్ పనిచేసిన అనుభవం వలన, అతనికి బెల్ మరియు సీమెన్స్ హల్స్కే టెలిఫోన్ లతో అదివరకే పరిచయం ఉంది. ఈ డిజైన్ లను అతను మరింత మెరుగు పరిచి, వాటికంటే ఎక్కువ నాణ్యత కలిగిన ఒక టెలిఫోన్ సాధనాన్ని అతను రూపొందించాడు. బెల్ గ్రూప్ కంటే చౌకైన సేవని అందించడం కొరకు Rikstelefon వంటి టెలిఫోన్ సంస్థలు ఈ క్రొత్త టెలిఫోన్ సాధనాలను వాడాయి. అతనికి పేటెంట్ లేదా రాయల్టీ సమస్యలు ఏమి లేవు ఎందుకంటే, బెల్ కూడా తమ సాధనాలను స్కాండినేవియాలో పేటెంట్ చేయలేదు. సాధానాలు తయారిదారుగా అతని శిక్షణ వలన ఎరిక్సన్ ఫోన్ లు ఆ నాటిలో సేకరణ చేసేవారికి చాలా ఆకర్షణీయంగా ఉండేవి. ఆ సంవత్సరపు చివరిలో అతను స్వంత టెలిఫోన్ లను తయారించడం ప్రారంభించాడు. అవి సీమెన్స్ టెలిఫోన్ ల మాదిరిగానే ఉండేవి. మొదటి సాధనాన్ని 1879లో సిద్ధం చేసాడు.

తన ప్రతిష్ఠను నెలకొల్పిన తరువాత, స్కాండినవియాకు టెలిఫోన్ పరికరాలు సరఫరా చేసే ప్రధాన సంస్థగా ఎరిక్సన్ తయారయింది. పెరుగుతున్న గిరాకికి అతని కర్మాగారం సరిపోలేదు కనుక కలపడం మరియు మెటల్-ప్లేటింగ్ వంటి పనులు ఇతర సంస్థలచే చేయబడింది. ముడి పదార్ధాలు చాలా వాటిని దిగిమతి చేసుకునే వాళ్ళు. అందువలన, తదుపరి సంవత్సరాలలో, ఎరిక్సన్ ఇత్తడి, వయర్, ఎబోనైట్, ఐస్కాంతం ఉక్కు వంటి పలు సంస్థలను కొన్నారు. కాబినెట్ లకు వాడే వాల్నట్ లో చాలా వరకు US నుంచి దిగుమతి చేసుకొనే వారు.

ఆ సంవత్సరం స్టాక్‌హొం యొక్క టెలిఫోన్ నెట్వర్క్ వేగంగా విస్తరించడంతో, ఆ సంస్థ టెలిఫోన్ ఉత్పాదనా సంస్థగా రూపు మారింది. కాని స్టాక్‌హొంలోని అతిపెద్ద టెలిఫోన్ నెట్వర్క్ ను బెల్ కొన్నప్పుడు, ఆ సంస్థ తమ టెలిఫోన్ లను మాత్రమే వాడాలని నియంత్రించింది. అందువలన, ఎరిక్సన్ తమ పరికరాలను ముఖ్యంగా స్వీడన్ గ్రామీణ ప్రాంతంలోని మరియు ఇతర నోర్డిక్ దేశాలలోని స్వేచ్ఛ టెలిఫోన్ కూటమిలకే విక్రయించారు.

బెల్ పరికరాల మరియు సేవల ఖరీదు చాలా ఎక్కువగా ఉండడంతో, హెన్రిక్ టోర్ సెడెర్గ్రెన్ Stockholms Allmänna Telefonaktiebolag అనే ఒక స్వతంత్ర టెలిఫోన్ సంస్థను 1883లో స్థాపించాడు. బెల్ తమ పరికరాలను పోటీ దారులకు విక్రయించదు కనుక, అతను తన క్రొత్త టెలిఫోన్ నెట్వర్క్ కు సరఫరా చేయడానికి ఎరిక్సన్ తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. 1918లో, ఈ రెండు సంస్థలు విలీనం అయి Allmänna Telefonaktiebolaget LM ఎరిక్సన్ అనే సంస్థగా మారింది.

1884లో, ఒక పలు-స్విచ్‌బోర్డ్ మాన్యువల్ టెలిఫోన్ ఎక్స్‌చేంజ్ వెస్ట్రన్ ఎలెక్ట్రిక్ లోని C. E. స్క్రిబ్నేర్ యొక్క రూపకల్పన నుండి అనుకరించబడింది. ఇది చట్టవిరుద్ధం కాదు ఎందుకంటే ఆ పరికరం స్వీడన్ లో పేటెంట్ చేయబడలేదు. కాని దీనికి USలో 1879 నుంచి 529421 పేటెంట్ ఉంది. ఒక స్విచ్‌బోర్డ్ కు 10,000 లైన్ల వరకు కలిగి ఉండే సామర్ధ్యం ఉంది. మరుసటి సంవత్సరం, LM ఎరిక్సన్ మరియు సీడెర్గ్రెన్ ఇద్దరూ USలో పర్యటించి "స్ఫూర్తి" కోసం పలు టెలిఫోన్ ఎక్స్‌చేంజ్ స్టేషన్లను సందర్శించారు. స్విచ్‌బోర్డ్ డిజైన్లో US ఇంజనీర్లు చాలా ముందున్నారని గుర్తించారు. కాని ఎరిక్సన్ టెలిఫోన్ లు వాటికి ఏమాత్రం తీసిపోలేదని కూడా గుర్తించారు.

1884లో, Stockholms Allänna Telefonaktiebolag కు చెందిన అంటోన్ అవెన్ అనే ఒక టెక్నీషియన్, టెలిఫోన్ యొక్క చెవి పీస్ మరియు మౌత్ పీస్ లను విలీనం చేసి ఒక హ్యాండ్ సెట్ లాగా రూపొందించాడు. దీనిని ఎక్స్‌చేంజ్ లోని ఆపరేటర్లు వాడడం మొదలుపెట్టారు ఎందుకంటే వారు ఖాతాదారులతో మాట్లాడుతున్నప్పుడు ఒక చేయి ఖాళీగా అట్టి పెట్టుకోవలసిన అవసరం ఉండేది. ఎరిక్సన్ క్రొత్తగా కనిపెట్టిన ఈ పరికరాన్ని తన ఉత్పాదనలలో వాడి, The Dachshund అనే పేరుతో ఒక టెలిఫోన్ ను రూపొందించాడు.

అంతర్జాతీయ విస్తరణ[మార్చు]

1890ల ఆఖరిలో ఉత్పత్తి పెరగడం, స్వీడన్ మార్కెట్ పెరుగుదల ఆగిపోవడం వంటి అంశాల వలన, ఎరిక్సన్, పలు ఏజెంట్ల ద్వారా, విదేశీ మార్కెట్ లకు విస్తరించింది. ఆరంభములో, బ్రిటిన్, రష్యా మార్కెట్లకు ఎరిక్సన్ విస్తరించింది. కాలక్రమేణా ఆ దేశాలలో ఎరిక్సన్ కర్మాగారాలు స్థాపించింది. స్థానిక కాంట్రాక్ట్‌లను పొందడంలో తమ అవకాశాలను పెంచుకోవడం దీనికి ఒక కారణం. స్వీడన్లో ఉన్న కర్మాగారం యొక్క సామర్ధ్యం సరిపోవకపోవడం మరొక కారణం. బ్రిటన్‌లో, కొంత కాలం ఎరిక్సన్ పరికరాలు నేషనల్ టెలిఫోన్ కంపెనీకు సరఫరా చేయబడ్డాయి. ఈ సంస్థ ఎరిక్సన్‌కు ఒక ప్రధాన ఖాతాదార సంస్థగా ఉండేది. 1897 సంవత్సరం నాటికి, ఎరిక్సన్ విక్రయంలో బ్రిటన్ వాటా 28%గా ఉంది. ఇతర నార్డిక్ దేశాలు కూడా ఎరిక్సన్ ఖాతాదారులుగా మారాయి. దీనికి ముఖ్య కారణం స్వీడన్ లో టెలిఫోన్ సేవలు త్వరతగతిలో విస్తరించడమే.

ఇతర దేశాలు, కాలనీలు కూడా, వారి మాతృదేశాల ప్రభావం వలన ఎరిక్సన్ ఉత్పాదలను వాడడం ప్రారంభించాయి. వాటిలో ఆస్ట్రేలియా, న్యూ జీలాండ్ కూడా ఉన్నాయి. 1890 ఆఖరి నాటికి, ఈ దేశాలు ఎరిక్సన్ యొక్క అతి పెద్ద ఐరోపాయేతర మార్కెట్లుగా మారాయి. మూకుమ్మడి ఉత్పాదన పద్ధతులు రావడంతో, ఫోన్ లు మునుపటి అందమైన రూపం మరియు మెరుగు కోల్పోతున్నాయి.

ఇతర దేశాలలో విజయం సాధించినా, ఎరిక్సన్ యునైటెడ్ స్టేట్స్ లో పెద్ద విజయం సాదించలేదు. బెల్ గ్రూప్ మరియు కేల్లోగ్గ్, ఆటోమాటిక్ ఎలెక్ట్రిక్ వంటి ఇతర స్థానిక సంస్థలు ఆ మార్కెట్లో గట్టి పట్టు సాధించాయి. అనంతరం, ఎరిక్సన్ తమ US ఆస్తులను అమ్మేసింది. దానికి భిన్నంగా, మెక్సికోలో విక్రయం పెరిగి, దక్షిణ అమెరికా మార్కెట్లలో సంస్థ అభివృద్ధి సాధించింది. దక్షిణ ఆఫ్రికా, చైనా దేశాలలో కూడా సంస్థ గణనీయమైన విక్రయాలు సాధించింది. తన సంస్థ ఒక బహుళ జాతి సంస్థగా ఎదిగి ఇంకా అభివృద్ధి సాధిస్తూ ఉండడంతో, 1901లో లార్స్ ఎరిక్సన్ సంస్థ నుంచి వైదొలిగారు.

2001 అక్టోబరు 1 నాడు సంస్థ యొక్క హ్యాండ్‌సెట్ విభాగం సోనీతో కలిసి, సోనీ ఎరిక్సన్ అనే ఒక ఉమ్మడి సంస్థను స్థాపించింది.[2] ప్రస్తుతం ఎరిక్సన్ హ్యాండ్‌సెట్ కోర్ ల ప్రధాన ఉత్పాదకుడు. అన్ని ప్రధాన వయర్‌లెస్ టెక్నాలజీలకు అవస్థాపనను అందించే సంస్థ. బ్రాడ్‌బాండ్ సేవలను అందించడానికి వీలుగా ప్రస్తుతం ఉన్న రాగి ఫొన్ లైన్ లను ఆధునీకరణ చేసే ముఖ్యమైన చర్యలో సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రధాన పాత్ర పోషించింది.

జూలై 2009లలో, సంస్థ చైనాలో $1.7 బిలియను విలువగల ఒప్పందం కుదుర్చుకుంది. చైనా మొబైల్ కమ్యూనికేషన్స్ కార్ప్ మరియు చైనా యునికోం అనే స్థానిక ఆపరేటర్ లతో ఒప్పందంపై సంతకం చేసింది.[3]

ఆటోమాటిక్ పరికరాలు[మార్చు]

స్టాక్‌హొంలోని టెలిఫోన్ప్లాన్ వద్ద ఉన్న LM ఎరిక్సన్ పూర్వపు ప్రధానకేంద్రము

సంస్థ ఒక ఆశ్చర్యకరమైన తప్పిదం చేసింది. USలో ఆటోమాటిక్ టెలిఫోనీ యొక్క పెరుగుదలను విస్మరించింది. దానికి బదులుగా, మాన్యువల్ ఎక్స్‌చేంజ్ ల విక్రయాల పైనే కేంద్రీకరించింది. 1910 నాటికల్లా, ఈ లోపం ప్రమాదకరంగా మారింది. 1920 వరకు ఈ తప్పిదాన్ని సరిచేయడంలో సంస్థ గడిపింది. 1921లో, సంస్థ తమ తొలి డయల్ ఫోన్ ను ప్రవేశపెట్టింది. ఆటోమాటిక్ స్విట్చింగ్ వ్యవస్థల అమ్మకం మొదట్లో తక్కువగా ఉండేది. ఈ పరిస్థితి సంస్థ యొక్క పరికరాలు ప్రపంచ మార్కెట్ లలో నాణ్యతను ఋజువు చేసుకునేవరకు కొనసాగింది. ఈ సమయములో, ఫోన్ లు సాధారణమైన రూపం కలిగి ఉండేవి. ఎరిక్సన్ యొక్క ఆరంభ ఆటోమేటిక్ డెస్క్ ఫోన్ లు మాగ్నెటో శైలిలో ఉండేవి. ముందు భాగంలో ఒక డయల్ ఉండి, ఎలెక్ట్రానిక్స్ లో తగు మార్పులు చేయబడి ఉండేవి. ఒక స్టైల్ ఏమంటే, కేసులను అలంకరించిన విస్తృతమైన డికాల్ లు (ట్రాన్స్ఫర్ లు). ఈ ఫోన్ లు చాలా ఆకర్షణీయంగాను సేకరణకు అనువుగానూ ఉండేవి.

మొదటి ప్రపంచ యుద్ధం, తరువాత ఏర్పడిన గ్రేట్ డిప్రెషన్, విప్లవం తరువాత రష్యన్ ఆస్తులను నష్టపోవడం వంటి అంశాలు సంస్థ అభివృద్ధిని తగ్గుముఖం పట్టించి, ఆస్ట్రేలియా వంటి దేశాలకు విక్రయాలను తగ్గించింది.

వాటాదారులలో మార్పులు[మార్చు]

సంబంధిత ఇతర సంస్థలను కొనడం వలన ఎరిక్సన్ యొక్క ఆర్థిక స్థితి దెబ్బతినడంతో, 1925లో కార్ల్ ఫ్రెడరిక్ విన్‌క్రాన్‌ట్జ్ సంస్థలో అత్యధిక వాటాను కొని, సంస్థను తన ఆధీనంలోకి తీసుకువచ్చాడు. విన్‌క్రాన్‌ట్జ్ కు నిధులు కొంత మేరకు ఇవర్ క్రూగేర్ అనే అంతర్జాతీయ పెట్టుబడిదారుడు అందించాడు. సంస్థ పేరు టెలిఫోన్ AB LM ఎరిక్సన్గా మార్చబడింది. విన్‌క్రాన్‌ట్జ్ సంస్థలలో అత్యధిక వాటా కలిగి ఉన్న క్రూగేర్, ఈ సంస్థలో ఆసక్తి చూపడం మొదలుపెట్టాడు.

1928లో, ఎరిక్సన్ తమ దీర్ఘకాల సాంప్రదాయమైన "A" మరియు "B" షేర్లను ప్రారంభించింది. ఒక్క "A" షేర్ కు 1000 ఓట్లు ఉంటాయి. ఒక్క "B" షేర్లకు 1 ఓటు మాత్రమే ఉంటుంది. అత్యధిక షేర్లు కాకుండా, కొన్ని "A" షేర్లు మాత్రమే పెట్టుకొని విన్‌క్రాన్‌ట్జ్ కంపెనీని తన ఆధీనంలో పెట్టుకున్నాడు. ఎక్కువ సంఖ్యలో "B" షేర్లను విడుదల చేసి, సంస్థకు ఎక్కువ డబ్బు సమకూర్చేలా చేశాడు. అదే సమయములో, అవి "B" షేర్లు కావడంతో, అధికార సమీకరణంలో యదాతధస్థితి కొనసాగింది.

1930లో, రెండవ సారి "B" షేర్లను విడుదల చేసినప్పుడు, క్రూగర్ "A" మరియు "B" షేర్లను కలిగి ఉండి, సంస్థను తన ఆధీనంలోకి తెచ్చాడు. అతను ఈ షేర్లను కొనడానికి LM ఎరిక్సన్ నుంచి ఋణం తీసుకున్నాడు. దానికి జర్మన్ ప్రభుత్వ బాండ్లను పూచీగా పెట్టాడు. అంతే కాక, ITT కార్పరేషన్ (సోస్తేన్స్ బెహన్ పరిపాలించే సంస్థ) నుంచి తన స్వంత సంస్థైన క్రూగర్ & టోల్కు భారి ఋణం తీసుకున్నాడు. దీనికి LM ఎరిక్సన్ యొక్క పెద్ద భాగాలను పూచీగా ఇచ్చాడు. అంతే కాక, టెలిఫోనికి సంబంధం లేని పలు అనుమానాస్పద అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలకు LM ఎరిక్సన్ పేరును పూచీగా వాడాడు.

ఆర్ధికంగా బలహీనపడిపోయిన ఎరిక్సన్ సంస్థను స్వంతం చేసుకోవాలని సంస్థకు ప్రధాన పోటీ సంస్థ అయిన ITT చూసింది. 1931లో, క్రూగర్ నుంచి సరిపోను సంఖ్యలో ఎరిక్సన్ షేర్ లను కొని ITT సంస్థలో ఆధిక్యం సాధించింది. కొంత కాలం వరకు ఈ వార్త బయటకు రాలేదు. ఎందుకంటే, స్వీడన్ సంస్థలలో విదేశీయులు పొందగలిగే వాటాకు ఒక పరిమితిని ప్రభుత్వం విధించింది కనుక ఆ షేర్లు కూడా క్రూగర్ పేరులోనే కొనసాగాయి. దీనికి బదులుగా క్రూగర్ ITTలో షేర్లు పొందవలసి ఉంది. ఈ వ్యవహారంలో అతనికి $11 మిలియన్ల లాభం వచ్చింది. ITT యొక్క బెహన్ ఈ లావాదేవీలను రద్దు చేయాలనీ చూసినప్పుడు, సంస్థలో డబ్బు ఏమి మిగలలేదని తెలుసుకున్నాడు. క్రూగర్ & టోల్ కు ఇచ్చిన భారి ఋణం తప్ప. ఆంటే, క్రూగర్ LM ఎరిక్సన్ ను ఆసంస్థ డబ్బుతోనే కొన్నాడు అన్నమాట.

క్రూగర్ సంస్థనుంచి వైదొలిగిన తరువాత, సంస్థ యొక్క బలహీనమైన ఆర్థిక స్థితి బయటపడింది. క్రూగర్ ఋణాలకు పూచీగా సంస్థను వాడుతూ ఉన్నాడు. లాభం వచ్చినా ఆ ఋణాలను తిరిగి చెల్లించలేకపోయాడు. కొన్ని అనుమానాస్పద షేర్ లావాదేవీలను సంస్థ చేపట్టిందని ఎరిక్సన్ కనుగొంది. ఈ నష్టాలు భారీగా ఉన్నాయి. పరిస్థితిని విశ్లేషించిన ITT, ఎరిక్సన్ యొక్క విలువను తాము పొరపాటుగా అంచనావేశామని ITT తెలుసుకుంది. న్యూ యార్క్ సిటీకి ఒక సమావేశానికి రమ్మని క్రూగర్ ని ITT పిలిచింది. కాని క్రూగర్‌కు "బ్రేక్‌డౌన్" ఎర్పడింది. క్రూగర్ యొక్క ఆర్థిక స్థితి గురించిన వార్త బయటకు రావడంతో, తమ ఋణాలకు పూచీ ఇవ్వమని బ్యాంకింగ్ వ్యవస్థలు క్రూగర్‌ పై ఒత్తిడి తెచ్చాయి. ఎరిక్సన్ షెర్ లు కొనుగోలు లావాదేవీని ITT రద్దు చేసింది. క్రూగర్ $11 మిలియను సొమ్ముని తిరిగి ఇవ్వలేక పొయాడు. 1932లో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఎరిక్సన్ లో మూడులో ఒక వంతు వాటా ITT వద్ద ఉంది. కాని ఈ వాటాను ITT వాడలేక పోయింది. ఎందుకంటే, విదేశీయులు 20% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉండకూడదన్నది సంస్థ షరతులలో ఒకటి.

వాలేన్బర్గ్ యుగం మొదలు[మార్చు]

ఒక స్థిరమైన మరియు లాబాధాయకమైన సంస్థయిన ఎరిక్సన్ ను దివాళా తీసి మూతపడకుండా సద్బుద్ధిగల బ్యాంకుల మరియు కొంత మేరకు ప్రభుత్వ సహాయం కాపాడింది. మర్సుస్ వాల్లెన్‌బెర్గ్ జూనియర్ పలు స్వీడెన్ బ్యాంకులతో సంప్రదించి, ఎరిక్సన్ ను ఆర్థికంగా స్థిరపడేలా చేశాడు. ఆ బ్యాంకులలో కొన్ని: స్టాక్‌హోంs ఎన్స్కిల్డ బ్యాంకు (తరువాత వినీలమయిన, Skandinaviska Enskilda Banken లో భాగం) మరియు వాల్లెన్‌బెర్గ్ కుటుంబం ఆధీనంలో ఉన్న స్వీడెన్ లోని ఇతర పెట్టుబడి బ్యాంకులు. బ్యాంకులు క్రమంగా LM ఎరిక్సన్ లో తమ "A" షేర్ల సంఖ్యను పెంచుకున్నాయి. కాని అప్పటికి ITT నే అత్యధిక వాటా కలిగిన ఒక సంస్థగా ఉంది. 1960 లో, వాల్లెన్‌బెర్గ్ కుటుంబం ఎరిక్సన్ లోని ITT వాటాలను కొనడానికి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటినుంచి వాల్లెన్‌బెర్గ్ కుటుంబం ఎరిక్సన్ పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చింది.

మార్కెట్ అభివృద్ది[మార్చు]

ఎరిక్సన్ DBH15 టెలిఫోన్.1931లో ప్రవేశపెట్టబడి 1947లో తిరిగి రూపొందించబడింది.ఈ డిజైన్ గెరార్డ్ కిల్జాన్ రూపకల్పన చేసినది

1920లు మరియు 1930లలో ప్రపంచ టెలిఫోన్ మార్కెట్లను ప్రభుత్వాలు స్థిరపరచడం మొదలుపెట్టాయి. అదివరకి ఊరు-ఊరా విడి విడిగా ఉండి, చిన్న చిన్న ప్రైవేట్ సంస్థలు సేవలు అందిస్తున్న వ్యవస్థలన్నిటిని విలీనం చేసి, ఒక పెద్ద సంస్థకు గుత్తకు ఇవ్వబడింది. ఎరిక్సన్ కు కొన్ని గుత్తలు లభించాయి. తమ పరికరాల విక్రయానికి ఇది సంస్థకు చాలా ముఖ్యంగా అయింది. ఇతర పెద్ద టెలిఫోన్ సంస్థలు కూడా ఇదే లక్ష్యంతోనే ఉన్నాయి. తమ అధీనంలో ఉన్న టెలిఫోన్ ఆపరేటింగ్ సంస్థల ద్వారా ఎరిక్సన్ తమ మొత్తం అమ్మకములో మూడవ వంతు సాధించింది.

మొత్తం మార్కెట్ ను తమలో పంచుకుందామని ప్రధాన టెలిఫోన్ సంస్థలు తమలో తాము పలు సంప్రదింపులు జరిపాయి. కాని ITT అతి పెద్ద సంస్థ కావడంతో ఆ సంస్థతో ఇతర సంస్థలు పోటీ చేయలేకపోయాయి. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఎరిక్సన్ టెలిఫోన్ ఆపరటింగ్ సంస్థలలో తమ కార్యకలాపాలని తగ్గించుకొని, తమకు బాగా తెలిసిన టెలిఫోన్లు మరియు స్విచ్ గేర్లను ఉత్పత్తి చేసే కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. విదేశాలలో తమకు ఉన్న ఉత్పాదనా సదుపాయాలు మరియు అనుబంధ సరఫరా సంస్థల సహాయంతో ఈ కార్యకలాపాలను ఎరిక్సన్ తేలికగా చేపట్టింది. ఈ సంస్థలు ఎటువంటి అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలలో పాల్గొనకుండా, స్థిరంగా ఉన్నాయి. బ్రిటన్ లో ఉన్న బీస్టన్ కర్మాగారం చాలా ఉపయోగకరంగా మారింది. అది ఎరిక్సన్ కు టెలిఫోన్ నేషనల్ కంపెనీకి మధ్య ఒక ఉమ్మడి సంస్థగా ఏర్పాటయింది. ఈ కర్మాగారం స్ట్రోగేర్ నుంచి BPO లైసెన్స్ తో ఆటోమేటిక్ పరికరాలను ఉత్పత్తి చేసింది. దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా వంటి పూర్వ కాలనీలకు తమ ఉత్పత్తిలో చాలా భాగాన్ని ఎగుమతి చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం పరికరాలు ఒప్పందాలను వివిధ సంస్థలకు పంచి ఇచ్చింది. బ్రిటన్ లో ఎరిక్సన్ చాలా కాలమునుండి ఉండడం, ఉత్పాదనా సదుపాయాలు కలిగి ఉండడం వలన ఈ ఒప్పందాలలో చాలా వాటిని కైవసం చేసుకోగలిగింది. ఎరిక్సన్ పరికరాలు మంచి నాణ్యత కలిగి ఉండేవి.[ఉల్లేఖన అవసరం]

గ్రేట్ డిప్రెషన్ తరువాత విక్రయాలు పెరిగినా, శతాబ్ద ప్రారంభములో సంస్థ ఉన్న స్థితిని మరల పొందలేక పోయింది. ఇంకా పూర్తి స్థాయిలో సంస్థ ఫోన్ లను తయారుచేస్తున్నా, స్విచింగ్ పరికరాలు సంస్థ యొక్క ముఖ్య ఉత్పాదనగా మారింది. మోల్దేడ్ తెర్మోప్లాస్టిక్ ఫోన్ లు (బెకలైట్ వంటివి) వాడకం మార్కెట్ లో ఎక్కువ కావడంతో ప్రత్యేకమైన ఎరిక్సన్ రకం ఫోన్ లకు గిరాకి తగ్గింది.

1980లలో, ఫుట్ బాల్ షర్టు స్పాన్సర్షిప్ రావడంతో, ఎరిక్సన్ రెండు ఇంగ్లీష్ ఫుట్ బాల్ క్లబ్ లను 1990లలో స్పాన్సర్ చేసింది-బ్రెంట్ ఫోర్డ్ మరియు క్వీన్స్ పార్క్ రెంజర్స్.

తదుపరి అభివృద్ది[మార్చు]

ఇంకా ఎరిక్సన్ ప్రపంచ టెలికమ్యూనికేషన్ రంగంలో ప్రధాన సంస్థగా కొనసాగింది. 1956లో, సంస్థ ప్రపంచంలో తొలిసారిగా MTA అనే పూర్తి ఆటోమేటిక్ మొబైల్ టెలిఫోన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది.[4] 1960లలో, ప్రపంచంలోనే తోలిసారిగా హ్యాండ్స్-ఫ్రీ స్పీకర్ ఫోన్ లను విడుదల చేసింది. 1956లో, విపరీతంగా మార్పు చేయబడిన శైలి కల ఎరికోఫోన్ అను ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ సేకరణకు చాలా అనువుగా ఉండేది. ఎరిక్సన్ యొక్క క్రాస్ బార్ స్విచింగ్ పరికరాలు ప్రపంచవ్యాప్తంగా పలు టెలిఫోన్ పరిపాలనా వ్యవస్థలలో అతి ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. మంచి నాణ్యత కలిగిన ఈ పరికరాలు మొబైల్ ఫోన్ వంటి రంగాలలో ఇప్పటికి ప్రభావము చూపుతూ ఉన్నాయి.[ఉల్లేఖన అవసరం]

కొనుగోళ్ళు, వ్యాప్తి చెందటం, ధృఢ పరచుటం మరియు సహకారము[మార్చు]

శతాబ్ద ప్రారంభములో ఇంటర్నెట్ మరియు వయర్లెస్ టెలిఫోనీ రంగాలు విలీనం అవ్వడం ప్రారంభించడంతో, 2000లో మోటోరోల (US), ఎరిక్సన్, నోకియా (ఫిన్లాండ్) సంస్థలు మొబైల్ పరికరాల ద్వారా ఎలక్ట్రానిక్ లావాదేవీలు ఉమ్మడిగా సురక్షణకు ప్రమాణాలను రూపొందింస్తున్నట్లు ప్రకటించాయి. మే 2000లో, వయర్లెస్ స్ట్రేటజిక్ ఇనిషియేటివ్[5]ను యూరోపియన్ కమిషన్ సృష్టించింది. ఇది ఐరోపాలోని నాలుగు ప్రధాన టెలికమ్యూనికేషన్ సంస్థలు సమాఖ్య - ఎరిక్సన్, నోకియా, ఫ్రాన్సు సంస్థైన అల్కాటెల్, మరియు జర్మన్ సంస్థైన సీమెన్స్ AG. ఈ సంస్థలు ఉమ్మడిగా నూతన ఆధునిక వయర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థల యొక్క క్రొత్త నమూనాలను పరీక్షించవలసి ఉంది. ఒక అంతర్జాతీయ ఆలోచనా మండలితో సమావేశం అయిన తరువాత, ఈ కన్సార్టియంలోని సంస్థలు డిసంబర్ 2000లో, ఇతర సంస్థలను 2001లో జరిగిన వయర్లెస్ వరల్డ్ రిసెర్చ్ ఫోరంలో పాల్గొనవలసినదిగా ఆహ్వానించాయి.

2000లో, సమాచార సాంకేతిక రంగం కుప్ప కూలడం, స్వీడెన్ లో ఆర్థిక సమస్యకు దారి తీసింది. దేశములోని ఇతర వేగంగా పెరుగుతున్న ఇంటర్నెట్ సలహా సంస్థలు, డాట్-కాం స్టార్ట్-అప్ సంస్థల మాదిరిగానే, ప్రపంచంలో అతి పెద్ద మొబైల్ టెలికమ్యూనికేషన్ పరికరాల తయారీ సంస్థైన ఎరిక్సన్, వేలాది మందిని ఉద్యోగాలనుంచి తొలగించింది. 2000లో, ప్రపంచంలో అతి పెద్ద చిప్ తయారి సంస్థ అయిన ఇంటెల్ కార్ప్., $1.5 బిలియను విలువ గల ఒప్పందాన్ని సంతకం చేసింది. దీని ప్రకారం, మరుసటి మూడు సంవత్సరాలకు LM ఎరిక్సన్ కు ఫ్లాష్ మెమరీను ఆ సంస్థ సరఫరా చేయాలి.

2001లో, ప్రపంచవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్ సంస్థలు స్టాక్ ధర కూలిపోవడం మరియు భారీ సంఖ్యలో ఉద్యోగాలను తొలగించడం వంటి పరిణామాలను ఎదుర్కున్నాయి. సెప్టెంబరు నాటికి, ప్రపంచ టెలికాం కెరియర్ సంస్థలు మరియు సరఫరా సంస్థల స్టాక్ మార్కెట్ విలువ, మార్చి 2000లో ఉన్న $6.3 ట్రిల్లియన్ ల నుండి $3.8 ట్రిల్లియన్ కు పడిపోయింది. 2001 సంవత్సరపు రెండవ త్రైమాసికంలో మాత్రమే 25 లక్షలకంటే ఎక్కువ ఉద్యోగాలు తొలగించపడ్డాయి. ప్రధాన పరికరాలు ఉత్పత్తి సంస్థలు - మోటోరోల (US), లుసెంట్ టెక్నాలజీస్ (US), మరియు సిస్కో సిస్టమ్స్ (US), మార్కొని (UK), సీమెన్స్ AG (జర్మనీ), నోకియా (ఫిన్లాండ్) మరియు ఎరిక్సన్ - వారి స్వదేశములో మరియు ప్రపంచవ్యాప్తంగా వారి అనుబంధ సంస్థలలో ఉద్యోగాలను తొలగించాయి.

కెనడాకు చెందిన నార్టెల్ నెట్వర్క్స్ లిమిటెడ్ అత్యధిక ఉద్యోగాలను తొలగించింది. ఆ సంస్థ 50% ఉద్యోగులను (దాదాపు 50,000 ఉద్యోగాలు) తీసివేసింది. అలాగే, ఫ్రాన్స్ పరికరాల తయారి సంస్థ అల్కాటెల్ 33,000 ఉద్యోగాలను (దాదాపు మొత్తం ఉద్యోగుల సంఖ్యలో మూడవ వంతు) తొలగించింది.

ఏప్రియల్ 2001 లో ఎరిక్సన్ మరియు జపాన్ కు చెందిన సోనీ కార్ప్ వారు ఒక ఉమ్మడి సంస్థను వారి వారి సేల్లూలర్ హాండ్ సెట్ ఉత్పత్తి వ్యాపారాలను కలుపుకుని లండన్ కేంద్రంగా, దీనిని స్థాపిస్తామని ప్రకటించారు.

ఆర్ధికంగా, అధికమైన పెట్టుబడుల కారణాన, 2002 సంవత్సరము, ఆ క్రితం సంవత్సరం కంటే ప్రపంచ ఇంటర్నెట్ మరియు టెలీకమ్యూనికేషన్స్ వ్యవస్థకు అధ్వానంగా పరిణమించింది. LM ఎరిక్సన్, రాయల్ KPN NV, వోడఫోనే గ్రూప్ PLC, డ్యూష్ టెలికాం AG సంస్థలకు కార్పరేట్ చరిత్రలోనే అత్యధిక నష్టం వాటిల్లింది. టెలికమ్యూనికేషన్ రంగంలో ఏర్పడిన సమస్యల వలన దివాలాలు, ఉద్యోగ నష్టాలు ఏర్పడ్డాయి. పలు ప్రధాన సంస్థలలో అధిష్టానంలో మార్పు వచ్చింది. 2002లో అత్యదిక నష్టం వాటిల్లిన ఒక ప్రముఖ సంస్థ, ఎరిక్సన్. అప్పుడు ఆ సంస్థ ప్రపంచంలోనే అతి పెద్ద వయర్లెస్ టెలికాం వ్యవస్థల ఉత్పాదనా సంస్థ. వేలాది ఉద్యోగాలు తొలగించపడి, ఆ సంస్థ వాటాదారుల నుండి $3 బిలియనులు సేకరించవలసి వచ్చింది.

జూన్ 2002లో, ఇంఫినియాన్ టెక్నాలజీస్ AG (అప్పట్లో ఆరవ అతిపెద్ద సెమీకండక్టర్ సరఫరా సంస్థ మరియు సీమెన్స్ AG యొక్క ఉపసంస్థ) LM ఎరిక్సన్ యొక్క మైక్రో ఎలెక్ట్రానిక్స్ విభాగాన్ని €400 మిలియన్లకు కొనుగోలు చేసింది.

అక్టోబరు 2005లో, LM ఎరిక్సన్ అప్పుడు కష్టాలలో ఉన్న బ్రిటిష్ టెలికాం తయారి సంస్థ అయిన మార్కొనిలో పెద్ద వాటా కొనుగోలు చేసింది. ఈ కొనుగోలులో భాగంగా మార్కొని బ్రాండ్ పేరు కూడా ఎరిక్సన్ కు లభించింది. ఈ బ్రాండ్ పేరు చాలా "రేడియో యొక్క తండ్రి" అని పిలవబడే గుగ్లీల్మో మార్కొని స్థాపించిన మార్కొని కంపెనీ నాటిది. సెప్టెంబరు 2006లో, LM ఎరిక్సన్, ఎరిక్సన్ మైక్రోవేవ్ సిస్టమ్స్ అనే తమ రక్షణ వ్యాపారం యొక్క పెద్ద భాగాన్ని SAAB AB అనే సంస్థలు విక్రయించింది. ఈ రక్షణ వ్యాపారం ముఖ్యంగా సెన్సార్ మరియు రాడార్ వ్యవస్థలను తయారి చేసూ ఉండేది. విక్రయం అనంతరం, దీని పేరు సాబ్ మైక్రోవేవ్ సిస్టమ్స్గా మార్చబడింది. ఈ విక్రయం తరువాత, అంతకు ముందు ఒక ఉమ్మడి సంస్థగా ఉండిన సాబ్ ఎరిక్సన్ స్పేస్ ఇప్పుడు పూర్తిగా SAAB ఆధీనంలో వచ్చింది. అయితే, నేషనల్ సెక్యూరిటీ & పబ్లిక్ స్ఫటి విభాగం ఈ విక్రయంలో భాగంగా కాదు. ఈ విభాగం ఎరిక్సన్ ఆధీనంలోకి వచ్చింది. నవంబరు 2006లో, LM ఎరిక్సన్ UIQ సాఫ్ట్‌వేర్ను సింబియాన్ నుంచి తమ స్మార్ట్‌ఫోన్‌ల కొరకు కొనుగొలు చేసింది.

జనవరి 2007లో, మాక్స్వెల్ అక్విసిషన్ కార్పరేషన్ అనే పరోక్షంగా తమ ఆధీనంలో ఉన్న అనుబంధ సంస్థను రెడ్‌బాక్ నెట్‌వర్క్స్ ఇంక్. (రెడ్‌బాక్‌‌) తో LM ఎరిక్సన్ విలీనం చేసింది.ఈ విలీనం అనంతరం రెడ్‌బాక్‌‌ LM ఎరిక్సన్ యొక్క అనుబంధ సంస్థగా మారింది. ఫిబ్రవరి 2007 లో, LM ఎరిక్సన్ ఎంట్రిస్ఫియర్‌ను కొనుగొలు చేసింది. ఈ సంస్థ యునైటెడ్ స్టేట్స్ లో ఫైబర్ యేక్సస్ టెక్నాలజీని అందింస్తున్న సంస్థ. సెప్టెంబరు 2007లో, LM ఎరిక్సన్ LHS టెలికాం Inc. అనే జర్మన్ సాఫ్ట్‌వేర్ సంస్థలో 85% వాటాను కొనుగోలు చేసింది. ఈ వాటాను తరువాత 87.5%కు పెంచింది.

జూలై 2009లో, ఎరిక్సన్ నోర్టెల్ యొక్క వయర్లెస్-పరికరాలు యూనిట్ ను $1.13 బిలియన్ కు కొనుగోలు చేసింది. ఈ యూనిట్ లో CDMA2000 మరియు LTE ప్రధానమైనవి. ఈ యూనిట్ కొరకు నోకియా సీమెన్స్ నెట్వర్క్స్ మరియు మాట్లిన్ పాటర్సన్ గ్లోబల్ అడ్వైసర్స్ సంస్థలు పోటీ పడ్డాయి.

2008 ఫిబ్రవరి 18న, యాస్ట్రా టేక్నోలోజీస్ ఎరిక్సన్ లోని PBX విభాగం ఎంటర్ప్రైస్ ని తమ ఆధీనంలోనికి తెచ్చుకున్నట్లుగా ప్రకటించింది.[6]

సంస్థ యొక్క ప్రధాన వ్యాపారంలో పోటీదార సంస్థలలో కొన్ని: అల్కాటెల్-లుసెంట్, హువవై, నోకియా సీమెన్స్ నెట్వర్క్స్ మరియు ZTE. సంస్థ యొక్క ప్రధాన వ్యాపారంలో కొంత భాగంలో పోటీ చేసే సంస్థలు సిస్కో, IBM, EDS, ఏక్సంచర్, నోకియా, మోటోరోల, సాంసంగ్, LG ఎలెక్ట్రానిక్స్, NEC, షార్ప్ మరియు ఇటీవల కాలంలో ఆపిల్ ఇంక్..

కార్పొరేట్ పరిపాలన[మార్చు]

LM ఎరిక్సన్ పాలక మండలిలో ప్రస్తుతం ఉన్న సభ్యులు: మోనికా బెర్జ్‌స్ట్రోం, పేటర్ బోన్‌ఫీల్డ్, క్రిస్టిన డేవిడ్సన్, బోర్జే ఎఖోలం, అన్న గల్ద్‌స్ట్రాండ్, జాన్ హెడ్‌లుండ్, కతేరిన్ హడ్సన్ ఉల్ఫ్ జోహన్స్సన్, పెర్ లింద్, స్వేర్కేర్ మార్టిన్-లోఫ్, నాన్సీ మకిన్స్ట్రి, టోర్బ్‌జార్న్ నైమాన్, అండేర్స్ నైరెన్, కార్ల్-హెన్రిక్ స్వాన్బెర్గ్, మిచెల్ ట్రేస్చౌ మరియు మార్కస్ వాల్లెన్‌బెర్గ్.[7]

ఉత్పత్తులు మరియు సేవలు[మార్చు]

LM ఎరిక్సన్ అన్ని ప్రధాన మొబైల్ కమ్మ్యినికేషన్ ప్రమాణాలకు ఎండ్-టు-ఎండ్ సొల్యూషన్స్[clarification needed]ను అందిస్తుంది. సంస్థలు మూడు ప్రధాన వ్యాపార విభాగాలు ఉన్నాయి.

 • బిసినెస్ యూనిట్ నెట్వర్క్స్ (BNET) మొబైల్ కు అవసరమైన నెట్ వర్క్స్ మరియు ఫిక్సెడ్ లైన్ పబ్లిక్ టెలిఫోన్ నెట్ వర్క్స్ పై దృష్టి సారిస్తుంది.
 • బిజినెస్ యూనిట్ గ్లోబల్ సర్వీసెస్ (BUGS) టెలికాం సంబంధిత సేవలను అందిస్తుంది. ఉదాహరణకు, ఒక ఆపరేటర్ నెట్వర్క్ ను నడిపే మరియు సంబంధిత వ్యాపార వ్యవహారాలకు పూర్తి బాధ్యతను ఈ విభాగం తీసుకుంటుంది.
 • బిజినెస్ యూనిట్ మల్టీమీడియా (BMUM) చార్జింగ్, ప్రోవిషనింగ్, IPTV, మొబైల్ TV మరియు ఇతర సహాయ, మీడియా వ్యవస్థలు, ముఖ్యంగా టెలికాం ఆపరేటర్లకు అందిస్తుంది.

అంతే కాక, గణనీయమైన పరిశోధనా మరియు అభివృద్ధి విభాగం కూడా ఉంది. పలు కేంద్రీకరించిన కార్యకలాపాలను కూడా సంస్థ చేపడుతుంది. స్థానిక కార్యకలాపాలను సమన్వయ పరచడానికి ప్రాంతాలు వారిగా మార్కెట్ యూనిట్ లు ఉన్నాయి. పెద్ద ఖాతాదారులకు ప్రపంచావ్యాప్త మరియు బహుళ-దేశ ఖాతాలు కూడా ఉన్నాయి.

వ్యాపార యూనిట్ నెట్వర్క్లు: మొబైల్ మరియు ఫిక్సెడ్ నెట్వర్కులు[మార్చు]

LM ఎరిక్సన్ నెట్ వర్క్ ఆపరేటర్లకు మొబైల్ సిస్టమ్స్ పరిష్కారాలను అందిస్తుంది. వాటిలో కొన్ని: రేడియో బేస్ స్టేషనుస్, బేస్ స్టేషను మరియు రేడియో నెట్వర్క్ కంట్రోలర్స్, మొబైల్ స్విచింగ్ కేంద్రాలు మరియు సర్వీసు అప్లికేషను నోడ్స్. సంస్థ యొక్క ఎండ్-టు-ఎండ్ పరిష్కారాలు ఆపరేటర్ లకు 3Gకు నెట్వర్క్ మైగ్రేషన్ ను అందిస్తుంది.

మొబైల్ అందుబాటు[మార్చు]

ఎరిక్సన్ అందించే మొబైల్ టెలికమ్యూనికేషన్ సిస్టంలలో ప్రధాన రెండవ-తరం (2G) (గ్లోబల్ సిస్టం ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ (GSM), టైం డివిషన్ మల్టిపిల్ ఏక్సస్ (TDMA), కోడ్ డివిషన్ మల్టిపిల్ ఏక్సస్ (CDMA) ), 2.5G (జనరల్ పాకెట్ రేడియో సర్విస్ (GPRS) ) మరియు 3G (ఎన్హాన్స్డ్ డేటా ఫర్ GSM ఎవల్యూషన్ (ఎన్హాన్స్డ్ డేటా రేట్స్ ఫర్ GSM ఎవల్యూషన్ (EDGE), వైడ్ బ్యాండ్ కోడ్ డివిషన్ మల్టిపిల్ ఏక్సస్ (W-CDMA), హై-స్పీడ్ డౌన్ లింక్ పాకెట్ ఏక్సస్ (HSDPA), కోడ్ డివిషన్ మల్టిపిల్ ఏక్సస్ (మూడవ తరం సేల్లులర్/రేడియో టెక్నాలజీ) (CDMA2000), టైం డివిషన్ సిన్క్రోనాస్ కోడ్ డివిషన్ మల్టిపిల్ ఏక్సస్ (TD-SCDMA) ) మొబైల్ టెక్నాలజీ ప్రమాణాలు. నెట్‌వర్క్ ఆపరేటర్ యొక్క ప్రస్తుత నెట్‌వర్క్ ప్రమాణంతో సంబంధం లేకుండా వారికి అనుకూలమైన పరిష్కారాన్ని చూపగలుగుతుంది. 3G యొక్క లాంగ్-టర్మ్ ఎవల్యూషన్ (LTE) కు ప్రమాణాల అభివృద్ధిలో ఎరిక్సన్ ముఖ్య పాత్ర వహిస్తుంది.

ఫిక్సెడ్ బ్రాడ్‌బ్యాండ్ ఏక్సస్[మార్చు]

నెట్‌వర్క్ ఆపరేటర్లు తమ ఫిక్స్డ్ మరియు మొబైల్ నెట్‌వర్క్ లను విలీనం చేసే సమయములో ఎరిక్సన్ యొక్క ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ ఉత్పత్తులు ఒక ముఖ్య పాత్ర వహిస్తాయి. ఈ సంస్థ బ్రాడ్‌బ్యాండ్ మల్టి-సర్వీస్ కమ్యూనికేషన్స్ పరికరాలు మరియు సేవలను లాటిన్ అమెరికా మరియు ఐరోపాలోని ఫిక్స్డ్ నెట్‌వర్క్ ఆపరేటర్ లకు అందిస్తుంది. ఇటువంటి మల్టి-సర్వీస్ నెట్‌వర్క్ లకు ఎరిక్సన్ అందించే పరిష్కారాలు ఒక లేయర్డ్ సాఫ్ట్-స్విచ్ సర్వీస్ మరియు కంట్రోల్ ఆర్కిటెక్చర్ ను వాడుతుంది. ఇది బ్రాడ్‌బ్యాండ్ యాక్సెస్ మరియు కోర్ నెట్‌వర్క్ రూటింగ్ మరియు ట్రాన్స్మిషన్ లను కలిపి అందిస్తుంది. ఫిక్స్డ్ నెట్‌వర్క్ పరికరాలు మరియు సంబంధిత నెట్‌వర్క్ రోల్-అవుట్ సేవలు సిస్టం విక్రయాల్లో 7% ఉంటుంది.

రేడియో అందుబాటు ఉన్న నెట్వర్కులు[మార్చు]

చిన్న పికో సెల్ (భవనాల లోపల కెపాసిటి మరియు కవరేజ్ పెంచడానికి మొబైల్ నెట్వర్క్ లో ఉన్న చిన్న సెల్లులు) నుండి హాయ్ కెపాసిటీ మాక్రో సెల్ వరకు అన్ని రకాల రేడియో బేస్ స్టేషనులను LM ఎరిక్సన్ అందిస్తుంది. రేడియో బేస్ స్టేషన్లు మొబైల్ హ్యాండ్సెట్, మొబైల్ నెట్‌వర్క్ మధ్య ఏక్సస్ మరియు ఇంటర్ కనెక్షన్ లను అందిస్తాయి. 2G GSM రేడియో బేస్ స్టేషనులు మరియు బేస్ స్టేషను కాంట్రోల్లెర్ల ప్రధాన అంశం ఏమంటే, వాటిని 2.5G/GPRS మరియు 3G/EDGE ట్రాన్స్‌మిషన్ కు మార్చుకోవచ్చు. అలాగే W-CDMA బేస్ స్టేషను లను కూడా HSDPAకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు.

రేడియో బేస్ స్టేషను మరియు రేడియో ఏక్సస్ నెట్‌వర్క్ లు కంట్రోలర్లు రేడియో ఏక్సస్ నెట్‌వర్క్ యొక్క ఇతర అంశాలు. ఇవి రేడియో బేస్ స్టేషను, కొర్ నెట్‌వర్క్ మధ్య ట్రాఫిక్ ను నిర్వహిస్తుంది.

2Gలో, బేస్ స్టేషను కంట్రోలర్లు మరియు మొబైల్ స్విచింగ్ సెంటర్లు, వాడుకదార్లు వాయిస్ కాల్ లేదా డేటా ట్రాన్స్‌మిషన్లో ఉన్నప్పుడు ఒక సెల్ సైట్ నుండి మరొక సైట్ కు వెళ్ళినప్పుడు ఆ కాల్ ను బదిలీ చేస్తాయి. అలాగే, 3G నెట్‌వర్క్లో, రేడియో నెట్‌వర్క్ కంట్రోలర్, సర్వీస్ లేయర్ లోపల ఉన్న మొబిలిటి సర్వర్ నోడ్స్ తో కలిసి ఈ కాల్ హ్యాండ్-ఓవర్ పనిని చేస్తుంది.

కోర్ నెట్‌వర్క్ నోడ్స్ రేడియో ఏక్సస్ నెట్‌వర్క్ ను ఇతర నెట్‌వర్క్ భాగాలతో కలుపుతాయి. పలు కోర్ నెట్‌వర్క్ స్విచింగ్ సిస్టంలు, బేస్ స్టేషను యొక్క కంట్రోలర్లు మరియు రేడియో నెట్‌వర్క్‌లు ఉమ్మడి ప్లాట్ఫారాల పై నిర్మించబడి ఉంటాయి. LM ఎరిక్సన్ యొక్క రేడియో బేస్ స్టేషను ఉత్పత్తుల మాదిరిగానే, మొబైల్ స్విచింగ్ ఉత్పత్తులు కూడా స్కేలబిలిటీ మరియు కెపాసిటి కలిగి ఉంటాయి. మొబైల్ నెట్‌వర్క్ పరికరాలు మరియు సంబంధిత నెట్‌వర్క్ రోల్-అవుట్ సేవల వాటా సంస్థ యొక్క మొత్తం విక్రయంలో సుమారు 74% ఉంటుంది.[ఉల్లేఖన అవసరం]

IP కోర్ నెట్వర్క్ (స్విచింగ్, రూటింగ్, నియంత్రణ మరియు రవాణా)[మార్చు]

ఎరిక్సన్ యొక్క కోర్ నెట్వర్క్ సొల్యూషన్స్ లో మొబైల్ సాఫ్ట్ స్విచ్, IP అవస్థాపన సౌకర్యాలు, IMS, మీడియా గెట్ వేస్, మొబైల్ ప్యాకెట్ బాక్ బోన్ నెట్వర్క్ (MPBN) మరియు మైక్రోవేవ్ మరియు ఆప్టికల్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ వాయిస్ మరియు డేటా ట్రాఫిక్ కు నిర్వాహణ అందించటము మొదలగునవి ఉంటాయి.

ఎరిక్సన్ నెట్వర్క్ టెక్నాలజీలు[మార్చు]

ఎరిక్సన్ నెట్‌వర్క్ టెక్నాలజీస్ (కేబిల్స్) యూనిట్ టెలికాం మరియు పవర్ నెట్‌వర్క్ లకు పలు రకాల కేబిల్ సంబంధిత ఉత్పత్తిలను అందిస్తుంది. LM ఎరిక్సన్ పాసివ్ ఫిబెర్ ఏక్సస్ నెట్‌వర్క్ రంగంలో కార్యకలాపాలు చేపడుతుంది. వీటిలో రాగి, ఫైబర్ ఆప్టిక్ మరియు మొబైల్ టెక్నాలజీస్ యొక్క సంయమనం కూడా ఉంది. కేబిల్స్ గ్రూప్ యొక్క మొత్తం అమ్మకంలో సుమారు మూడవ వంతు ఇంటర్-సెగ్మెంట్ విక్రయం నుండి వస్తుంది. చైనా, ఇండియా, మలేషియా మరియు స్వీడెన్ దేశాలలో ఉత్పత్తి జరుగుతుంది.

 • AXE టెలిఫోన్ ఎక్స్‌చేంజ్
 • బేస్ ట్రాన్సీవర్ స్టేషను
 • నెట్వర్క్ స్విచింగ్ సబ్ సిస్టం

ఎరిక్సన్ పవర్ మోడ్యూల్స్[మార్చు]

ఎరిక్సన్ పవర్ మోడ్యూల్స్ డైరెక్ట్ విద్యుత్ (DC) /DC కన్వర్టర్లు మరియు DC/DC రెగ్యులేటర్లకు ప్రముఖ సరఫరా సంస్థ, ముఖ్యంగా కమ్యునికేషన్స్ పారిశ్రామిక రంగంలోనూ, మల్టీప్లెక్సార్స్, స్విచ్ లు, రూటర్లు మరియు రేడియో బేస్ స్టేషనులు వంటి అధునాతన పరికరాలను అందజేస్తుంది. చైనాలో ఉత్పత్తి చేయబడతాయి.

ఎరిక్సన్ మైక్రోవేవ్ సిస్టమ్స్[మార్చు]

ఎరిక్సన్ మైక్రోవేవ్ సిస్టమ్స్ రాడార్ సిస్టమ్స్ కు రూపకల్పన చేసి, చివరకు సాబ్ AB 2006 సెప్టెంబరు 1 నాడు టెలికం మీద దృష్టి సారించి, సైనిక మార్కెట్ కు దూరంగా జరిగే ప్రయత్నంలో భాగంగా అమ్మటం జరిగింది.

మల్టీ మీడియా వ్యాపార సంస్థ[మార్చు]

అత్యావసర సిస్టంలే కాకుండా కంటెంట్ మరియు అప్లికేషన్ భాగస్వాముల మధ్య సంబంధాల వలన మొబైల్ మల్టిమీడియా పరిష్కారాలను[clarification needed] అందించడానికి ఎరిక్సన్‌కు వీలు కలుగుతుంది. మొబైల్ ఫొన్లు మరియు మొబైల్ ఫొన్ ప్లాట్‌ఫార్మ్‌ల పనిని కూడా ఈ వ్యాపార యూనిట్ పర్యవేక్షిస్తుంది. 2009లో, సొషల్ మీడియా పోర్టల్ఙను ఎరిక్సన్ ప్రారంభించింది. దీని ద్వరా టెలికాం ఆపరేటర్లు వెబ్ 2.0 డొమైన్ లో ప్రవేశించవచ్చు. ఈ పరిష్కారములో ఒక భాగమే, Pixl8r ప్రమాణము. దీని వలన క్రాస్-ఆపరేటర్ సోషల్ కమ్యూనిటీలు ఏర్పాటు చేసుకోవచ్చు.

పరికరాలు[మార్చు]

సోనీ ఎరిక్సన్ మొబైల్ కమ్యునికేషన్స్ AB (సోనీ ఎరిక్సన్), మొబైల్ ఫోన్లు, యేక్ససరీలు మరియు పెర్సనల్ కంప్యూటర్ (PC) కార్డులను అందిస్తుంది. ఉత్పత్తుల రూపకల్పన, అభివృద్ధి, ప్రచారం, విక్రయం, పంపిణి, వినియోగదారుల సేవలు వంటి కార్యక్రమాలను సోని ఎరిక్సన్ చూసుకుంటుంది. సోని ఎరిక్సన్ హాండ్‌సెట్‌లలో మూడవ వంతు చైనా లోని కర్మాగారములో తయారు చేయబడుతుంది. మిగిలిన మూడులో రెండవ వంతు హాండ్‌సెట్‌లను ఒప్పంధ తయారీదారుల (EMS), ఇతర పరికరాల తయారీదారుల (ODM) ఆసియా, లాటిన్ అమెరికా మరియు ఇరోపా లలో పలు నగరాలలో ఉత్పత్తి చేయబడుతుంది.

సేల్లూలర్ టెలిఫోన్లు[మార్చు]

2001 లో సోనీ ఎరిక్సన్ అనే సంయుక్త సంస్థ స్థాపించబడినప్పటినుంచి, ఎరిక్సన్ స్వయంగా సెల్లులర్ ఫోన్ లను తయారు చేయడంలేదు. పూర్వ మాడల్‌లు కొన్ని:

 • ఎరిక్సన్ GA628 - దాని z80 CPU కు ప్రసిద్ధి చెందింది
 • ఎరిక్సన్ SH888 - వైర్లెస్ మోడెం సామర్ధ్యాలు కలిగిన మొదటి మొబైల్ ఫోన్.
 • ఎరిక్సన్ A1018 - డ్యూయెల్ బాండ్ సెల్ఫోన్, తేలికగా హాక్ చేయగలిగినది. మొదటిది
 • ఎరిక్సన్ A2618 & ఎరిక్సన్ A2628 - డ్యూయెల్బాండ్ సెల్ఫోన్స్. PCF8548 I²C కంట్రోలర్ పై ఆధారపడిన గ్రాఫికల్ LCD డిస్ప్లే వాడండి [1].
 • ఎరిక్సన్ T10 - రంగుల సెల్ఫోన్
 • ఎరిక్సన్ T18
 • ఎరిక్సన్ T28 - అతి నాజూకైన మరియు అధునాతనమైన ఫోన్. అధునాతనమైన లిథియం పాలీమర్ బ్యాటరీలు వాడుతుంది. ఎరిక్సన్ T28 FAQ PCF8558 I²C కొంట్రోలర్ పై ఆధారపడిన గ్రాఫికల్ LCD డిస్ప్లే వాడుతుంది.
 • ఎరిక్సన్ T29
 • ఎరిక్సన్ T39 - T28 ను పోలి ఉండి కూడా ఒక GPRS మోడెం మరియు ట్రైబాండ్ సామర్ధ్యాలు కలిగినది.
 • ఎరిక్సన్ T66
 • ఎరిక్సన్ T68 - సోనీ ఎరిక్సన్ T68iగా ముద్రపడిన రంగుల డిస్ప్లే కలిగిన మొదటి ఎరిక్సన్ హాండ్ సెట్
 • ఎరిక్సన్ R310s
 • ఎరిక్సన్ R320s
 • ఎరిక్సన్ R380 - సింబయెన్ OS వాడిన మొదటి సెల్ఫోన్
 • ఎరిక్సన్ R520 - T39 తో పోలిక కలిగి ఉండి, ఒక కాండీ బార్ తరహా ఫాక్టరీ వలెనూ మరియు లోపలే నిర్మించబడిన స్పీకర్ ఫోన్ మరియు ఒక ఆప్టికల్ ప్రోక్సిమిటీ సెన్సార్ వంటి అదనపు అనువైన అంశాలు కలిగినటువంటిది.
 • ఎరిక్సన్ R600
టెలీఫోన్లు[మార్చు]
 • ఎరిక్సన్ డయలాగ్
 • ఎరికోఫోన్

ఎరిక్సన్ మొబైల్ ప్లాట్‌ఫార్మ్‌స్[మార్చు]

ఎరిక్సన్ మొబైల్ ప్లాట్‌ఫార్మ్‌స్, మొబైల్ హాండ్‌సెట్‌లు మరియు PC కార్డులు వంటి పరికరాలలో వాడే GSM/EDGE మరియు WCDMA/HSPA ప్లాట్‌ఫార్మ్‌లకు అవసరమైన టెక్నాలజీ ప్లాట్‌ఫార్మ్‌లను అందిస్తుంది. ఎరిక్సన్ మొబైల్ ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా, ఓపన్-స్టాండార్డ్, ఎండ్-టు-ఎండ్ ఇంటర్ ఆపరేటబిలిటి పరీక్షించబడిన GSM/EDGE మరియు WCDMA టెక్నాలజీ ప్లాట్‌ఫార్మ్ లకు LM ఎరిక్సన్ లైసెంస్ ఇస్తుంది. సంస్థ ఉత్పత్తులలో కొన్ని: రెఫెరెన్స్ డిజైన్లు, ప్లాట్‌ఫార్మ్ సాఫ్ట్‌వేర్, అప్లికేషను-స్పెసిఫిక్ ఇంటగ్రేటద్ సర్క్యూట్ (ASIC) డిజైన్లు మరియు అభివృద్ధి బోర్డ్‌లు, అభివృద్ధి మరియు సొధనా పరికరాలు, శిక్షణ, సపోర్ట్ మరియు డాకుమెంటేషన్. ఎరిక్సన్ మొబైల్ ప్లాట్‌ఫార్మ్‌స్ తొమ్మిది ప్రాంతాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. స్వీడన్‌లో ముఖ్య కార్యాలయం ఉంది.

ఎరిక్సన్ ఎంటర్‌ప్రైస్[మార్చు]

ఎరిక్సన్ ఎంటర్‌ప్రైస్, వ్యాపారాలకు, పబ్లిక్ సంస్థలకు, విద్యా సంస్థలకు కమ్యూనికేషన్స్ సిస్టంస్ మరియు సేవలను అందిస్తుంది. చిన్నపాటి మరియు పెద్ద సంస్థలకు ఇది పలు రకాల ఎంటర్‌ప్రైస్ అవసరాలను పూర్తి చేస్తుంది. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకొల్ (VoIP) -ఆధారిత ప్రైవేట్ బ్రాంచ్ ఎక్స్‌చేంజ్‌లు (PBX), వయర్లెస్ లోకల్ ఏరియా నెట్‌వర్క్‌లు (WLAN), మరియు మొబైల్ ఇంట్రానెట్ పరిష్కారాలను అందిస్తుంది. మొబైల్ ఎంటర్‌ప్రైస్‌తో, ప్రయాణంలో ఉన్న వాడుకదారులు పలు రకాల సేవలను పొందవచ్చు. అవి: ప్రైవేట్, పబ్లిక్, ఫిక్సడ్, వయర్లెస్ నెట్‌‌‌వర్క్ల ద్వారా వ్యాపారానికి అవసరమైన కమ్యూనికేషన్స్, సమాచార అప్లికేషన్‌లను వాడవచ్చు. ఎరిక్సన్ ఎంటర్‌ప్రిసే ప్రధానంగా స్వీడన్ నుంచి పనిచేస్తుంది. ఐతే, మార్కెట్ యూనిట్‌లు మరియు ఇతర భాగస్వాములు/పంపిణిదారుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తుంది. ఉత్పత్తి పూర్తిగా అవుట్‌సోర్స్ చేయబడుతుంది. 2008లొ, ఎరిక్సన్ ఎంటర్‌ప్రిసే వ్యాపారం ఆస్ట్ఱా అనే ఒక ప్రపంచవ్యాప్త ఎంటర్‌ప్రైస్ కమ్యూనికేషన్ సంస్థలు అమ్మబడింది.

వ్యాపార యూనిట్ గ్లోబల్ సర్వీసస్[మార్చు]

ఎరిక్సన్ పపంచంలోనే అతిపెద్ద టెలికాం సేవలు అందించే సంస్థ. టెలికాం సేవలలో సంస్థ యొక్క బలానికి సంస్థ యొక్క టెక్నాలజీ నేత్రుత్వం, R&D సాధనలు, దీర్ఘకాల ఇన్నొవేషన్ వంటి అంశాలే కారణం. సంస్థ అందించే సేవలలో కొన్ని: కంసల్టింగ్, సిస్టంస్ ఇంటెగ్రేషన్, నిర్వహించబడిన సేవలు, నెట్‌వర్క్ డిప్లాయ్మెంట్ మరియు ఇంటగ్రేషన్, విద్య మరియు సహాయ సేవలు. వీటిలో భాగాలు: నెట్‌వర్క్‌ల ప్రాణాలికా, నిర్మాణం, డిప్లాయింగ్, ఆప్టిమైజింగ్ మరియు నడపడం. ఖాతాదారులకు పరిష్కారాలు మరియు యుక్తి, టెక్నాలజీ, నెట్‌వర్క్, నడపడం మరియు అర్హత వంటి అంశాలలో సంప్రదింపు సేవలు.

టెలికాం పరిశ్రమలో నిర్వహించబడిన సేవలను సంస్థ అందిస్తుంది. కస్టమర్ నెట్‌వర్క్‌ యొక్క రోజు వారి కార్యకలాపాలను నిర్వహించే సేవను (హొమ్ ఇంటర్నెట్ సొల్యూషన్) విభాగం అందిస్తుంది. నెట్‌వర్క్ బిల్డ్-‌అవుట్ మరియు ఆన్-డిమాండ్ సామర్ధయాన్ని మరియు అప్లికేషన్లు మరియు కంటెంట్ నిర్వాహణా వంటి అంశాలను అందిస్తుంది. ఎరిక్సన్ యొక్క సర్వీసస్ విభాగంలో 30,000 సెర్వీస్ ప్రొఫెషనల్‌లు 175 దేశాలలో పనిచేస్తున్నారు.

నిర్వహించబడిన సేవలు[మార్చు]

టెలికాం పరిశ్రమలోనే నిర్వహించబడిన సేవలను పూర్తి స్థాయిలో అందిస్తున్న సంస్థ, ఎరిక్సన్.[ఉల్లేఖన అవసరం] సంస్థ అందిస్తున్న సేవలలో ఉన్నవి: కస్టమర్ నెట్‌వర్క్‌ యొక్క రూపకల్పన, నిర్మాణం, నడపడం, నిర్వహించడం. ఎండ్-యూసర్ సేవలు, వ్యాపార సహాయ సిస్టంలు, కంటెంట్ మరియు సర్వీస్ అప్లికేషన్ల హోస్టింగ్, నెట్‌వర్క్ కవరేజ్ మరియు కెపాసిటి ఆన్-డిమాండ్. నిర్వహించబడిన సేవారంగంలో అగ్రగామి[dubious ] సంస్థ అయిన ఎరిక్సన్, 2002 నుంచి ప్రపంచవ్యాప్తంగా 100కు పైన కాంట్రాక్ట్‌లను అధికారపూర్వకంగా ప్రకటించింది.[ఉల్లేఖన అవసరం] హోస్టింగ్ మినగా నిర్వహించబడిన సేవల కాంట్రాక్ట్‌లలో, ఎరిక్సన్ 225 మిలియను కంటే ఎక్కువ సబ్స్‌క్రైబర్ లకు సేవలు అందిస్తుంది. సెప్టెంబరు 2009లో, స్ప్రింట్ నెక్స్‌టెల్ యొక్క వయర్ లైన్ మరియు వయర్లెస్ నెట్‌వర్క్‌లను నిర్వహించడం ప్రారంభించింది.[8]

సహాయ సేవలు[మార్చు]

తమ కస్టమర్లకు నెట్‌వర్క్ అందుబాటుని పెంచడానికి, దీర్ఘకాల ఎవల్యూషన్‌‌ను పొందడం కొరకు ఎరిక్సన్ సహాయం అందిస్తుంది. తప్పులు జరగకుండా ముందుగానే ఆపడం మరియు జరిగిన తప్పులను సరిదిద్దుకోవడం, ఈ రెండిటికి సేవలను సంస్థ అందిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వనరులు మరియు స్థానిక వనరులను కలిపి ఎరిక్సన్ ఈ సహాయ సేవలను అందిస్తుంది.

విడి భాగాల నిర్వాహణా నుంచి కస్టమైజ్డ్ సాఫ్ట్‌వేర్ వరకు పూర్తి స్థాయి సహాయ సేవలను సంస్థ అందిస్తుంది. వాటిలో కొన్ని:

 • సరైన నెట్‌వర్క్ సమర్ధతను సాధించడం
 • నెట్‌వర్క్ కాంప్ల్క్సిటిను నిర్వహించడం
 • సర్వీసస్ ఎవల్యూషన్ ను రక్షించడం
 • వివిధ సరఫరాదారులను నిర్వహించడం
 • విడి భాగాల వాడకాన్ని చక్కపెట్టడం

సిస్టంస్ అనుసంధానం[మార్చు]

విద్య[మార్చు]

సంప్రదింపులు[మార్చు]

యుక్తి, టెక్నాలజీ, నెట్‌వర్క్, ఆపరేషన్స్ మరియు సమర్ధత వంటి అంశాలలో ఎరిక్సన్ సంప్రదింపు సేవలను అందిస్తుంది.

మార్కెట్ అభివృద్ధి, టెక్నాలజీ మార్పులు, పనితీరు సామర్ధ్యాలు వంటి అంశాలలో ఏర్పడే అవకాశాలను మరియు సవాళ్ళను ఎరిక్సన్ గుర్తిస్తుంది.

నెట్‌వర్క్ రోల్-అవుట్[మార్చు]

ఎరిక్సన్ అందించే నెట్‌వర్క్ రోల్-అవుట్ సేవలను సంస్థ ఉద్యోగులు, ఉప-కాంట్రాక్టర్లు మరియు కేంద్ర వనురులు అందరు కలిపి అందిస్తున్నారు.

ఈ సేవ ఏక్సస్, కోర్ మరియు రవాణా నెట్‌వర్క్‌లకు పరిష్కారాలను అందిస్తుంది. విక్రేత ఎవరైనా, సంస్థ ఇన్-బిల్డింగ్ పరిష్కారాలను అందిస్తుంది.

ఎరిక్సన్ అందించే సేవలు:

 • సివిల్ పనులు
 • డేటా మైగ్రేషన్
 • అనుసంధానం
 • అనుసంధానం డిజైన్
 • వివిధ-విక్రేతలను సరిచూడడం
 • నెట్‌వర్క్ డిజైన్
 • స్థలమును కొనడం
 • సాఫ్ట్‌వేర్ డిప్లాయ్మెంట్ సన్నహాలు

.మోబి మరియు మొబైల్ ఇంటర్నెట్[మార్చు]

మొబైల్ ఇంటర్నెట్ కొరకు విశేషంగా ప్రారంభించబడిన .మోబి అనే పై-స్థాయి డొమైన్‌ను రూపొందించడంలో ఎరిక్సన్ ముఖ్య పాత్ర వహించింది.[9] సెప్టంబర్ 2006లో .మోబి విడుదల అయినప్పటి నుంచి, ఎరిక్సన్.మోబి అనే మొబైల్ పోర్టల్‌ను మరియు సోనీ ఎరిక్సన్ కొరకు సోనీఎరిక్సన్.మోబి అనే మొబైల్ పోర్టల్‌ను సంస్థ ప్రారంభించింది. అంతే కాక, ఎరిక్సన్ డెవలపర్ కనెక్షన్ అనే ఒక డెవలపర్ ప్రోగ్రాంను కూడా ఎరిక్సన్ అందిస్తుంది. అప్లికేషన్లు మరియు సేవలను వేగవంతంగా అభివృద్ధి చేయడానికి ఇది సహాయపడుతుంది.[10] బీటా అప్లికేషన్లకు మరియు బీటా API లు & పరికరాలకు ఎరిక్సన్ లాబ్స్ అనే ఒక ఓపన్ ఇన్నొవేషన్ ఇనిషియేటివ్ ను ఎరిక్సన్ అందిస్తుంది.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • మదుపరి AB
 • సోనీ ఎరిక్సన్
 • సోనీ ఎరిక్సన్ ఉత్పత్తుల యొక్క పట్టిక
 • సేడేర్గ్రేన్
 • ఎరిక్సన్ నికోలా టెస్లా
 • ఏర్లాంగ్ (ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్)
 • టాన్డ్బర్గ్ టెలివిజన్

సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Annual Results 2009" (PDF). Ericsson. Retrieved 2010-01-25. Cite web requires |website= (help)
 2. "Ericsson - press release". Cision Wire. Retrieved 2001-10-01. Cite web requires |website= (help)
 3. ఎరిక్సన్ విన్స్ $1.7 డీల్స్ విత్ చైనీస్ ఆపరేటర్స్, వాల్ స్ట్రీట్ జర్నల్, జులై 8, 2009
 4. http://www.cellular-news.com/story/19883.php
 5. Microsoft Word - WSI_DraftD9.v0.8.doc
 6. ఎరిక్సన్ టూ డైవెస్ట్ ఇట్స్ ఎంటర్ప్రైస్ PBX సొల్యూషన్స్ టూ యాస్ట్రా టేక్నోలోజీస్ - ప్రెస్ విడుదల
 7. ఎరిక్సన్ - బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ LM ఎరిక్సన్
 8. ఎరిక్సన్ ప్రెస్ రిలీస్
 9. dotMobi Investors | dotMobi
 10. ఎరిక్సన్: ఎబౌట్ అవర్ డెవలపర్ ప్రోగ్రాం

మరింత చదవటానికి[మార్చు]

 • జాన్ మ్యూర్లింగ్ & రిచార్డ్ జీన్స్ (1994) ఎ స్విచ్ ఇన్ టైం: AXE — క్రియేటింగ్ ఎ ఫౌండేషన్ ఫర్ థ ఇన్ఫర్మేషన్ ఏజ్ . లండన్: కమ్యూనికేషన్స్ వీక్ ఇంటర్నేషనల్. ISBN 0-231-12232-2.
 • జాన్ మ్యూర్లింగ్ & రిచార్డ్ జీన్స్ (1997). థ అగ్లీ డక్లింగ్ . స్టాక్‌హొం: ఎరిక్సన్ మొబైల్ కమ్యూనికేషన్స్. ISBN 0-912616-87-3.
 • జాన్ మ్యూర్లింగ్ & రిచార్డ్ జీన్స్ (2000). థ ఎరిక్సన్ క్రోనికిల్: 125 ఇయర్స్ ఇన్ టెలికమ్యూనికేషన్స్ . స్టాక్‌హొం: Informationsförlaget. ISBN 0-912616-87-3.
 • థ మొబైల్ ఫోన్ బుక్: థ ఇన్వెన్షన్ ఆఫ్ థ మొబైల్ టెలిఫోన్ ఇండస్ట్రీ . ISBN 0-231-12232-2.
 • మొబైల్ మీడియా ఎండ్ అప్లికేషన్స్ - ఫ్రం కాన్సెప్ట్ టూ కాష్: సక్సెస్ఫుల్ సర్వీస్ క్రియేషన్ ఎండ్ లాంచ్. ISBN 0-912616-87-3.

బాహ్య లింకులు[మార్చు]

మూస:OMX Stockholm 30 companies

"https://te.wikipedia.org/w/index.php?title=ఎరిక్సన్&oldid=2759350" నుండి వెలికితీశారు