ఎర్నా సోల్బర్గ్
ఎర్నా సోల్బర్గ్ పార్లమెంటు సభ్యురాలు | |
---|---|
![]() 2022 లో సోల్బర్గ్ | |
నార్వే ప్రధానమంత్రి | |
In office 2013 అక్టోబరు 16 – 2021 అక్టోబరు 14 | |
చక్రవర్తి | హెరాల్డ్ V |
అంతకు ముందు వారు | జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ |
తరువాత వారు | జోనాస్ గహర్ స్టోర్ |
ప్రతిపక్ష పార్టీ నాయకురాలు | |
Assumed office 2021 అక్టోబరు 14 | |
చక్రవర్తి | హెరాల్డ్ V |
ప్రధాన మంత్రి | జోనాస్ గహర్ స్టోర్ |
అంతకు ముందు వారు | జోనాస్ గహర్ స్టోర్ |
In office 2005 అక్టోబరు 17 – 2013 అక్టోబరు 16 | |
చక్రవర్తి | హెరాల్డ్ V |
ప్రధాన మంత్రి | జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ |
అంతకు ముందు వారు | జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ |
తరువాత వారు | జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | బెర్గెన్, నార్వే | 1961 ఫిబ్రవరి 24
జాతీయత | నార్వేజియన్ |
రాజకీయ పార్టీ | కన్సర్వేటివ్ పార్టీ |
జీవిత భాగస్వామి |
సిండ్రే ఫిన్నెస్ (m. 1996) |
సంతానం | 2 |
కళాశాల | బెర్గెన్ విశ్వవిద్యాలయం |
వెబ్‌సైట్ | https://erna.no/ |
ఎర్నా సోల్బర్గ్ (జననం 1961 ఫిబ్రవరి 24) నార్వేజియన్ రాజకీయవేత్త, 2013 నుండి 2021 వరకు నార్వేకు ప్రధానమంత్రి. 2004 మే నుండి కన్జర్వేటివ్ పార్టీకి నాయకురాలిగా ఉన్నారు.[2]
సోల్బర్గ్ మొదటిసారి 1989లో స్టోర్టింగ్‌కు (నార్వే పార్లమెంటు) ఎన్నికైంది. 2001 నుండి 2005 వరకు బోండెవిక్ రెండవ మంత్రివర్గంలో స్థానిక ప్రభుత్వంలో ప్రాంతీయ అభివృద్ధి మంత్రిగా పనిచేసింది. ఆమె పదవీకాలంలో, వలస విధానాన్ని కఠినతరం చేయడం, నార్వే పరిపాలనా విభాగాల ప్రతిపాదిత సంస్కరణల రూపకల్పననూ ఆమె పర్యవేక్షించింది. 2005 ఎన్నికల తర్వాత, ఆమె 2013 వరకు కన్జర్వేటివ్ పార్టీ పార్లమెంటరీ గ్రూపుకు అధ్యక్షత వహించింది. సోల్బర్గ్ సంప్రదాయవాద విధానాల సామాజిక, సైద్ధాంతిక ప్రాతిపదికను నొక్కిచెప్పింది. అయితే పార్టీ కూడా దృశ్యమానంగా మరింత ఆచరణాత్మకంగా మారింది. [3]
2013 సెప్టెంబరు ఎన్నికల్లో గెలిచిన తర్వాత, సోల్బర్గ్ నార్వే ప్రధానమంత్రి అయింది. గ్రో హార్లెం బ్రండ్ట్‌ల్యాండ్ తర్వాత ఆ పదవిని చేపట్టిన రెండవ మహిళ ఆమె. సోల్బర్గ్ క్యాబినెట్, తరచుగా అనధికారికంగా "బ్లూ-బ్లూ క్యాబినెట్" అని పిలుస్తారు, ప్రారంభంలో కన్జర్వేటివ్, ప్రోగ్రెస్ పార్టీలతో కూడిన రెండు పార్టీల మైనారిటీ ప్రభుత్వం. స్టోర్టింగ్‌లోని లిబరల్, క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీలతో మంత్రివర్గం అధికారిక సహకారాన్ని ఏర్పాటు చేసింది. [4] 2017 ఎన్నికల్లో ప్రభుత్వం తిరిగి ఎన్నికైంది. 2018 జనవరిలో లిబరల్ పార్టీ కూడా ప్రభుత్వంలో చేరింది.[5] ఈ విస్తరించిన మైనారిటీ సంకీర్ణాన్ని అనధికారికంగా "బ్లూ-గ్రీన్ క్యాబినెట్" అని పిలుస్తారు. 2018 మేలో సోల్బర్గ్ కోరే విల్లోచ్‌ను అధిగమించి కన్జర్వేటివ్ పార్టీ తరఫున నార్వేకు ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రిగా నిలిచింది.[6] 2019 జనవరిలో క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీ కూడా ప్రభుత్వంలో చేరింది. తద్వారా పార్లమెంటులో మెజారిటీని సాధించారు. 2021 సెప్టెంబరు 13న, పార్లమెంటరీ ఎన్నికల ఫలితాల్లో స్టోర్టింగ్‌లో ఆమె ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. ఆమె ఓటమిని అంగీకరించి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను లేబరు పార్టీకి చెందిన జోనాస్ గహర్ స్టోర్‌కు వదిలివేసింది.[7] 2021 అక్టోబరు 12న, సోల్బర్గ్, ఆమె ప్రభుత్వం తమ రాజీనామాలను రాజు హెరాల్డ్ V కి సమర్పించారు. దీనితో స్టోర్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం అయింది, రెండు రోజుల తర్వాత దీనిని ఖరారు చేశారు. ఆ తర్వాత ఆమె తిరిగి ప్రతిపక్ష నాయకురాలిగా బాధ్యతలు చేపట్టింది.
తొలినాళ్ళ జీవితం, విద్య
[మార్చు]సోల్బర్గ్ పశ్చిమ నార్వేలోని బెర్గెన్‌లో 1961 ఫిబ్రవరి 24 న జన్మించింది. సంపన్నమైన కల్ఫారెట్ పరిసరాల్లో పెరిగింది. ఆమె తండ్రి, అస్బ్జోర్న్ సోల్బెర్గ్ (1925-1989), బెర్గెన్ స్పోర్వేలో కన్సల్టెంట్‌గా పనిచేసాడు. ఆమె తల్లి ఇంగర్ వెంచే టోర్గెర్సెన్ (1926-2016) కార్యాలయ ఉద్యోగి. సోల్బర్గ్ కు ఒక అక్క, ఒక చెల్లి.[8]
సోల్బర్గ్ పాఠశాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. 16 సంవత్సరాల వయస్సులో డిస్లెక్సియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయినప్పటికీ ఆమె తరగతిలో చురుగ్గా మాట్లాడేది.[9] 1979లో ఉన్నత పాఠశాల విద్యార్థినిగా ఆమె చివరి సంవత్సరంలో, ఆమె స్కూల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ నార్వే బోర్డుకు ఎన్నికైంది. అదే సంవత్సరం జమైకా కోసం విద్యార్థులు డబ్బును సేకరించిన జాతీయ ఛారిటీ ఈవెంట్ ఒపెరాస్జోన్ డాగ్స్‌వర్క్‌కు నాయకత్వం వహించింది.
1986లో, ఆమె తన cand.magతో పట్టభద్రురాలైంది. బెర్గెన్ విశ్వవిద్యాలయం నుండి సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ లో డిగ్రీ. ఆమె చివరి సంవత్సరంలో, బెర్గెన్‌లోని కన్జర్వేటివ్ పార్టీ స్టూడెంట్స్ లీగ్‌కు నాయకత్వం వహించింది.
1996 నుండి ఆమె వ్యాపారవేత్త, మాజీ కన్జర్వేటివ్ పార్టీ రాజకీయ నాయకుడైన సింద్రే ఫిన్స్‌ను పెళ్ళి చేసుకుంది, ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. [10] [11] ఆ కుటుంబం బెర్గెన్, ఓస్లోల్లో నివసించింది.
రాజకీయ జీవితం తొలినాళ్లలో
[మార్చు]స్థానిక ప్రభుత్వం
[మార్చు]సోల్బర్గ్ 1979 – 1983, 1987 – 1989 కాలాలలో బెర్గెన్ నగర మండలిలో డిప్యూటీ సభ్యుడిగా ఉంది. ఇది కార్యనిర్వాహక కమిటీలో చివరి కాలం. ఆమె యంగ్ కన్జర్వేటివ్స్, కన్జర్వేటివ్ పార్టీ స్థానిక, మునిసిపల్ అధ్యాయాలకు అధ్యక్షత వహించింది.
పార్లమెంటు సభ్యురాలు
[మార్చు]ఆమె మొదటిసారి 1989లో హోర్డాలాండ్ నుండి స్టోర్టింగ్ (నార్వేజియన్ పార్లమెంట్) కు ఎన్నికైంది. ఆ తరువాత ఐదుసార్లు మళ్ళీ ఎన్నికైంది. ఆమె 1994 నుండి 1998 వరకు జాతీయ కన్జర్వేటివ్ ఉమెన్స్ అసోసియేషన్ నాయకురాలిగా కూడా ఉంది.
స్థానిక ప్రభుత్వం, ప్రాంతీయ అభివృద్ధి మంత్రి
[మార్చు]2001 నుండి 2005 వరకు సోల్బర్గ్ ప్రధాన మంత్రి కెజెల్ మాగ్నే బోండెవిక్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ, ప్రాంతీయ అభివృద్ధి మంత్రిగా పనిచేసింది. ఆశ్రయం విధానంపై ఆమె దృఢమైన వైఖరితో సహా ఈ విభాగంలో ఆమె అనుసరించిన కఠినమైన విధానాల కారణంగా మీడియాలో ఆమెకు "జెర్న్-ఎర్నా" (ఉక్కు మహిళ) అనే మారుపేరు వచ్చింది. [12]

వాస్తవానికి, 2001–2005 నాటి బోండెవిక్ ప్రభుత్వం, 2005–2009 నాటి మధ్య-ఎడమ రెడ్-గ్రీన్ ప్రభుత్వం కంటే వేలాది మంది శరణార్థులను అనుమతించిందని సంఖ్యలు చూపిస్తున్నాయి. [13] 2003 లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఇస్లామిక్ షరియా కౌన్సిల్‌ల ఉనికి గురించి తెలిసిన తర్వాత, సోల్‌బర్గ్ నార్వేలో ఇస్లామిక్ షరియా కౌన్సిల్‌లను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు, [14] [15] 2004 లో నార్వేకు వలసలను పెంచాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. [16]
మంత్రిగా సోల్బర్గ్, ముల్లా క్రెకర్ జాతీయ భద్రతకు ప్రమాదకరమని, అతన్ని బహిష్కరించాలనీ నార్వేజియన్ ఇమ్మిగ్రేషన్ డైరెక్టరేట్‌ను ఆదేశించింది. తరువాత, 2010 లో ఎర్నా సోల్బర్గ్‌కు వచ్చిన హత్య బెదిరింపుకు గాను క్రెకర్‌పై ఉగ్రవాద అభియోగాలు నమోదు చేయబడ్డాయి.
ఇజ్రాయెల్ తో సంబంధాలు దెబ్బతినకుండా ఉండటానికి ఆమె మొర్దెచై వనునుకు రాజకీయ ఆశ్రయం నిరాకరించింది.[17]
పార్టీ నాయకురాలు
[మార్చు]ఆమె 2002 నుండి 2004 వరకు కన్జర్వేటివ్ పార్టీకి ఉప నాయకురాలిగా, 2004లో పార్టీ నాయకురాలిగా పనిచేసింది.
2009 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, కేవలం పన్ను కోతలు, రాష్ట్రానికి చిన్న పాత్ర అనే వాగ్దానాలు ఓటర్లను ఒప్పించవని పార్టీ గ్రహించింది. అందువల్ల సోల్బర్గ్ గతంలో తనకు "ఐరన్ ఎర్నా" అనే మారుపేరు తెచ్చిపెట్టిన తన వాక్చాతుర్యాన్ని విడిచిపెట్టి, వేరే విధానం అవసరమని వివరించడం ప్రారంభించింది - కోతలకు బదులుగా, సంస్కరణలను చేపట్టాలని, సంక్షేమ రాజ్యాన్ని కూల్చివేయడానికి బదులుగా, దాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించాలనీ చెప్పింది.
2011లో, ఆమె పీపుల్, నాట్ బిలియన్స్ అనే పుస్తకాన్ని ప్రచురించింది, దీనిని కొత్త ప్రోగ్రామ్ మ్యానిఫెస్టోగా చెప్పవచ్చు. ఆమె పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, చిన్న మునిసిపాలిటీలను క్రమం తప్పకుండా సందర్శించేది. పెద్ద వ్యాపారాలకు సేవ చేయడం తమ లక్ష్యం కాదని, కొత్త ఉద్యోగాల సృష్టి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక పునర్నిర్మాణానికి పరిస్థితులను సృష్టించడం అనీ అందరికీ వివరించింది. నార్వే ఆర్థిక వ్యవస్థను చమురు ఆదాయాలపై ఆధారపడటం నుండి బయటకు తీసుకురావాలనే తన దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాన్ని, సాంప్రదాయిక కుడి-పక్ష పద్ధతులైన పన్ను కోతలు, ఖర్చు తగ్గింపులు కంపెనీలలో రాష్ట్ర వాటాలను ప్రైవేటీకరించడం ద్వారా సాధించవచ్చని సోల్బర్గ్ భావించింది. అదనంగా, ఆమె ఉచిత విద్య, ఉచిత ఆరోగ్య సంరక్షణను కొనసాగిస్తానని హామీ ఇచ్చింది. [18]
నార్వే ప్రధాన మంత్రి (2013–2021)
[మార్చు]

2013 సెప్టెంబరు 9 న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత సోల్బర్గ్ ప్రభుత్వ అధిపతి అయింది. 2013 అక్టోబరు 16న ప్రధానమంత్రి పదవి చేపట్టింది. గ్రో హార్లెమ్ బ్రండ్‌ట్‌ల్యాండ్ తర్వాత సోల్‌బెర్గ్ నార్వేకి రెండవ మహిళా ప్రధాన మంత్రి. [19]
2017 లో ఆమె ప్రభుత్వం తిరిగి ఎన్నికైంది, 1980ల తర్వాత తిరిగి ఎన్నికల్లో గెలిచిన దేశంలో మొట్టమొదటి కన్సర్వేటివ్ నాయకురాలిగా సోల్బర్గ్ నిలిచింది.[20] స్టోర్టింగ్‌లో సెంటర్-రైట్ పార్టీలు కూడా మెజారిటీని నిలబెట్టుకోగలిగాయి.
ఎర్నా సోల్బర్గ్ మంత్రిగా, పార్లమెంటేరియన్‌గా, ప్రాంతీయ రాజకీయ నాయకురాలిగా అనేక జాతీయ పదవులను నిర్వహిస్తూ, అభివృద్ధి పట్ల, పెరుగుదల పట్ల, సంఘర్షణ పరిష్కారం పట్ల బలమైన నిబద్ధత చూపింది.[21]
ఆమె 2018 లో ప్రభుత్వంలో చేరడానికి లిబరల్స్ తో కూడా చర్చలు జరిపింది. [22] లిబరల్స్ అధికారికంగా 2018 జనవరి 17న సోల్బర్గ్ మంత్రివర్గంలో చేరారు. 2018 సెప్టెంబరు నుండి నవంబరు వరకు కొనసాగిన క్రిస్టియన్ డెమోక్రాట్ల కూటమి వివాదం తరువాత, వారు చివరికి గర్భస్రావ చట్టంలో స్వల్ప మార్పు ఆధారంగా సోల్బర్గ్ క్యాబినెట్‌లో చేరడానికి చర్చలు జరిపారు, ఇది ప్రజల నుండి, విమర్శకుల నుండి తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. క్రిస్టియన్ డెమోక్రాట్లు అధికారికంగా 2019 జనవరి 22న మంత్రివర్గంలో చేరారు. [23]
ఆమె సంకీర్ణం లోని పక్షాల మధ్య ఉద్రిక్తతలను ఎదుర్కొంది. ఇది ప్రోగ్రెస్ పార్టీతో విడిపోవడానికి దారితీసింది.[17]
2015లో వలస సంక్షోభాన్ని ఆమె కనికరం లేకుండా నిర్వహించినందుకు, మాజీ బ్రిటిష్ ప్రధాన మంత్రి మార్గరెట్ థాచర్‌ను సూచిస్తూ, ఆమెకు "ఐరన్ ఎర్నా" అనే మారుపేరు వచ్చింది, ఆ సమయంలో ఆమె రిసెప్షన్ పరిస్థితులను కఠినతరం చేసింది. [17]
2020 మార్చిలో చమురు ధరల పతనాన్ని తట్టుకునేందుకు, ఆమె ప్రభుత్వం వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి ఉద్యోగుల తాత్కాలిక తొలగింపు విధానాలను సరళీకృతం చేయడం, పన్ను హక్కులు వంటి అనేక చర్యలను స్వీకరించింది. [24]
నార్వేలో COVID-19 మహమ్మారి
[మార్చు]2021లో నార్వేలో COVID-19 మహమ్మారి సమయంలో తన 60వ పుట్టినరోజు తర్వాత ఒక రోజు, సోల్బర్గ్ తన భర్త, 13 మంది కుటుంబ సభ్యులతో కలిసి తన పుట్టినరోజు జరుపుకోవడానికి గీలోలోని ఒక రెస్టారెంట్‌కు వెళ్లడం ద్వారా జాతీయ ఆరోగ్య మార్గదర్శకాలను ఉల్లంఘించింది. మార్గదర్శకాల ప్రకారం రెస్టారెంట్లలో ఒక బృందంలో గరిష్ఠంగా 10 మంది మాత్రమే ఉండాలి. మార్చిలో ఆమె, మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు క్షమాపణలు చెప్పింది. తాను దాని గురించి సరిగ్గా ఆలోచించలేదని చెప్పింది. తాను ఇంకా బాగా తెలుసుకుని ఉండాల్సిందని చెప్పింది. [25] పోలీసు దర్యాప్తు నిర్వహించిన తర్వాత ఆమెకు 20,000 NOK ($2,352) జరిమానా విధించబడింది.[26]
2021 సెప్టెంబరు 24న, ఆమె ప్రభుత్వం, కోవిడ్ సమయంలో తీసుకున్న అన్ని జాతీయ ప్రధాన చర్యలనూ ఎత్తివేసింది. ఆ మరుసటి రోజు సాయంత్రం 4:00 గంటలకు, అధికారికంగా దేశాన్ని తిరిగి తెరిచింది. [27]
అంతర్జాతీయ కార్యక్రమాలు
[మార్చు]ప్రధానమంత్రిగా, NATO పార్లమెంటరీ అసెంబ్లీకి నార్వేజియన్ ప్రతినిధి బృందానికి మాజీ అధ్యక్షురాలిగా, ఆమె అట్లాంటిక్ విలువలు, భద్రతను సమర్థించింది.
2018లో ఆమె స్థిరమైన సముద్ర ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ ఉన్నత స్థాయి ప్యానెల్‌ను ఏర్పాటు చేసి, G7 శిఖరాగ్ర సమావేశంలో ఈ అంశాన్ని ప్రవేశపెట్టింది. సముద్ర నష్టాన్ని నివారించడానికి ప్రపంచ బ్యాంకు తీసుకున్న చొరవకు [28] ఆమె ప్రభుత్వం మద్దతు ఇచ్చింది.
2016 నుండి ప్రధానమంత్రి, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం ఏర్పాటు చేసిన న్యాయవాద బృందానికి సహ-అధ్యక్షత వహిస్తున్నారు. లక్ష్యాలలో, అందరికీ, ముఖ్యంగా సంఘర్షణ ప్రాంతాలలోని బాలికలు, పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంపై ఆమె ప్రత్యేక ఆసక్తిని చూపుతుంది. 2014 నుండి 2016 వరకు MDG అడ్వకేట్‌గా ఆమె చేసిన పనిలో కూడా ఇది కేంద్రంగా ఉంది.
ఆమె చేసిన ఒక కీలక ప్రసంగంలో, ప్రపంచంలోని అట్టడుగు ప్రాంతాలలో, సంఘర్షణలతో నిండిన ప్రాంతాలలో సాంప్రదాయ సహాయం, మానవతా సహాయం ఇప్పటికీ అవసరమని ఆమె పేర్కొంది. అయితే, SDGలు ప్రపంచ అభివృద్ధి యొక్క సమగ్ర దృక్పథాన్ని తీసుకుంటాయి. ఆర్థిక, సామాజిక, పర్యావరణ అంశాలను ఏకీకృతం చేస్తాయి. [29]
సోల్బర్గ్ బాలికల హక్కులు, విద్య వంటి లింగ సమస్యలపై ప్రత్యేక ఆసక్తిని కనబరిచింది. గ్రాకా మాచెల్ తో కలిసి ఆమె 2030 లో పేదరికం, లింగం, సాంస్కృతిక నమ్మకాలు వంటి అంశాలు నేటి ప్రతిష్టాత్మక యువతులు ప్రపంచ వేదికపై నమ్మకంగా నిలబడకుండా నిరోధించలేవని ఆశాభావం వ్యక్తం చేసింది. [30]
2016లో, ఆమె సింగపూర్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ ది గ్లోబల్ గోల్స్‌లో ఒక ఉపన్యాసం నిర్వహించింది. స్థిరమైన, న్యాయమైన, మరింత శాంతియుత భవిష్యత్తు - ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్‌కు రోడ్ మ్యాప్‌ను ఈ ప్రసంగం ఉద్దేశించింది. [31]
సోల్బర్గ్, గ్లోబల్ పార్టనర్‌షిప్ ఫర్ ఎడ్యుకేషన్ కోసం గణనీయమైన ఆర్థిక సహాయాన్ని సేకరించింది. 2018 నవంబరులో ఓస్లోలో మహిళలు, పిల్లల ఆరోగ్య ప్రతిజ్ఞ సమావేశానికి గ్లోబల్ ఫైనాన్స్ ఫెసిలిటీని నిర్వహించింది. విద్యలో పెట్టుబడి ఇతర అన్ని SDG లక్ష్యాల పురోగతిని వేగవంతం చేస్తుందని ఆమె దృఢ విశ్వాసం.
2017 ఏప్రిల్‌లో ఆమె బీజింగ్‌లోని పెకింగ్ విశ్వవిద్యాలయంలో ప్రపంచీకరణ, అభివృద్ధిపై ప్రసంగం చేసింది. [32]
ఆమె అంతర్జాతీయంగా ఆమె చేసిన కృషికి గాను 2018 లో, గ్లోబల్ సిటిజన్ వరల్డ్ లీడర్ అవార్డు తొట్టతొలి పురస్కారాన్ని అందుకుంది.[21]
అక్టోబరు 2019 లో, సిరియాలోని కుర్దిష్ ప్రాంతాలపై టర్కిష్ ఏకపక్ష దాడిని ఆమె విమర్శించింది. కానీ టర్కీని నాటో నుండి సస్పెండ్ చేయాలనే పిలుపులను తోసిపుచ్చింది.[33]
2019లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సోల్బర్గ్ చేసిన ప్రసంగంలో, 2021–2022 సంవత్సరానికి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వానికి నార్వే అభ్యర్థిత్వాన్ని ఆమె సమర్థించారు. వాతావరణ మార్పు, సైబరు భద్రత, ఉగ్రవాదం వంటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రపంచానికి బలమైన బహుపాక్షిక సహకారం, సంస్థలు అవసరమనీ, ఐక్యరాజ్యసమితిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందనీ ఆమె సమర్థించారు. [34]
2021 మేలో డానిష్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ సర్వీస్, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీతో కలిసి తోటి EU సభ్యులు, నాయకులపై వైర్‌ట్యాపింగు చేసిందని వార్తలు వచ్చాయి. దీని ఫలితంగా EU దేశాలలో విస్తృత వ్యతిరేకత వచ్చింది. డానిష్, అమెరికన్ ప్రభుత్వాల నుండి వివరణ కోసం డిమాండ్లు వచ్చాయి. [35] [36] "సన్నిహిత మిత్రదేశాల సహకారం ఉన్న దేశాలు ఒకదానిపై ఒకటి గూఢచర్యం చేయాల్సిన అవసరం ఉందని భావిస్తే అది ఆమోదయోగ్యం కాదు" అని సోల్బర్గ్ చెప్పింది.[37]
ఇతర వార్తా కథనాలు
[మార్చు]2004లో స్థానిక ప్రభుత్వం, ప్రాంతీయ అభివృద్ధి మంత్రిగా ఉన్న సోల్బర్గ్, ఇజ్రాయెల్ అణు విజిల్‌బ్లోయర్ మోర్డెచాయ్ వనును నార్వేలో ఆశ్రయం కోసం చేసిన అభ్యర్థనను తిరస్కరించిందని 2008 ఏప్రిల్‌లో వెల్లడైంది.[38] వనునుకు ఆశ్రయం కల్పించడానికి నార్వేజియన్ డైరెక్టరేట్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ సిద్ధంగా ఉన్నప్పటికీ, వనును దరఖాస్తు నార్వే సరిహద్దుల వెలుపల చేయబడినందున దరఖాస్తును ఆమోదించలేమని నిర్ణయించారు. [39] ఇజ్రాయెల్ నుండి వనునును రప్పించడం ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా చేసే చర్య అవుతుందని సోల్‌బర్గ్, ప్రభుత్వం భావించారనీ, ఇజ్రాయెల్‌కు స్నేహితుడిగా, మధ్యప్రాచ్యంలో రాజకీయ భాగస్వామిగా నార్వేజియన్ ప్రభుత్వం యొక్క సాంప్రదాయ స్థానానికి ఇది తగదనీ ఓ వర్గీకరించని పత్రం వెల్లడించింది. సోల్బర్గ్ ఈ విమర్శను తిరస్కరించి, తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. [40]
2014లో, ఆమె సిల్వి లిస్టాగ్ నిర్వహించిన వ్యవసాయం, ఆహార సమావేశంలో పాల్గొంది, దీనికి రవాణా మంత్రి కెటిల్ సోల్విక్-ఓల్సెన్, వాతావరణ, పర్యావరణ మంత్రి టైన్ సండ్‌టాఫ్ట్ కూడా హాజరయ్యారు. తరువాత, ఆ నలుగురినీ కలిపి తీసిన చిత్రం అదే సంవత్సరం మార్చి 14న Government.no వెబ్‌సైట్‌లో కనిపించింది. [41] అదే సంవత్సరం ఏప్రిల్‌లో ఆమె డేటా నిలుపుదలపై యూరోపియన్ కోర్టును విమర్శించింది. టెలినార్ గ్రూప్, కోర్టు చర్యలు లేకుండా డేటాను ఉపయోగించుకోవచ్చని వాదించింది. [42]
2017లో, ఓస్లోలోని రష్యన్ రాయబార కార్యాలయం నార్వేజియన్ అధికారులు, నిఘా సంస్థలు "తప్పుడు, సంబంధం లేని రష్యన్ వ్యతిరేక వాక్చాతుర్యాన్ని " ఉపయోగిస్తున్నాయని, "రష్యన్ ముప్పు" గురించి "నార్వే జనాభాను భయపెడుతున్నాయని" ఆరోపించింది. దీనికి ప్రతిస్పందనగా, ప్రధాన మంత్రి సోల్బర్గ్ ఇలా చెప్పింది: "భద్రతా విధానంపై దృష్టి సారించిన వెంటనే బయలుదేరే రష్యా ప్రచారానికి ఇది ఒక ఉదాహరణ. ఇందులో కొత్తదేమీ లేదు." [43]
2010లో నార్వేజియన్ నోబెల్ కమిటీ చైనా అసమ్మతివాది లియు జియాబోకు నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వాలని నిర్ణయించినప్పటి నుండి దెబ్బతిన్న చైనా-నార్వే సంబంధాలను మెరుగుపరచడానికి సోల్బర్గ్ ప్రయత్నించింది. ప్రభుత్వ కస్టడీలో ఉన్నప్పుడు అవయవాల వైఫల్యం కారణంగా 2017 జూలై 13న లియు మరణించాడు. దానికి ప్రతిస్పందనగా, సోల్బర్గ్ ఇలా అంది: "లియు జియాబో మరణ వార్త నాకు తీవ్రమైన బాధ కలిగించింది. లియు జియాబో దశాబ్దాలుగా మానవ హక్కులకు, చైనాలో మరింత అభివృద్ధికీ కేంద్ర స్వరంగా ఉన్నాడు."
ఓటమి
[మార్చు]2021 ఎన్నికల్లో, మధ్య-వామపక్ష పార్టీలు మెజారిటీ సీట్లను గెలుచుకున్నాయి. సోల్బర్గ్ ఓటమిని అంగీకరించింది. [44]
ప్రధాని పదవి తర్వాత
[మార్చు]2022 మే 20 న సోల్బర్గ్, గ్లోబల్ సిటిజన్ బోర్డు సభ్యుడిగా మారుతున్నట్లు ప్రకటించారు. తన ప్రవేశం గురించి ఆమె ఇలా చెప్పింది: "ఈ స్థానానికి నేను అంగీకరిస్తున్నాను. ఎందుకంటే గ్లోబల్ సిటిజన్ బహుశా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను, ముఖ్యంగా యువకులను, పేదరికంపై పోరాడటానికీ, ఐరాస స్థిరత్వ లక్ష్యాలను సాధించడానికీ సమీకరించే గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉన్న సంస్థ". [45]
నవంబరు 13 న సోల్బర్గ్, తాను కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలిగా కొనసాగుతాననీ, 2025 పార్లమెంటరీ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటాననీ ప్రకటించింది. [46]
2023 నార్వేజియన్ స్థానిక ఎన్నికలలో, సోల్బర్గ్ నేతృత్వంలోని కన్జర్వేటివ్‌లు అత్యధిక ఓట్లను గెలుచుకున్నారు. 1924 తర్వాత జాతీయ ఎన్నికల్లో లేబరు పార్టీ అత్యధిక ఓట్లను గెలుచుకోకపోవడం ఇదే మొదటిసారి. [47]
భర్త స్టాక్ ట్రేడింగ్ వివాదం
[మార్చు]2023 స్థానిక ఎన్నికలకు ముందు, సోల్బర్గ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆమె భర్త సింద్రే ఫిన్నెస్, స్టాక్ మార్కెట్‌లో చురుగ్గా ఉన్నారని మీడియా సంస్థలు వెల్లడించాయి. అతని కొనుగోళ్ల గురించి తనకు తెలియదని, ఫిన్స్‌లో స్టాక్‌లు ఉన్న కంపెనీలతో వ్యవహరించడంలో తాను నిష్పాక్షికంగా ఉన్నానని కూడా ఆమె పేర్కొంది. ఎన్నికలు జరిగిన నాలుగు రోజుల తర్వాత, సెప్టెంబరు 15 న, వివిధ కంపెనీలలో జరిగిన 3600 స్టాక్ లావాదేవీల పూర్తి జాబితా విడుదలైంది. ఆమె బహిరంగ క్షమాపణ కూడా జారీ చేసింది; నేషనల్ అథారిటీ ఫర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రాసిక్యూషన్ ఆఫ్ ఎకనామిక్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ క్రైమ్ ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించడానికి కారణాలను పరిశీలిస్తామని ప్రకటించింది. [48] [49] నవంబరు 3న, వారు ఫిన్స్‌పై దర్యాప్తును కొనసాగించబోమని ప్రకటించారు. [50]
2023 నవంబరు 7న, పరిశీలన, రాజ్యాంగ వ్యవహారాలపై పార్లమెంటు స్టాండింగ్ కమిటీ విచారణ సందర్భంగా ఆమె ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. [51] [52] [53] నవంబరు 21 న కమిటీ మరో 12 ప్రశ్నలను ముందుకు తెచ్చింది. [54] సోల్బర్గ్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఫిన్స్ 112 మిలియన్లకు పైగా నార్వేజియన్ క్రోనర్‌లను స్టాక్‌లలో కొనుగోలు చేశారని అంచనా. లావాదేవీల సంఖ్య మూడు వేలకు పైగా ఉంటుందని అంచనా. ప్రతి లావాదేవీ గురించి సోల్బర్గ్‌కు తెలియకపోయినా, ఆమెకు పరస్పర విరుద్ధ ప్రయోజనాల సమస్య ఉందని మీడియా నివేదికలు సూచించాయి. [55] [56]
ప్రధానమంత్రి కార్యాలయంలో సోల్బర్గ్‌కు అత్యంత సన్నిహిత సలహాదారులు కొందరు, సోల్బర్గ్ భర్త స్టాక్ ట్రేడింగ్‌కు సంబంధించి ఆమెకు ఉన్న విరుద్ధాసక్తుల విషయాలను గురించి "కేంద్ర ఇమెయిల్‌లను" ఆర్కైవ్ చేయలేదని E24 నవంబరు 26 న నివేదించింది. చట్టం ప్రకారం వాటిని ఆర్కైవు చెయ్యాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవహారం గురించి కార్యాలయానికి ఉన్న జ్ఞానం, తద్వారా పత్రాలు 10 సంవత్సరాలకు పైగా ప్రజలకు అందకుండా ఉంచారు.[57][58]
నవంబరు 30న, పరిశీలన, రాజ్యాంగ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ ప్రధానమంత్రి కార్యాలయానికి మరో 13 ప్రశ్నలను పంపింది, ఇది మరింత ప్రత్యేకంగా రికార్డుల నిర్వహణ గురించి అడుగుతుంది.[59][60]
గౌరవాలు
[మార్చు]జాతీయ గౌరవాలు
[మార్చు]Norway Commander of the Order of St. Olav (2005)
Norway King Harald V's Jubilee Medal 1991–2016 (2016)
మూలాలు
[మార్చు]- ↑ "Erna Solberg" (in నార్వేజియన్). Norske biografiske leksikon. 25 February 2020. Archived from the original on 15 December 2019. Retrieved 9 November 2020.
- ↑ "15 women leading the way for girls' education". globalpartnership.org. Archived from the original on 2019-03-22. Retrieved 2019-03-22.
- ↑ Alstadheim, Kjetil B. (December 22, 2012). "Solberg-og-dal-banen". Dagens Næringsliv (in నార్వేజియన్). Oslo. p. 2.
- ↑ "Avtale mellom Venstre, Kristelig Folkeparti, Fremskrittspartiet og Høyre" (PDF) (in నార్వేజియన్). Høyre. Archived from the original (PDF) on May 28, 2014. Retrieved May 23, 2014.
- ↑ Dagenborg, Joachim. "Norway's Liberals to join Conservative-led government". U.S. Archived from the original on 2018-05-27. Retrieved 2018-04-26.
- ↑ Løland, Leif Rune. "Passerer Willoch – Solberg blir Høyres lengstsittende statsminister". NRK (in నార్వేజియన్ బొక్మాల్). Archived from the original on 2018-05-29. Retrieved 2018-06-01.
- ↑ "Erna Solberg erkjenner valgnederlag (Erna Solberg concedes defeat)". NRK (in Norwegian). 13 September 2021. Retrieved 13 September 2021.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Johansen, Per Kristian (February 9, 2009). "Erna Solberg varsler tøffere integrering" (in నార్వేజియన్). Norwegian Broadcasting Corporation. Archived from the original on October 15, 2013. Retrieved May 23, 2014.
- ↑ Fondenes, Eivind; Eriksrud, Aslak. "Partifellene, syntes ikke Erna Solberg var blå nok" [Comrades did not Erna Solberg was blue enough] (in నార్వేజియన్). TV2. Archived from the original on June 30, 2009. Retrieved April 2, 2013.
- ↑ "After softening, 'Iron Erna' Solberg set to become Norway's PM". Daily News and Analysis. Reuters. September 10, 2013. Archived from the original on June 30, 2009.
- ↑ "Erna Solberg". Forbes (in ఇంగ్లీష్). Archived from the original on 2019-03-22. Retrieved 2019-03-22.
- ↑ Morken, Johannes (8 May 2009). "Erna Solberg varsler tøffere integrering" [Erna Solberg suggests tougher integration]. Vårt Land (in నార్వేజియన్). Archived from the original on June 30, 2009. Retrieved July 11, 2010.
- ↑ Svela, Helge O. (September 13, 2009). "Det (var) altså flere asylsøkere som kom til Norge under den forrige Bondevik-regjeringen som Erna var med i, enn det har kommet nå under den rød-grønne regjeringen" [It (was) thus more asylum seekers coming to Norway during the previous Bondevik government that Erna was in, than it has now come under the red-green government]. Bergens Tidende (in నార్వేజియన్). Archived from the original on June 30, 2009. Retrieved August 29, 2010.
- ↑ Sandli, Espen (November 6, 2003). "Solberg ber om shariaråd" [Solberg asking for Sharia Council]. Drammens Tidende (in నార్వేజియన్). Archived from the original on May 27, 2012. Retrieved August 29, 2010.
- ↑ Ljones, Bjørg Irene (August 11, 2007). "Forby sharialover i Norge" [Prohibiting Sharia law in Norway]. Norge Idag (in నార్వేజియన్). Archived from the original on June 30, 2009. Retrieved August 29, 2010.
- ↑ Almendingen, Berit (September 20, 2004). "Erna vil friste innvandrere til Norge" [Erna will entice immigrants to Norway]. TV 2 (in నార్వేజియన్). Archived from the original on March 26, 2005. Retrieved August 29, 2010.
- ↑ 17.0 17.1 17.2 "Erna Solberg, la conservadora "de hierro" con más años en el poder". ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "swissinfo" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "V Norsku se po letech vrací k moci pravice". Deník Referendum (in చెక్). 2013-09-12. Retrieved 2023-08-17.
- ↑ "Dette er utfordringene som møter de nye statsrådene" [These are the challenges facing the new ministers]. Aftenposten. October 16, 2013. Archived from the original on June 30, 2009. Retrieved October 16, 2013.
- ↑ "Norway's centre-right coalition is re-elected". The Economist. 14 September 2017. Archived from the original on 15 September 2017. Retrieved 15 September 2017.
- ↑ 21.0 21.1 "Prime Minister Erna Solberg". 16 October 2013. Archived from the original on 2019-12-15. Retrieved 2019-10-31. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "regjeringen" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Venstre sier ja til å gå i regjering". 14 January 2018. Archived from the original on 2019-09-02. Retrieved 2019-11-12.
- ↑ "KRFS veivalg". 26 March 2015. Archived from the original on 2020-07-31. Retrieved 2019-11-12.
- ↑ "En Norvège, la gauche remporte les législatives et revient au pouvoir". Le Monde.fr. 13 September 2021.
- ↑ "Erna Solberg og familien brøt smittevernreglene: -Jeg kan bare beklage" (in Norwegian). NRK. 18 March 2021. Archived from the original on 18 March 2021. Retrieved 18 March 2021.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Solberg apologises and will pay 20 000 NOK fine" (in Norwegian). NRK. 9 April 2021. Archived from the original on 9 April 2021. Retrieved 9 April 2021.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Skroter de fleste tiltak" (in Norwegian). Dagbladet. 24 September 2021. Retrieved 24 September 2021.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "PROBLUE: The World Bank's Blue Economy Program". Archived from the original on 2020-01-02. Retrieved 2020-01-02.
- ↑ "Keynote speech - European Development Days". 7 June 2017. Archived from the original on 2019-11-04. Retrieved 2019-11-04.
- ↑ "We cannot achieve global goals unless girls' rights are realised". Archived from the original on 2019-10-31. Retrieved 2019-10-31.
- ↑ "Fullerton Lecture: The Global Goals - a Roadmap to a Sustainable, Fair and More Peaceful Future". 13 April 2016. Archived from the original on 2019-11-04. Retrieved 2019-11-04.
- ↑ "Sustainable Development - Making Globalisation Work for People and the Planet". 10 April 2017. Archived from the original on 2019-11-01. Retrieved 2019-11-01.
- ↑ "Norway against suspending Turkey from NATO". Anadolu Agency. 15 October 2019.
- ↑ "Norway's statement at the United Nations General Assembly". 27 September 2019. Archived from the original on 2019-10-31. Retrieved 2019-10-31.
- ↑ "Danish secret service helped US spy on Germany's Angela Merkel: report". Deutsche Welle. 30 May 2021.
- ↑ "How Denmark became the NSA's listening post in Europe". France 24. 1 June 2021.
- ↑ "NSA spying row: US and Denmark pressed over allegations". BBC News. 31 May 2021.
- ↑ Dennis Ravndal (September 4, 2008). "Erna Solberg hindret Vanunu i å få asyl" [Erna Solberg prevented Vanunu in getting asylum]. VG. Archived from the original on June 30, 2009. Retrieved April 10, 2008.
- ↑ Stian Eisenträger (September 4, 2008). "Vanunu: - Håper Norge angrer asyl-avslaget" [Vanunu: - Hope Norway regrets asylum refusal]. VG. Archived from the original on June 30, 2009. Retrieved April 10, 2008.
- ↑ Stian Eisenträger (September 4, 2008). "Vanunu-venner i harnisk" [Vanunu friends outraged]. VG. Archived from the original on June 30, 2009. Retrieved April 10, 2008.
- ↑ "Skogens rolle i klimasammenheng" [The forest's role in climate change]. Government.no. March 14, 2014. Archived from the original on June 30, 2009. Retrieved April 12, 2014.
- ↑ "Erna Solbergs datalagring kan bli torpedert" [Erna Solberg: Data storage can be torpedoed]. Bergens Tidende. Archived from the original on June 30, 2009. Retrieved April 12, 2014.
- ↑ "The Russian Embassy in Oslo calls its relations with Norway 'unsatisfactory'". 17 February 2017. Archived from the original on 2019-10-18. Retrieved 2018-05-08.
- ↑ "Norway's center-left heads to victory in general elections". AP News (in ఇంగ్లీష్). 2021-09-13. Retrieved 2024-05-04.
- ↑ "Solberg får internasjonalt verv" (in నార్వేజియన్). ABC Nyheter. 20 May 2022. Retrieved 20 May 2022.
- ↑ "Erna Solberg trekker seg ikke – vil bli statsminister i 2025" (in నార్వేజియన్). NRK. 13 November 2023. Retrieved 13 November 2023.
- ↑ "Norway's conservative opposition wins local elections with nearly 26% of the votes". AP News (in ఇంగ్లీష్). 2023-09-12. Retrieved 2024-05-04.
- ↑ "Sindre Finnes gjorde 3600 aksjehandler mens Erna Solberg var statsminister" (in నార్వేజియన్). Verdens Gang. 15 September 2023. Retrieved 15 September 2023.
- ↑ "Økokrim: Vil vurdere om det er grunnlag for etterforsking i Finnes-saken" (in నార్వేజియన్). Nettavisen. 15 September 2023. Retrieved 15 September 2023.
- ↑ "Solberg om Økokrim-avgjørelse: - I dag er jeg fylt på med krefter" (in నార్వేజియన్). NRK. 3 November 2023. Retrieved 3 November 2023.
- ↑ "Høringen: Erna med balansekunst på tynn is" (in నార్వేజియన్). Nettavisen. 7 November 2023. Retrieved 8 November 2023.
- ↑ "Solberg kritiseres: – Fortsatt en gåte" (in నార్వేజియన్). Nettavisen. 7 November 2023. Retrieved 7 November 2023.
- ↑ "Trettebergstuen avviser Støre-påstand: – Feil. Jeg har ikke blitt advart" (in నార్వేజియన్). NRK. 7 November 2023. Retrieved 7 November 2023.
- ↑ "Solberg må svare på nye spørsmål: – Unnvikende og omtrentlig" (in నార్వేజియన్). NRK. 21 November 2023. Retrieved 21 November 2023.
- ↑ "Sjekk tidslinjene til Høyre og NRK – og les Finnes' svar" (in నార్వేజియన్). NRK. 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ "Her er Finnes' liste over handler – skal ha tjent 1,8 millioner mens kona var statsminister" (in నార్వేజియన్). Dagens Næringsliv. 15 September 2023. Retrieved 18 September 2023.
- ↑ "Slik holdt Erna Solbergs nærmeste brev, dokumenter og mannens navn unna offentligheten" (in నార్వేజియన్). E24 Næringsliv. 26 November 2023. Retrieved 29 November 2023.
- ↑ "Kontroll- og konstitusjonskomiteen utsetter konklusjonen i habilitetssaken" (in నార్వేజియన్). E24 Næringsliv. 28 November 2023. Retrieved 29 November 2023.
- ↑ "Kontrollkomiteen sender nye spørsmål i aksjesakene" (in నార్వేజియన్). E24 Næringsliv. 29 November 2023. Retrieved 29 November 2023.
- ↑ "Kontrollkomiteen med 13 nye spørsmål i to saker" (in నార్వేజియన్). E24 Næringsliv. 30 November 2023. Retrieved 1 December 2023.