ఎర్నేని లీలావతి దేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎర్నేని లీలావతి, భారత స్వాతంత్ర్య సమరయోధురాలు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆమె కృష్ణాజిల్లా, గుడివాడ తాలూకా గుడ్లవల్లేరు 1906లో వల్లభనేని జానకీరామయ్య, వెంకమ్మ దంపతులకు జన్మించింది. 1915లో గాంధీజీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా కృష్ణా జిల్లా సందర్శించిన సమయంలో ఆమె గాంధీజీ ఉపన్యాసాన్ని విని ప్రభావితురాలైంది. ఆ సమయంలో ఆమెకు దేశభక్తి బీజాలు నాటుకున్నాయి. తన అక్క శేషమాంబతో కలసి నూలు వడకడం, ఖాదీ ధరించడం చేసేది. ఆమెకు ఎర్నేని సుబ్రహ్మణ్యంతో వివాహం అయింది. ఆమె భర్త సుబ్రహ్మణ్యం 1930లో గాంధీజీతో పాటు దండి సత్యాగ్రహంలో పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధుడు. అతను దండి నుండి ఉప్పును చిన్న పొట్లాలుగా తెచ్చి వాటిని బంగారం కంటే విలువైనదిగా అమ్మి వచ్చిన ధనాన్ని జాతీయోధ్యమ నిధికి అందజేసాడు. స్త్రీలు పవిత్రంగా భావించే కాలి మట్టెలను లీలావతిదేవి ఇచ్చేసి ఆ ఉప్పు పొట్లం కొన్నది. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న ఆమె కుటుంబాన్ని పోలీసులు అరెస్టు చేసారు. అంగలూరులోని వారి ఇల్లు ఉద్యమకారులతో కళకళ లాడుతుండటం చూసి పోలీసులు సహించలేక ఆ ఇంటిని జప్తు చేసి స్వాధీనం చేసుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులతో కలసి కొమరవోలులో గాంధీజీ ఆశ్రమాన్ని స్థాపించింది.

ఆమె సీతారామమ్మ, రాజేశ్వరి, వేంకటసుబ్బమ్మ మరికొందరితో కలసి విజయవాడలో జాతీయగీతాలు ఆలపిస్తూ, నినాదాలు చేస్తూ ఊరేగింపులు జరిపి శాసనోల్లంఘనం చేసింది. ఆ కారణంగా 1944 ఏప్రిల్ 13 న అమృతమ్మ, సావిత్రి, అమ్మాళ్‌ మొదలైన వారితో కలసి ఆరుమాసాలు రాయవేలూరులో జెైలుశిక్ష అనుభవించారు.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]